27, ఆగస్టు 2018, సోమవారం

సమస్య - 2772 (హనుమంతుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్"
(లేదా...)
"హనుమంతుం దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే"

26, ఆగస్టు 2018, ఆదివారం

నిషిద్ధాక్షరి - 45


కవిమిత్రులారా,
అంశము - రక్షాబంధనోత్సవముపై పద్యము
నిషిద్ధము - 'ర'కారము (రకార సంయుక్తము కూడ)
ఛందస్సు - మీ ఇష్టము.

25, ఆగస్టు 2018, శనివారం

సమస్య - 2771 (శవమున శశిలోని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్"
(లేదా...)
"శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ము ల్గనెన్"

24, ఆగస్టు 2018, శుక్రవారం

న్యస్తాక్షరి - 58 (వ-ర-ల-క్ష్మి)


అంశము - వరలక్ష్మీ స్తుతి
ఛందస్సు- 
తేటగీతి (మొదటి పాదం మొదటి గణం మొదటి అక్షరం 'వ', రెండవ పాదం రెండవ గణం మొదటి అక్షరం 'ర', మూడవ పాదం మూడవ గణం మొదటి అక్షరం 'ల', నాల్గవ పాదం నాల్గవ గణం మొదటి అక్షరం 'క్ష్మి/క్ష్మీ' ఉండాలి).

(లేదా...)

చంపకమాల (మొదటి పాదం 1వ అక్షరం 'వ', రెండవ పాదం 6వ అక్షరం 'ర', మూడవ పాదం 12వ అక్షరం 'ల', నాల్గవ పాదం 18వ అక్షరం 'క్ష్మి' ఉండాలి).

వరలక్ష్మి దేవి ప్రార్ధన

శైల చిత్ర బంధ తేటగీతి


శైల చిత్ర బంధ తేటగీతి

వత్సరమ్ము   వేచి   లపక  వాంఛ తోడ
లక్ష్మి   పూజను చేయును లలన లెల్ల,
దేహి  యనినంత నిచ్చును  దీవెనలు   వి
ధాత  జనని మురిపెముగన్  తల్లి  పూని
కి  యని తలచుచు,   పున్నమికి గత కాల
మందు వంక  లేని భృగు వార  మందు పూజ
చేయమని ముదముగ బల్కె సిరి పడతుక
చారు మతికి  స్వప్నమున ,విషయము లెల్ల
పతికి  నెల్లర కును దెల్ప  పమ్మె మోద
ము , నలివేణు  లెల్లరు  వేచి ముఖ్య మైన
దినము నేతెంచగ  జలనిధి  సుతను  కడు
భక్తి   తోడ   పూజలు జేయ, పద్మ వాస
కడు సిరుల  నిడెను  గద నపుడు, సని నిడ
మరుని తల్లి  దురదురమున్  సిరుల నిడును

(పమ్ము=   పొందు , లపక  =    ధనము  , సని   = పూజ,   దురదరము  = శీఘ్రము)

                                                                                       బంధ కవి   పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

23, ఆగస్టు 2018, గురువారం

సమస్య - 2770 (కదలనివాఁ డిల్లు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కదలనివాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్"
(లేదా...)
"కదలనివాఁడు సేర్చె నిలుఁ గాననివానిని విభ్రమంబుగన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

22, ఆగస్టు 2018, బుధవారం

సమస్య - 2769 (నమ్మిన బిడ్డలన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నమ్ము బిడ్డలఁ దునుమాడె నమ్మ విధిగ"
(లేదా...)
"నమ్మిన బిడ్డలన్ దునిమి నవ్వుచు సాగెను మాతృమూర్తియే"

21, ఆగస్టు 2018, మంగళవారం

సమస్య - 2768 (పగవానిన్ సతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పగవానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్"  
(లేదా...)
"పగవానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో"

20, ఆగస్టు 2018, సోమవారం

దత్తపది - 144 (కల-తల-మర-వస)

కల - తల - మర - వస
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
పెండ్లి విందును వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
(ఈరోజు కవిమిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి కుమారుని వివాహపు విందు సందర్భంగా)

19, ఆగస్టు 2018, ఆదివారం

సమస్య - 2767

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
" కొండలనె యలంకరించి కోమలి మురిసెన్"  
(లేదా...)
"కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే"