27, ఆగస్టు 2018, సోమవారం

సమస్య - 2772 (హనుమంతుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్"
(లేదా...)
"హనుమంతుం దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే"

40 కామెంట్‌లు:

 1. (పురుషోత్తం గారి మనుమడు హనుమంతు పెండ్లిలో
  ఆరుగురమ్మాయిల నాట్యం)
  ఘనుడగు పురుషోత్తమునకు
  మనుమడు;సుగుణుడు;సొగసున మదను;డుదారుం
  డని వాసిని గాంచిన యా
  హనుమంతుని బెండ్లి;యాడి రార్గురు కాంతల్.

  రిప్లయితొలగించండి


 2. అనఘా! షట్రిపువులనడ
  చినవా డున్ పుట్టువడుగు చినవాడుగదా
  తనకలి యయ్యె నెటులనో
  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. వినుటకు వింతగ నున్నది
  వినువీధిని సంచ రించు వేలుపు యనగన్
  కనివిని యెరుగని పలుకులు
  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  సమస్యాపూరణం...

  హనుమంతుం దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే"

  * నక్షత్రాంకితములన్నీ స్త్రీలింగపదములే *

  ఘనచిత్త *స్థితి* , రామనామ *రతి* , వాక్యజ్ఞాన *సంపత్తి* , రా...
  ముని పాదమ్ముల *భక్తి* , సాధుగణసమ్మోదక్రి *యాసక్తి* .,
  వై
  రిని నిర్జించెడి *శక్తి* ,యన్న గుణముల్ *స్త్రీలింగ* రూపమ్ములై
  హనుమంతుం దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ సూరం శ్రీనివాసులు గురువులకు ధన్యవాదములతో...
   చిరు సవరణ.. 🙏

   సమస్యాపూరణం...

   హనుమంతుం దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే"

   * నక్షత్రాంకితములన్నీ స్త్రీలింగపదములే *

   ఘనచిత్త *స్థితి* , రామనామ *రతి* , వాక్యజ్ఞాన *సంపత్తి* , రా...
   ముని పాదమ్ముల *భక్తి* , సాధుగణసమ్మోదక్రి *యాసక్తి* .,
   వై
   రిని నిర్జించెడి *శక్తి* , ధీరతను సంప్రీతిన్ సమావిష్టలై
   హనుమంతుం దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే"

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. కనిరిరుగుపొరుగు మువ్వురు
   వనితలు కవలలను ., వారు పరిణయవేళన్
   జని గుడికి , మ్రొక్కి రాముని,
   హనుమంతుని ., పెండ్లియాడిరార్గురు కాంతల్ !

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి

 5. హీరో హనుమంతుడి పెళ్లి :)  మన హీరోయిను ప్రేమ లో పడగ భామాయంచు వెంటాడుచున్
  ననఘా! స్విట్జరు లాండులోన జరిగెన్ నాంతాడు యోగంబుగా
  హనుమంతుం దగఁ బెండ్లి; యాడిరట తా మయ్యార్గురౌ కాంతలే
  కనకా మేనక జ్యోతిలక్ష్మి కమలా కావేరి ప్రత్యూషలున్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. మునుకౌని లంక కు పనిచిరి
  హనుమంతు ని ; బెండ్లియాడిరార్గు రు కాంత ల్
  జనుల ను పీడించి పతన
  మొనరింప గ జూచు ననుట నొప్పగు జగతి న్
  _________కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
 7. మునుకౌని లంక కు పనిచిరి
  హనుమంతు ని ; బెండ్లియాడిరార్గు రు కాంత ల్
  జనుల ను పీడించి పతన
  మొనరింప గ జూచు ననుట నొప్పగు జగతి న్
  _________కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి


 8. హీరో హనుమంతు :) సాజాత్యములు కనబడిన జిలేబి పూచీ లేదు :)


  మనసైనది నాకు దొరుకు
  ననుచు మసకమసక రేయి నాట్యము లాడన్
  వెనుకల బడుచున్ హీరో
  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. ఘనమగు జ్ఞానము ,శక్తి, బ
  జన, విభవము,వీర్యము,విభ, సరసముగా బం
  ధనమిడుచు ముదము నొప్పగ
  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్
  షడ్గుణములు
  శక్తి , జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము , తేజము ,(ఇవి ఆరు కాంతలు) హనుమంతుని వరించెనను భావన

  రిప్లయితొలగించండి
 10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2772
  సమస్య :: హనుమంతుం దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే.
  బ్రహ్మచారియైన హనుమంతుని ఆఱుగురు అమ్మాయిలు పెండ్లిచేసికొన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: వాయుదేవుని కుమారుడైన ఆంజనేయుడు ఉదయాద్రిపై ఒక కాలు అస్తాద్రిపై మఱియొక కాలు ఉంచి నిలబడి సూర్యభగవానుని దగ్గఱ విద్యలను నేర్చుకొనదలచినాడు.
  తర్కము వ్యాకరణము ధర్మము మీమాంస వైద్యము జ్యోతిష్యము అనేవి షట్ శాస్త్రములు. ఈ ఆఱు విద్యలను తాను పొందాలని మారుతి దీక్ష వహించి కోరుకొన్నాడు. అందులకు ప్రసన్నులైన ఆ ఆఱుగురు విద్యాలక్ష్ములు ప్రీతితో హనుమంతుని వరించినారు అని విశదీకరించే సందర్భం.

  ఘనమౌ శాస్త్రము లాఱు, వ్యాకరణ తర్క జ్యోతిషమ్ముల్ ధరన్
  గన మీమాంసయు ధర్మ వైద్యములు, దీక్షన్ గోరె నా విద్యలన్
  హనుమంతుండు, ప్రసన్ను లైరి గద విద్యాలక్ష్ము లున్; ప్రీతితో
  ‘’హనుమంతుం దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే.’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (27-8-2018)

  రిప్లయితొలగించండి
 11. మునిమనుమడు తా గోరెన
  ని నర్తకి మణులను పిలిచె నృత్యము కొరకై
  ఘనముగ జరిపించె నతడు
  హనుమంతునిఁ బెండ్లి, యాడిరార్గురు కాంతల్

  రిప్లయితొలగించండి
 12. మనమున బూజింప దగును
  హనుమంతునిఁ; బెండ్లియాడి రార్గురు కాంతల్
  యినతేజుడు,సుందరుడౌ
  జనపాలకు నొక్కని మది సంబరమొప్పన్.

  రిప్లయితొలగించండి
 13. సందర్భం 'హనుమంతు' అను యువకుని పెండ్లి

  కనుమని చూపెదరెవరిని?
  తనిసె నతండేమి చేసి తత్పర మతియై?
  పనిచెను హారతి నెవ్వరు?
  హనుమంతుని-పెండ్లి యాడి-రార్గురు కాంతల్.

  రిప్లయితొలగించండి
 14. హనుమంతాతని నామము
  కనగా వాలమ్మె కరవు కపిబుద్ధులతొ
  దినమొక పని చేసెడు నా
  హనుమంతుని పెండ్లి యాడి రార్గురు కాంతల్
  (హనుమంతు , ఆంజనేయులు మొదలైన పేర్లు పెట్టుకున్న వాళ్లని ఇలా వేళాకోళం చెయ్యటం మన సమాజం లో సహజమే కదా!)

  రిప్లయితొలగించండి
 15. వినయముననడుగుచుంటిని
  హనుమంతునిబెండ్లియాడిరార్గురుకాంతల్
  వినుటకుబాధగనున్నది
  హనుమంతుడుబ్రహ్మచారియగుటనుసామీ!

  రిప్లయితొలగించండి
 16. తనకున్ దోచిన నిందలన్ పలికి సీతాసాధ్వినిన్ దూర నా
  మెను నిందించుట పాప మంచొక రనన్ "మీరేమి సర్వజ్ఞులా ?"
  యని యా చాకలి పల్కె "పావని ఘనుండా ! తారతో గూడె నా
  హనుమంతున్ దగ పెండ్లియాడిరట యయ్యార్గురౌ కాంతలున్".
  (తాగుబోతైన ఆ రజకుడు సీతని నిందించింది కాక అది తప్పు అన్నందుకు హనుమంతుణ్ని కూడా కలిపాడని కల్పన. నిందించే వాడిని తప్పు అంటే ఇంకాస్త రెచ్చి పోతాడు. తారని ఇరికించి అదిచాలక పేర్లు కూడా చెప్పకుండా ఆ ఆరుగురు కూడా అన్నాడు. )

  రిప్లయితొలగించండి
 17. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ========================
  హనుమంతుం దగ బెండ్లియాడిరట
  తామయ్యార్గురౌ కాంతలే
  ========================
  ఘోటక బ్రహ్మాచారి అయిన హనమం
  తుడిని ఆ ఆరుగురు కన్యామణులు
  చక్కగా వివాహం చేసుకున్నారని చెప్ప
  టంలో గల అసంబద్దమే సమస్య.
  =========================
  సమస్యా పూరణము - 240
  ====================

  అరిషడ్వర్గములవి యెంచగ నారు
  మదవతులై మనలోకి జారు
  సుర నరులను ఓడించు జోరు
  వివేకులకు చూడ నిత్యముగ పోరు
  సైచి భరించరెవరు మమ్ము
  భర్తగ భరించినన్ తీరు చింతలే
  హనుమంతుం దగ బెండ్లియాడిరట
  తామయ్యార్గురౌ కాంతలే

  ====##$##====

  " కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్య "
  ము లారు అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గ
  ములుగా పిలువబడును. ఇవి యారు నెర
  జాణలై, మదవతులై అటు సురలను ఇటు
  నరులను తమ స్వాధీనంలోకి తీసుకుని
  ముప్పతిప్పలు పెట్టును. వీటికి అతీతుడైన
  వాడు, వీటి ధాటిని ఓర్చి భరించిన వాడు
  హనుమంతుడు. అట్టి యోధుని మనమున
  తమ పతిగా యెంచి ఈ ఆరుగురు కాంతలు
  వివాహమాడినారని భావము.

  ( మాత్రా గణనము - అంత్యప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
 18. 27, ఆగస్టు 2018

  హనుమంతుని గుడివద్దనె
  మనమాయార్గురను కలిసి మనసిచ్చితిమే
  యని భక్తిగఁ బూజించియు
  హనుమంతునిఁ, బెండ్లియాడి రార్గురు కాంతల్

  రిప్లయితొలగించండి

 19. నేటి భార్యాబాధితుడు :)


  వినుమా జిలేబి‌ హరికథ
  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్
  తనఖా పెట్టిరి నతడిని
  మన సేటంగటిన సూవె మనుగడ లేకన్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. మననధ్యానపరాయణైకరఘురామాంఘ్రిద్వయీభక్తి , జీ

  వన ధిం దాటిన శక్తి , యుక్తినిఁ , గృపాపారమ్య , జేత్రున్నతిన్ ,

  ఘనుడై యొప్పగ , బ్రహ్మచారుడయినన్ గార్హస్త్యుడై వెల్గు నా

  హనుమంతుం దగఁ బెండ్లి యాడిరటఁ దామయ్యార్గురౌ గాంతలే.

  జీవనము = నీరు, ధి = కలిగి యున్నది సముద్రము , జలధి , వనధి వలె.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 21. అనవతరము పృచ్ఛకునిగ
  తన యూరిని వదలి పార దలచిన కవియే
  ఘనమగు సమస్య నిడె నిటు
  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్

  మనయూరిని ఘన కవియని
  ఘనమగు యవధాన సభను గల్పింపంగన్
  తన పాండిత్యమిదని యనె
  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్

  నిన్నటి నిషిద్దాక్షరి కి పూరణ

  అక్క తమ్ముని బంధ మానందమయము
  నన్నచెల్లెలి యనుబంధ మదియు నటులె
  సంత సమ్మున సాగించ జాలు ననగ
  కంకణము హస్తమందున కట్టు దినము
  మనగ జూతు మాసేతు హిమాచలంబు

  రిప్లయితొలగించండి
 22. వినుమా విడ్డూరంబిది
  హనుమంతుని బెండ్లియాడిరార్గురు కాంతల్
  కొనగల కట్నంబిచ్చియు
  ఘనుడనిభావించి మోసకారునినమ్మే

  రిప్లయితొలగించండి
 23. రిప్లయిలు
  1. కనువిందు గొల్పు మంటప
   మున నాఁడపడుచులు సేరి ముదమారగఁ ద
   మ్ముని దీవించుచుఁ జూచుచు
   హనుమంతునిఁ బెండ్లి, యాడి రార్గురు కాంతల్


   మనసుల్ దోచిన వారి నెన్నుకొని షణ్మాన్యప్రభా భూషలం
   జని వేగమ్ముగ నాంజనేయు గుడికిన్ సంరంభ మేపారఁ జ
   ల్లని చిత్తమ్మున వారి కాపురములన్ రక్షించగన్ వేడుచున్
   హనుమంతుం, దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే

   తొలగించండి
 24. జనకుంబుత్రిక జాడకై కదలి యాసంద్రమ్మునే దాటెడిన్
  ఘనుడౌమారుతి ధైర్యసాహసములన్ గాంచంగనే సద్గుణా
  ద్వినయాద్విజ్ఞత కార్యదీక్ష మరియున్ విశ్వాససద్భక్తులే
  హనుమంతుందగ బెండ్లియాడిరట తామయ్యార్గురౌ కాంతలే.

  రిప్లయితొలగించండి
 25. ఘనముగ జరిగెను హితుడౌ
  హనుమంతుని బెండ్లి, యాడి రార్గురు కాంతల్
  కనులకు విందుగ మరియున్
  వినిపించిరికీర్తనలను వేదిక మీదన్!!!

  రిప్లయితొలగించండి
 26. కందం
  తనతో నటించు తరుణులు
  కనగలరని యోగమనుచు గట్టిగ నమ్మన్
  సినిమా పాత్రల గతమున
  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్

  మత్తేభవిక్రీడితము
  తనతో నాయికగన్ నటించఁ దొలి చిత్రంబందు యోగమ్మనన్
  కొనసాగించగ నాటి యారుగురు దత్కోణంబునన్ నెగ్గిరే
  వినగన్ వింతయె? పాత్రలన్ నిజము సంప్రీతిన్ సినీభక్తుఁడౌ
  హనుమంతుం దగఁ బెండ్లియాడిరట తామయ్యార్గురౌ కాంతలే!

  రిప్లయితొలగించండి
 27. అనుకొనిన విధముగనె తమ
  కనుకూలురగు వరులు మఱి యనువుగ దొఱుకన్
  మనమున దలచు కొనుచు నా
  హనుమంతునిఁ ; బెండ్లియాడి రార్గురు కాంతల్"

  రిప్లయితొలగించండి


 28. బులుసు వారి అమ్మాయే మొదటి మహిళావధాని అవధానము చేయటం అనుకంటా చిత్తూరుకు  కణ్ణను కాలేజీలో
  క్షుణ్ణముగాచేసిరి బులుసు అపర్ణ భళా
  మన్నిక గానవధానము
  మున్నెన్నడెరుగని చందముల చిత్తూరున్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 29. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్

  సందర్భము: సూర్య పుత్రి సువర్చలతో హనుమంతుని వివాహం జ్యేష్ఠ శుద్ధ నవమి నాడు వైభవంగా జరుగుతున్నది. దేవతలు ఋషులు అంతా వచ్చారు.

  కశ్యపోఽత్రి భరద్వాజః
  విశ్వామిత్ర శ్చ గౌతమః
  జమదగ్ని ర్వశిష్ఠశ్చ
  సప్తైతే ముని పుంగవాః

  వీరు సప్తర్షులు. ఒక్క వశిష్ఠుని పక్కన పెట్టితే తక్కిన ఆరుగురి భార్యలు కృత్తికలు. (వీరు పెంచినారు కాబట్టే కార్తికేయు డని పేరు సుబ్రహ్మణ్య స్వామికి..)
  హనుమంతుని పెండ్లిలో ఆడినారు పాడినారు ఆరుగురు కాంతలు.
  వీరు రూపాలు మార్చుకొని దిగి వచ్చిన కృత్తికలేమో!.. అన్నారు తెలిసినవారు.
  ==============================
  దినకరసుతతో జరుగగ
  హనుమంతునిఁ బెండ్లి...
  యాడి రార్గురు కాంతల్..
  ఘనముగఁ బాడిరి; దిగి వ
  చ్చిన కృత్తిక లేమొ యనుచు
  చెప్పిరి విబుధుల్

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  27-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 30. ఇనునికి శిష్యుండగుచును
  ఘనతరముగ నేర్వగాను గహనపు విద్యల్
  వనవాసిని వరియించుచు
  హనుమంతుని బెండ్లియాడి రార్గురు కాంతల్!

  రిప్లయితొలగించండి
 31. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్

  సందర్భము: సూర్య పుత్రి సువర్చలతో హనుమంతుని వివాహం జ్యేష్ఠ శుద్ధ నవమి నాడు వైభవంగా జరుగుతున్నది. దేవతలు ఋషులు అంతా వచ్చారు.
  షడ్గుణములు (జ్ఞానం శక్తి ఐశ్వర్యం బలం వీర్యం తేజస్సు) రూపములు ధరించి
  హనుమంతుని పెండ్లిలో నాట్య మాడినవి. గానం చేసినవి.
  ==============================
  కన జ్యేష్ఠ శుద్ధ నవమిని
  హనుమంతునిఁ బెండ్లి...
  యాడి రార్గురు కాంతల్
  ఘనముగఁ బాడిరి... దిగి వ
  చ్చిన వట రూపాలు దాలి
  చిన షడ్గుణముల్!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  27-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 32. వినయము చెలువము స్నేహము

  తనువున ధైర్యము రయమును తన్మయ భక్తిన్

  చనుదెంచుచు వనములలో

  హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్

  రిప్లయితొలగించండి
 33. దినమున్ 'రాముడు' రాత్రి 'దాశరథి'యే తీండ్రించి యొప్పారగా
  కనగన్ 'రాఘవు' డెందు జూడగనుతా 'కౌసల్య పుత్రుండు'గా
  చన 'సీతాపతి' 'సత్యసంధుడు'నిగా సారూప్య నామమ్ములే
  హనుమంతుం దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే

  రిప్లయితొలగించండి