9, జులై 2018, సోమవారం

ఆవిష్కరణ సభ

"జడ కందములు - మా కందములు" ఆవిష్కరోత్సవానికి వచ్చిన కవిమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఎందరో మహానుభావులు, అవధానులు, పండితులు, కవిశ్రేష్ఠులు, బహుగ్రంథకర్తలు నామీది ఆప్యాయతతో దూర భారాలను లెక్కించక, ఇబ్బందులు పడుతూ వచ్చి సభను అలంకరించారు. వేదిక మీద కూర్చుని, సన్మానాలు పొందదగినవారు సామాన్య ప్రేక్షకులై సభనిండా కూర్చుని ఎదురుగా కనిపిస్తుంటే ఒకింత అపరాధ భావానికి లోనయ్యాను. నా పిలుపు మేరకు ఎక్కడెక్కడి నుండో వచ్చి, స్నేహభావంతో పలుకరించిన మిత్రుల సౌహార్దాన్ని చూచి భావోద్వేగానికి లోనయ్యాను. ఎన్నెన్నో విషయాలు చెప్పాలని, అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలని ఆత్రంగా ఉన్న నేను తీరా నన్ను మాట్లాడమనే సరికి కారణం లేకుండానే దుఃఖం ముంచుకు వచ్చి ఏమీ మాట్లాడలేకపోయాను. నా మాటలు వినాలని ఆసక్తిగా ఎదురు చూసిన మిత్రులను నిరుత్సాహ పరచినందుకు మన్నించండి.
పుస్తకాన్ని సలక్షణంగా ప్రకటించాలన్న ఉద్దేశంతో నేను, గుండు మధుసూదన్ గారు ఎంతో జాగ్రత్తగా పరిశీలించి దోషాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పటికి రెండు దోషాలు నా దృష్టికి వచ్చాయి.
"అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడింది" అని ఒక సామెత. అందరి తప్పులు వెదకి, దిద్దిన నేను నా పద్యంలో గణదోషాన్ని గుర్తించలేకపోయాను. అలాగే గోగులపాటి వారి పద్యంలో ప్రాస తప్పింది. ఇలాగే నా దృష్టికి రానివి కొన్ని ఉండవచ్చు.
ఇది నేను మొదటిసారిగా ప్రచురించిన పుస్తకం. మొదటిసారిగా నిర్వహించిన సభ. అనుభవ రాహిత్యం వల్ల ఏవైనా లోటు పాట్లు జరిగితే, ఎవరి మనసైనా నొచ్చుకొని ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను.
మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు.

సమస్య - 2728

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సత్యమును బల్క బుధు లపచార మంద్రు"
(లేదా...)
"సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు

8, జులై 2018, ఆదివారం

నిషిద్ధాక్షరి - 44

కవిమిత్రులారా,
అంశము - జడపై పద్యం
నిషిద్ధము - 'జ, డ' అన్న అక్షరాలు.
ఛందస్సు - మీ ఇష్టము.

7, జులై 2018, శనివారం

సమస్య - 2727

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్"
(లేదా...)
"పరమేశుం గొలువంగఁ బాపములు వే పండంగ నిక్కమ్ములే"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు

6, జులై 2018, శుక్రవారం

సమస్య - 2726

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్"
(లేదా...)
"సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్"

5, జులై 2018, గురువారం

సమస్య - 2725

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వాణి రాణియయ్యె భర్గునకును"
(లేదా...)
"వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై"

4, జులై 2018, బుధవారం

సమస్య - 2724

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె"
(లేదా...)
"జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే"

3, జులై 2018, మంగళవారం

సమస్య - 2723

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము"
(లేదా...)
"చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్"

2, జులై 2018, సోమవారం

న్యస్తాక్షరి - 57

అంశము - గ్రామ దేవతలు
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు... 
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా
'పో - లే - ర - మ్మ' ఉండాలి.

1, జులై 2018, ఆదివారం

సమస్య - 2722

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు"
(లేదా...)
"చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు శూరుఁడై"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)