3, జులై 2018, మంగళవారం

సమస్య - 2723

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము"
(లేదా...)
"చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్"

48 కామెంట్‌లు:

  1. అల్ల మిథిలలో నానాడు చల్లగాను
    రామభద్రయ్య తమ్ముడు రక్తి మీర
    చక్క నైనట్టి యూర్మిళ, జానకమ్మ
    చెల్లెలినిఁ, బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

    రిప్లయితొలగించండి
  2. మత్స్య యంత్రమ్ము ఛేదించి మగువ కృష్ణ
    బొంది, కపట సన్యాసియై యంద మైన
    నారి మనసును గెలిచి కృష్ణ బలరామ
    చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము.

    రిప్లయితొలగించండి
  3. తీర్థ యాత్రల పేరుతో తిరుగు నపుడు
    మాయవేషము తో వచ్చి మగువ మనసు
    గెలిచి విజయుడు ద్వారకన్ కృష్ణు ప్రియపు
    చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    నల్లనివాడు చూపెను ప్రణాళికఁ , దాను యతీంద్రుడై జనన్ ,
    మల్లెల మొల్లలంగొని యమాయకభక్తి సుభద్ర చేర ., సం...
    పల్లలితాంగితో సరసమాడుచు క్రీడియె కృష్ణమూర్తికిన్
    చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరు సవరణ...🙏

      నల్లనివాడు చూపెను ప్రణాళికఁ , దాను యతీంద్రుడై చనన్ ,
      మల్లెల మొల్లలంగొని యమాయకభక్తి సుభద్ర చేర ., సం...
      పల్లలితాంగితో సరసమాడుచు క్రీడియె కృష్ణమూర్తికిన్
      చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. తండ్రి తమ్ముడు నీకు చిన్నాన్న అతని కూతురు
    చెల్లెలె కద
    ముసల్మానుల వివాహంబట ఈ రీతిగ వేడుక
    సూతము పద
    ధర్మమెంచక అటుంచు జన్యువ్యవస్థీకరణ ఏ
    రీతిగన్
    చెల్లిని బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి
    మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టాసత్యనారాయణ
    బావమరదు లసూయల బాలివారె
    ఆడబిడ్డను గనరు,యయారె , మామ
    ఆస్తి వరులిరువురికను యాశ నువిద
    చెల్లెలిని బెండ్లియాడె మెచ్చెను జగమ్ము!

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టాసత్యనారాయణ
    తల్లికి బిడ్డలిద్దరవ తమ్ముడు నగ్రజు డొక్కయింటికిన్
    అల్లురునౌట కూడదను యాన ప్రచారములోన నుండగా
    కల్ల యటన్న రామకథ గాసిలె లక్ష్మణమూర్తి, జానకీ
    చెల్లిని బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చగన్!

    రిప్లయితొలగించండి
  8. వలచి చేకొని పొమ్మని వార్త బంప
    వెడలి రాక్షస పద్దతి న్ వీరు డ గు చు
    న డ్ డు తొలగించు కొను చు తా న ప్దు రుక్మి
    చెల్లెలి ని పెండ్లి యా డె మెచ్చేను జ గ మ్ము

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2723
    సమస్య :: *చెల్లెలిఁ బెండ్లియాడె నట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్.*
    చెల్లెలిని పెళ్లి చేసికొన్నాడు ఒక వ్యక్తి. మంచివాళ్లందరూ అతనిని మెచ్చుకొన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం ::
    రాఘవత్వే భవేత్ సీతా రుక్మిణీ కృష్ణజన్మని।
    అన్యేషు చావతారేషు విష్ణో రేషానపాయినీ।।
    అని మనం వినియున్నాం కదండీ. ప్రేమతో సకల జగాల నేలే శ్రీమహావిష్ణువు ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించగా, ఎల్లప్పుడూ స్వామివారి హృదయంలో కొలువై ఉండే శ్రీ మహాలక్ష్మి రుక్మిణీదేవిగా అవతరించింది. శ్రీ వల్లభుడైన కృష్ణుడు భీష్మకుని పుత్రికామణి, రుక్మికి సోదరీమణి, నిజచేతోహారిణి, కన్యకామణి యైన రుక్మిణి ని కుండిన నగరంలో గ్రహించి సాధువులందరూ మెచ్చుకొంటూ ఉండగా ద్వారకా నగరంలో వివాహ మాడిన సందర్భం.

    ఎల్ల జగాల ప్రేమసుధ నేలెడి విష్ణువు కృష్ణమూర్తియై
    యుల్లము లోని లక్ష్మి సుగుణోన్నత రుక్మిణిగా జనింప, శ్రీ
    వల్లభు డంత రాక్షస వివాహమునన్ గ్రహియించి రుక్మికిన్
    *జెల్లెలిఁ బెండ్లియాడె నట శిష్టజనావళి సూచి మెచ్చగన్.*
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (3-7-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహృదయులు జిలేబి గారికి ప్రణామాలు. మీరు ప్రతిరోజూ నా గళము వినాలనుకొంటే ఈ లింకు చూడవచ్చు.
      https://t.me/ttdnews

      తొలగించండి
    2. శంకరాభరణం టెక్స్ట్ మరియూ ఆడియో కోసం

      https://t.me/sekharreddytml

      టీటీడీ సమాచారం కోసం
      https://t.me/ttdnews

      తొలగించండి
  10. ఒక్క పురుషుండు గ్రామాన నొప్పుమీర
    యోగ్యుడైనట్టి వరుజూచి యున్నతముగ
    భార్యగాజేసి యటబంపి భర్త వెనుక
    చెల్లెలినిఁ, బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    గంగ గౌరమ్మ లిద్దరు గట్టు సుతలు
    గట్టు విల్తుని తలనెక్క గంగ మురిసి
    సగము నేనౌదునన గౌరి శ్రమమున సతి
    చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారి మార్గదర్శకత్వంతో సవరించిన పూరణ :

      తేటగీతి
      గంగ గౌరమ్మ లిద్దరు గట్టు సుతలు
      గట్టు విల్తుని తలనెక్క గంగ మురిసి
      కోరి సగమౌదునని రాగ గౌరి, సతికి
      చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

      తొలగించండి
  12. డా.పిట్టాసత్యనారాయణ
    తల్లికి బిడ్డలిద్దరవ తమ్ముడు నగ్రజు డొక్కయింటికిన్
    అల్లురునౌట కూడదను యాన ప్రచారములోన నుండగా
    కల్ల యటన్న రామకథ గాసిలె లక్ష్మణమూర్తి, జానకీ
    చెల్లిని బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చగన్!

    రిప్లయితొలగించండి
  13. వల్లమాలిన బ్రేమను బెంచగాను
    తల్లి లేనట్టి చెల్లిని తపన తోడ
    నుల్లమలరగ నుత్తముం డొక్కనరుడు
    చెల్లెలిని బెండ్లియాడె మెచ్చెను జగమ్ము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. నల్లనయ్యకు జెల్లెలి నాలిగొనగ
      కల్ల సన్యాసి వేషంబు వల్లెయనుచు
      నుల్ల మలరంగ పార్థుడే యుక్తిగొనగ
      నెల్లలోకంబు నేలెడి గొల్లవాని
      చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము

      తొలగించండి
    2. మొదటి పద్యానికి సవరణ:


      వల్లమాలిన బ్రేమను బంచి తాను
      తల్లి లేనట్టి చెల్లికి త్రాణ యవగ
      నుల్లమలరగ నుత్తముం డొక్కనరుడు
      చెల్లెలిని బెండ్లియాడె మెచ్చెను జగమ్ము!

      తొలగించండి
    3. నల్లని వానికిన్ భగిని నాలిగ గైకొను కోర్కెతోడుతన్
      కల్లపు జోగియై చనెను కవ్వడి బావగు కృష్ణు సూచనన్
      మెల్లగ బాలికన్ ముదము మీరగ సిగ్గుల ద్రుంచి గొల్లకుం
      జెల్లిని బెండ్లియాడె నట శిష్టజనావళి సూచి మెచ్చగన్!

      తొలగించండి
  14. మదిని దోచిన కన్నెపై మరులు కొనియు
    మారు వేషమున కిరీటి మనసు గెలిచి
    చల్లనైన మనసు గల నల్లనయ్య
    "చెల్లెలినిఁ బెండ్లియాడె,మెచ్చెను జగమ్ము"

    రిప్లయితొలగించండి
  15. పాండురాజేంద్రు వరసుతపంచకంబు
    ప్రథితపాంచాల రాజ్యపు పంకజాక్షి
    ధీరు డైనట్టి యాద్రౌపదేయు ముద్దు
    చెల్లెలిని బెండ్లియాడె ; మెచ్చెను జగమ్ము .
    (ద్రౌపదీ పాండవ పరిణయం )

    రిప్లయితొలగించండి
  16. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపాంతరంగుడై
    చల్లని వార్త చెప్పు ముఖసంభవు గొల్చి విదర్భ కన్య రం
    జిల్లగ తేరునం బరగి శీఘ్రముగా జని రుక్మబాహునిన్
    చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  17. రుక్మి భీష్మించి తనచెల్లి రుక్మిణినియె
    దుష్ట శిశుపాలు నకునీయ యిష్ట పడగ
    చక్రి యేతెంచి యోడించి సమితి ,వాని
    "చెల్లెలినిఁ బెండ్లియాడె,మెచ్చెను జగమ్ము"
    ****}{}{****
    (సమితి = యుద్ధము)

    రిప్లయితొలగించండి
  18. చెల్లెలును పరిణయ మాడ చిత్రమేమి?
    ఘనులు వలచి పెండ్లాడెను గతములోన,
    దేవకి తనయుడు విదర్భ దేశ రుక్మి
    చెల్లెలినిఁ బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము"
    తొలకరి దొరబిడ్డ కిరీటి ద్రుష్ట ద్యుమ్న
    చెల్లెలినిఁ బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము"
    నిక్కముగ లక్ష్మణ ఘనుడు నేలచూలి
    చెల్లెలినిఁ బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము"
    నరుడు యతి వేషమును దాల్చి నల్లనయ్య
    చెల్లెలినిఁ బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము"

    రిప్లయితొలగించండి
  19. విద్యయందునదిట్టయాపేరిశాస్త్రి
    వలపునొందుచునాభార్య,పైడితల్లి
    చెల్లెలినిబెండ్లియాడెమెచ్చెనుజగమ్ము
    చూడచక్కనిజంటగానడరుకతన

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. గురుమూర్తి ఆచారి
    ,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    " ముర్తుజా " > చిన్ననాయన పుత్రి యైన

    " వహిద " బేగమున్ మనువాడె | వరుసకు దన

    చెల్లెలిని బెండ్లి యాడె మెచ్చెను జగమ్ము |

    వారి మతమందు నం దది పద్ధతి యట

    సరి యని ధృవీకరించెను సైన్సు గూడ

    _________________________________________

    రిప్లయితొలగించండి


  22. బుచికి వారి తనూజ‌ను, బుడత గారి
    చెల్లెలినిఁ బెండ్లియాడె,మెచ్చెను జగమ్ము
    తేటగీతితో కొనియాడ తేరునెక్కి
    చనె విహారయాత్రలకు బుచ్చాయి బాబు

    రిప్లయితొలగించండి


  23. 1.కపట సన్న్యాసిగా మారి కాంతకొరకు
    అర్జునుడు చేరె ద్వారకన్ యాశతోడ
    సేవలటగొంచు ముదమున చిలిసి కృష్ణు
    చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము.


    2. కోమలాంగిసు భద్రను కూర్మితోడ
    కరము పట్టగ నెంచుచు కవ్వడియును
    తీర్థయాత్ర నెపంబున తిరిగి శౌరి
    చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము.

    3.విప్ర వేషము దాల్చుచు వేగ సాగి
    మత్స్య యంత్రమ్ము ఛేదించి మహిని క్రీడి
    యందుకొనెద్రౌపదీ దేవినాశిఖండి
    చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము.

    4.కమ్మవ్రాసి పంపినయట్టి కాంతభైష్మిఁ
    కరము చేపట్టనరుదెంచి కన్నడపుడు
    రథముపై గొని పోయెతా రమణిఁ రుక్మి
    చెల్లెలిని బెండ్లియాడె, మెచ్చెను జగమ్ము.

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. అల్లనరామచంద్రప్రభువాయమసీతనుబెండ్లియాడగా
    నుల్లసమందిలక్ష్మణుడునొప్పుగనప్పుడుసీతచెప్పగా
    చెల్లినిబెండ్లియాడెనటశిష్టజనావళిసూచీమెచ్చగన్
    నల్లికజూడగామిగులనందముగాగడునొప్పెగాధరన్

    రిప్లయితొలగించండి
  26. సురుచిర యతి వేషమ్మున నరుఁడు దివిరి
    కళ్ళు గప్పి తాలాంకుని కాంత సేవ
    లంది కపట వేషమ్మున నంతఁ గృష్ణు
    చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

    అగ్నిద్యోతనుఁడు రుక్మిణి మాటలుగా కృష్ణునకు చెప్పిన సందర్భము:

    ఉల్లము నందు నేఁ దఁలచ నోర్వ మనోధవుగాఁ బరుం గడుం
    బ్రల్లదు నాపి సోదరునిఁ బన్నుగఁ జేకొను మంచుఁ గోరఁగన్
    వల్లె యటంచుఁ బల్కి వడి భామను రుక్మిణిఁ జక్రి రుక్మికిం
    జెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 9-1-2017 నాటి పూరణలు:

      కల్ల సేసి కన్న కలలు గొల్లమేటి
      మగఁడు రుక్మికి ఘన చైద్య మగధ సేన
      లెల్ల నుల్లమ్ములను దల్ల డిల్ల రుక్మి
      చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము


      చల్లని చిత్త మున్న మరి చాలదె యందము గూడు వెట్టునే
      కల్లలు గాక నిత్యములె కాయపు టందము లెంచి చూచినన్
      నల్లని దంచుఁ దా దొర తనమ్మునఁ బక్కనఁ బెట్టి యక్కనుం
      జెల్లెలిఁ బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే?

      తొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    ("భారతదేశం నా మాతృభూమి.
    భారతీయులందరూ నా సహోదరులు..."
    ...భారత జాతీయ ప్రతిజ్ఞ)


    అల్లదె స్కూలులో బుడుత డల్లరి చేయక రోజురోజు తా
    మెల్లగ మెల్లగా గునిసి మేలుగ నెల్లరు భారతీయులున్
    చెల్లెబొ సోదరుల్ తనకు చెన్నుగనంచు ప్రతిజ్ఞ చేయుచే
    చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  28. దేవదానవు లొక్కటై దీక్షగాను
    సాంద్ర మదనమ్ము జేయగ?చక్కగాను
    జేష్టదేవియు,లక్ష్మియు,చిక్కిరచట!
    హరికి నచ్చగ?యానందకరమునందు
    చెల్లెలిని బెండ్లియాడె!మెచ్చెనుజగము!

    రిప్లయితొలగించండి
  29. ఉత్పలమాల

    అల్లన దేవతల్ శివుఁడు నంబికఁ గైకొనఁ బల్లవాస్త్రుఁడుం
    డుల్లము మార్చునంచు విననొప్పగ బూన్చగ వానిఁ గాల్చుచున్
    ఫుల్ల సరోజ నేత్రి హిమపుత్రి నపర్ణును గట్టు పట్టికిన్
    జెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్



    రిప్లయితొలగించండి
  30. విప్ర సందేశమునుబంపె పెండ్లి యాడ,
    గౌరి పూజకు చనుదెంచె కన్య యపుడు
    కన్న డేతెంచి రాక్షస కళన రుక్మి
    చెల్లెలిని బెండ్లియాడె మెచ్చెనుజగమ్ము
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి

  31. చల్లని వేళయందు నట చక్కని కమ్మను దాల్చివిప్రుడున్
    నుల్లము నందుతాహరిని నొప్పుగ దల్చుచు చేరి ద్వారకన్
    తెల్లము చేయగా నతివ తీరును శౌరియు నేగి రుక్మికిన్
    చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  32. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

    సందర్భము: ఇది సుభద్రార్జునుల కల్యాణమో ఊర్మిళా కల్యాణమో కాదు.. రుక్మిణీ కల్యాణం.. రుక్మి ప్రసక్తి.... లేకుండా.. కొత్తరకం.. ఎలాగో చూడండి.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    కృష్ణు డంగీకరించె రుక్మిణి వలపును..
    "వదిన వచ్చి మీ పని పట్టు వరుసగ.." నని
    భద్రగుణ నుడికించి సుభద్రను తన
    చెల్లెలినిఁ... బెండ్లియాడె.. మెచ్చెను జగమ్ము..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    3.7.18

    రిప్లయితొలగించండి
  33. వరముగ జనియించె సుభద్రకు రహి గల్గ
    నర్జునుని యందు నభిమన్యు నామము గల
    వీర బాలకుండు ; నతడుత్తర కుమార
    చెల్లెలిని బెండ్లియాడె మెచ్చెను జగమ్ము!

    రిప్లయితొలగించండి
  34. కబురు వెట్టుచు పిలువగ కలికి, హరియె
    రథము పైనను చేకొని రయముగాను
    రోదసీ జల్ల పూవాన రుక్మి యొక్క
    చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము

    రిప్లయితొలగించండి
  35. సమస్య :-
    "చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము"

    *తే.గీ**

    అన్న పెండ్లిన తను జూచినందగత్తె
    ఎవరెవరనియారాతీయ గిష్టసఖియ
    మరదలని దెలియంగనే మదిన వదిన
    చెల్లెలిని బెండ్లియాడె; మెచ్చెను జగమ్ము
    .................✍చక్రి

    రిప్లయితొలగించండి
  36. పిల్లిని చంకబెట్టుకొని పెళ్ళికి బోవగ భోజనానికై
    యల్ల తెనాలి రాముడట హైరన నొంది వరుండు చావగా
    ఫుల్లసరోజ నేత్రనట పొంకము మీరగ బావగారిదౌ
    చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి