శ్రీ చింతా రామకృష్ణా రావుగారూ నమస్కారములు.అధ్యాపక వృత్తిలో మీ అనుభవాలు చక్కగా చెప్పారు. మేము చదువుకొనే దినములలో కూడా తెలుగు అధ్యాపకులను విద్యార్ధులు ఎప్పుడూ అల్లరి పెట్టలేదు. వారంటే మాకు యెనలేని గౌరవము !
మూర్తి గారూ ! ధన్యవాదములు.చిన్ని కృష్ణుని అల్లరి మూకను బాగానే అభినందించారు. మందాకిని గారూ! సంపత్ గారూ ! మీరు కూడా చిన్ని కృష్ణుని అల్లరి మూకను చక్కగా పట్టుకున్నారు. రవీందర్ గారూ ! కోతి మూకను చక్కగా అభినందించారు. చింతా రామకృష్ణా రావుగారూ !నమస్కారములు.బుధులపై గౌరవం పెరిగే విధంగా చెప్పారు.నా బ్లాగు "సమస్యల తోరణాన్ని "వీక్షించి మొదటి సారిగా సువ్యాఖ్య నందింనచినందులకు ధన్యవాదములు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు. ‘గొల్లడుతో’ అన్నచోట ‘గొల్లలతో’ అంటే బాగుంటుంది.
మందాకిని గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, వాత్సల్యరసపూర్ణమైన పూరణ. అభినందనలు. * మిస్సన్న గారూ, అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
అల్లరి చిత్రము జూచితి
రిప్లయితొలగించండిపిల్లలతో కలసి, నాకు పిచ్చగ నచ్చెన్!
అల్లదొ!యూనిట్ వచ్చెను
'అల్లరి' మూకలను పిలిచి యభినందింతున్!!
పిల్లలు జేయక నల్లరి,
రిప్లయితొలగించండిచిల్లరగా పెద్దవారు చేతురె? మదిలో
కల్లా కపటము తెలియని
అల్లరిమూకలను పిలిచి యభినందింతున్!
అల్లన కృష్ణుడె యాద్యుడు
రిప్లయితొలగించండిఅల్లరి జేయంగ, జనుల యభిమతములు సం
ధిల్లగ కష్టములోపెడు,
అల్లరి మూకలను పిలిచి అభినందింతున్.
శాస్త్రిగారూ చక్కని పూరణలు !
రిప్లయితొలగించండిఉల్లము తనపై తిరమవ
గొల్లడుతో కలసిమెలసి గోకుల మందున్
చల్లయు,వెన్నను గ్రోలెడి
అల్లరిమూకలను పిలిచి యభినందింతున్ !
చల్లగ చూతురు బుధులను.
రిప్లయితొలగించండిఅల్లరి పెట్టుదురుగ దురహంకృతులన్నన్.
మల్లెల మది నమరిన యా
అల్లరిమూకలను పిలిచి యభినందింతున్
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, నా కంటే ముందుగా మీరు కృష్ణుడిని పట్టేసుకొన్నారు !
రిప్లయితొలగించండిశ్రీ చింతా రామకృష్ణా రావుగారూ నమస్కారములు.అధ్యాపక వృత్తిలో మీ అనుభవాలు చక్కగా చెప్పారు. మేము చదువుకొనే దినములలో కూడా తెలుగు అధ్యాపకులను విద్యార్ధులు ఎప్పుడూ అల్లరి పెట్టలేదు. వారంటే మాకు యెనలేని గౌరవము !
రిప్లయితొలగించండిరామాయణంలోని సీతాన్వేషణ ఘట్టంలో రాముని స్వగతం :
రిప్లయితొలగించండి"గొల్లున నరచుచు వానరు
లెల్లరు వారధిని గట్ట నిక్కటు దీరెన్ !
యిల్లును జేరిన తదుపరి
యల్లరి మూకలను పిలిచి యభినందింతున్ ! "
వల్లభుడతడే జగతికి
రిప్లయితొలగించండిచల్లని చూపుల కరుణలుఁ జల్లెడు వాడే
ఎల్లెడ నతనికి తోడగు
యల్లరి మూకలను పిలిచి యభినందింతున్ !
చిన్ని కృష్ణునితో నిరంతరం మసిలే భాగ్యం కలిగిన గోపబాలకులను అభినందిస్తాను. (నిజం)
మూర్తి గారూ ! ధన్యవాదములు.చిన్ని కృష్ణుని అల్లరి మూకను బాగానే అభినందించారు.
రిప్లయితొలగించండిమందాకిని గారూ! సంపత్ గారూ ! మీరు కూడా చిన్ని కృష్ణుని అల్లరి మూకను
చక్కగా పట్టుకున్నారు.
రవీందర్ గారూ ! కోతి మూకను చక్కగా అభినందించారు.
చింతా రామకృష్ణా రావుగారూ !నమస్కారములు.బుధులపై గౌరవం పెరిగే విధంగా చెప్పారు.నా బ్లాగు "సమస్యల తోరణాన్ని "వీక్షించి మొదటి సారిగా సువ్యాఖ్య నందింనచినందులకు ధన్యవాదములు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండికల్లాకపటము లెరుగని
పిల్లల చిలిపి పనుల గని పెద్దల మది రం
జిల్లగ వాత్సల్యమునన్
అల్లరి మూకలము పిలచి యభినందింతున్
సుగ్రీవుడు దదిముఖునితో నన్న మాటలు:
రిప్లయితొలగించండిఎల్లరు ధ్వంసము జేసిరె
యెల్లను మధువనము కపులు? ఇదినిజ మైనన్
తల్లిని సీతను జూచిన
యల్లరిమూకలను పిలిచి యభినందింతున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘గొల్లడుతో’ అన్నచోట ‘గొల్లలతో’ అంటే బాగుంటుంది.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిఉత్తమమైన పూరణ. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
ఉల్ల మలరఁజేసిన పూరణ మీది. అభినందనలు.
మూడవపాదాన్ని యడాగమంతో ఆరంబించారు. అది వాక్యారంభం కనుక అచ్చుతో ప్రారంభిస్తే దోషం లేదు. చింతా వారి పూరణను గమనించండి.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
వాత్సల్యరసపూర్ణమైన పూరణ. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
గురువుగారూ,ధన్యవాదములు.' గొల్లఁడు ' అంటే కృష్ణుడు అనే భావముతో వ్రాసానండీ. అల్లరి మూకలు కూడా గోపాలురే అనుకొండి.
రిప్లయితొలగించండిమిస్సన్నగారూ, మధువన ధ్వంస గాధ మధురం !
రిప్లయితొలగించండిగురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమూర్తి మిత్రమా మీక కూడా. మీ గోపాలుర అల్లరి ముచ్చటగా ఉంది.
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిచిల్లర బ్రతుకులు బ్రతికిన
రిప్లయితొలగించండినల్లరిమూకలను పిలిచి యభినందింతున్;
చెల్లున్నిదియే యనుకొని
ఝల్లున నొకనాడు వారు జైలున పడుదుర్ ;)
"హత్వై తానాతతాయినః"
తొలగించండిక్షమించ వలెను. ప్రస్తుతం కాష్మీరులో రాళ్ళు రువ్వుతున్న అల్లరి మూకలలను దృష్టిలో నుంచుకొని వ్రాసితిని.
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమిత్ షా ఉవాచ:
రిప్లయితొలగించండి"కొల్లలు కొల్లలు చేరుచు
ముల్లాలను రాళ్ళు రువ్వి మురిపించంగన్
పళ్ళను పూవుల గైకొని
యల్లరిమూకలను పిలిచి యభినందింతున్"