గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశం ::న్యస్తాక్షరి నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు క్రమంగా *పో - లే - ర - మ్మ* అనే అక్షరాలు వచ్చేటట్లు *ఆటవెలది పద్యం* వ్రాయాలి. సందర్భం :: ఓ పోలేరమ్మ తల్లీ! నీకు సాటి యైన దేవతలు వేఱే లేనే లేరమ్మా! నీ చరణమే శరణమని నీ పాదం పట్టుకొన్నానమ్మా! తెలియక తప్పులు చేసినా మమ్ము వదలి వెళ్లిపోవద్దమ్మా! పాడి పంటలను అనుగ్రహించి మా పేదరికాన్ని తొలగించు మమ్మా! మాకు దిక్కు నీవే నమ్మా! మమ్ము చల్లగా చూడమ్మా! అని గ్రామ దేవతను ప్రార్థించే సందర్భం.
కోట రాజశేఖర్ గారూ, అద్భుతమైన పూరణ. న్యస్తాక్షరాలను పాదాదిలోను, యతిస్థానంలోను నిలిపిన మీ ప్రతిభ ప్రశంసనీయం. అభినందనలు. నాలువ పాదంలో యతిస్థానంలో ద్విత్వ మకారం లేదు. వచ్చే అవకాశమూ లేదు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఅంశము - గ్రామ దేవతలు
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు...
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా
'పో - లే - ర - మ్మ' ఉండాలి.
పోతపోయ కరుణ మూర్తీభవించితి !
లేరు నీకు సాటి లేరు తల్లి !
రక్ష నీవె మా పురమునకు ! మావుళ...
మ్మ ! యని భీమవరము మహి రహించె !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో రెండవ 'లేరు'కు అన్వయం?
పోలెరాంబ విడిచి పోలేరు , నీ దయ
తొలగించండిలేక నరులు నిలువ లేరు , తల్లి !
రక్షనీవె నీవె , రక్తార్చితాంఘ్రి ! అ
మ్మ ! కరుణఁ గని సతము మమ్ము బ్రోవు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పోతు లయ్య సామి పోచమ్మ మైసమ్మ
రిప్లయితొలగించండిలేచి వచ్చు నట్లు లీల నుండ
రయము బోనము లను రక్షించు మనుచు న
మ్మలు భక్తి మీర కొ లు తు రు గ ద
నాలుగో పాదం లో మ్మలి ల అని సవరణ చేయడ మైనది
తొలగించండిరాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ! నాల్గవ పాదంలో యతి సరియేనా?
తొలగించండినాలుగో పాదం లో ప్రాస యతి లికిని లుకును చెల్లింది సీతా దే వి గారూ
తొలగించండిA.Satyanarayana Reddyజులై 02, 2018 6:00 AM
రిప్లయితొలగించండిపోసి జలము చేయ పూజనమ్మలను పో
లేరు యిచ్చు శుభము లెండి వేగ
రండి గ్రామ వాసు లార నిండుమది న
మ్మను కొలిచి సుఖముగ మనుటకొరకు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పోలేరు + ఇచ్చు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "పోలే రొసంగు శుభము..." అనండి.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిపోచ!మైస!ముసలి! పూర్ణమ్మ!కనకమ్మ!
లేడ్గురక్క!లయ్య బోడమల్లు!
రంగ!దుర్గ!నాగ! రౌద్రపు బీర!స
మ్మతినిగొల్తు మయ్యలమ్మల మిము!💐
(పోచమ్మను ప్రేమగా,"ఓ పోచ !"అంటూ పిలువడంT.S లో పల్లె పట్టుల ఆచారము కలదు.)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోక రాక లిచ్చి పూర్ణంబుగా నిల్ఛి
రిప్లయితొలగించండిలేమి బాపి సిరుల లీలనిచ్చి
రయముగాను మమ్ము రక్షింపు!ప్రేమ ని
మ్మనుగు తల్లి నతుల నందజేతు
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండిపోరు వంటి బ్రదుకు తీరులే మార్చియు
రిప్లయితొలగించండిలేమి నుండి జనుల లేవదీసి
రయము వెతల ద్రోల 'రమ్ము!రారమ్ము!ర'
మ్మనుచు గ్రామ దేవతను పిలిచెద.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోతు వేట నిడగ పోచమ్మ గుడికేగి
రిప్లయితొలగించండిలేచి మబ్బు లోన కాచి యుంటి
రగడ జేసి జేసి రాజన్న యలిగె న
మ్మన వివిన గనడు మైసమ్మ దరికనె
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. సవరించండి.
పోతు వేట నిడగ పోచమ్మ గుడికేగి
తొలగించండిలేచి మబ్బు లోన కాచి యుంటి
రగడ జేసి జేసి రాజన్న యలిగె న
మ్మనవి వినగ కదిలె మారు యనక
(పో)వ లెనిల గ్రామ దేవతల్ దురితంబు
రిప్లయితొలగించండి(లే)మి గూలి మాదు కామితములు
(ర)యము తోడ దీరి జయమంద వలయున
(మ్మ)యని కొలువ వలెను నియతి తోడ.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోలేరమ్మవు నీవే పోశమ్మవు కూడ నీవే
రిప్లయితొలగించండిలేలెమ్మనగ నీవు రావే మమ్ముల కాచి పోవే
రంజుగ ఇదె కల్లు ముంత మరి యాటలతో
మాసంత
మ్మత్తులోన జోగిరంత భక్తి లేదు వీసమంత
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశం ::న్యస్తాక్షరి
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు క్రమంగా
*పో - లే - ర - మ్మ* అనే అక్షరాలు వచ్చేటట్లు *ఆటవెలది పద్యం* వ్రాయాలి.
సందర్భం :: ఓ పోలేరమ్మ తల్లీ! నీకు సాటి యైన దేవతలు వేఱే లేనే లేరమ్మా! నీ చరణమే శరణమని నీ పాదం పట్టుకొన్నానమ్మా! తెలియక తప్పులు చేసినా మమ్ము వదలి వెళ్లిపోవద్దమ్మా! పాడి పంటలను అనుగ్రహించి మా పేదరికాన్ని తొలగించు మమ్మా! మాకు దిక్కు నీవే నమ్మా! మమ్ము చల్లగా చూడమ్మా! అని గ్రామ దేవతను ప్రార్థించే సందర్భం.
*పో* కుమమ్ము వీడి *పో* కు పోలేరమ్మ!
*లే* రు నీకు సాటి, *లే* మి బాపు,
*ర* క్తి పట్టితిని ధ *ర* ణి నీదు చరణ మ
*మ్మ!* గతి నీవె యమ్మ! మమ్ము గనుమ!
పాదాది లోనే కాక యతి స్థానములలో కూడా న్యస్తాక్షరములను ఉంచే ప్రయత్నం జరిగింది.
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (2-7-2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. న్యస్తాక్షరాలను పాదాదిలోను, యతిస్థానంలోను నిలిపిన మీ ప్రతిభ ప్రశంసనీయం. అభినందనలు.
నాలువ పాదంలో యతిస్థానంలో ద్విత్వ మకారం లేదు. వచ్చే అవకాశమూ లేదు.
నాపై గల ఆదరాభిమానముల కారణంగా గొప్పగా అభినందించిన గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి భక్తిపూర్వక ప్రణామాలు.
తొలగించండిపోతరాజు నీకు బూజలే చేయగ
రిప్లయితొలగించండిలేచిరావె తల్లి బ్రోచగాను
రక్ష నీవె రమణి రత్నాంగి! పోలెర
మ్మ! కరుణావతార! మాననీయ!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆర్యా! నాల్గవ పాదమున న్యస్తాక్షరం ప్రధమం కాకుండా ద్వితీయమైనది! పరిశీలింప ప్రార్ధన!🙏🙏🙏
తొలగించండిగురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీతాదేవి గారి వ్యాఖ్యను గమనించి తగిన సవరణ చేయండి.
గు రు మూ ర్తి ఆ చా రి
తొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
మూర్ఖ భక్తి
~~~~~~~
పోటకమున పిల్ల పోరుపెట్టుచు నుండె |
లేత మేక నిక బలి నొసగెదము
రక్ష గట్టి | వేగ రక్షించు సుంకుల
మ్మ ! మయి సమ్మ ! చౌడ మాంబ ! తల్లి !
{ పోటకము = స్ఫోటక మను చర్మ వ్యాధి ;
రక్ష = తాయెత్తు ; }
-------------------------------------------------------------------------------
పోతులెందుకమ్మ ? పూనకాలేలమ్మ ?
రిప్లయితొలగించండిలేనిపోని రభస గానవమ్మ !
రక్తపాతమాపి రక్షణ సల్పు మ
మ్మ ! మము గన్న తల్లి ! మాన్యచరిత!!
బాపూజీ గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
నమస్సులండీ!
తొలగించండిప్రశస్తమైన పూరణ బాపూజీగారూ! అభినందనలు!!💐💐💐
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ సీతాదేవి గారూ !
తొలగించండిపోతును బలి నిత్తు భోగమ్ము లీయవే
రిప్లయితొలగించండిలేని వాడనమ్మ లీల జూపు
రక్త తర్పణమ్ము రంజిల చేతున
మ్మ,నను కావుమమ్ము వినతు లివియె
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂న్యస్తాక్షరి🤷♀.. .. .. .. .. .. ..
పో..లే..ర..మ్మ అనే అక్షరాలు
4 పాదాల ఆదిలో వరుసగా రావాలి.
అంశం.. గ్రామదేవతలు
ఛందస్సు.. ఆటవెలది
సందర్భము: పోచమ, బతుకమ్మ, తాయమ్మ, పోలేరమ, గెలువులమ, మారెమ, సుంకులమ్మ, జమ్ములమ్మ... వీళ్ళు గ్రామ దేవత లని తలుస్తాను.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
పోచమ బతుకమ్మ పొసగ తాయమ్మ పో
లేరమ గెలువులమ మారెమ యిల
రమణకెక్కు సుంకులమ్మ యా జమ్ముల
మ్మ లలి గ్రామ దేవత లని తలతు
రమణకెక్కు=శోభించు
లలి=ఒప్పిదమైన
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
2.7.18
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపోలకమ్మ ! ఎర్రపోతమ్మ ! బ్రోవు పో
లేరు తల్లి యెక్కిలి మము బ్రోవు
రచన నాటవెలది ప్రణతులివి మరిడ
మ్మ శరణు శరణనుచు మదిని గొల్తు!
👏
తొలగించండిపోతురాజునీకుపూజజేయగవచ్చె
రిప్లయితొలగించండిలేచిరమ్మువేగలీలతోడ
రక్షజేయనీవుదక్షురాలవుగద
మ్మనివేడుచుంటిమారెయమ్మ!
పోచుపుచ్చెదవుగ పురమునందలికీడు
రిప్లయితొలగించండిలేరు నీకు సాటి రిపులనణచ
రక్తమీయలేదు రట్టడి చేయక
మ్మ, మరిడెమ్మ బ్రోవుమమ్మ మమ్ము
పోచుపుచ్చు=పోగొట్టు
పోవ దొడ్డవరము ముత్యా లనఁగ వేల్పు
రిప్లయితొలగించండిలేమఁ గాంతు మచట లేక సాటి
రమణి వెంట నుండ నమృతాశి గోగుల
మ్మ యతి భక్తి నే నమస్కరింతు
[మా యూరు బి. దొడ్డవరము లోని దేవతలు: ముత్యాలమ్మ, గోగులమ్మలు]
పోవ లేరు విడిచి మూర్తి పోలేరమ్మ
తొలగించండిలేవ రమ్మ నిద్ర భావ మంద
రయక నిన్ను నమ్మ రక్షింప మమ్ము ర
మ్మ నినె పోల లేరమ భువి నమ్మ
పో.. పోలేరమ్మ
లే..రమ్మ
ర మ్మ
మ్మ పో..లే..ర..మ్మ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపోలికేది నీకు పోగొట్ట భీతిని
తొలగించండిలేరు నీకుసాటి లేమ లెచట
రమ్మువేగ మమ్ము రక్షింప తిరుపత
మ్మ! పెనుగంచి గ్రామ మాత లక్ష్మి!
న్యస్తాక్షరాలను యతి స్థానములలో కూడ ఉంచే ప్రయత్నం చేశాను!
పోతరమ్ము వదలి పూజలు చేసెద,
రిప్లయితొలగించండిలేమి నాపి నిడు కలిమిని మాకు,
రక్ష తోడ మమ్ము రమ్యమౌ చేటల
మ్మనిరతమ్ము కాచు మనసు బెట్టి
ప్రకాశము జిల్లా లో చచేటలమ్మ,అంకమ్మ అను గ్రామ దేవతలు గలరు
పోమ్మన్న పోని రోగాల్
రిప్లయితొలగించండిలేమ్మై పోవు గద నీ ఫలీకృత కరుణన్
రమ్మన వచ్చు సి రుల్ , నా
మ్మమ్మల్ గొల్చిన భగవతి! మాతా శరణం!
పోడిమి చెడుమాన్పు!పోలేరు యమ్మగా
రిప్లయితొలగించండిలేమిలేకజేయు లేశమైన
రక్ష గూర్చుదేవి తక్షణమందు!న
మ్మ?మనభక్తి శక్తిమార్గమౌను!
పోలి తల్లినిలను పోడిమిగ గొలువ
రిప్లయితొలగించండిలేమి సురిగిపోవు, లేదు భయము
రక్షగోరి జనులు రమ్మని బిలువ త్రి
మ్మటలనెడపి గాచు మహిత శక్తి!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపోలకయను తల్లి మేలొనర్చగ సాటి
రిప్లయితొలగించండిలేనిదనుచు దలచి మానవాళి
రక్ష గోరి యామె నక్షయ వరములి
మ్మనుచు గొల్తురైరి యవని యందు
ఆటవెలది
రిప్లయితొలగించండిపోషణమది నాటుపోటులన్ దయఁగూర్చి
లేమి బాపి సాటిలేని బలిమి
రసను గ్రామములకు రక్షగా నొసఁగు న
మ్మలఁ గనంగ రమ్మ! మహిమఁ దెలియ
కవిపండితులు శ్రీ సూరారం శ్రీనివాసులు గారి సూచిత సవరణలతో :
తొలగించండిఆటవెలది
పోషణమతి నాటుపోటులన్ దయఁగూర్చి
లేమి బాపి సాటిలేని బలిమి
రసను గ్రామములకు రక్షగా నొసఁగు న
మ్మలఁ గనంగ రమ్మ! మహిమఁ దెలియ
పోరి యోర్తు గొలిచె పుడమిలో నిను గోరి
రిప్లయితొలగించండిలేదు సంతు నీదు లీల చూప
రమ్మటంచు కోర రయమున తీరెన
మ్మ నిను పొగడ తరమె మనిషికిలను.
పోరుసలిపి జనుల బ్రోతువు సతతమ్ము
లేమి బాపి తీర్చు కామితమ్ము
రయమున నిను గొల్చి రాజాధి రాజులి
మ్మహిని యేలిరంట మానుగాను.
పోకు మమ్మ తల్లి పురమును విడి నీవు
లేరు మాకు దిక్కు వేరెవరును
రక్షమాకు నీవె రయమున కావవ
మ్మగిరి పుత్రి మమ్ము మహిని నీవు
కవి మిత్రులు శ్రీ బొల్లికొండ రామనాథం గారు వ్రాసిన న్యస్తాక్షరి పూరణను పరిశీలించగలరు.
రిప్లయితొలగించండి(పో)రు సల్పు వేల్పు పోలేరు మాతవే
(లే)మి తనము మాకు లేక యుండ
(ర)జత నాసికాభరణము రంజిలగ న
(మ్మ)! నిను గొలుతు మమ్మ! మమ్ము గనుమ!