కల - తల - మర - వస
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
పెండ్లి విందును వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
(ఈరోజు కవిమిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి కుమారుని వివాహపు విందు సందర్భంగా)
(ఈరోజు కవిమిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి కుమారుని వివాహపు విందు సందర్భంగా)
రిప్లయితొలగించండికలకండకలిపి లడ్డులు
జిలేబులు, మతలబు రెడ్డి చినవా డికి పెం
డ్లి! లసితపు వసతి! మరలమ
రలవచ్చునకొ బిరియాని ! రండి తఱియిదే :)
అన్నపు రెడ్డి వారికి శుభాకాంక్షలతో
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి"కల"వారింటి వివాహ వింద"మర"గా కార్యంబులన్నాపి విం
"తల "స్వాదిష్టపు వంటకాల రుచినిన్ దట్టించగా,నిల్చి చె
ప్పులనే వీడక జిప్ప చేత నిడరే పూర్ణాహుతిన్ గొంచు నా
వల నర్గే మిష కైన వక్క పొడినిన్ బామన్ "వస"ద్వాటికన్!
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఆర్యా,
శ్రీ ,శ్రీమతి సత్యనారాయణ రెడ్డి గారల కుమారుని వివాహ సందర్భముగా వారికి నా హార్దిక శుభాకాంక్షలు.పూరణ మాత్రము "బఫే"విందు నుద్దేశించినది,general .
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వివాహ విందు' దుష్టసమాసం. "కలవారింటిది పెండ్లివిందు..." అనండి.
ధమ్ము బిరియాని తలపించు కమ్మదనము ;
రిప్లయితొలగించండిమరపు రానీని పాయసమధురిమమ్ము ;
కలగలపు జేసి బ్రతుకున కలసి తినిరి
పరిణయవసనధారులు వధువు వరుడు.
బాపూజీ గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
కలవారి కొత్త కోడలు
రిప్లయితొలగించండితలవాకిట నిలచె నంట తబ్బిబ్బవగన్
వలవిసరిన వరుని వసతి
నెలరాజును మరల మరల నెమ్మిని గాంచన్
రెడ్డి గారికి{ పాతవధూ వరులకు } + నూతన వధూ వరులకు
శుభాకాంక్షలతో . ఆశీర్వదించి అక్క
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి"కన్న ! యివేమిరా ? గెనుసుగడ్డల ముక్కల ? చేపముక్కలా ?
తిన్నవి" యన్న బాలుడిటు తెల్పెను "పీతలటంచు నవ్వి., "బా...
గున్నవటంచు రెండు మరి కోరితి ! మైమరపించె వంట శ్రీ
యన్నపురెడ్డి యింట.," ననిరందరు ! మక్కువ సంతసించుచున్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిఆహా ! పీతల్ రొయ్యల్ ! :)
జిలేబి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
=====================
"కల" , "తల" , "మర" , "వస" -
ఈ పదములను అన్యార్థముగ
వినియోగిస్తు పెండ్లి విందును
వర్ణించవలయును
======================
దత్తపది - 18
==========
పీకల దాకా తిను శంభు లింగం
వెంట రాగా బుడగ జంగం
మతలబుగ చూడ వివాహ రంగం
తామర తంపర రుచులనంగం
కుతితీరగ వసతి ఇదియేననెను
ప్రీతితో ప్లేటును చేకొనెను
ఎంగిలి సేతెవనికి తాకెను
నాకేమియనుచు ముందుకు సాగెను
====##$##====
ఎక్కడికెళ్ళినా శుభ్రంగా పీకల దాకా మెక్కే
శంభు లింగం బుడగ జంగం మిత్రుడొకడిని
వెంటబెట్టుకుని ఒకానొక పెండ్లి విందుకు
హాజరైనాడు. అక్కడ అపరిమితమైన రుచు
లుగా వంటకములు చేయబడినాయి. ఆహా
ఏమి నా అదృష్టమనుకొనుచు శంభు లింగం
తన ఎంగిలి చేతు ఎవరికైనా తగిలెనేమోనని
కూడా చూడక వంటకముల కెగబడినాడని
భావము.
( మాత్రా గణనము - అంత్యప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం )
__/\__
తొలగించండిస*కల*జనమును మెచ్చెడు సంబరంబు
రిప్లయితొలగించండివిత*త ల*క్ష్మీ కళా భావ విలసితంబు
విందు భోజన*మర*య శోభించె మిగుల
చెలు*వ స*రసన వరుడు భాసించి చూడ.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండికలవటు కాజా, జాంగిరి
రిప్లయితొలగించండితలకొక హిమ క్రీము మంచి దద్దోజనమున్
పులిహోరయు, నురమరగా
చలిమిడియు, వసంతధూత చట్నీలుండెన్!!!
వసంతధూత =మామిడి
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశం :: దత్తపది
దత్తపదిలో ఇచ్చిన పదాలు - కల, తల, మర, వస (అన్యార్థంలో)
పెండ్లి విందు సందర్భం
వరుడు :: చిరంజీవి వేంకట రామిరెడ్డి
వధువు :: చి।।ల।।సౌ।। లావణ్య
విందు :: శ్రీ అన్నపరెడ్డి వారి విందు
కల్యాణ సన్నిధి :: గోవిందుని సన్నిధి
వరుడై వేంకట రామిరెడ్డి కలడీ ప్రక్కన్ మహావిష్ణువై,
వర లావణ్యయు చెంత లక్ష్మి వలె శోభన్ జేరియుండెన్, మహ
ద్వరమై ‘’అన్నపరెడ్డి’’ విందమర నాస్వాదించి మీ రందఱున్
వర గోవిందుడు బ్రోవ, సన్మతి నిటన్ పద్యాలఁ దీవింపుడీ.
కలడీ- - - - అనే చోట- కల
చెంత లక్ష్మి- అనే చోట - తల
విందమర - అనేచోట- మర
బ్రోవ సన్మతి- అనేచోట- వస
అనే పదాలను
దత్తపదిలోని పదాలుగా చూడవచ్చు.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (20-8-2018)
తొలగించండిఅద్భుతమైన, "co- " విందు పిలుపు :)
జిలేబి
సహృదయులు జిలేబి గారికి ప్రణామాలు.
తొలగించండిగో విందు
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిసందర్భశుద్ధి గల అద్భుతమైన పూరణ. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండికలవారి ఇంటిలో ఘనమైన పెండ్లిరా
రిప్లయితొలగించండి.....కందను బచ్చలి పొంది నెగడు
తలచిన తడవుగా దండిగా పనసలు
.....నావ పెట్టిన కూర యలరి తీరు
మరతురే వంకాయ మధ్యకు చీలిచి
.....గుత్తిగా వండుట గొప్ప దినుసు
వసమాయె మామిడి పస గల పప్పుతో
.....జారీల నాజ్యపు టేరు పారు
కొబ్బరికి మేను పచ్చడై గుమ్ము మనును
నేతిలో నాని బూరెలు నిగిడి చూచు
దప్పళము పులిహారయు తప్పవు గతి
యప్పడాలను వడియాల జెప్ప నేల?
మిస్సన్న గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
బిరియాని, రైత, లడ్డూల్
రిప్లయితొలగించండిమరందమును మించినట్టి మాధుర్యముతో
మరులు గొలుపు కోవ, సకల
సురుచిర మౌ భక్ష్యములట సొంపుగ నమిరెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నూతన వధూవరులకు శుభాకాంక్షలు
రిప్లయితొలగించండితెలియజేయగోర్తాను
కలవారుకానవారలు
రిప్లయితొలగించండితలచినవెనువెంటయాయెదరగనివంటల్
తలలూపెడువసలూరుచు
మరపునకున్రావుదినినమధురపురుచులన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెంట నాయె...' అనండి.
కలసి మెలసి యు మిత్రులు కమ్మ నైన
రిప్లయితొలగించండిసత్య నారాయణుని విందు చ వులు మెసవి
సమత మమత ల పెంచె డు చక్క నైన
వ స తుల మర గ మురియ రె వాంఛ తీర
____కరణం రాజేశ్వర రావు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలసి మెలసి యు మిత్రులు కమ్మ నైన
రిప్లయితొలగించండిసత్య నారాయణుని విందు చ వులు మెసవి
సమత మమత ల పెంచె డు చక్క నైన
వ స తుల మర గ మురియ రె వాంఛ తీర
____కరణం రాజేశ్వర రావు
ఇంతమంది యిన్ని వంటకాలు వండిన తరువాత మళ్ళీ నేనేం వండుతాను....
రిప్లయితొలగించండిఅందుకే ఏర్పాట్లను ప్రశంసిస్తాను...
😃
*కల*హంసలు జలకన్యలు
*తల*ములతో స్వాగతింప దరహాసమునన్
కలగా వింద*మర* *వస*తిఁ
జెలరేగిన షడ్రుచులట చిత్తము దోచెన్
జలకన్యలు = పన్నీరు జలమును చిలకరించువారు
తలము = చాఁచినవ్రేళ్లుగల అఱచేయి
అన్నపరెడ్డి వారి కుమారునికి కోడలికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు.
💐💐
అన్నపరెడ్డివారికి అభినందన వందనములు
🙏🏻
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలకండ బూరెలును విం
రిప్లయితొలగించండితల గుప్పించెడు రుచిగల తాండ్రయు జున్ను
న్నులవల చారున జీళ్ళును
పలు రుచులగు మర మరాలు పంచిరి పెండ్లిన్
నిన్నటి సమస్యకు నా పూరణ
దండిగ వ్రతముల జేయగ
కొండొకచో నొక వనితకు కొడుకులు గలుగున్
పండుగ నాడా బంగరు
కొండలనె యలంకరించి కోమలి మురిసెన్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కలయ సుధారసప్రచురకామితపాయసమోదకమ్ములున్
రిప్లయితొలగించండిదలపుల సుస్థిరమ్ములనఁ దాదృశషడ్రుచికారకమ్ములై
బలువిధపక్వశాకములు భవ్యగతిన్ మరపొందలేనివై
వెలసెను పెక్కు వంటలట వేంకటరెడ్డి కుమారు బెండ్లిలో.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తే.గీ.
రిప్లయితొలగించండిసకల రుచులతో నలరు భోజనముఁ దినుచుఁ
గవితలఁ జదివి దీవించు కవుల వినుచు
నమర వైభవమునుఁబొందె నతిథులెల్ల
వాసవసముడన్నపరెడ్డి వారి యింట
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బొంది రతిథు లెల్ల' అనండి.
స(కల)ము స్వాగతంబులకు స్థానముగా విలసిల్లుచుండ నా
రిప్లయితొలగించండివికసితపుష్పసంభరిత వేదిని శీ(తల)పేయముల్ ఫలో
దకములు శాకపాకములదండులు మై(మర)పించు భక్ష్యముల్
ప్రకటితచోష్యముల్ గలవు భా(వస)మంచితమైన విందునన్.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమనోహరంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
కరుణ కలవారు,కలవారు కలిమి బలిమి
రిప్లయితొలగించండికొడుకు పెళ్ళియె తలపెట్టి కొమర మిగుల
మరక యొక్కింత లేకయె మంచిగాను
అతిథులవసర ములనన్ని యవధరించి
వివిధ రుచుల వంటకముల విందు నిడిరి.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి హృదయ పూర్వ కాభినందనలతో:
రిప్లయితొలగించండికలశామృత లలితామ్ర సు
పలాస షండ ప్రవిమల పాథః ప్రోక్ష
ల్లలి తామర సన్నిభ దివ
స లసద్భోజన వరమ్ము సాలునె పొగడన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిసలలిత సత్పూరణమ్ము సాలునె పొగడన్!
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిస్థ లోచి తాశీస్సుల కల ధన్యుఁడ నైతిన్
తొలగించండికలశము లో ఆబోతు మాంసము మామిడి పండు , తామర తూడులతో కలిపి చేసిన భోజనము వరము పొగడ తరమా !
సరియేనాండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిచిన్న సవరణ : “పలాశ” గా చదువ గోర్తాను.
తొలగించండిఅయ్యో యాబో తెక్కడి నుండి వచ్చినది మధ్యలో.
మీకు వివరణ నిచ్చునపుడు గమనించితిని “పలాశ” ముద్రారాక్షసము.
కలశ-అమృత (కలశము లోని నీటిలో) – లలిత (మృదువైన)– ఆమ్ర (మామిడి) – సుపలాశ (మంచి యాకులు) – షండ (గుంపు, గుత్తి) – ప్రవిమల (స్వచ్చమైన) – పాథః ( నీళ్ళు) – ప్రోక్షత్ (చల్లిన) – లలిత ( మనోజ్ఞమైన) అమర – సన్నిభ (దైవ సమానమైన) – దివస (పగలు) – లసత్ ( వెల్గులీను) భోజన వరము: పూజానంతర వివాహ భోజనము.
తొలగించండిధన్యవాదాలండి !
ఆ షండ సైడ్ ట్రాక్ లో తీసుకెళ్ళి పోయింది !
నెనరులు వివరణకు.
జిలేబి
భాసర భారతి యెదుటను
రిప్లయితొలగించండివేసిన వేదికల మీద పెండిలి జరిగెన్
వాసిగనట నెలతలకే
నేసిన వసనముల నిడిరి నెయ్యము మీరన్
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భాసర భారతి యెదుటను
రిప్లయితొలగించండివేసిన వేదికల మీద పెండిలి జరిగెన్
వాసిగనట నెలతలకే
నేసిన వసనముల నిడిరి నెయ్యమ్మమరన్
గురుగారికి నమస్కారము మొదట పద్యములో దత్తపది వేరే ఉపయోగించాను
ఈ పద్యము సవరించా వ్రాశాను.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బావ మరది పెండ్లినిచూడ వారి యిలుకు
రిప్లయితొలగించండిబోవ సతితో నచట విందుభోజనమున
బొబ్బటులు కలఖండలు బూంది లడ్లు
విసరగ సురలోకము తలపించె నపుడు
విసరు=తిను
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తరచుగరెడ్డి సంకలనదాతగ!అన్నపరెడ్డిపందిటన్
రిప్లయితొలగించండివరయుత బంధువర్గమునభావసముచ్చితరుచ్యమట్లుగా!
పరచిన విస్తరందు దలపన్ దగులడ్డు,జిలేబి,కోవలున్
మరచుటసాధ్యమా రుచులు?మంగళదాయకమైనపెళ్లిలో
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంపకమాల
రిప్లయితొలగించండిపులకల నూత్నదంపతుల మోమును గాంచిన సంబరంబునన్
నెలతల విందువడ్డనల నిండగ విస్తరి షడ్రసమ్ములున్
పలుమరు మారుమారనెడు పల్కుల మైమరపించ ముచ్చటన్
నలువ సతీ ప్రమోదమున నాట్యముఁ జేసిరి పద్య సుందరుల్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిబిలిచిరి వెంకట బెళ్లికి
రిప్లయితొలగించండికలపగ నవధాన్యములను గల్పగ మరలన్
తలచితి నవసరమే యని
దలవకనే విందు నందు ధప్పళ ముండెన్
అన్నపురెడ్డి వారికి శుభాకాంక్షలు. క్రొత్త జంటకు ఆశీస్సులు.
రిప్లయితొలగించండిఅన్నపురెడ్డి వారి గృహమందున పుత్రుని పెండ్లి వేడుకల్
కన్నుల పండు వందు కడు కమ్మని విందులు బల్ పసందులై
మిన్నగ దోచె నాహుతుల మేటి హృదాబ్జము లందు కోరెదన్
క్రన్నన నూత్న దంపతుల గాటపు బ్రేమలు పండ గౌరినిన్.
వధూవరులకు శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిపట్టు వసనములను కట్టి వరుడు వేచె
తలపు లందు కొత్త తళకు లొత్త
సకలజనులు సంతసాన దీవెన లిడ
వధువు వచ్చె నమర వనిత వోలె.
మరొకపూరణ
రిప్లయితొలగించండికలకాలము సతిపతులిటు
వలపులు పంచుచు సతతము వసతిన మనుడీ
తలచిన వెల్లయు నమరగ
తిలకించుచు పెద్దవారు దీవెన లిడగా!
...............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂దత్తపది🤷♀....................
కల - తల - మర - వస
పై పదాలను అన్యార్థంలో పెండ్లి విందును
వర్ణిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యం
సందర్భము: సులభము
ఈరోజు కవిమిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి కుమారుని వివాహపు విందు సందర్భంగా కళ్యాణ శుభాభినందనలతో...
(అసనారె= శ్రీ అన్నవరపు సత్యనారాయణ రెడ్డి గారు)
==============================
సకలములు పిండి వంటలు చక్కగా న
వతల సంసిద్ధ *మసనారె* వరగృహాన..
నమరవరులైన మెచ్చున ట్లమరిన వట!
అందరు వెడలవలయు నియ్యవసరమున
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
20-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""