19, ఆగస్టు 2018, ఆదివారం

సమస్య - 2767

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
" కొండలనె యలంకరించి కోమలి మురిసెన్"  
(లేదా...)
"కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే"

104 కామెంట్‌లు:


  1. అండ యినుడు తోడై యుష,
    నిండగు "వాజేనవాజిని" భళిభళి యనన్
    మెండుగ సూనృత తూరుపు
    కొండలనె యలంకరించి, కోమలి, మురిసెన్!


    శుభోదయం
    ఉషో వాజేనవాజిని !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. Rig-veda III.61

      3.61.1

      उषो॒ वाजे॑न वाजिनि॒ प्रचे॑ता॒: स्तोमं॑ जुषस्व गृण॒तो म॑घोनि ।

      पु॒रा॒णी दे॑वि युव॒तिः पुरं॑धि॒रनु॑ व्र॒तं च॑रसि विश्ववारे ॥१॥

      uṣaḥ vājena vājini pra-cetāḥ stomam juṣasva gṛṇataḥ maghoni

      purāṇī devi yuvatiḥ puram-dhiḥ anu vratam carasi viśva-vāre

      Dawn, richly stored with substance, conscious cleave to the affirmation of him who expresses thee, O thou of the plenitudes. Goddess, ancient, yet ever young thou movest many-thoughted following the law of thy activities, O bearer of every boon.

      తొలగించండి
    2. 👏👏👏

      "Full many a glorious morning have I seen
      Flatter the mountain-tops with sovereign eye,
      Kissing with golden face the meadows green,
      Gilding pale streams with heavenly alchemy"

      ...William Shakespeare

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సూనృత తూరుపుకొండలు' దుష్టసమాసం. సవరించండి.

      తొలగించండి
  2. నిండుగ బొమ్మల కొలువున
    కొండల రాయని కొలువగ కూరిమి తోడన్
    మెండుగ నేడగు తిరుమల
    " కొండలనె యలంకరించి కోమలి మురిసెన్"  

    రిప్లయితొలగించండి
  3. కొండల రాయుని వలచిన
    చండీశుని చిలిపి మనసు జటల బిగించెన్
    మెండుగ సంతస మొందుచు
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    " దండుగ యింద్రపూజ ! మన దైవము కన్నులముందు నిల్చెనీ
    కొండగ ., గ్రాసవృద్ధినిడు గోవులకున్ మనకెల్ల., పున్నముల్
    పండును పూజఁ జేయ "యని బాలముకుందుడు దెల్ప , దండలన్
    కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోవర్ధన పూజ విషయంగా మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఈ భావం శ్రీ భూసారపు నర్సయ్య గారిది... ప్రకృతికాంత... పర్వతమును అలంకరించింది.. అని కవిభావం... నా మాటల్లో.....

      పండిన చెట్లతో , వివిధపక్షులతో , సెలయేళ్ల మ్రోతతో ,
      మెండగు పూలతో , మృదుల మృత్తికతో , హరిణంపు సొంపుతో
      నిండ , గిరీంద్రమున్ ప్రకృతి నిర్మలమౌ గతి తీర్చిదిద్దగా
      కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    3. "భూసారము" తో " నర్సరీ" నిర్మించిన మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు



      జిలేబి

      తొలగించండి
    4. మీ స్పందన కూడా జిలేబీ వలెనే ఉన్నది 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి


  5. మెండుగ నాకర్షించెడు
    దండిగ పెరిగిన స్తనముల దాచుట కొరకై
    నిండుగ పైటను గప్పుచు
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పద్యం 'సముద్రవసనే దీవీ పర్వతస్తనమండలే...' శ్లోకాన్ని గుర్తు చేసింది.

      తొలగించండి

    2. ఆహా విరించి గారివ్వాళ విపంచి యైనారు :)

      తొలగించండి
  6. కొండలరేడు మేనలకు కూతురు పార్వతి భక్తిమీరగా
    గుండెలలోని ప్రేమ నతిగోప్యత పుష్పములందునింపుచు
    న్నండగ వెండికొండపయి నల్లన నిల్చిన శంభు భాగ్యపుం
    గొండ నలంకరించి సుమకోమలి మోదమునందె చిత్రమే!

    రిప్లయితొలగించండి
  7. కొండల రాయునిన్ కొలిచి గొప్పగ పూజలు జేయువా రలే
    పండితు లెందరో శివము పాటవ మందున వల్లె వేయగా
    పండుగ లందునన్ విరులు భక్తిని మెండుగ సోయగం బిడన్
    కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే

    రిప్లయితొలగించండి
  8. నిండుగ పండుగ దినమున
    పండంటి సుతలను దీర్చి పట్టు వలువలన్
    మెండగు ప్రేమను బంగరు
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పండువంటి' అనే అర్థంలో 'పండంటి' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2767
    సమస్య :: కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే
    పుష్పం లాగా కోమలంగా ఉన్న స్త్రీ పెద్ద కొండను అలంకరించింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం.
    సందర్భం :: పండుగ రోజుల్లో తల్లులు బిడ్డలను గొప్పగా అలంకరిస్తూ ఉంటారు. యశోదమ్మ ఒక పండుగ రోజున చిన్నికృష్ణుని పిలిచి నాయనా! నీవు నా బంగారు కొండవు. ఈరోజు నీ పుట్టినరోజు పండుగ. అందువలన నిన్ను బాగా అలంకరిస్తాను. నీకు ఇష్టమైన వెన్నముద్ద ఇదుగో నీ చేతిలో పెడుతున్నాను అంటూ వెన్నముద్ద ఇచ్చింది. నడుముకు బంగారు మొలత్రాడు చుట్టింది. సందిట తాయెత్తు కట్టింది. పట్టువస్త్రాలను కట్టబెట్టింది. తలపై నున్న కొండె చుట్టూ పూదండ పెట్టింది. కాళ్లకు సరిమువ్వ గజ్జెలు కట్టింది.
    ఇలా అలంకరింపబడిన చిన్ని కృష్ణుని ఒక మహాకవి ఒక తెలుగు పద్యంలో మనోహరంగా ఇలా వర్ణించాడు.
    చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
    బంగరు మొలత్రాడు పట్టు దట్టి
    సందె తాయెతలును సరి మువ్వ గజ్జెలు
    చిన్ని కృష్ణ ! నిన్ను చేరి కొలుతు.
    ఇలా తన బంగారు కొండయైన చిన్ని కృష్ణుని ఆ కోమలి యశోదమ్మ అలంకరించింది అని వర్ణించి చెప్పే సందర్భం.

    పండుగఁ జిన్నికృష్ణుఁ గని బంగరుకొండ యటంచుఁ బిల్చి, పూ
    దండను వెన్నముద్దఁ మొల త్రాడును తాయెతఁ బట్టుపుట్టమున్
    మెండుగ మ్రోయు గజ్జెలను మించుచు గూర్చె యశోద, ప్రేమ నా
    కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే?
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (19-8-2017)

    రిప్లయితొలగించండి

  10. అండ యినుడు తోడై యుష,
    నిండగు "వాజేనవాజిని" భళిభళి యనన్
    మెండగు సూనృత, తూరుపు
    కొండలనె యలంకరించి, కోమలి, మురిసెన్!


    సవరణ సరియే నాండీ కంది వారు?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయ
    బండయె వేంకటపతి గాన్
    గండములన్నాదుకొనెడు ఘనుడని విని వే
    నిండగు వెన్నునిగన దా
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    బండల రాజకీయమున బంతినెరింగిన నేత నేలకో
    దండుకొనంగ నండ యను దారిని బట్టెను"పాకు"(Pak)నేడు యా
    పండుగ జూడ నాయకుల ప్రాభవమాటయు పాటలందె పో!
    "కొండ నలంకరించి సుమకోమలి మోదమునందె చిత్రమే!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నేడు + ఆ = నే డా' అవుతుంది. యడాగమం రాదు. "నేడు నా" అనవచ్చు.

      తొలగించండి
  13. దేవిక
    ------
    (సీతా సమేతుడై భద్రగిరిపై రాముడు వెలసినాడు)

    కొండగ వెలయగ భద్రుడె
    నిండుగ ప్రార్థించి రామునిన్ ; పతి తోడన్
    పండుగ యని సంతసమున
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్ !

    రిప్లయితొలగించండి
  14. లెండిక రండి నా సుత వరించగ వీరులు శైవచాపమున్

    ఖండమొనర్చి గొండు జనకాత్మజ నన్న విదేహు చాటుతో

    దండిగఁ జేర , గెల్వ నట రాముడె , హారము తోడ పైడియౌ

    కొండ నలంకరించె సుమకోమలి , మోదము నందె చిత్రమే ?.


    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    "ఫత్తర్ మే సాయీ(స్వామి)మిలే, తొ మై పూజుం పహాఢ్...(కబీర్) నా మొదటి పూరణమునకు ఆలంబన,ఆర్యా,

    రిప్లయితొలగించండి

  16. ఓం నమో వేంకటేశాయ :)

    రాఘ"వేండ్రము"

    రాఘవేంద్రుని ఐంద్ర జాలము అనూష్క :)



    అండ నయోధ్య రాముడట నాయతనమ్మును వీడి గొల్వగా
    కొండల పైన స్థావరము గాంచిన వేంకట నాధుడిన్ కెడన్
    నిండుగ నంత రంగ మున నిర్మల బుద్ధిని గాంచి నెత్తిపై
    కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె, చిత్రమే
    తండము, రాఘవేంద్రు కయి దండగ నద్భుత మయ్యె నే సఖీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. పండుగగా డందముగను
    మెండుగ సందడిగ మేల్మి మించిన సొబగుల్
    పండగ,ముద్దుల బిడ్డల
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్.

    రిప్లయితొలగించండి
  18. కొండను వ్రేల నెత్తి జన కోటిని గావగ కృష్ణమూర్తి యా
    కొండయె ధన్య మాధవుని గోటను నిల్చెను వ్రాల జాల నా
    కొండకు రేని పాదముల కొండనె కొల్తు నటంచు తీగపై
    కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే.

    రిప్లయితొలగించండి

  19. ఇక జిలేబి యే దిక్కు :)


    అండ యినుడు తోడై యుష,
    నిండగు "వాజేనవాజిని" భళిభళి యనన్
    మెండుగ జిలేబి తూరుపు
    కొండలనె యలంకరించి, కోమలి, మురిసెన్!


    శుభోదయం
    ఉషో వాజేనవాజిని !

    రిప్లయితొలగించండి


  20. తండా వాళ్ళ జిలేబీ
    మెండుగ సర్కస్సులోన మేల్మిని గాంచెన్
    నిండుగ మెడలో భళి యన
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. మెండైన వత్సలత్వము
    నిండగ హృదయంబులోన నిజసుతుని వచో
    మండితుడగు నా యేడవ
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్.

    రిప్లయితొలగించండి
  22. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =====================
    కొండ నలంకరించి సుమకోమలి
    మోదము నందె చిత్రమే
    ======================
    పూల మాదిరి సుతి మెత్తని ఆ
    సౌందర్య రాశి తనను తానో కాక,
    ఇంటినో, చంటి బిడ్డనో కాక, కొండను
    అలంకరించి సంతోషించినది ఆశ్చర్య
    కరముగా యని చెప్పడంలో విశేషమే
    ఇచట సమస్యగా పరిగణించ
    ==========================
    సమస్యా పూరణము - 236
    ====================

    అల్ప అనల్ప భావనలు
    ఆవు పేడగ శిఖర దీవెనలు
    భక్తిగ వీచెనదె వీవనలు
    దైవ కృపకు శుభ కామనలు
    గోబర్దన లీల నెంచి
    కృష్ణ కథామృత గాత్రమే
    కొండ నలంకరించి సుమ కోమలి
    మోదము నందె చిత్రమే

    ====##$##====

    గోవర్ధన గిరికి ప్రత్యామ్నాయముగా
    ఉత్తర ప్రదేశ్ , కిషన్ గంజ్ ప్రాంతంలో ఆవు
    పేడతో శిఖరము (పర్వతం ) ఆకృతిని చేసి
    చక్కగా అలంకరించి పూజించటం అక్కడ
    ఆచారముగా కొనసాగుతున్నది.

    మానవ శాస్త్రం (Anthropology )
    ని అనుసరించి "గోవర్ధన గిరి" పూజ(అనల్ప-
    సాంప్రదాయము ) (Great Tradition )
    "గోబర్దన గిరి" పూజ (అల్ప సాంప్రదాయము)
    (Little Tradition ).

    మనము పూజించుకునే దేవీ దేవతల
    విషయంలో "మహిషాసుర మర్దిని /మైసమ్మ",
    "బాలా త్రిపుర సుందరి/బాలమ్మ ", "నృసింహ
    స్వామి /నర్సప్ప", "చాముండేశ్వరి /చౌడమ్మ",
    "రేణుకాదేవి /ఎల్లమ్మ " లుగా ఉదహరించు
    కోవచ్చును.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  23. చండుడని పలికెను కుచపు
    కొండలనె యలంకరించి, కోమలి మురిసెన్
    దండిగ రాజు సనిని చేయు
    చుండన్ తనవక్షములకు స్తోత్రములిడుచున్


    సని = అర్చన


    పూజ : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
    • అచ్చన, అపచితి, అభ్యర్చ, అభ్యర్చన, అభ్యర్చనము, అభ్యర్హన, అర్చ, అర్చన, అర్చనము, అర్హ, అర్హణ, అర్హణము, ఆరాధన, ఆరాధనము, ఇజ్య, ఉపాసన, ఉపాస్తి, గురుకారము, చాగుబడిక, తిరువారధనము, నమన్య, పర్యుషణము, వందని, సంసేవ, సపర్య, సని.


    ఒక రాజు శివ భక్తుడు .శివరాత్రి దినమున వెలయాలి ఇంటిలో నిద్ర పోవు చుండగా ఒక్కసారి గా గుర్తుకు వస్తుంది ఆ రోజు శివరాత్రి యని ఏమి చేయాల అని ఆలోచిస్తూ ఎదురుగా నగ్నంగా ఉన్న వేశ్య కుచములు అతనికి శివలింగములుగా కనిపిస్తాయి అప్పుడు నిర్మల మైన భకి్తో వాటికి పూజచేసి తరిస్తాడు చలన చిత్రం పరమానందయ్య శిష్యుల కధ ఆధారముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం చివర బేసిగణంగా జగణం వచ్చింది. సవరించండి.

      తొలగించండి
  24. కొండొక యువతికి కలలే
    పండగ కవలలు జనించి పండువ సేయన్
    నిండగ మది తన బంగరు
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్.

    రిప్లయితొలగించండి
  25. చండామార్కులయింటను
    నాండాళనుబేరనొప్పునాసతిభక్తిన్
    నండజువాహనుడుండెడు
    కొండలనెయలంకరించికోమలిమురిసెన్

    రిప్లయితొలగించండి
  26. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,




    [ హరిభక్తులైన తాపసుల శిక్షించుట పుణ్యమే

    సుమా ! కావున వారిని చంపి వేయ మని హిరణ్య

    కశిపుడు సేనాధిపతికి ఆదేశము నొసగెను ]


    దుశ్ఛంధత్వ విహీన సత్వగుణమున్ , ధూతేంద్రియోద్వేగమున్ ,

    నైశ్చల్యామల విష్ణుభక్తియు , బ్రధాన ఙ్ఞాన జిఙ్ఞాసయున్ ,

    నిశ్చింతన్ గల మౌనివర్గము నికన్ నిర్జింపుమా నిర్దయన్

    బశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా


    [ ఛంధత్వము = ఙ్ఞానము ; ధూత = విదలింపబడిన ,

    లేకుండ జేసిన ; అమల = స్వఛ్చమైన ; ప్రధానఙ్ఞానము

    = మోక్షఙ్ఞానము ; ]

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  27. నిండుమనంబుతోగదిసినీరజనాభునినాప్తమిత్రమా
    భండనభీమునిన్దరికిభక్తినిజేరియుసాదరంబుగా
    కొండనలంకరించిసుమకోమలిమోదమునందెచిత్రమే
    మండనమెప్పుడున్దనరుమాన్యతతోడననెట్టివేళలన్

    రిప్లయితొలగించండి
  28. నిండగు భక్తి యు తోడు త
    కొండల రాయల ను జేరి కోరిక మీర న్
    దండిగ సుమ మాలల తో
    కొండ ల నె యలoకరించి కోమలి మురిసె న్
    ______కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  29. నిండగు భక్తి యు తోడు త
    కొండల రాయల ను జేరి కోరిక మీర న్
    దండిగ సుమ మాలల తో
    కొండ ల నె యలoకరించి కోమలి మురిసె న్
    ______కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  30. అండగ నుండును హేరం
    బుం డని నైవేద్యములను భోజ్యములను వే
    దండ నిభమ్ములగు కుడుము
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్


    పండుగ నాఁడు పూజ లిడఁ బన్నుగ మాకు నొసంగవే యనన్
    దండము వెట్టి పల్కి యిటు తాను సఖీజన కోటి కెల్ల నా
    కుండఁగ నీయ కుండుదునె యుత్తమ విగ్రహ సంచయమ్మునుం
    గొం డనలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే

    [కొండు + అనలంకరించి = కొం డనలంకరించి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      రెండవ పూరణలోని విరుపు ప్రశంసనీయం!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. కొండలు మీరు యశోదకు
    రండు హలధరుడ ముకుంద రయమున మీరున్
    పండుగ నేడును రండని
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్!

    రిప్లయితొలగించండి
  32. కొండిక లిరువురు గల్గిరి
    నిండుగ దీవెనలిడి ప్రియ నేస్తుల తోడన్
    పండుగ జరుపన్ బంగరు
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్ ౹౹

    రిప్లయితొలగించండి
  33. కొండలరాయుని దయతో
    గుండెకుబలమట్లు కవలకొమరులు గలుగన్
    కొండలరాయళ్లనుచును
    కొండలనె యలంకరించి కోమలిమురిసెన్

    రిప్లయితొలగించండి
  34. చిన్న వయస్సులోనే హిమాలయాయలు అధిరోహించి మన మవ్వన్నెల జెండాను అక్కడ అలంకరించిన *పూర్ణ* దృష్టిలో ఉంచుకొని

    మెండుగ దేశభక్తి ఝరి మే ప్రవహించ హిమాలయమ్ముపై
    జెండను నిల్పి *పూర్ణ* విరచించె మనోహరమైన చిత్రమే
    యిండియ మూడు వన్నెలట నింపుగ వెల్గె మహా నగమ్ము పై
    *కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'మేఁ బ్రవహించ' అనండి. బాగుంటుంది.

      తొలగించండి
  35. పార్వతి దేవి శివునితో తన అన్న ను చూడాలన్న కోరిక చెప్పుట

    వెండి నగముపై నుండను
    నిండుగ మాయన్న కొండనె జనెద నిక యే
    వండీ యంచుమ తిరుపతి
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలంకరించుట = రావుట
      ఉదా: వేదిక ను అలంకరించవలసింది గా కోరుతున్నాము :)

      తొలగించండి
    2. శ్రీకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏవండీ' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  36. నిండుమనంబున నేడగు
    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్
    రండిక పేరంటమునకు
    కొండిక వాయనములిపుడు కూరిమి తోడన్.

    రిప్లయితొలగించండి
  37. కందం
    పండుగనుచు కృష్ణాష్టమి
    కుండలలో వెన్ననుంచి కోమలి దీర్చన్
    దండుగమారొక డిట్లనెఁ
    "గొండలనె యలంకరించి కోమలి మురిసెన్"

    ఉత్పలమాల
    మెండుగ పెండ్లి వేడుకకు మేలని పిల్చెదరామె నెందరో
    పండఁగ 'శైలజాహరుల' భావము నాటి వివాహమంచుఁ దా
    వెండినగంబులన్ మలచి వేదిక పైఁదగ తీర్చిదిద్దుచున్
    గొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే

    (శైలజాహరులు = వధూవరులు)

    రిప్లయితొలగించండి
  38. పెండిలి యీడువచ్చెనని పెద్దలు తొందర పెట్టుచుండ నా
    కొండని గుండెలందుగల కొమ్మను చక్కని చుక్కయైన చా
    ముండను జూడనెంచుచును ముద్దుల పుత్రుని చేరబిల్చి యా
    కొండనలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే.

    రిప్లయితొలగించండి
  39. పెండిలి యాడి యా సతిని వీడి విదేశము లేగె భర్త యొ

    క్కండె ; వియోగభారహతకాంత కృశించగ , రేపె వత్తు నీ

    యండకనన్ , నిశిన్ గడుపె నాత్రముతో ; రవి యంతఁ దూరుపుం

    గొండ నలంకరించె ; సుమకోమలి మోదము నొందె చిత్రమే?.
    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  40. పండుగ గాప్రభుత్వమట బారిగ మొక్కలు నాటనెంచగన్
    మెండుగ వచ్చిరే జనులు మేదిని యీనిన చందమై యటన్
    బండల తోడనిండెనొక పర్వతమున్ గని యంకురాలతో
    కొండనలంకరించి సుమ కోమలి మోదము నందె చిత్రమే.

    రిప్లయితొలగించండి
  41. బండను బారు గుండియను వహ్నిన దూకెను యజ్ఞశాలలో
    కొండకుఁ బుట్టెనా యతివ, కోరుచు నీశుని పాద పద్మముల్
    చండ ప్రచండమౌ తపము సల్పి వరించెను, చల్లనైనదౌ
    "కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే"

    రిప్లయితొలగించండి
  42. ...............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    కొండ నలంకరించి సుమ కోమలి
    మోదము నందె చిత్రమే

    సందర్భము: *రాకొండ..* నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లికి సమీపంలోని ఒకానొక హరిహర క్షేత్రం. రామ లింగేశ్వరు డిక్కడ వెలసినాడు. అనగా రాముడు.. శివుడూ ఇద్దరూ.. అందువల్ల శ్రీ రామ నవమి...శివరాత్రి... ఉత్సవాలు రెండూ అంగరంగ వైభోగంగా జరుగుతాయి.
    మహనీయులు సంప్రదాయ ప్రియులు భక్త కవులు *కీ.శే. మల్లేపల్లి శేఖర రెడ్డి గారు* స్ఫూర్తి నందించి ఎందరినో తీర్చి దిద్దారు.
    కొండ పేరూ రాకొండనే! కొండ కింద నున్న గ్రామం పేరూ రాకొండనే!
    రాముడు వనవాస కాలంలో ఈ కొండమీద కొన్నాళ్లున్నా డని ప్రతీతి. రావణవ ధానంతరం హనుమంతుడు కాశీనుంచి శివలింగాన్ని (రామేశ్వరంలో ప్రతిష్ఠకోసం) తెస్తుండగా ఈ కొండపై తపస్సు చేసుకుంటున్న మునుల తపశ్శక్తి ఒక దివ్యమైన జ్యోతిలా కనిపించగా ఒకింత సేపు నిలిచినాడు. అతని స్వేద బిందువులు కొండమీది వాయువ్యపు గుండంలో పడి ఎఱ్ఱ కలువ లైనా యని స్థల చరిత్ర.
    రాముడు పాదం మోపడంవల్ల మారుతి చెమట చుక్కలు రాలటంవల్ల ఈ కొండకు ప్రాధాన్యం వచ్చింది. రామకొండ రామగిరి రామాద్రి రామశైలం అని పేర్లు. క్రమంగా *రాకొండ* అయింది.
    ఇప్పటికీ వాయువ్యపు గుండం దక్షిణపు గుండ్ల నడుమ ధ్యానం చేస్తే హనుమ ద్దర్శనం అతి సులభ మంటారు.
    ఇక్కడి గుండములు:
    కలువల గుండము.... వాయువ్యము
    గోగర్భ గుండము....... తూర్పు
    సీతమ్మ గుండము...... ఆగ్నేయము
    ప్రాణగుండము........ నైరుతి
    పాదప్రక్షాళన గుండము..పశ్చిమము
    "ఐదు పవిత్రమైన గుండాలతో అలరాలుతూ (కోకిలలు రామచిలుకలు మొదలైన వాటియొక్క) అవ్యక్త మధుర శబ్దాలతో అలరారే వృక్షాలతో వున్నది యీ కొండ. చెత్రమాసం వచ్చేసింది ఈ శుక్లపక్షంలో వసంత నవరాత్ర్యుత్సవాలు జరుపా లమ్మో!" అంటూ మల్లేపల్లి శేఖరరెడ్డి గారు శ్రద్ధాళువు లైన మహిళామణులకు గుర్తు చేయగా అం దొక మహిళ తోటివారికి పల్లెను కొండను కొండదారిని అలంకరించడానికి పనులు పురమాయించింది... అలంకరించి సంతోషించింది అనే సందర్భ మిది.
    ==============================
    "గుండము లైదు గల్గి కల
    కూజితముల్ వినిపించు భూజముల్

    మెండుగ గల్గు కొండ యిది;
    మేలుగ చైత్రము శుక్ల పక్షపుం

    బండుగ వచ్చె నమ్మొ!" యని
    పల్లెను *శేఖర రెడ్డి* చెప్ప *రా*

    *కొండ* నలంకరించి సుమ
    కోమలి మోదము నందె చిత్రమే!

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
    19-8-18
    """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి
  43. ఎండలు వానలు కలబడ

    పండుగ జేసె హరివిల్లు పరవశమౌచున్...

    నిండుగ నగుపించె నిటుల:

    కొండలనె యలంకరించి కోమలి మురిసెన్!!!

    రిప్లయితొలగించండి
  44. భౌతిక శాస్త్రుని హావభావముల్ :)


    అండగ వానజల్లులిట హాయిగ రాలుచు సొమ్మసిల్లగా

    మెండుగ సూర్యరశ్మి భువి మీదుగ సోకగ క్రుంగి క్రుంగుచున్

    పండుగ జేయుచున్ విరిసి పాడుచు నాడెడి నింద్రధన్వమై

    కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే!!!

    రిప్లయితొలగించండి
  45. మెండుగ పూలు కోయుచును మిక్కిలి ప్రీతిని భాగ్యనగ్రినిన్
    చెండులు చెండ్లుగా మలచి చెన్నుగ జేరుచు నాలయమ్ము త
    న్కండగ దోస్తులుండ బతుకమ్మగ కూర్చిన పూలతోడ నా
    కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే

    రిప్లయితొలగించండి