కవిమిత్రులకు నమస్కృతులు... 'జడ కందములు - మా కందములు' పుస్తకావిష్కరణ సభ ఏర్పాట్లలో వ్యస్తుడనై బ్లాగులో మీ పూరణలను సమీక్షించలేక పోయాను. మన్నించండి. 8వ తేదీ ఆవిష్కరణ సభకు ఎవరెవరు వస్తున్నారో తెలియజేయవలసిందిగా మనవి. మీ మీ చిరునామాలు తెలియజేస్తే పోస్టు ద్వారా మీకు పుస్తకాలను పంపిస్తాను.
"మైలవరపు వారూ, పదాలు చేపలు, గంభీరచిత్తం సాగరంలో పుట్టిన కవిత్వపు టగ్నిలో ఒదిగిన సమర్థ పదాల చేపలు తప్పక సంబరా న్నందుతాయి. అందమైన, ఉత్కృష్టమైన పూరణ. అభినందనలు."
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2724 సమస్య :: *జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే.* నీటిలో అగ్ని పుట్టగానే చేపలు సంతోషపడ్డాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: ఒక ఐంద్రజాలికుడు (గారడీవాడు) *అబ్రకదబ్ర* అని అంటూ ప్రేక్షకులను చేపలుగా మార్చేశాడు. జాగ్రత్తగా చూడండి ఇప్పుడు నేను నీటిలో నిప్పును పుట్టిస్తాను అని అన్నాడు. తక్షణమే నీటిలో నిప్పు పుట్టింది. చేపలుగా మారిపోయి అచ్చట ఉన్న ప్రేక్షకులు ఆ అద్భుతాన్ని సంబరంగా చూచినారు అని చిత్రవిచిత్రాలను చేయగల మాంత్రికుని కనికట్టును గుఱించి విశదీకరించే సందర్భం.
కామేశ్వర రావు గారూ, ఇది గతంలో ఇచ్చిన సమస్యయే అన్న విషయం మీరు ప్రస్తావించే వరకు తెలియదు. ధన్యవాదాలు. మీ అప్పటి, ఇప్పటి పూరణలన్ని అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
సందర్భము: చేపల కోసం కొత్తగా వచ్చిన ఆహారపు గుళికలు నీళ్ళలో వేయగానే నిప్పురవ్వలలాగా మిలమిలా మెరుస్తాయి. వాటిని ఒక్కొక్కటే అక్వేరియంలో జారవిడుస్తుంటే అవి నిప్పు కణికల లాగా మెరుస్తున్నాయి. కాని చేపలు తెగ మురిసిపోతున్నాయి. వాటిని పట్టుకొని తినడానికి చుట్టూ మూగుతున్నాయి.... ఆ సన్నివేశం నీటిలో నిప్పు రగులుకొ న్నట్టుగా వుంది. కాని చేపలు సంబరపడిపో తున్నట్టుగా కనపడుతున్నది. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ మిలమిలలాడుచున్ జ్వలన మే యను తీరు భ్రమింపజేయు నా గుళికలు తిండికోసమయి క్రొత్తగఁ జేయగబడ్డవాని చే పల కొక టొక్కటే విడువ.. పట్ట వెసన్ జను గాజు గీములో.. జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే..
గాజు గీము= గాజు గృహము.. చేపలకోసం గాజుతో తయారు చేయబడిన అక్వేరియం
బలము కోలుపోవుచు నుండి వలను జూసి
రిప్లయితొలగించండికలిసికట్టుగ త్రెంచుచు కాట్లు వేసి
యలమటించగ నాకలి నపుడు, సృణిక
జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె :)
సృణిక : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
సం. వి. ఆ. స్త్రీ.
చొంగ.
(రూ. సృణీక.)
సృణిక జలము = లాలాజలము
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిసృణికజలంలో క్షుధాగ్ని పుట్టిందా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండికవిమిత్రులకు నమస్కృతులు...
రిప్లయితొలగించండి'జడ కందములు - మా కందములు' పుస్తకావిష్కరణ సభ ఏర్పాట్లలో వ్యస్తుడనై బ్లాగులో మీ పూరణలను సమీక్షించలేక పోయాను. మన్నించండి.
8వ తేదీ ఆవిష్కరణ సభకు ఎవరెవరు వస్తున్నారో తెలియజేయవలసిందిగా మనవి. మీ మీ చిరునామాలు తెలియజేస్తే పోస్టు ద్వారా మీకు పుస్తకాలను పంపిస్తాను.
శంకరార్యులకు నమస్సుమనస్సులు .
రిప్లయితొలగించండినాచిరునామా :
Dr.Jandhyala Jaya krishna Bapuji
C/o Jandhyala Srinath
8543 Rugby Drive
Irving
Texas-75063 U.S.A
K.S. గు రు మూ ర్తి ఆచా రి ( Retired Bank employee. )
రిప్లయితొలగించండిOpposite :-- State Bank of India
V E L U G O D U. POST
K u r n o o l. District. A P
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిపరగ జాతీయ భావమున్ బ్రక్కకిడగ
జలము కేంద్రమునన్ మంటలంటె, నేత
లరరె! ప్రాంతీయ తత్త్వము న్నరయ వింత!
"జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె!"
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
8 వ తారీఖున. నేను కూడ ఆవిష్కరణకు వస్తున్నాను .
రిప్లయితొలగించండిఇట్లు గురుమూర్తి ఆచారి నమస్తే
సంతోషం! స్వాగతం!
తొలగించండి
రిప్లయితొలగించండిబ్రహ్మ రంధ్రమున తళుక్కు భగము చేరి
మయత నుదకపు తళుకున మల్లె పుట్టి
నాత్మ పరిణితి హృదయపు నాభి గాన
జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె!
👏👏👏
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ చిరునామా తెలియజేస్తే 'జడ కందములు...' పుస్తకాన్ని పోస్టులో పంపిస్తాను. ఇక్కడ పెట్టడం ఇష్టం లేకుంటే నా మెయిల్ కు పంపండి.
తొలగించండిshankarkandi@gmail.com
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసలలిత మంజు వర్ణ పద జాలములన్ గన మత్స్యసంఘముల్ ,
చలిత గభీర చిత్తము విశాలమహాబ్ధి ,కవిత్వమగ్నియౌ !
నిలకడఁ గైత వ్రాయఁ గవి ., నేనని నేనని లేచి గెంతుచున్
జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కంది శంకరయ్య గారు:
తొలగించండి"మైలవరపు వారూ,
పదాలు చేపలు, గంభీరచిత్తం సాగరంలో పుట్టిన కవిత్వపు టగ్నిలో ఒదిగిన సమర్థ పదాల చేపలు తప్పక సంబరా న్నందుతాయి. అందమైన, ఉత్కృష్టమైన పూరణ. అభినందనలు."
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిచలమున రండు రండనుచు సాటి విదేశపు మేకినిండియా(Make in India)
జలమున మంట లేచునని చాలగ జింతిలు వారలేరి? యీ
చలనమె జాతి నీతి యను చందమునందరు మెచ్చ జేపలై
విలవిలలాడకే ముదము వింతగ నంది రదెట్లటన్న,బో!
"జలమున నగ్ని పుట్టగనె సంబరమందెను మత్స్యజాలమే!"
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(దక్షిణ ధ్రువప్రాంతంలో గడ్డకడుతున్న అంటార్కిటికా )
రిప్లయితొలగించండిమంచుగడ్డగ మారెడి మరణజలధి
"అంటరికిటాన "మీనమ్ము లలమటింప
భగభగలు గ్రక్కి వేవేడి సెగలతోడ
జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె .
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిచిమ్మ చీకటి చెచ్చెరఁ గ్రమ్ముకొనగ
రిప్లయితొలగించండితరణి మబ్బుల మాటున దాగ, రాత్రి
జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె
వెలుగు ఱేని కనుంగొను తలపుతోడ
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తామదె దాగి ఉన్నవి కద జలమున ఆమ్లజని
రిప్లయితొలగించండిఉదజనులు
వినియోగింతురు రేపటి రోజున విడివిడిగానె
పురజనులు
ఇంధనముగ నీటిని నిలుపును చూడగ
రాబోవు కాలమే
జలమున అగ్ని పుట్టగనె సంబర మందెను
మత్స్య జాలమే
క్రమాలoకారం లో ___
రిప్లయితొలగించండిఎచట నుండును బడబాగ్ని ? ఏమి పెట్టి
ర సురులు హనుమ తోక కు ? నహి నివాస
మేది ? వానలు మెండైన నేమి జరి గు ?
జలము లో ' నగ్ని' పుట్ట ' మ త్ స్యము లు మురియు
మూడవ పాదం చివర జరుగు అని సవరణ చేయడ మైనది
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2724
సమస్య :: *జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే.*
నీటిలో అగ్ని పుట్టగానే చేపలు సంతోషపడ్డాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: ఒక ఐంద్రజాలికుడు (గారడీవాడు) *అబ్రకదబ్ర* అని అంటూ ప్రేక్షకులను చేపలుగా మార్చేశాడు. జాగ్రత్తగా చూడండి ఇప్పుడు నేను నీటిలో నిప్పును పుట్టిస్తాను అని అన్నాడు. తక్షణమే నీటిలో నిప్పు పుట్టింది. చేపలుగా మారిపోయి అచ్చట ఉన్న ప్రేక్షకులు ఆ అద్భుతాన్ని సంబరంగా చూచినారు అని చిత్రవిచిత్రాలను చేయగల మాంత్రికుని కనికట్టును గుఱించి విశదీకరించే సందర్భం.
ఇల నొక డైంద్రజాలికుడు హేలగ *నబ్రకదబ్ర* యంచు దా
బలుకుచు, మత్స్యజాలముగ బాగుగ మార్చుచు ప్రేక్షకావళిన్,
జలమున నగ్ని పుట్టును ప్రశంసల జూడు డనంగ, నచ్చటన్
*జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (4-7-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిఇంద్రజాలికుని వ్యాజంతో చక్కని పూరణ చెప్పారు. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిమద్యమును గ్రోలు మగడున్న మగువకిలను
రిప్లయితొలగించండిఖాళి సీసాల నమ్మిన కాసు లెన్నొ
చేరునంచును ముదమందు నారు లుందు
రంచు దలచు మూర్ఖుడు వచి యించె నిట్లు
జలములో నగ్నిపుట్ట మత్స్యములు మురిసె.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.ఎన్.వి.ఎన్ .చారి
రిప్లయితొలగించండిమిలమిలలాడు మీనములమ్రింగగ వేసిరి జాలమా నదిన్
వలలను జూచి చేపలును ప్రార్థన జేయగ దేవదేవునిన్
జలముననగ్ని పుట్టగనె సంబరమందెను మత్స్యజాలమే
వలల దహించెనగ్నియు నవారిత భక్తి మహాత్మ్య కాంతులన్
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అండ్రువిబుధులుబడబాగ్నియదియయనుచు
రిప్లయితొలగించండిజలములోనగ్నిపుట్ట,మత్స్యములుమురిసె
చెఱువునిండుగజలధారచేరజూసి
యుసురుపదిలమైమనకికయుండుననుచు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కరణం రాజేశ్వర రావు
రిప్లయితొలగించండివిశ్రాంత తెలుగు ఉపాధ్యా యులు
5_3_138హిందూ పురం డి .ఆర్ .కాలనీ
515201అనంత పురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్
9182329440
చంపకమాల
రిప్లయితొలగించండిమలమల మాడ వేసవికి మర్త్యులు భూమిని తల్లడిల్లగన్
జలములు నావిరైన సరసందున జీవనమంత రించనన్
ఫెళఫెళ నింగిఁ దేలుచును భీతిలు గర్జనఁ జంచలానఁ గ
జ్జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండిచంపకమాల
మలమల మాడ వేసవికి మర్త్యులు భూమిని తల్లడిల్లుచున్
జలములు నింక నేటను విచారముఁ జెందుచు జీవనమ్మునన్
ఫెళఫెళ నింగిఁ దేలుచును భీతిలు గర్జనఁ జంచలానఁ గ
జ్జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే
కవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారి సూచిత సవరణతో
తొలగించండిజలచరమన్నియున్భయముచాలకలుంగగపారిపోయెనే
రిప్లయితొలగించండిజలముననగ్నిపుట్టగనె,సంబరమందెనుమత్స్యజాలమే
జలములుబొంగిపొర్లుచునుచాలిననంతకుమిక్కుటంబుగా
బరుగులుదీయుచున్వడిగబారుచునుండగజూచివేడుకన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూని విశ్వమందున మిన్ను మానికమ్ము
రిప్లయితొలగించండిమీఱి చండ ప్రచండుఁడై మిన్ను నుండఁ
దాఁక సూర్య కిరణములు వీఁక రాత్రి
జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె
[రాత్రి జలము = మంచు]
సలలిత జీవ కోటికి నిశా దివసమ్ములు ఘోర హైమ లా
తుల శిశిర మ్మసహ్య మగుఁ దోరముగన్ బడబాగ్ని రూపమై,
సలిలము శీతలమ్మున వెసన్ ఘన మౌటను రోష వార్థికిం
జలమున, నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే
[వార్థికిన్ + చలమున = వార్థికిం జలమున]
13/7/2017 నాటి పూరణలు:
తొలగించండినలినజు సృష్టి చిత్రములు నైపుణి నెంచఁ దరమ్మె యేరికిన్
జలనిధి నింపె రత్నముల జాతము సేసె నబింధనమ్మునున్
వలనుగ భోజనార్థము నపార విహార విలాస నీరధిం
జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్
[అబింధనము = బడబాగ్ని; అగ్ని = చిత్రమూలము (మొక్క పేరు)]
కన్నులా యవి నిజమెంచఁ జెన్ను మీన
ములు సుమీ చూడఁ జూడగ ముద్దు గొలుపు
చేడియ ప్రియకాంతునిఁ జూడ సిగ్గు తోడఁ
జలములో నగ్ని పుట్టె! మత్స్యములు మురిసె!
[చలము = వణుకు; మత్స్యములు = నయనోక్తములు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఇది గతంలో ఇచ్చిన సమస్యయే అన్న విషయం మీరు ప్రస్తావించే వరకు తెలియదు. ధన్యవాదాలు.
మీ అప్పటి, ఇప్పటి పూరణలన్ని అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిజలనిధి మానసమ్మవగ స్వార్థము మోహము కామక్రోధముల్
రిప్లయితొలగించండిజలచరముల్ గదే నరుని చంచల బుద్ధిని సంచరించెడిన్
తలపులలోన వాంఛలను దావము జృంభణమైన వేళలో
జలమున నగ్నిపుట్టగనె సంబరమందెను మత్స్య జాలమే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ,కె,ఈశ్వరప్ప, విశ్రాంత ఆరోగ్యవిస్తరణాధికారి
రిప్లయితొలగించండిఇ"నం:4/514 గాంధినగర్
ఆలూరు కర్నూలు జిల్లా518395
A,p
మనశరీరాని కిడుతిండి మహిమచేత
రిప్లయితొలగించండిశక్తి నాసక్తి గలుగంగ?యుక్తిగాను
సూక్ష్మ జీవులె చేపలై జూడకున్న
జలములోనగ్ని బుట్ట?మత్స్యములుమురిసె!
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి("సీతారాం సీతారాం సీతారాం జై సీతారాం")
విలవిల లాడు నాయకుని వీధుల వెంబడి పాదయాత్రలో
కలకలలాడు సందడహ! కన్నులు వీనులు విందుజేయ నా
హలహల మందు వోటరుల హాయిని జూడగ నిట్లు తోచెగా: 👇
జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే
మత్స్యగంధి పుట్టగ నొక మత్స్యమునకు
రిప్లయితొలగించండిఉపరిచర వసు రేతస్సను అనలము వ
లన; చతురతగ నివ్విధి యనదగుగద
జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
జలమున నగ్ని పుట్టగనె
సంబర మందెను మత్స్యజాలమే
సందర్భము: చేపల కోసం కొత్తగా వచ్చిన ఆహారపు గుళికలు నీళ్ళలో వేయగానే నిప్పురవ్వలలాగా మిలమిలా మెరుస్తాయి.
వాటిని ఒక్కొక్కటే అక్వేరియంలో జారవిడుస్తుంటే అవి నిప్పు కణికల లాగా మెరుస్తున్నాయి. కాని చేపలు తెగ మురిసిపోతున్నాయి. వాటిని పట్టుకొని తినడానికి చుట్టూ మూగుతున్నాయి....
ఆ సన్నివేశం నీటిలో నిప్పు రగులుకొ న్నట్టుగా వుంది. కాని చేపలు సంబరపడిపో తున్నట్టుగా కనపడుతున్నది.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
మిలమిలలాడుచున్ జ్వలన
మే యను తీరు భ్రమింపజేయు నా
గుళికలు తిండికోసమయి
క్రొత్తగఁ జేయగబడ్డవాని చే
పల కొక టొక్కటే విడువ..
పట్ట వెసన్ జను గాజు గీములో..
జలమున నగ్ని పుట్టగనె
సంబర మందెను మత్స్యజాలమే..
గాజు గీము= గాజు గృహము.. చేపలకోసం గాజుతో తయారు చేయబడిన అక్వేరియం
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
4.7.18
వలపున నాల్గు మీనములు బ్రాహ్మడు జార్చగ చేపతొట్టిలో
రిప్లయితొలగించండితలుపును తీసి మన్మడట దబ్బున వేయగ మంచుగడ్డలన్
కులికెడి చేప పిల్లలహ గుడ్లను త్రిప్పుచు తోకలెత్తగా
కలవరమంది బాపడట గ్యాసున బెట్టగ చేపతొట్టినిన్
జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే 😊