21, ఆగస్టు 2018, మంగళవారం

సమస్య - 2768 (పగవానిన్ సతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పగవానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్"  
(లేదా...)
"పగవానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో"

95 కామెంట్‌లు:


 1. వచ్చె వచ్చె :)


  మగువా ! నా ప్రాణ సఖీ !
  జగణపు జాణవు జిలేబి చక్కగ నీవే
  మగడిగ వరించనుచు చం
  పగ, వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. (పురుషద్వేషిణి రాణి ప్రమీల అర్జునుని పెండ్లాడటం )
  మగవారల శత్రులుగా
  దగ భావించెడి ప్రమీల తరుణియె యోడన్
  వగకాడయ్యెను పార్థుడు ;
  పగవానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్ .

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. అగణిత గుణగణ శోభిత
   నగరాజసుత యుమ తీవ్ర తపమును గొనుచున్
   సగమౌచున్నా మారుని
   పగవానిం బెండ్లియూడె పడతియె ప్రీతిన్!

   తపస్సు వలన చిక్కి సగమైనది యని, శివునిలో సగభాగమగుచు యని రెండు భావనలతో!

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సగమగుచు నా సుమాస్త్రుని। పగవానిం...' అనండి. లేదా.. సగమేను గొనుచు మారుని... అనండి.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా!
   సవరించిన పూరణ:
   అగణిత గుణగణ శోభిత
   నగరాజసుత యుమ తీవ్ర తపమును గొనుచున్
   సగమగుచు నా సుమాస్త్రుని
   పగవానిం బెండ్లియూడె పడతియె ప్రీతిన్!

   తొలగించండి
 4. నగరమ్మున యుండు నతం
  డగణిత గుణశీలి గాదె యందము నందున్
  చిగురు విలుకాడని చూ
  పగ వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. 'నగరమ్మున నుండు... చిగురు విలుకాడనుచు చూ।పగ..' అనండి.

   తొలగించండి
 5. మగ పెండ్లి వారు వచ్చిరి
  సొగసుగ నా క్రొత్త జంట చూపులు కలిసెన్
  సగమై రెల్లరు దీవిం
  పగ వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్.

  రిప్లయితొలగించండి 6. మగువా ! జాణవు నీవు సూవె! రమణీ మాంగళ్యమున్ జేర్చెదన్
  జగడంబుల్ వలదే ! జిలేబి! యిలలో జంగాళమైనావు నీ
  వు గనమ్మై నిను పెండ్లి యాడెదను నే వోఢై యటంచున్ హ!చం
  పగ, వానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో!  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. అగణిత సుందర రూపుడు
  తగునీతడు నీకటంచు తనవా రొకనిన్
  సుగుణాన్వితునచటన్ జూ
  పగ, వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్

  రిప్లయితొలగించండి
 8. తగ మదిఁగోరిన రుక్మిణి
  చిగురించిన భక్తి కృష్ణు చేపట్టెనుగా
  రగిలెడు చెడు శిశుపాలుని
  పగవానిం; బెండ్లియాడె పడతియు ప్రీతిన్

  రిప్లయితొలగించండి
 9. జగదభిరాముని రాముని
  సుగుణాన్వితు వైభవాఢ్యు సూనృత చరితున్
  నిగమారాధ్యుని దైత్యుల
  పగవానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండవ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 10. మైలవరపు వారి పూరణ

  నగరాడాత్మజయై జనించి , నగలన్ భాగ్యమ్ములన్ ద్రోసి , యె...
  న్నగ దీక్షామతియై తపించి, పరమానందస్వరూపున్ శివున్
  జగదీశున్ పతిగా దలంచి పితరుల్ స్వాంతమ్ములన్ సమ్మతిం...
  పగ ., వానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 11. తగునని మది తా వలచియు
  సుగుణమ్ముల రాశియైన సుందరునొకనిన్
  తగ పలువురు సంతోషిం
  "పగ;వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్"

  రిప్లయితొలగించండి
 12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2768
  సమస్య ::
  పగవానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో.
  పగవాడిని అంటే తన శత్రువునే ఒక స్త్రీ వివాహం చేసికొన్నది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: తారకాసుర సంహారం కోసం కుమారసంభవం కోసం ఎదురుచూచే బ్రహ్మాది దేవతలందఱూ శివ పార్వతుల కల్యాణం జరిపించాలని అనుకొన్నారు. ‘’శివుడు పగ ద్వేషము అనే దుర్గుణాలు లేనివాడు. గొప్ప కరుణతో ప్రకాశించే వాడు. దివి నుండి భువికి దూకే ఆపగను (గంగను) తలపై ధరించి ఆపగలిగిన వాడు. విషాన్ని తాను భుజించి లోకుల కష్టాలను ఆపగలవాడు. అతనిని నీవు వరించు అని ఈశ్వరుని గొప్ప తనాన్ని గుఱించి నారద ముని పార్వతికి విశదీకరించినాడు. అప్పుడు ఆ శివుడు తన మనస్సులో ప్రత్యక్షమైనట్లు తోపగ వానిని(ఆ శివుని) సతి (పార్వతి) పెండ్లి చేసికొని సంతోషంతో సౌభాగ్యంతో వర్ధిల్లింది అని విశదీకరించే సందర్భం.

  పగ లేకుండెడి వాడు సత్కరుణతో వర్ధిల్లు వా డీశు డా
  పగనే యాపగ జాలువాడు విషమున్ భక్షించి కష్టాల నా
  పగ నేర్చున్ శివు డంచు నారదుడనన్ , వాడే మనో వీథి దో
  ‘’పగ, వానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో.’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (21-82018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతమైన పూరణ అవధానిగారూ! అభినందనలు!💐💐💐🙏🙏🙏

   తొలగించండి
  2. కోట వారూ,
   అత్యద్భుతమైన పూరణ. ముఖ్యంగా పగ శబ్దాన్ని నాలుగు పాదాలలో నిక్షిప్తం చేసిన విధానం మనోహరం. అభినందనలు.

   తొలగించండి
  3. గురువర్యుల వాత్సల్యమునకు ప్రణామాలు.

   తొలగించండి
 13. సొగసున మారుని మించిన
  గగనపు గంధర్వు డంట గానము నందున్
  చిగురించు ప్రేమసుధ కురిపిం
  పగ , వాని బెండ్లియాడె పడతియె ప్రీతిన్

  రిప్లయితొలగించండి
 14. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  =====================
  పగవానిన్ సతి పెండ్లియాడి
  పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో
  ======================
  దక్ష ప్రజాపతి శివుడిని తన పరమ
  శత్రువుగా భావించును, అట్టి యెడ
  అతని కూతురు సతీదేవి అలాంటి
  పగవాడినే వివాహమాడి ప్రేమతో
  పొందినది గొప్ప అదృష్టమును అని
  చెప్పటంలో అసంబద్దతె సమస్య.
  ========================
  సమస్యా పూరణము - 237
  ====================

  అంతర్ముఖుడు భవుడు నా నాథుడనుచు
  ఆది మధ్యాంత రహితుండనుచు
  స్మశాన వాసిగ ధీరుడనుచు
  బూదిగ మైపూత అందగాడనుచు
  దక్షుని దక్షత కాదనగన్
  శక్తి పీఠములై నిలువు ఆర్తితో
  పగవానిని సతి పెండ్లియాడి
  పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో

  ====##$##====

  తన తండ్రికి శత్రువు ఐననేమి, తనకు
  పగవాడిగ తోచిననేమి, అంతర్ముఖుడు,
  పుట్టుక లేనివాడు, ఆది మధ్య అంతములు
  లేనివాడు,స్మశానములో తిరుగుటకిఛ్ఛగించు
  వాడు, బూడిదను శరీర లేపనంగా భావించు
  అందగాడు అయిన శివుడిని పతిగా భావించి
  తండ్రి దక్షుడి మాటను ఖాతరు చేయక,మనకై
  శక్తి పీఠములై నిలుచు భవిష్యత్ మర్మముగా
  సతి పగవాడిని వివాహమాడి ప్రేమ మీరగ
  గొప్ప అదృష్టమును పొందినదని భావము.

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
 15. మగటిమి గల యభిమన్యుడె
  యగుపడి నంత శశిరేఖ యాతని వలచెన్
  దగువాడనుచు మదికి దో
  "పగ;వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్"

  రిప్లయితొలగించండి
 16. సమస్య :-
  "పగవానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్"

  *కందం**

  మగువకు జననీ జనకులు,
  నగుమోమున కడు వెలిగెడు నల్లని వరుడే
  తగినట్టివాడనియు జూ
  పగ;వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్
  .......................✍చక్రి

  రిప్లయితొలగించండి
 17. తెగవేధించుచు నాడపిల్లలను ప్రత్యేకమ్ముగా తాననన్
  జగడమ్మాడుచు వెక్కిరించునొకనిన్ జాగ్రత్తగా ప్రేమతో
  తగవున్ మానిపి లొంగదీసుకొనియున్ తానేమిటో చూ
  *"పగ వానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 18. డా.పిట్టా సత్యనారాయణ
  నగధీరుడు రూపమును
  న్నిగ నిగలాడెడి వయస్సు నిండగు సిరియు
  న్నగణిత సద్గుణమలుగల
  పగవానిన్ పెండ్లియాడె పడతియె ప్రీతిన్

  రిప్లయితొలగించండి
 19. సొగసు న కులికే సు త కును
  తగు వరుడ ని వెదికి తెచ్చి తండ్రి యె పలి కె న్
  మగువా !కను మా యని చూ
  పగ వానిన్ బెండ్లియాడె పడతి యెప్రీతన్
  కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కులికే' అనడం వ్యావహారికం. "కులికెడి" అనండి.

   తొలగించండి

 20. మాస్ మహరాజా రవితేజా బ్రాండు కలర్ఫుల్ కతల్ :)

  అగొ!మాస్ మహరాజా !జత
  సుగుణపు పూబోడి వేడి,సుమనోహరియున్ !
  బిగువైన కథనమున కొల
  పగ వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మహరాజా' అనడం గ్రామ్యం. "మహారాజా" అనడం సాధువు.

   తొలగించండి

  2. రవితేజా , సాధువు రెండు విభిన్న ధ్రువాలు :)


   జిలేబి

   తొలగించండి
  3. ఇది కరెక్ట్ “జిలేబి” గారూ 👌 👍 🙂. అయితే మీరు తెలుగు సినిమాలు చూస్తారన్నమాట.

   తొలగించండి

  4. చూస్తాము కాని అర్థమవదండీ :)

   ఫైటింగూ సాంగూ ఫైటింగూ సాంగూ
   మధ్యలో ఒక ఐటెము సాంగు
   డిష్యూం డిష్యూం డిష్యూం

   శుభం

   ఆపై సెట్టులోని ముచ్చట్లు తెరవెనుక కత బుల్లి స్క్రీను లో పోతా వుంటే సైడులో పేర్లు స్క్రోలవుతావుండును.

   ఇంతే తెలుసు :)


   జిలేబి

   తొలగించండి
  5. అక్కడికి ఏదో మాకు అర్థమవుతున్నట్లు 😕! పైన మీరు చెప్పినవాటితో పాటు ... ఎదురుగా ఉన్న పాత్రని మాటిమాటికి చెంపదెబ్బలు కొడుతుండడం (ఆ పాత్ర హీరో పాత్ర కన్నా వయసులో పెద్దవాడైనా కూడా), అందరినీ అపహాస్యం చేస్తూ మాట్లాడడం - ఇవే ఈ సోకాల్డ్ మాస్ హీరోల హీరోయిజం. ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం 😣?

   ఇక మీరు చెప్పిన బుల్లితెర మీద ముచ్చట్లు .... నేను చూడను తల్లో ఆ తెరెనక కతలు ... చూడనంతే 😠.

   తొలగించండి
 21. నిగమాంతప్రతిపాదితశ్రుతిలసన్నీరేజపత్రేక్షునిన్,

  జగదాకారధృతావతారవరమోక్షప్రాప్తిసంధాయకున్,

  తగ నీ సాధుజనావనున్ సిరి హరిన్ ధ్యానించి, దైత్యాళికిన్

  పగవానిన్ , సతి బెండ్లి యాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో.
  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 22. సెగను రగిలించెడు ప్రియుడు
  మొగమును జూపక మనసున మోహము రేపన్
  మగనిగ బ్రియుడును మారగ
  "పగవానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్"

  రిప్లయితొలగించండి
 23. పగలేవెన్నెల నందిం
  పగ!కనులొసగెడి వెలుగులు ప్రక్కనసందిం
  పగ!ప్రేమ,పెంపు పులకిం
  పగ!వానింబెండ్లియాడె పడతియె ప్రీతిన్!

  రిప్లయితొలగించండి


 24. కందం
  సిగలో జాబిలిదారిని 
  నగస్త్యుని వలచి యపర్ణ యనురాగముతో
  సగమవ్వ సురలు స్తుతియిం
  పగ వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్

  రిప్లయితొలగించండి
 25. నా రెండవ పూరణ.

  సుగుణోపేతవిరాజితాకృతిమనశ్చోరుండునై యొప్పెఁ దా

  మగడై నెచ్చలి! నాకు యోగ్యుడగునే? మన్నింతురే?" యన్న నా

  మగువం జూచి యనుంగురాలు తగదమ్మా! యంచుఁ దచ్ఛంకఁ బా

  పగ , వానిని బెండ్లి యాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతతో.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 26. తగిన వయసువా డనచును
  మగటిమి గలవాడనుచును
  మానుగ సుతకున్
  నగుచును సంబంధము చూ
  పగ వానిం పెండ్లి యాడె పడతియె ప్రేమన్.

  రిప్లయితొలగించండి
 27. నగలేవియు లేకున్నను
  నగవుల ముత్యము లొలికెడు నవలామణికిన్
  తగువానిని పెద్దలు చూ
  పగ,వానింబెండ్లియాడె పడతియె ప్రీతిన్!!!

  రిప్లయితొలగించండి
 28. నగవరుఁడు సురవరుల వరు
  సగఁ గాంచి శివుని గణించి జనకుం డంతం
  దగు నీతఁ డనంగ సురా
  పగ వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్


  తగఁ డీ చైద్యుఁడు రాక్షసాంశుఁ డని చిత్తంబందుఁ దాఁ దల్చుచున్
  మృగ లోలాక్షియ యేఁగుదెంచ వడి నా కృష్ణుండు విప్రుండు పం
  చఁగ వైదర్భి మహానురాగమున రక్షశ్శ్రేణి కత్యంతపుం
  బగవానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిం బ్రీతితో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చూపఁగ లో నర్థానుస్వార మాటంకముగా నున్నదని యీ పూరణమును విసర్జించి సవరించితిని.:

   తగు వారిని వరులను వరు
   సఁగఁ గాంచి యొకని గణించి జనకుం డంతం
   దగు నీతఁడు నీకని చూ
   పఁగ వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్

   తొలగించండి
  2. సమస్యా పాదములో లేని యరసున్న నాదిని గాక పదము మధ్య నుంచుట సమస్యా పాదమును మార్చి నట్లే గదా!

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   ఈరోజు పూరణలలో అరసున్నను పరిగణనలోనికి తీసుకొనలేదు. తీసుకుంటే ఎంతోమంది పూరణలను తప్పు పట్టవలసి వస్తుంది. కొన్ని దోషాలను చూసి చూడనట్లు మిన్నకుండుట అలవాటయింది.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 29. ఎగురన్ వస్త్రము గాలి కామె సభలో నేతెంచుచో నూరువుల్
  దగ కన్ పించ మహాభిషుండు కుతితో దానిం గనన్ మర్త్యుడై
  జగతిం బుట్టె నతండు శంతనునిగా శాపాన దానేగి యా
  పగ వానిన్, సతి! పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో.

  రిప్లయితొలగించండి
 30. పగవారల నిర్జించగ
  తగనిపనులతోడ తండ్రి ధనము హరింపన్
  తగు జీవనమార్గముఁ జూ
  పగ, వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్

  రిప్లయితొలగించండి
 31. సొగసగు రూపము కంటెను
  సుగుణములుండిన సుమనస్కుండే
  తగువాడని పెద్దలు తెలు
  పగ, వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్.

  రిప్లయితొలగించండి
 32. చిగురుంబోలినపార్వతి
  రగులగ దనమనమునందు రమ్యుడుభవుపై
  దగువలపుంగనమారుని
  పగవానింబెండ్లియాడెపడతియెప్రీతిన్

  రిప్లయితొలగించండి
 33. మత్తేభవిక్రీడితము(పంచపాది)
  పగవాడీతడు వీనికిన్ విషమునే భద్రమ్ముగా నిమ్మనన్
  తగువాడీతడు వీనికిన్ విషయనే భద్రమ్ముగా నీయఁ దా
  నుగ లేఖన్ సవరించుచున్ విషయ మాన్యున్ చంద్రహాసున్ వినో
  దిగ ప్రేమాతిశయమ్మునన్ జెలఁగి ప్రత్యేకమ్మనన్ దండ్రికిన్
  పగవానిన్, సతి పెండ్లియాడి పడసెన్భాగ్యోన్నతిన్ బ్రీతితో

  రిప్లయితొలగించండి
 34. పగవానిన్సతిపెండ్లియాడిపడసెన్భాగ్యోన్నతిన్బ్రీతితో
  పగవాడైననుజూడగామదికిపాపంబెన్నడుజేయువా
  డుగగన్పించడుదానుగాప్రజకుగీడున్జేయశంకించుసూ
  పగవాడైననుమారుగానిలనుభోభావాతిరేకంబునన్

  రిప్లయితొలగించండి
 35. తాపసి మిధిల పత్తనమునకున్ రామ చంద్రుని కొనిపోయి జనకునిసుత
  సీతకు బెట్టిన శివధనుర్భంగ స్వయంవరమును జూప నా రఘు కుల
  తిలకుడు విల్లునెత్తి విఱచె నొక్కమారుగ, సభ లోని వారు గెలువడికి
  నెమ్మి సలుపగ వానిం బెండ్లి యాడెపడతియె ప్రీతిన్ ఘనుడతడని మది

  నందు తలచుచు,రాముని డెందము పర
  వశము నొందగ తాపసి వదనము చిరు
  నగవు తోడ ప్రకాశమై నర్తనమిడ
  నెల్ల రిడె దీవెనలపుడు నెమ్మి తోడ

  రిప్లయితొలగించండి
 36. మరోరెండు పూరణలు
  తగవిక చేయకు పుత్రీ
  తగదిది వలదనుట పెండ్లి ధరలో నెపుడున్
  సగమై మనుమని వరుఁజూ
  పగ వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్.

  నిగమాంతరంగుడౌ యా జగదీశుని కమలజాది సన్నుత పాత్రున్
  సుగుణాకరునచ్చో చూ
  పగ వానిం బెండ్లి యాడె పడతియె ప్రీతిన్.

  రిప్లయితొలగించండి
 37. తెగవన్ జూపుచు నడ్వు ముందుకని తా ధీ శక్తితోడన్ సదా
  దిగులున్ జెందెడి కోమలాంగికిని సందేహంబులన్ దీర్చుచున్
  సుగమంబొందగ జేసె స్నేహితుడు, సంశోభిల్లు కార్యంబు జూ
  పగ , వానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో"

  రిప్లయితొలగించండి
 38. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పగవానిన్ సతి పెండ్లియాడి పడసెన్
  భాగ్యోన్నతిన్ బ్రీతితో

  సందర్భము: సులభము. భాగవతానుసరణము. మాన్యులు శ్రీ సూరం శ్రీనివాసులుగారి ప్రేరణము.
  మౌనులు= విశ్వామిత్రుడు వశిష్టుడు మున్నగువారు.
  రాజులు= దశరథుడు జనకుడు మున్నగువారు.
  ==============================
  తగు నీ రాముడు జానకీ రమణికిన్
  దథ్యంబు శ్రీ రాముడున్
  దగు సీతా సతి, కింత మంచి దగునే
  దాంపత్య మీ యిద్దరన్
  దగులంగట్టిన బ్రహ్మ నేరుపరి గాదా!
  మౌనులున్ రాజు లొ
  ప్పగ వానిన్ సతి పెండ్లియాడి పడసెన్
  భాగ్యోన్నతిన్ బ్రీతితో

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  21-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 39. డా.పిట్టా సత్యనారాయణ
  జగమే కాదది కూడదన్న మతినిన్ జాటింప శత్రుత్వమే
  రగులన్ ధైర్యము శౌర్యమున్ గలిపి సం రంభంబున న్నీతినిన్
  సెగలన్ "గాశ్మిరియాత"టల్ గనియె నీ సేవారతిన్ బోల్చగన్
  పగవానిన్ సతి పెండ్లియాడె పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో!

  రిప్లయితొలగించండి
 40. వెగటుగ నెత్తిన దాల్చిన

  వగలాడి మగువను జూచి భగ్గున మండన్

  సగభాగ మాక్రమించుచు

  పగవానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్ :)

  రిప్లయితొలగించండి
 41. ఇషాని ఉవాచ:

  తగునా యివ్విధి తప్పులన్ పలుక తాతా! బోసి నోటోడివే:👇

  "పగవానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో"

  నగుబాటాయె గదా! సరే! వినుమురా! నానోట నీవాక్యమున్:👇

  "భగవానున్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో"

  రిప్లయితొలగించండి
 42. వగతో వేల్పులు వేడగా హరియె తా వ్రాలంగ భూదేవిపై
  పగలున్ రాత్రియు వేచి వేచుచునటన్ పండంటి పిల్లాడికై
  ఖగమున్ వాహ్యము జేయు శ్రీపతియెభల్ కామారి చాపమ్ము ద్రుం
  పగ వానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిన్ బ్రీతితో :)

  రిప్లయితొలగించండి