6, జులై 2011, బుధవారం

సమస్యా పూరణం -384 (రాజీనామాల జాతరకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రాజీనామాల జాతరకుఁ దెర లేచెన్.
ఈ సమస్యను సూచించిన మా బంధువు, విశ్రాంత తెలుగుపండితులు అయిన
శ్యాం సుందర్ గారికి
ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. శంకరార్యా ! - లేచెన్ - అంటే చాలదా ? లేచేన్ అనాలా ?

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    01)
    _______________________________

    రోజులు గడచుచు నున్నవి
    మాజీ యగుచుండె కోర్కి - మరి మరి వేడన్ !
    "మా " జీ నే బెదిరింపగ
    రాజీనామాల జాత - రకుఁ దెర లేచెన్ !
    _______________________________
    "మా " జీ = సోనియమ్మ

    రిప్లయితొలగించండి
  3. కిశోర్ జీ ! మా'జీ' ని మాజీ లను బలే పట్టుకున్నారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    ధన్యవాదాలు. సవరించాను.

    రిప్లయితొలగించండి
  5. కిశోర్ జీ పూరణ అదిరింది. ' మాజీ ' బెదిరిందా ?

    రిప్లయితొలగించండి
  6. వసంత కిశోర్ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. శాస్త్రి గారు చెప్పినట్లు మాజీ శబ్దప్రయోగంలో మీ చమత్కారం అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు. మాజీని బెదిరించడానికే మాజీ లయ్యారు. బెదిరిందా లేదా అన్నది నేడో రేపో తేలిపోతుంది.

    రిప్లయితొలగించండి
  8. క్యాజీ ! దేఖ్ జీ ! విన నిటు
    రా, జీ! నామాల జాతరకుఁ దెర లేచెన్ !
    ఈజీ గా పెట్ట, ప్రజకు
    రోజీ డ్రామాల జూఛి రోనా, 'మా' జీ !

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ మణిప్రవాళ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. కం: వాజమ్మలె ? మన నేతలు ?
    రోజూ డ్రామాలె యికను రూఢిగ ప్రజకున్
    తాజా నామాలె - పడరు
    రాజీ - నామాల జాతరకు దెర లేచెన్

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    --- బ్లాగు : సుజన సృజన

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యా ! ధన్యవాదములు !
    మూర్తీజీ ! ధన్యవాదములు !
    శాస్త్రీజీ ! మీ పూరణ - బహుత్ అచ్ఛీ !
    రాజా రావ్‌జీ ! మీ నామాలు కూడా బావున్నాయ్ !

    రిప్లయితొలగించండి
  12. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    కిశోర్ జీ !ధన్యవాద్ జీ !

    రిప్లయితొలగించండి
  13. 02)
    _______________________________

    రోజీ పూజ్యపు నామాల్
    బేజారౌ చుండ గుండె - పెక్కురు రోయన్ !
    రాజా లగుటకె కాదా ?
    రాజీనామాల జాత - రకుఁ దెర లేచెన్ ?
    _______________________________

    రిప్లయితొలగించండి
  14. తాజా డెడ్ లైనంటూ
    రోజూ చెప్పెడి కథలను రోయంగ జనుల్,
    బేజారవగా నేతలు
    రాజీనామాల జాతరకుఁ దెర లేచెన్.

    రిప్లయితొలగించండి
  15. యీ జీవననాటకమున
    రాజీనామాల జాతరకుఁ దెర లేచెన్
    కాజేయుచు జన ధనముల్
    నే జైలుకుబోవనుంద్రొ నీచాధములే.

    రిప్లయితొలగించండి
  16. రాజుకొనెను రణరంగము
    రాజీలకు తావు లేదు రా ! రా ! దిగి రా !
    "మాజీ !" నీవిపుడె ! యనుచు
    రాజీనామాల జాతరలకు దెర లేచెన్ !

    రిప్లయితొలగించండి
  17. మాజీ లైనను చాలును,
    రాజీ యికపడగబోము,రాష్ట్రము యికమీ
    చేజారునుననుచు బల్కిరి
    రాజీనామాల జాతరలకు దెర లేచెన్ !

    రిప్లయితొలగించండి
  18. తాజా పువ్వుల నల్లెను
    రాజీ నా మాల. జాతరకుఁ దెర లేచెన్
    బాజా మ్రోగుచు నున్నద
    హో,జోరుగ! రమ్ము, చూడఁ యుత్సవ హేలన్.

    రాజీ అను యావిడ మాల అల్లిందనుట, జాతర యుత్సవములను చూడ రమ్మనుట.

    రిప్లయితొలగించండి
  19. రాజాశేఖరు డిచ్చెన్
    రోజూ వాటాలనందరు కుడిచి మరచెన్
    తాజా ఛాయలు పోయెన్
    రాజీనామాల జాతరకుఁ దెర లేచెన్.
    మనవి: ఛాయ=లంచం అనే అర్థంలో. ప్రాసకోసం రాజశేఖరులో "జా" వేయవలసివచ్చింది.

    రిప్లయితొలగించండి
  20. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    రాజీ పడని మీ పూరణ అదిరింది. అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.

    రవి గారూ,
    బహుకాలానికి మామీద దయచూపారు చక్కని పూరణతో. ధన్యవాదాలు.

    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    ‘జనధనముల/ నేజైలుకు’ అందాం.

    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘రాష్ట్రము + ఇక’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘రాష్ట్ర మ్మిక’ అంటే సరి.

    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గురువు గారూ, ధన్యవాదములు.
    చూడ, యుత్సవ -- ఇక్కడ యడాగమం/ నుగాగమం ఏది రావాలో కొంచెం సందేహంగా ఉండింది.

    రిప్లయితొలగించండి
  22. మందాకిని గారూ,
    అది ‘చూడన్ + ఉత్సవ = చూడ నుత్సవ’.

    రిప్లయితొలగించండి