6, జులై 2018, శుక్రవారం

సమస్య - 2726

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్"
(లేదా...)
"సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్"

67 కామెంట్‌లు:

 1. తరతరములు మనకిడినవి
  వరములు శాపముగ మారి వందలు వందల్
  భరియింప లేని భారత
  సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్

  సరము = కొలను

  రిప్లయితొలగించండి


 2. అరకొర విజ్ఞానులగుచు
  పరుగుల జీవన విధాన పరిణామముగా
  మరువ సనాతనమున్, పరి
  సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్

  రిప్లయితొలగించండి
 3. నిరతము వ్యర్థ పదార్థము
  చెరువులలో చేరి నీటిఁ జెరుపుచు నుండన్
  మురికిజలమ్ముల నిండిన
  సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టానుండి
  ఆర్యా, సరము॥హారము,శ.రు

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టానుండి
  ఆర్యా, సరము॥హారము,శ.రు

  రిప్లయితొలగించండి
 6. చెరువులు రొయ్యల తోడను,
  మురుగు జలము తోడనదులు మురియు చునుండన్
  భరత ధరణిపై గల పరి
  సరములు జీవులకు గన నసహ్యములయ్యెన్

  రిప్లయితొలగించండి
 7. సరసీ రుహముల సొగసులు
  కరువాయెను నేడు గాంచ కల్లగ మిగిలెన్
  పరుసము నింపగ జనులట
  సరములు జీవులకుఁ గన నసహ్యము లయ్యెన్

  రిప్లయితొలగించండి

 8. అరరే వరుసగ పడినా
  రు రాముని పయి మన బ్లాగరులు వెసవెసగా
  నరె, రామాయణ కథన కృ
  సరములు జీవులకుఁ గన నసహ్యము లయ్యెన్

  రిప్లయితొలగించండి
 9. (సరస్సుల ప్రాధాన్యం - మనుష్యుల నిర్లక్ష్యం)
  సరములు భారతేందిరకు శాశ్వతసంపద లెల్లవేళలన్ ;
  వరములు పౌరులందరకు పంటలు పండగ కడ్పునిండగా ;
  వరలుచు తీపియూటల పిపాసను దీర్చును ; మంచిముత్తెపుం
  సరములు సర్వజీవుల కసహ్యములయ్యెను దుర్నిరీక్ష్యతన్ .

  రిప్లయితొలగించండి
 10. చెరువు లు కుంట ల జలము ల
  మురికి గ నొ న రించు పనులు మునుకొ ని చేయ న్
  చౌ ర బడు రోగం బు ల పరి
  సరము లు జీవుల కు గనన స హ్యము ల య్యే న్

  రిప్లయితొలగించండి
 11. మొన్న బీజింగు నిన్న హస్తిన చూడగా రేపెవరిది
  వంతు
  శిలాజ ఇంధనమే దహనముగ మనిషి చేసెను
  రోజిదె తంతు
  కాలుష్యము గన కోరలు సాచె ప్రభుత మౌన
  ఉపేక్షతన్
  సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను
  దుర్నిరీక్ష్యతన్

  రిప్లయితొలగించండి
 12. మిత్రులందఱకు నమస్సులు!

  కరమరుదయ్యె వాన, మఱి గాటముగాఁ గుజ షండ మెండియున్,
  విరులు ఫలమ్ము లెచ్చటను వేడ్కగఁ జూచెదమన్న లేక, యీ
  నరులకు నుష్ణబాధల దినమ్ములు హెచ్చఁగ, నేఁటి గ్రీష్మ వా
  సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   'గ్రీష్మవాసరము'లతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అద్భుతమైన పూరణ మధురకవి గారూ! నమఃపూర్వక అభినందనలు! 🙏🙏🙏

   తొలగించండి
 13. వరమైన ప్రకృతి మాతను
  నరులత్యాశను జెరచగ నాణ్యత లేకే
  మురికగు వ్యాధిజనక పరి
  సరములు జీవులకుగన నసహ్యము లయ్యెన్

  రిప్లయితొలగించండి
 14. రిప్లయిలు
  1. పరమపవిత్రమైన ఘన భారతదేశమునన్ జనించి , తా
   మరకొర విద్యనేర్చి , తమకన్నియు సాధ్యములంచు త్రుళ్లుచున్
   దురితమనస్కులై చెలగు దుష్టుల మూర్ఖుల భావజాల మ...
   త్సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 15. పెరిగెను గదవాడి విసురు
  సరుకుల వాడుకయె నేడు జగతిని జూడన్
  తరిగిన శుభ్రత తో పరి
  సరములు జీవులకు గన నసహ్యము లెయ్యెన్.

  రిప్లయితొలగించండి
 16. తరువులు నరికిన నలుగును
  వరుణుడు, నభమును విడువడు వసుధను గనడే
  కరువులు పెరిగిన నిగురును
  సరములు, జీవులకు గన నసహ్యము లెయ్యెన్.

  రిప్లయితొలగించండి
 17. [06/07, 08:16] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
  కరమందని ద్రాక్ష పులుపు
  దరిజేరని వన్నిజూడ దారిద్ర్యములే
  సరిగా తీరని తమ 'యవ
  సరములు'జీవులకుగన నసహ్యము లెయ్యన్

  రిప్లయితొలగించండి
 18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2726
  సమస్య :: *సరములు సర్వ జీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్.*
  సరములు అందరికీ అసహ్యము లైనాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
  సందర్భం :: గురువు గారు పాఠం చెబుతూ ఓ శిష్యా! సరములు అనేవి చాలా ఉన్నాయి. మంచి చెడులను గమనించు. సత్యాన్ని గుర్తించు. పూసరములు కేసరములు మొదలైనవి సుగంధాది సద్గుణములతో ప్రకృతి సిద్ధములై గ్రహింపదగినవిగా ఉన్నాయి. మన లోపల ఉన్న దుర్గుణములైన క్రోధ లోభ మత్సరములు కపాల(బుద్ధి)నిర్మితములై సర్వ జీవులకు అసహ్యములౌతూ త్యజింపదగినవిగా ఉన్నాయి. కాబట్టి దుర్గుణములను త్యజించు. సద్గుణములను సంపాదించు అని ఉపదేశం చేసే సందర్భం.

  సరములు పెక్కు లున్న విల సత్యము నెంచగ శిష్య వర్య ! పూ
  సరములు కేసరమ్ములును సహ్యము లయ్యెను, క్రోధ లోభ మ
  త్సరములు దుర్గుణమ్ములు సతమ్ము కపాల వినిర్మితమ్ము, లా
  *సరములు సర్వజీవుల కసహ్యములయ్యెను దుర్నిరీక్ష్యతన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (6-7-20-18)

  రిప్లయితొలగించండి
 19. కందం
  చరవాణి దూరదర్శను
  నరులకు నిత్యావసరము నమ్మిన, తెరకున్
  నిరతము నతికెడు నీ యవ
  సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్

  రిప్లయితొలగించండి
 20. వరములు ప్రకృతి యిడు సరో
  వరములు గద మనకు భువి నివాసము కొఱకున్
  ఎరుగమిచే పాడయ్యెను
  "సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్"
  ***)()(***
  సరములు =నీటికుంటలు;మడుగులు;చెరువులు;సరస్సులు.
  ఎరుగమి = అవగాహన లేమి;అజ్ఞానము

  రిప్లయితొలగించండి

 21. ఉరువిడి పెంపుకొఱకు నలు
  గురుకూడి వనరులను సమకూర్చెడి పనులన్
  జరుపు సమయమందున పెడ
  సరములు జీవులకుగన నసహ్యములయ్యెన్

  ఉరువిడి=సమాజము
  పెడసరము=మొండితనము

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 25. అరకొరపూడికదీయగ
  సరములుజీవులకుగననసహ్యములయ్యెన్
  బరిసరమంతయునరయగ
  గిరములతోగూడియుండికిటకిటలాడెన్

  రిప్లయితొలగించండి
 26. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  సరములు జీవులకుఁ గన నసహ్యము
  లయ్యెన్

  సందర్భము: స్పష్టము..
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  ధర నున్నత విద్యలు పే..
  రరయగ ర్యాగింగు మాత్ర
  మతులమును.. భయం
  కరమును.. చదువరు లను ధూ
  సరములు జీవులకుఁ గన
  నసహ్యము లయ్యెన్

  ధూసరము=గాడిద

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  6.7.18

  రిప్లయితొలగించండి
 27. ధర యుఱుములు మెఱుపులఁ దాఁ
  బరేత భూమిఁ దలఁపింపఁ బట్ట శవములం
  బర మాశను వ్రాలఁగఁ గణ
  సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్

  [కణసరము = డేగ]


  ఉరువుగ నేఱి యేఱి మఱి యూడ్చి తటిం బడ వేయఁ జెత్తనుం
  దెరలి కరమ్ము వారుచును దీర్చుచు నుండఁగఁ గాలకృత్యముల్
  పరిపరి పాఁడి గేదెలను బాటవ మొప్పఁగఁ దోము చుండఁగన్
  సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్

  [సరములు = కొలనులు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 1/2/2017 నాటి పూరణలు:

   గురుభాషితములు నిజపితృ
   సుర మోక్షద కార్య తతుల సువ్యక్తములుం
   బరమ శమదంపు టధివా
   సరములు జీవులకుఁ గడు నసహ్యము లయ్యెన్!

   [అధివాసరము = శ్రాద్ధ దినమునకు పూర్వ దివసమునఁ జేయు నుపవాసము)


   పరిజన బంధు మిత్రగణ వందిత నేతల భాషణమ్ములం
   దరతమ భేద రోదనలఁ దర్జన భర్జన రాజకీయు లా
   గురు రవ దుర్భరమ్ములు నకుంఠిత కాలపరంప రానువ
   త్సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్!

   [అనువత్సరము = అయిదేండ్ల వత్సర చక్రములో నాల్గవ సంవత్సరము]

   తొలగించండి
  2. కీ.శే. శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారి పూరణ:

   భరియింపరానికంపును,
   బరివేధించు మశకములు ప్రబలిన వాతా
   వరణము, ప్రదూషితపు పరి
   సరములు, జీవులకు కడు నసహ్యము లయ్యెన్

   తొలగించండి

 28. చురకత్తి మీసపు మగం
  డ్లు, రాతిరి సమయపు సరసులున్ వడి వడిగా
  తిరుగు సరసాంగనల పరి
  సరములు జీవులకుఁ గన నసహ్యము లయ్యెన్

  రిప్లయితొలగించండి
 29. కురియగ వర్షధారలవి కొండల కోనల ముంచివేయగా
  గురుతులు లేకనే ప్రజలు కుంటల వాగుల నాక్రమించగా
  పురమున నీటి పారుదల భూమికి లోపల గట్టలేమిచే
  మురికగునీరు దారులను మూయుచు
  బొంగగ నిత్య వర్షవా
  సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్షతన్

  రిప్లయితొలగించండి
 30. ఐఎ
  ధరలెల్ల పెరిగె ధరలో
  సరుకులు కల్తీవెదక్క సతమత మగుచున్
  నిరతము దుర్గంధ పరి
  సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్.

  కరమున పిన్నలు పెద్దలు
  నిరతము ప్లాస్టిక్కు వాడి వసుమతి యందున్
  చెరువుల వేయగ నాపరి
  సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్.

  రిప్లయితొలగించండి
 31. సరములుసర్వజీవులకసహ్యములయ్యెనుదుర్నిక్ష్యతన్
  నరయగనంతియేగదసరంబులశుభ్రతలేకయుండుచో
  కిరములుసంచరించుటకుకీలకమయ్యెనునాసరస్సులున్
  సరములశుభ్రతయ్యదియసర్వులబాధ్యతయౌనునిధ్ధరన్

  రిప్లయితొలగించండి
 32. ధరణిని దేవళమ్ములు నదమ్ములు కానలు కొండలెల్ల మీ
  సరములు సర్వజీవుల, కసహ్యములయ్యెను దుర్నిరీక్ష్యతన్
  పురముల కోసమంచు వనముల్ తెగ ద్రుంచగ ప్రాప్తమయ్యెడిన్
  కరువులు కాటకమ్ములును కశ్మలమే యిల పెచ్చుమీరగన్
  విరివిగ గ్రొత్తరోగములు విస్తృతి జెందుచు భీతిగొల్పగన్

  రిప్లయితొలగించండి

 33. కురిపించె ట్రంపు చైనా
  సరకుల పై టాక్సు భువిని సమరము మొదలా
  యె రయము, ప్రాక్పశ్చిమ మీ
  సరములు జీవులకుఁ గన నసహ్యము లయ్యెన్.

  రిప్లయితొలగించండి
 34. వరములె శుబ్రత‌మనకడ
  హరితమె నహ్లాదముంచి నాయువుబెంచున్!
  కరువు,నపరిశుబ్రతపరి
  సరములుజీవులకు గన?నసహ్యములెయ్యన్

  రిప్లయితొలగించండి
 35. ఆటవిడుపు సరదా పూరణ:
  ("ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్")

  వరమయి క్షీర వృద్ధికి సువర్ణపు కాసులనీను దాతలై
  కరుణను జూపి ముక్తినిడు కాలుని వాహన జాతులైననున్
  వరుసగ వీధిలో నిలచి వాలము లెత్తుచు రేణమిచ్చు కా
  సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్

  రిప్లయితొలగించండి
 36. చంపకమాల
  సిరులను పెంపు జేసుకొను చిత్తమె గాని పరిశ్రమల్ వినా
  శ రహిత మౌ రసాయన విసర్జనలన్ పరి శుభ్ర రీతినిన్
  దొరలఁగ జేయకుండగను దోషములంప నదీ నదమ్ములున్
  సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్

  రిప్లయితొలగించండి
 37. కవిమిత్రులారా, నమస్కృతులు.
  ఉదయం నుండి అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారితో కలిసి మన ఆవిష్కరణోత్సవం జరుగనున్న హాలు దగ్గర ఏర్పాట్లు సరిచూసుకొనడం, కవి సన్మానాలకు శాలువలు కొనడం, అల్పాహారాలకు ఆర్డర్ ఇవ్వడం మొదలైన పనులతో తీరిక లేకుండా తిరిగి ఇప్పుడే నెలవు చేరుకున్నాను. పూర్తిగా అలసి ఉన్న కారణంగా ఈరోజు మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 38. ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
  సరములు జీవులకుఁ గన నసహ్యము
  లయ్యెన్

  సందర్భము: ఒక డొకనితో అంటున్నాడు. ఏమని...
  " విరిసరముల యందం చూచి మురియవలసిందే! తరుణులకు యింటి పని వంట పని రాకపోతే... ధూసరములు కూడా వారివైపు చూడడానికి యిష్టపడవు సుమా!
  అందుకని చెప్పే దేదైనా వుంటే విరిసరముల అందంగురించి చెప్పరా! ఇంటిపని వంటపని యనకురా! నేను వినను.. ( నువ్వేం చెబుతావో నాకు తెలుసు గనుక)"
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  విరి సరముల యందము చె
  ప్పర! యింటి పని మరి వంట
  పని యనకుర! ఆ
  తరుణుల దెస జూచునె ధూ
  సరములు!.. జీవులకుఁ గన
  నసహ్యము లయ్యెన్

  ధూసరము=గాడిద

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  6.7.18

  రిప్లయితొలగించండి
 39. డా.పిట్టాసత్యనారాయణ
  సరము॥హారము( శబ్ద రత్నాకరము)
  మొర విని "పుష్పవిలాపము"
  ఉరముల ఛేదింప జేయ నుర్వి జనులకున్
  తిరమగు భావన గలుగన్
  సరములు జీవులకు గన నసహ్యములయ్యెన్

  రిప్లయితొలగించండి
 40. డా.పిట్టాసత్యనారాయణ
  వరములనీని దేవునికి, ప్రాణము బోయిన మానవాళికిన్,
  చెరి సగమంచు దోపిడికి జేతులుచాచిన మంత్రివర్యుకున్,
  కరణమునందు సత్యమును గానని బోధక సుప్రజాళికిన్,
  బరగను పుష్ప మాలికల వాసికి "బోకె"లు చాలులే యనన్
  సరములు సర్వ జీవులకసహ్యములయ్యెను దుర్నిరీక్షతన్
  (బోకె॥అస్థి (శ.ర)ఆంగ్లంలో వలెగాక.రెండవ అర్థం)

  రిప్లయితొలగించండి
 41. డా.పిట్టా నుండి
  ఆర్యా,"మంత్రి,నేతకున్"గా చదువ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 42. కరముల కంఠ భూషణలు కన్నుల కింపుగ భాగ్యనగ్రినిన్
  మురియుచు చార్మినారమున ముచ్చటి కొట్టుల బారుబారుల
  న్నరయగ సత్య మౌక్తికల హాయిని గొల్పెడు ప్లాస్టికమ్ములౌ
  సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్

  రిప్లయితొలగించండి