8, జులై 2018, ఆదివారం

నిషిద్ధాక్షరి - 44

కవిమిత్రులారా,
అంశము - జడపై పద్యం
నిషిద్ధము - 'జ, డ' అన్న అక్షరాలు.
ఛందస్సు - మీ ఇష్టము.

123 కామెంట్‌లు:

  1. కాలము మారెను కురులే
    స్త్రీలకు బరువాయె నేడు ఛీ యని వానిం
    గేలను కోయుచు నుండ ని
    కేలా యీ బ్రతు కటంచు నీల్గెదు వేణీ!

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    వీపునన్ మధ్యమున గన పిరుదులపయి
    కదలి త్రిపథగ యట్టిటు కదలినట్లు
    మువ్విధమ్ముల పాయల ముద్దుగొల్పు
    కేశబంధమ్ము మారుని కేలి శరము !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్న గారూ,
    మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    ఈనాడు ఆవిష్కరింపబడే 'జడ కందములు...' పుస్తకంలో మీ పద్యాలు లేకపోవడం పెద్ద లోపం.

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారూ,
    మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    ఈనాడు ఆవిష్కరింపబడే 'జడ కందములు...' పుస్తకంలో మీ పద్యాలు లేకపోవడం పెద్ద లోపం.

    రిప్లయితొలగించండి
  5. ఆ: వేణిక పయిన కడుఁ బ్రేమముకలిగిన
    కవుల సంగమమ్ము కదలి వచ్చి
    కంది శంక రయ్య కమనీయ దీవెన
    లందు కొని ముదమును పొంద వలయు

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. ప్రేమలు పొంగగ సుకవులు
    నీ మేలును జాట తెనుగు నేలను నిష్ఠన్
    తా మల్లిరి కందము లను
    సేమము నీ కగును బాయు చింతలు వేణీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రేమలు పొంగగ సుకవులు
      నీ మేలును చాట తెనుగు నేలను నిష్ఠన్
      తా మల్లిరి కందము లను
      సేమము నీ కగును బాయు చింతలు వేణీ.

      జాగ్రత్త టైపా టండీ

      తొలగించండి
  8. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂నిషిద్ధాక్షరి 🤷‍♀.. .. .. .. .. ..
    అంశం
    *జడపై పద్యం*
    నిషిద్ధము - 'జ, డ' అన్న అక్షరాలు.
    ఛందస్సు - మీ ఇష్టము.

    సందర్భము: స్పష్టము..
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    గంగ యొకవైపు నినదించు
    గలగల మని...
    మెఱయు నొకవైపు నెలవంక
    మిలమిల మని...
    " కొప్పు గల యమ్మ యెటు వైపు
    దిప్పిన సరె!"....
    చిత్తమున స్మరియించెద
    శివుని సిగను...

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    8.7.18

    రిప్లయితొలగించండి
  9. ఆ: వేణిక పయి కరము ప్రేమము కలిగిన
    కవుల సంగమమ్ము కదలి వచ్చి
    కంది శంక రయ్య కమనీయ దీవెన
    లందు కొని ముదమును పొంద వలయు

    రిప్లయితొలగించండి
  10. పిరుదులపై నల కదలుచు
    విరి విల్తుని మేటి చెఱకు విల్లై యెదలన్
    మరిపించును మురిపించును
    విరిబోణీ! నీదు వేణి విస్మయ గతులన్

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా ‌సత్యనారాయణ
    అలకల గరకర గోయగ
    పిలకలకే వలపు విరియు బిరుదము రాగా
    తలపై గణపతి బిళ్లయె
    వెలయకదంపతియె మనదు వెయ్యేళ్లేమో!
    (వేణికి కొంచెము పైన గణపతి బంగరుబిళ్ల ధరించేవారు స్త్రీలు.backgroundలో నాగు ఉండేది.దీనిని నాగఫణి అనేవారు.నేటి విడిపోవడాలకు ఆ జడలు,నాగఫణులు లేకపోవడమే కారణమేమో!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిరుదుల పై బిరుదు వగుచు
      సరసములో సరిగమలకు సాధన మగుచున్
      పురకాంతల నెచ్చెలివై
      మురిపింతువు ముగ్ధులవగ పురుషుల నిలలో

      తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

      తొలగించండి
  12. *పిరుదుల పై బిరుదు వగుచు*
    *సరసములో సరిగమలకు షడ్జమ మగుచున్*
    *నెరజాణల నెచ్చెలివై*
    *మురిపింతువు సిరులతోడ పురుషుల నెపుడున్*

    *తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష*

    రిప్లయితొలగించండి
  13. తైలము కోరెడి పీడ పేలు చుండ్రుకు జాడ
    పూలను పొదిగెడు మేడ అరాళ కుంతల కాడ
    తల నుండి దిగిన ఊడ బుసలు కొట్టునదె చూడ
    అతుకగ సౌరపు నాడ అలరినది వేడుక తోడ

    రిప్లయితొలగించండి
  14. కాల గతిలోన నెందఱో కవులుఁగూడి
    కందముల నిన్ను మెచ్చిరిఁగాదె వేణి!
    శంకరయ్య మహోదయు చలువ వలన
    శారదాంబయె దీవించి సంతసింప

    రిప్లయితొలగించండి
  15. పలు రక విరుల ధరించి యు
    నిలువ క నాట్యము ను స లి పి నేరుపు మీర న్
    కలవర పర తువు పరుల ను
    మిలమిల మెరియు దు వు వేణి మేదిని యందు న్

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. నాదు ప్రియురాలు ధవళాంగి ; నాతి వేణి
    దీర్ఘమైనది ;చిక్కనిది ;మరియెంతొ
    చక్కనైనది ; కేకిపింఛమును బోలు ;
    పుష్పమాలిక కీలించి పొంగిపోదు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కేశాలను కేకి పింఛముతో పోల్చడం కొత్తగా ఉంది! కేకి పింఛము పలు వర్ణాలతో ఉంటుంది కదా! ఈ కాలంలో కేశాలకు పలు వర్ణాలద్దడం సరదా అయింది కనుక సరిపోయిందనే అనుకుందాం!!😊😊😊

      తొలగించండి
  18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశం :: నిషిద్ధాక్షరి
    జ డ అనే అక్షరాలు వాడకుండా
    జడపై పద్యం వ్రాయాలి.
    సందర్భం :: ఓ కేశ బంధమా! నీ నల్లని రంగు చూచి నారాయణుడు కూడా నిన్ను మెచ్చుకొంటాడు. చక్కగా కొప్పు సవరించుకొని కువలయాక్షులు నిన్ను మెచ్చుకొంటారు. నీవే ఒక ఆభరణమని నిన్ను అందంగా తీర్చిదిద్దుకొని మురిసిపోతారు. సహజ సిద్ధమైన శిరస్త్రాణం నీవే. ముందు వెనుక అందం నీవే. ఓ శిరోరుహ రాశీ! నీవు లేకుంటే అదమంతా నిండు సున్న అవుతుంది గదా అని జడను వర్ణించే సందర్భం.

    కేశ బంధమ ! నిన్ను కృష్ణ మూర్తియె మెచ్చు
    తన రంగు నీ రంగు తలచి తలచి
    కుంతల బంధమా! కువలయాక్షులు మెచ్చు
    కొందురు నిను తమ కొప్పు మలచి
    కచ బంధమా! నిన్ను కాంతలు మది మెచ్చి
    యాభరణ మ్మని యంద్రు వలచి
    చికుర బంధమ! నిన్ను స్త్రీ లెల్లరును మెచ్చు
    కొందు రందమ్ముల గూర్చి కొలిచి ప్రాణ సమ మగు ఘన శిరస్త్రాణ మీవె
    ఘనత విలసిల్లుదువు ముందు వెనుక నీవె
    రమ్య రుచిర శిరోరుహ రాశి వీవె
    నీవు లేకున్న అందమ్ము నిలువ దెన్న.
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (8-7-2018)

    రిప్లయితొలగించండి
  19. అధరముల కన్న మిన్నగ
    మధురస భావనలనిచ్చు మన్మథ శరమై
    హృదయముల దోచు దానవె
    సుదతుల వెన్నంటి యున్న సొగసరి వేణీ!

    రిప్లయితొలగించండి
  20. పద్యము వ్రాయకుండా తప్పులు వెదకితిని ఈ రోజు...అందరికీ క్షమాపణలు
    🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదే వ్రాయబోతున్నాను! ఈ రోజు ఇన్ చార్జి హెడ్ మాస్టర్ మీరేనా అని??!!🤔🤔🤔

      తొలగించండి
    2. సారు బిజీ అని నేనే ఛార్జి పుచ్చుకొన్నాను జబర్దస్తీగా

      తొలగించండి
    3. మరి మీరు ఆవిష్కరణకి రావట్లేదాండి?

      తొలగించండి
  21. ఉరుకు సురగంగ నల్లన
    విరికి పగిది నొడిసి పట్టి శివుని శిరమునన్
    శరదిందు రేఖ చెలిమిని
    వరలుచు ధ్యానింప దగిన భద్రవు వేణీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉరుకు సురగంగ నల్లన
      విరికి పగిదిని బిగియించి శివుని శిరమునన్
      శరదిందు రేఖ చెలిమిని
      వరలుచు ధ్యానింప దగిన భద్రవు వేణీ!

      తొలగించండి
    2. మీ పద్యము చాలా బాగుందండి శ్రీమతి సీతాదేవి గారూ!

      తొలగించండి
    3. ధన్యవాదములు సహదేవుడు గారూ! 🙏🙏🙏

      తొలగించండి
  22. బారుగనటునిటునూగుచు,
    మారునిశరములు కుశలత మప్పుటలేవే?
    ఘోరముకాదా! పుణ్యము
    పూరణలందున సహితము పూర్ణములయ్యో!

    రిప్లయితొలగించండి
  23. నేను గతంలో వ్రాసిన శతాధిక "జడ" పద్యములలో ఇది ఒకటి.
    "జడ" తీసి "సిగ" పెట్టాను.

    అత్తా! పూలిత్తావా
    ఇత్తా సిగలోన పెత్తి ఇంతికి పోతా
    అత్తిచ్చిందని నే నే
    ల్పిత్తాలే యక్కనిపులు, వెవ్వెవ్వెవ్వే !

    రిప్లయితొలగించండి
  24. వివిధ తలపులు నీయందు వెల్లివిరిసె
    కురుల వలె, నీజననమె మాకు తెరవవగ
    పలువురమొకటై కలసి కవనము లల్ల
    కంద శతకమై కాంతిల్లె కవులు మురియ

    రిప్లయితొలగించండి

  25. మధ్య పాపటనట మంచిగా దీయుచు

    కురుల చిక్కును దీసి కోమలముగ
    కొసల నల్లబోవ కూరిమి తోమోము
    కప్పు కొనియె పతియు కరము ప్రీతిఁ


    మధ్య పాపట దీయుచు మంచిగాను

    కురుల నెల్ల దువ్వి కొప్పును చుట్టుచు
    మల్లె పూలు తురిమి మరులు గొల్పి
    నోర చూపు చూచు నువిదను గాంచుచు
    పనులు మరచి పోయె పతియు తాను


    ముంగురులను దువ్వి ముచ్చటగా వేణి
    నల్ల వీపు పైన నందముగను
    మెలిక లు తిరు గంగ మీటమగని యెద
    పరవశాన గాంచు పతిని మగువ.

    వీపుపైన సతము వేగము గా సాగు
    పాము వోలె నదియు పాకు నచట
    అలిగిన సమయాన నస్త్రమై యలరారు
    పతులమదిని దోచు పాశ మిదియె

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. Saturday, July 7, 2018
    జ,డ నిషిధ్ధము
    నునుపగుగురులనుగనగను
    గనువిందుగనయ్యెమిగులగాంతలవేణుల్
    వేనలియందమునరయగ
    మునులకునున్సాధ్యమగునె?ముచ్చటకైనన్

    రిప్లయితొలగించండి
  28. అల్లిన నీ కురులే నా
    యుల్లములో పాశమయ్యె నూహింపంగన్
    ఝల్లనె మది తలపోయగ
    కొల్లలుగ కెరటముల వలె కోరిక లెగసెన్!

    రిప్లయితొలగించండి
  29. ఇరవై పాపపు రాశికి
    వర వేంకట పతి కొసగగ వరమైతివిగా
    తరుగగ రాగము మోహము
    తిరుక్షవరమె తగియున్నది తరచుగ నిలన్!

    మన పాపాలన్నీ మన కేశాలలో చేరుతాయిట! కనుక వీటిని తరచు తొలగించడం ఉత్తమమని పెద్దల ఉవాచ! 🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  30. కురులిడు నతివ కెప్పుడు కోమలమ్ము ,
    నoగరుహము లేకున్నచో నoబరమున
    నమవశ శశధరుని వోలె నలరుబోడి
    శిరము సవురు విహీనమై సరవి తరపు
    కొనును, నిక్క మిదియే గద వనితలారా!
    అలక లున్నచో తెలిగంటి పలువిధముల
    వలన నొందగల రెపుడు, మెలిక ద్రిప్పి
    కేశ గర్భమ్ము బెట్టును వాసి గలిగి,
    విరియ బోయంగ వచ్చును భరుని యెదుట
    కినుక చూపుచు , శిరముపై కేశములను
    పాయలుగ నల్లి వాటిపై ఫల్యములను
    పెట్ట వచ్చు, సరసముగా కొట్ట వచ్చు
    వేనలిని విసరి పతిని విసుగు లేక,
    పురుష పుంగవులకు సరి పోవు నటుల
    తిరిని తగ్గించి మహిలోన తిరుగ వచ్చు ,
    లోమములు తల పై నున్న భామ కిడును
    మురిపెము, బెళుకు తగ్గును మోవిపైన ,
    కచములున్న మగువ వేణిక పగటు గలిగి
    నెరి నిడును, వేణితో నింతి నురిని వేసు
    కొనగ వచ్చు తుట్ట తుదకు మనసు విరుగ ,
    వేనలి ఘనత మెచ్చగా వేయి నోళ్ళు
    చాలవు, సు విశాలమ్మైన సహురి పైన

    రిప్లయితొలగించండి
  31. ఫుల్లాంబురు హా క్ష్యార్యా
    పల్లవ దేహార్ధ భాసి పర మామర గం
    గా ల్లాలవాల మీ ధ
    మ్మిల్లము చంద్ర విలసితము మేరు సు ధామా

    [అల్ల = తల్లి; ధమ్మిల్లము = జడకొప్పు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలు వర్ధమాన సుకవి శ్రేష్ఠులు శాస్త్రి గారికి నమస్సులు.

      తొలగించండి
    2. 😊

      వర్ధమానము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

      గ్రంథసంకేతాది వివేచన పట్టిక
      సం. వి. అ. పుం.
      1. ఆముదపుఁ జెట్టు;
      2. మూఁకుడు;
      3. రాజగృహరచనా విశేషము;
      4. అభినయహస్త విశేషము.

      తొలగించండి

    3. అభినయహస్త విశేషము సరియైన జవాబు :)
      (ప్రొఫయిలు ఫోటో:))

      జిలేబి

      తొలగించండి

  32. జడకందం మా కందములకు శుభాకాంక్షలతో

    సవాలాయెన్ రాణీ మదితిరిగె నీ సన్నిధిన్ కోరుచున్ మే
    ఘవర్ణంబై సర్పంబువలె కదిలెన్ కాంతివంతంబుగా నీ
    దు వేణీ! పూబోణీ! లలన! మగువా! దువ్వినావే వయారీ
    రవేసాకుల్తెమ్మా కవివరులకై రా! సభాప్రాంగణం బి
    ద్ది వేంచేపుల్ కందమ్మునకు తిరికిన్ తీర్థమిద్దే శుభాంగీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. సవరణతో

    వివిధ తలపులు నీయందు వెల్లివిరిసె
    కురుల వలె, నీయునికియె మాకు తెరవవగ
    పలువురమొకటై కలసి కవనము లల్ల
    కంద శతకమై కాంతిల్లె కవులు మురియ

    రిప్లయితొలగించండి
  34. తల నున్నగ ద్రువ్వుచు నివ
    తల నవతల పాయ లిగ్గి తలగిన నెఱి కుం
    తలనొత్తుచు నల్లితి కొల
    తలకందని వేణిని నెలతల యీ కలిమిన్౹౹

    రిప్లయితొలగించండి


  35. వేణీ! కందపు పద్యమాలికలివే వేగంబుగా రమ్మ ! శ్రీ
    వాణీ పుత్రులు నిన్ను మెచ్చి వరుసన్ పారించినారివ్వి! పూ
    బోణీ! నాల్గనగంట కొట్టగ భళా పొత్తమ్ము ప్రాప్తంబగున్
    కాణీ లెక్కలజేర్చి కూర్చినవివే ! కాంతామణీ రా గొనన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  36. శ్రీ గురుభ్యోనమః

    గురువర్యులకు వందనములు.
    ఆర్యా, "జడకందములు మాకందములు" పుస్తక ఆవిష్కరణ" సందర్భముగా శుభాకాంక్షలు.
    సభకు రాలేకపోయినందులకు క్షంతవ్యుడను. సభ దిగ్విజయముగా జరుగవలెనని ఆకాంక్షిస్తూ

    పలువురు కవివర ప్రముఖులు
    కలువగ నొకచోట మిగుల కౌతుకమొప్పెన్
    కలువలు విరిసిన రీతిగ
    పులకించెను ప్రాంగణమ్ము బుధవర్గముతోన్

    రిప్లయితొలగించండి
  37. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂నిషిద్ధాక్షరి 🤷‍♀.. .. .. .. .. ..
    అంశం
    *జడపై పద్యం*
    నిషిద్ధము - 'జ, డ' అన్న అక్షరాలు.
    ఛందస్సు - మీ ఇష్టము.

    సందర్భము: ఒకానొక భక్తుడు దేవి కేశపాశాన్ని స్మరిస్తున్నాడు. దేవిని స్తుతిస్తున్నాడు. ఐతే అప్పు డాతనికి అర్ధ నారీశ్వర రూపమూ స్మృతిపథంలో మెదలింది.
    సర్వమంగళా కేశపాశం సహజంగానే దివ్య సుగంధ భరితం.
    సింధుర రాజ గమనా ధమ్మిల్ల బంధంబు సహజ గంధంబు... అని పూర్వ కవి ప్రయోగం ప్రసిద్ధం.
    ఆ భక్త కవి ఇలా స్తుతిస్తున్నాడు.
    "అమ్మా! నీ జడ దివ్య పరిమళం గలది. అది వెనుకకు వాలిపోతూ వీపుపై వ్రేలాడుతున్నది. అప్పుడు శివుడు అర్ధభాగంలో వున్నాడు కాబట్టి ఆతని మెడ చుట్టూ తిరిగి వెనుకకు వాలి వీపుమీద మరోవైపు కాల సర్పం (తోకభాగం) వ్రేలాడుతున్నది. ఈ జడ ఆ కాల సర్పంతో తన్మయత్వంతో పెనవేసుకున్నది. ఆ జడకూడ మరొక కాల సర్పమా... అన్నట్టున్నది కాబట్టి వాటి కా స్నేహం కుదిరిందేమో!
    క్రమంగా నీ కేశపాశం ఘన జఘనంమీద ప్రకాశిస్తున్నది. అటువంటి నీ జడను స్మరిస్తున్నాను తల్లీ! సర్వమంగళా!...."
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    వెనుకకు వాలి వీపుపయి
    వ్రేలుచు, దివ్య సుగంధ యుక్తమై
    తనరుచు, కాల సర్పమును
    తన్మయతన్ బెనవేసి, వింతగా
    ఘనమగు శ్రోణిపై మరొక
    కాల సరీసృపమో యనన్ వెలిం
    గెను గద కేశపాశ మది
    నీది! స్మరించెద సర్వమంగళా!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    8.7.18

    రిప్లయితొలగించండి
  38. పిరుదులపై కదులగలుగు
    చొరువను గలిగినది నీవు చోద్యమ్మదియే
    తరుణుల సుకుమార తనువు
    చరియింతువు నీవు గాదె సరసపు వేణీ!

    రిప్లయితొలగించండి


  39. అరె! కొత్తిమీరికట్టా
    చిరు సరదాయె కుసుమమును సిగపై చొనుపన్
    మరి కాలేదాయె శుభాం
    గి!రాధ! నీయందమంత గిరిగీసెన్బో :)

    జిలేబి
    పరార్ సీ యు ఆల్ అట్ ది వెన్యూ

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  40. అందములు వాణి కీ జడ

    కందములు మనోజ్ఞమైన కైతల కివి సం

    బంధములు కావ్య వన మా

    కందములును తెలుగు తల్లి కచబంధము నౌ.

    రిప్లయితొలగించండి
  41. కబరీభరమ్మది కాలసర్పమటుల
    కదలుచు నిలువున గలచు నెదను,
    చంచరీకశ్రేణి సారసాసవముకై
    సాగుచున్నదను విస్మయము నొసగు
    నింగిని వ్రేలుచు నీలాభ్రభాసమై
    శృంగారభావంపు బొంగు నొదవు,
    యమునాస్రవంతిలహరికావిభాసమై
    శాంతమ్ము నొనగూర్చు సత్త్వగతుల,

    రసము లొక్క పట్టు రాగమ్ము నొలకించి,
    కటితటికృతనాట్యగరిమ నొప్పి,
    స్త్రీల ననుగమించు చిత్తమ్ములను దోచు
    కేశపాశలసితకేళిఁ గనగ.


    రిప్లయితొలగించండి
  42. రిప్లయిలు
    1. కందం
      శిశిర ముప్పాయలునై
      మురిపెమ్మున నల్లుకొనుచు మునుకొని కులుకులు
      పిరుదుల యున్నతి ప్రియమని
      దరువేయఁగ నాట్యమాయె! తరుణీ వేణీ!

      తొలగించండి
  43. కురులనల్లి కందు కూర్చున్న విరులన్ని
    మరులుబెంచ నెంచ మమతలుంచ?
    వీపు నందమంత విశదబరచురీతి
    కంటియింట నుంచు కాంతసొగసు!

    రిప్లయితొలగించండి
  44. *నిషిద్ధాక్షరి* :-

    అంశము - జడపై పద్యం
    నిషిద్ధము - 'జ, డ' అన్న అక్షరాలు.
    ఛందస్సు - ఇష్టము

    *తే.గీ**

    అటునిటూగు,పిరుదులపై నటన చేయు
    వగల మారి వయ్యారపు వాలు కురులు
    వేణి వేయగా నందము వీక్షకులకు
    కొప్పు గట్టగా బంధము కోమలికమె
    నేటి కాలపు మహిళలు నెరులు దీసి
    నేటికిది ఫ్యాషనందురు నెత్తి గొరిగి
    ....................✍చక్రి

    రిప్లయితొలగించండి


  45. జడకందములన్ గలదో
    యి డమడమ మజా జిలేబి యిమిడేను భళా!
    చెడుగుడు లాడి తిరిగె సూ
    వె!డిమడిమ కవివరు నడుమ వేదిక నందున్ :

    స్పెషలు అత్తరు యాక్షను అవధాన వరేణ్యత్రయం సభలో దర్శన మివ్వడం

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి