24, ఆగస్టు 2018, శుక్రవారం

న్యస్తాక్షరి - 58 (వ-ర-ల-క్ష్మి)


అంశము - వరలక్ష్మీ స్తుతి
ఛందస్సు- 
తేటగీతి (మొదటి పాదం మొదటి గణం మొదటి అక్షరం 'వ', రెండవ పాదం రెండవ గణం మొదటి అక్షరం 'ర', మూడవ పాదం మూడవ గణం మొదటి అక్షరం 'ల', నాల్గవ పాదం నాల్గవ గణం మొదటి అక్షరం 'క్ష్మి/క్ష్మీ' ఉండాలి).

(లేదా...)

చంపకమాల (మొదటి పాదం 1వ అక్షరం 'వ', రెండవ పాదం 6వ అక్షరం 'ర', మూడవ పాదం 12వ అక్షరం 'ల', నాల్గవ పాదం 18వ అక్షరం 'క్ష్మి' ఉండాలి).

102 కామెంట్‌లు:

 1. మైలవరపు వారి పూరణ

  వరము శ్రావణమాసమ్ము ! వనితలార !
  అమ్మ రక్షించి సౌభాగ్యమందఁజేయు
  భక్తి గొలిచిన ., లభియించు వరములెన్నొ !
  శ్రీకరమ్మగును వరలక్ష్మీవ్రతమ్ము !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరమగు శ్రావణమ్ము !శుభవర్షములన్ గురిపించు ! తల్లియే
   కరుణఁ గనన్ రహించు శుభకార్యములెన్నొ గృహమ్ములందు శ్రీ
   హరిహృదయాధివాసిని భయాలను దీర్చును., నిల్చు కొంగుబం
   గరమన., నమ్మ మ్రొక్కుడు ! సుఖమ్ములకై వరలక్ష్మిఁ గొల్వుడీ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. వరదిగిభరాట్కరోన్ముక్తవారిసిక్త
   దివ్యరమణీయమూర్ధవౌ దేవి ! భాగ్య
   వర్షములనిడు లక్ష్మివే! వరములిడవె !
   శ్రీహరిప్రియవు! వరలక్ష్మి ! నుతిఁ గొనుమ !

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. మైలవరపు వారి మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. వరదిగిభరాట్కరోన్ముక్తవారిసిక్త
   దివ్యరమణీయమూర్ధవౌ దేవి ! భాగ్య
   వర్షములనిడు లక్ష్మివే! వరములిడవె !
   శ్రీహరిప్రియవు! వరలక్ష్మి ! నుతిఁ గొనుమ !

   వర కరి హస్త కాంచన విభాసిత కుంభ కృతాభిషేకవై
   పరమదయారసాంబుపరివర్ధితసజ్జనభాగ్యరాశివై !
   సరసిజపీఠ సంగత విశాల కుసుంభ నిభాంబర ప్రభన్
   వరములనిచ్చి బ్రోచు భృగువంశజ ! శ్రీ వరలక్ష్మి ! సన్నుతుల్ !

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 2. (మైలవరపు మురళీకృష్ణ గారికి ధన్యవాదాలతో...)

  'వ'రమిదె శ్రావణ మ్మగును భామిను లెల్ల వ్రతంబుఁ జేసినన్
  వర మిడు క్షీ'ర'సాగరుని పట్టివి, సంపద లెల్ల నిత్తువే
  నిరతము భక్తితోఁ గొలువ నీ'ల' పయోధర వర్ణు రాణి! చె
  చ్చెర శుభసౌఖ్యముల్ బొనరఁ జేయుదువే వరల'క్ష్మి'! మ్రొక్కెదన్.

  రిప్లయితొలగించండి
 3. వజ్రసింహాసనాసీన ! పద్మగంధి !
  విష్ణురమణీమణీ ! దేవి ! విశ్వజనని !
  హసితవికసితలసితస్మితాస్య ! కమల !
  క్షీరసాగరజ ! జయలక్ష్మి ! దయ గనుము !

  రిప్లయితొలగించండి
 4. వసుధ శ్రావణమాసమ్మువాసికెక్కె

  సిరుల రమణిఁ. గొల్వగ నందు శ్రేయ మొదవు

  సౌఖ్యసౌభాగ్యలసితప్రశాంతులార !

  చేరి భజయింపగ ధనలక్ష్మి నిడు వరము

  కంజర్ల. రామాచార్య..

  రిప్లయితొలగించండి

 5. శుభాకాంక్షలతో


  వరములను కోరుచు మురిసి వరుస గాను
  కొలిచి రవణము చెందుచు కోరికల క
  లలను తేలుచు లబ్ధియె లక్ష్యముగను
  చింతనల జేయనేల లక్ష్మీ! జిలేబి !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. వరముల నొసంగు తల్లి యా వనధి పుత్రి
  రండి రమణులార మొదట లక్ష్మిని భజి
  యించ కరమగు లలితోడ, నింపు గూర్చు
  ద్రవ్యముల నిచ్చి తప్పక లక్ష్మి మనకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాలుగవ పాదంలో నాలుగవ గణం మొదటి అక్షరం 'క్ష్మి' ఉండాలి. మీరు రెండవ అక్షరంగా వేసారు. "ద్రవ్యముల నిచ్చి ప్రోచు లక్ష్మియె మనలను" అందామా?

   తొలగించండి
  2. గురువర్యుల సవరణకు ధన్యవాదములు.
   తే: వరముల నొసంగు తల్లి యా వనధి పుత్రి
   రండి రమణులార మొదట లక్ష్మిని భజి
   యించ కరమగు లలితోడ, నింపు గూర్చు
   ద్రవ్యముల నిచ్చి ప్రోచు లక్ష్మియె మనలను

   తొలగించండి
 7. వరుసగ నిమ్ము మాకు శుభ వర్తన నర్తన సంపదాళి,స
  త్వరముగ సారసాక్షులును భవ్య సుపూజ్య సుగంధ ద్రవ్య సం
  భరితపు దివ్య పుష్పముల,పాల,విశేష మహోత్సుకంబునన్
  వరమతి భక్తి భావము భాసుర లక్ష్మి!మదంబ!గొల్వరే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాలుగవ పాదంలో గణదోషం. న్యస్తాక్షరం స్థానభ్రంశమయింది. "భక్తిభావమున భాసుర రూపిణి లక్ష్మి గొల్వరే" అందామా?

   తొలగించండి


 8. వరముల నెల్ల వేళల కవాటపు చేరువ నిల్చి కోరుటే
  ల రమణి సార పక్షి వలె? లబ్ధియె లక్ష్యమకో జిలేబి? నీ
  దు రవణ మెల్ల దంధనము! దూల సుమా! జగదాంబ నీదు త
  ల్లి! రయత నీకు జేర్చు తను లివ్వగురీతి!అలక్ష్మి నివ్వదే!


  శుభాకాంక్షలతో

  జిలేబి

  రిప్లయితొలగించండి

 9. (వ)రము లిచ్చియు కాపాడు వసుధ జనుల
  కరువు (ర)క్కసి బోద్రోలు కరణ తోడ
  వివిధ సౌఖ్యము (ల)నుగూర్చు వేనవేలు
  క్షేమమును గూర్చగ వరల(క్ష్మి) నిను గొలుతు!

  రిప్లయితొలగించండి
 10. వరము లిచ్చెడి తల్లికి వంద నములు
  కాచి రక్షించి శుభమిడి గావు మమ్మ
  రమణి నీమ్రోల మ్రొక్కితి లక్షణ ముగను
  క్షీర సాగర తనయ లక్ష్మీసుగాత్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో న్యస్తాక్షరం స్థానభ్రంశం చెందింది. "రమణి నీదు మ్రోల నిలుతు లక్షణముగను" అందామా?

   తొలగించండి
  2. వరము లిచ్చెడి తల్లికి వంద నములు
   కాచి రక్షించి శుభమిడి గావు మమ్మ
   రమణి నీదుమ్రోల నిలుతు లక్షణ ముగను
   క్షీర సాగర తనయ లక్ష్మీసుగాత్రి

   తొలగించండి
 11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  నేటి అంశము :: న్యస్తాక్షరి (58)
  విషయము :: వరలక్ష్మీ స్తుతి
  ఛందస్సు :: చంపకమాల
  (మొదటి పాదం 1వ అక్షరం 'వ',
  రెండవ పాదం 6వ అక్షరం 'ర',
  మూడవ పాదం 12వ అక్షరం 'ల',
  నాల్గవ పాదం 18వ అక్షరం 'క్ష్మి' ఉండాలి).
  సందర్భం :: వరలక్ష్మీ వ్రతము స్త్రీలకు సర్వ సౌభాగ్యములను అందజేసే వ్రతము అని సూతమహర్షి శౌనకాది మహర్షులకు తెలియజేస్తూ ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్ల పక్షానికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసికొనాలి అని వివరించినాడు.
  ఓ వర లక్ష్మీ! శ్రీహరిప్రియా! ఓ సౌభాగ్య లక్ష్మీ! నీవు వరాలిచ్చే తల్లివి. భక్తుల పాలిటి కల్పవల్లివి. నీ వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో చేస్తున్నాను. మమ్ము పాలించేందుకు సంతోషంగా మా ఇంటికి రావమ్మా మహాలక్ష్మీ! మా ఇంటిలో స్థిరంగా ఉండవమ్మా! సంపదలను అనుగ్రహించవమ్మా! అని వరలక్ష్మీ దేవిని స్తుతిస్తూ ప్రార్థించే సందర్భం.

  వరముల నిచ్చు తల్లి ! వర భక్తుల పాలిటి కల్పవల్లి! సం
  బరమున చేర రమ్ము, మము పాలన జేయుము, మా గృహమ్మునన్
  స్థిరముగ నుండుమా సతము, శ్రీల నొసంగుము శ్రీ హరిప్రియా !
  చిర తర భక్తి నీ వ్రతము జేసెద, శ్రీ వరలక్ష్మి ! భాగ్యదా !
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (24-8-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. సవరణతో
   గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
   నేటి అంశము :: న్యస్తాక్షరి (58)
   విషయము :: వరలక్ష్మీ స్తుతి
   ఛందస్సు :: చంపకమాల
   (మొదటి పాదం 1వ అక్షరం 'వ',
   రెండవ పాదం 6వ అక్షరం 'ర',
   మూడవ పాదం 12వ అక్షరం 'ల',
   నాల్గవ పాదం 18వ అక్షరం 'క్ష్మి' ఉండాలి).
   సందర్భం :: వరలక్ష్మీ వ్రతము స్త్రీలకు సర్వ సౌభాగ్యములను అందజేసే వ్రతము అని సూతమహర్షి శౌనకాది మహర్షులకు తెలియజేస్తూ ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్ల పక్షం లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసికొనాలి అని వివరించినాడు.
   ఓ వర లక్ష్మీ! శ్రీహరిప్రియా! ఓ సౌభాగ్య లక్ష్మీ! నీవు వరాలిచ్చే తల్లివి. భక్తుల పాలిటి కల్పవల్లివి. నీ వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో చేస్తున్నాను. మమ్ము పాలించేందుకు సంతోషంగా మా ఇంటికి రావమ్మా మహాలక్ష్మీ! మా ఇంటిలో స్థిరంగా ఉండవమ్మా! సంపదలను అనుగ్రహించవమ్మా! అని వరలక్ష్మీ దేవిని స్తుతిస్తూ ప్రార్థించే సందర్భం.

   వరముల నిచ్చు తల్లి ! వర భక్తుల పాలిటి కల్పవల్లి! సం
   బరమున చేర రమ్ము, మము పాలన జేయుము, మా గృహమ్మునన్
   స్థిరముగ నుండుమా సతము, శ్రీల నొసంగుము శ్రీ హరిప్రియా !
   చిర తర భక్తి నీ వ్రతము జేసెద, శ్రీ వరలక్ష్మి ! భాగ్యదా !
   కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (24-8-2018)

   తొలగించండి
 12. వరము ల నొసగు తల్లి ని భక్తి మీర
  కొలువ రమణులు బూని యు కోర్కె తోడ
  రక రకం పు పూల నలంకర ణ ము జేసి
  చేరి పూజ లొ నర్త్రు లక్ష్మీ వ్రతాన
  _______కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పారు. కాని ఇచ్చిన స్తుతి వరలక్ష్మీస్తుతి.

   తొలగించండి
 13. వసుధ జనులెల్ల తలతురే వాసిగాను
  నీదు రమణీయ నామమ్ము నెల్ల వేళ
  హరిమనోహరి లలితాంగి యాదుకొనుమ
  చేరి కొలుతుమిక వరలక్ష్మి పదములను

  రిప్లయితొలగించండి
 14. వత్సరంబున కొక మారు వచ్చునట్టి
  జనని రమ కాచు చుండును సంతసముగ
  మమ్ము నెప్పుడు, లపక కోసమ్ము మేము
  చేతుము సతము సనిని లక్ష్మి దయ గోరి
  సని = పూజ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణసూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   లక్ష్మీ స్తుతి ఏది?

   తొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వరముల నిడెడి మాతవు పద్మవాస
  మమ్ము రక్షించి దయతోడ మనుపు మమ్మ
  సతము నీపూజలను సల్పి సాగు చుండు
  సేవకులము మానుతులు లక్ష్మి కొనుమమ్మ

  రిప్లయితొలగించండి
 16. వనితలు శుక్రవారమున భర్తల క్షేమముఁగోరి శ్రావణం
  బున మనసారనీదు వ్రతమున్ సలుపున్ తగు భక్తితోడ, దీ
  వెనలిడి వారిఁ బ్రోతువని వేలకు వేలుగ మ్రొక్కు నీకు పా
  వన చరితా! మురారి సతి! వందనముల్ వరలక్ష్మి కావుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వ్రతమున్ సలుపన్' అనండి.

   తొలగించండి
 17. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  " వ- ర - ల - క్ష్మీ " వరుసగా ఈ
  అక్షరాలను మొదటి పాదములో
  మొదటి ,రెండవ పాదంలో రెండవ,
  మూడవ పాదంలో మూడవ,నాల్గవ
  పాదంలో నాల్గవ అక్షరంగా వచ్చునట్లు
  వరలక్ష్మి స్తుతి చేయవలెను
  ==========================
  న్యస్తాక్షరి - 6
  ===========

  వరముగ సంపదల ప్రాప్తి
  అర్థార్థులు అనిపించు
  వరమై సద్బుద్ది చేరగ
  సత్కర్మల మొలిపించు
  వరాల తల్లిని కోరుము
  స్వఛ్ఛ మనసు కలిగించు
  వరలక్ష్మియె తానుగ మనకై
  వరములను కురిపించు

  ====##$##====

  గీతాచార్యుడి వివరణలో భక్తులు
  నాలుగు రకములు. 1.అర్తులు 2 అర్థార్థులు
  3.జిజ్ఞాసువులు4.జ్ఞానులు.సమాజమునకు
  అన్వయింప 90% గా భక్తులు అర్థార్థులు
  గానే కొనసాగుతున్నారు.

  " నా కర్మల ఫలంగా గాక , నన్ను ప్రత్యేక
  దృష్టితో చూసి నాకు సంపదలను ప్రాప్తింప
  చేసిన ,నీ ఋణమెంతమాత్రం ఉంచుకోక
  ముడుపులు చెల్లించుకుంటాను"- ఒకానొక
  అర్థార్థుడి అంగలార్పు.

  నిజము చేదైనను ప్రస్తావించుకొనవలె.
  "ఓ తల్లి వరలక్ష్మి నాకు సద్బుద్ది ప్రసాదించు
  తత్ఫలితంగా నాచే సత్కర్మలు ఆచరించ
  బడి సంపదలు వాటికవె సమకూరును "
  యని వరలక్ష్మి వ్రతమాచరించు వారిలో
  కేవలం 10% భక్తులు మాత్రమే ఇలాంటి
  ప్రార్థనలు చేస్తారని భావము.

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  --- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
 18. వరముల నిచ్చు తల్లివని వాసిగ గొల్చెడు భక్తులన్ గనన్
  ధరణిని జేర రమ్మికనుదాకర పుత్రి వృషాక పాయి శ్రీ
  హరి హృదయమ్మదే సతత మాలయమై విలసిల్లు మాతరో
  సురగణ పూజితాగ్రణి వసుంధర హే వరలక్ష్మి గావుమా!

  రిప్లయితొలగించండి
 19. వరలిన హర్యురస్స్థిరనివాసమనోజ్ఞకృపాకరత్వమున్

  నెరయగ , క్షీరసాగరజనిత్వలసజ్జగదాధిపత్యమున్ ,

  బరివృతదివ్యదాస్య,పతిపాలనశోభనదోహదత్వమున్ ,

  బరగు రమన్ భజించు , సిరి ప్రాప్తిలు , చిత్తమె సాక్షి యొప్పగన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి

 20. వరము లనొసగెడి జనని వార్ధి పుత్రి
  వేగ రక్షించి కాపాడు విశ్వజనుల

  భక్తితో గొల్వ లలితోడ భాగ్య మంద
  స్తీలు భక్తి జేసెదరు లక్ష్మీవ్రతంబు.

  రిప్లయితొలగించండి
 21. వరముల నొసంగు లక్ష్మి యిద్ధర విశదమ
  గును గరము వరలక్ష్మి నాఁ గువలనేత్ర
  పూజ సేయఁగ లలనలు బుద్ధి నుంత్రు
  చేరి కాపాడు సతము లక్ష్మి యని భక్తి


  వనజ దళాయతాక్షి నిజ భక్తజనావన సత్క్రియా రతై
  క నిజ మనోరథప్రకర కంజ ముఖాంబుజ వారిరాశి సం
  జనిత రమాభిధాన విలసల్లలితాంబుజ హస్త హస్తి భా
  జన జల భాసమాన శిర చక్రధరాంగన లక్ష్మిఁ దల్చెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. దీర్ఘసమాసయుక్తమైన ధారతో వెలయించిన మీ ద్వితీయపద్య మద్భుతంగా ఉన్నదండీ! అభినందనలు!

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   కవిపుంగవులు మధుసూదన్ గారు ధన్యోస్మి.

   తొలగించండి
 22. గు రు మూ ర్తి ఆచారి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,, ‌‌‌


  వరము లిచ్చును , మనకు సంపదల నిచ్చు

  సాగర తనూజఁ బ్రార్థింప సవినయముగ |

  క్రమవిధానముల గడింప గలసి వచ్చు ,

  సిరుల గుప్పించు సతము లక్ష్మీ లలామ

  రిప్లయితొలగించండి
 23. మిత్రులందఱకు శ్రీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!

  "వ"రము లొసంగు తల్లి! రమ! పద్మగృహా! దయఁ జూడు మమ్మరో!
  సిరి! మనసా"ర" మమ్ముఁ గని, శ్రీల నొసంగవె విష్ణువల్లభా!
  కరము భజింతు మో జలధి కన్య "ల"లిన్ గృతులెన్నొ వ్రాసియున్!
  మురిసెద మమ్మ పాడుకొని ముచ్చటగా వరల"క్ష్మి" నిచ్చలున్!

  రిప్లయితొలగించండి
 24. వనితల పూజకు న్ దని సి వాంఛలు దీర్తువు విష్ణు పత్ని వై
  జనహిత కారకం బగుచు సంతస భాగ్య ము నిచ్చు తల్లి వై
  ఘన మగు శాంతి జీవన సుఖాలనొసo గేడు సౌమ్య మూర్తి వై
  వినుతు ల జేసి వే డ గ నె ప్రీతి గ గాచు ను లక్ష్మి యెల్ల ర న్
  ______కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రీతిగ గాచెదె' అనండి.

   తొలగించండి
 25. వరము లొసగెడి మాతరో వందన మిదె
  కరి వరదు రాణి శ్రీ దేవి కల్పవల్లి
  విష్ణుసతి, రమ, లక్ష్మిగ విమల చరిత
  క్షితిని దీవించుము వరలక్ష్మిగ జనులను

  రిప్లయితొలగించండి
 26. వరములొలసి శ్రావణ శుక్రవారమందు
  సర్వ రకముల సంపద సౌభగముల
  దాపుమని నోములనియతి తప్పకుండ
  మిక్కిలి రహితోడ వరలక్ష్మిని కొలిచెద

  రిప్లయితొలగించండి
 27. తే.గీ.
  'వ'రద! భాగ్యమ్ము నీయవే భజన జేతు
  మాదు 'ర'క్షణ జేయవే మహిమఁ జూపి
  సిరుల సంపద'ల' నిడుమ సిలుగు బాపి
  క్షేమ ములనీయవె జయల'క్ష్మి'! మము బ్రోచి

  సిలుగు = ఆపద, ఉపద్రవము

  రిప్లయితొలగించండి


 28. *తే.గీ**

  వరములీయగా రావమ్మ వసుధ పైకి
  మమ్ము రక్షించి కాచెడి మాతనీవె
  సతము నిన్నే కొలచెదము శరణుదల్లి
  కినుక జూపకమ్మ వరలక్ష్మీ లలామ
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి
 29. వసుధకార్థికమందించ వరలు లక్ష్మి
  ప్రజలరక్షణ జేకూర్చు భాగ్యలక్ష్మి
  పూజ సేయగ లభ్యమౌపుణ్యమనుచు
  చింతమాన్పు పూజించ?లక్ష్మి వ్రతమందు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కార్తిక' టైపాటు.

   తొలగించండి
 30. వననిధికన్యకాజలజవాసవిరాజితసుందరాకృతిన్

  దనరిన శ్రీరమారమణి ధార్మికరక్షణదుష్టశిక్షలో

  ఘనతరమూర్తిమత్త్వలతికాలలనామణికీర్తి నొందుచున్

  దనియగ నిచ్చుఁ, జేయు మిక ధ్యానమెదన్ వరలక్ష్మి శ్రీదయై.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 31. వరమునిచ్చెడుతల్లికాబట్టియండ్రు
  నిన్నురతనాలయమ్మనినిజముగాను
  మమ్ముకాపాడులక్ష్శమ్మ!మదినినిండ
  మీదుమిక్కిలి దయనునిక్షిప్తపరచి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అమ్మ + అని' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి
 32. వరములనిడు శ్రావణమున సురదనలకు
  సురుచిర దరహాసిని సిరి, మరునియంబ
  భక్తిగవ్రతము ఘటించ లక్షణముగ
  క్షేమమొసగు తల్లి వరలక్ష్మి కరుణించి!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. యతిదోషం. "భక్తిగ వ్రతమును ఘటింప భవ్యముగను" అందామా?

   తొలగించండి
 33. వరగుణశోభితా! వరద! వారిజవాసిని! వారిజేక్షణా!
  వరవదనారవింద! వరవర్ణిని! వార్ధిసుతా! వరాంగనా!
  వరనిజభక్తకోటిపరిపాలనదివ్యకళావిశారదా!
  వరకమలాసనాహరిశివార్చ్యపదా! వరలక్ష్మి! సన్నుతుల్.

  రిప్లయితొలగించండి
 34. వరద! భక్తాభయప్రదా! బ్రహ్మవిష్ణు
  శివసురగణాధిపార్చిత! శీఘ్రఫలద!
  హరిహృదయనిజాలయ!రమా!హరిణి!దేవి!
  లలితవదనాబ్జ! శ్రీవరలక్ష్మి! నతులు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   సంబోధనల నాశ్రయించి అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 35. వర్దమానుని దేవేరి వరము లిమ్ము ,
  మాత!రమ!పద్మ లాంచన! మరుని యంబ!
  కలిమి గుబ్బెత! లంబ! శ్రీ!చల! జలదిజ!
  సిరుల నీయవమ్మ వర లక్ష్మి నిరతమ్ము

  రిప్లయితొలగించండి
 36. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂న్యస్తాక్షరి🤷‍♀....................
  అంశము - వరలక్ష్మీ స్తుతి
  ఛందస్సు- తేటగీతి
  1 వ పాదం 1 వ గణం 1 వ అక్షరం 'వ',
  2 వ పాదం 2 వ గణం 1 వ అక్షరం 'ర',
  3 వ పాదం 3 వ గణం 1వ అక్షరం 'ల',
  4 వ పాదం 4 వ గణం 1 వ అక్షరం 'క్ష్మి/క్ష్మీ' ఉండాలి.

  సందర్భము: లక్ష్మీదేవిని అష్టలక్ష్మీ స్వరూపాలుగా స్తుతించడం ప్రసిద్ధమే! ఆ రూపా లివి.
  1.ఆది 2.గజ 3.ధైర్య 4.ధన 5.విద్యా 6.విజయ 7.సంతాన 8.ధాన్య లక్ష్మీ రూపాలు.
  అవి ఈ పద్యంలో పేర్కొనబడ్డాయి.
  *రత్నలక్ష్మి* అనే పేరుతో కొల్లాపూర్ (జటప్రోలు) సంస్థాన ప్రాంతీయులు లక్ష్మీదేవిని పిలుచుకుంటారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రమైన *సింగవట్నం* లో లక్ష్మీదేవి పేరు రత్నలక్ష్మీదేవి.
  శ్రీ కపిలవాయి లింగమూర్తి గారు రచించిన "పాలమూరు జిల్లా దేవాలయాలు" గ్రంథంలోను యీ ప్రసక్తి యున్నది.
  శ్రీ తమటం రేణుబాబు గౌడు గారు రచించిన "సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శతకం"లోను.. శ్రీ వేదార్థం మధుసూదనశర్మ గారు రచించిన "కొల్లాపూర్ సాహితీ వైభవం" అనే పుస్తకానికి "సాహితీ స్నేహలత.." అనే పేరుతో నేను వ్రాసిన పీఠికలోను.. యీ ప్రసక్తి కనిపిస్తుంది.
  ==============================
  *వ* రద! ధనలక్ష్మి! గజలక్ష్మి! పద్మ! ధైర్య
  లక్ష్మి! *ర* త్న లక్ష్మీ! ధాన్య లక్ష్మి! ఆది
  లక్ష్మి! సంతాన *ల* క్ష్మి! శ్రీ లక్ష్మి! జ్ఞాన
  మిచ్చు శుభ లక్ష్మి! విజయ ల *క్ష్మి* ! వర లక్ష్మి!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  24-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 37. వందనమ్మోడ్తు నోతల్లి వాసిగాను
  మంధిరతనూజ నీపాద మందు వ్రాలి
  వేదనలు బాపి లలితాంగి యాదుకొనగ
  సిరుల నివ్వవమ్మ వరలక్ష్మి ముదముగను.

  రిప్లయితొలగించండి
 38. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂న్యస్తాక్షరి🤷‍♀....................
  *చంపకమాల*
  మొదటి పాదం 1వ అక్షరం 'వ',
  రెండవ పాదం 6వ అక్షరం 'ర',
  మూడవ పాదం 12వ అక్షరం 'ల',
  నాల్గవ పాదం 18వ అక్షరం 'క్ష్మి' .

  సందర్భము: ఒక భక్తురాలు ఇలా అంటున్నది.
  "నీవు వరాలిచ్చి పత్తా లేకుండా వెళ్ళిపోతావు తల్లీ! మరుక్షణంలో నా మనస్సులోనేమో బోలెడన్ని కోర్కెలు పుట్టుకొస్తాయి మళ్ళీ. మొహమాటంచేతనో జంకు చేతనో నేను నిన్ను మళ్ళీ పిలువలేను. (నీ కెక్కువ శ్రమ నీయడం నా కిష్టం లేదు మరి.) అప్పు డెట్లా!"
  ==============================
  *వ* రములు మాకు నిత్తు వని
  వాసిగ నిన్ గొనియాడుచుందురే!
  వరములు గో *ర* నాకు నిడి
  పక్కకుఁ బోవగ నీవు.. పుట్టవే
  చరచర కొత్తకొత్త విటు
  చా *ల* గ నా మదిఁ గోర్కె.. లింక నిన్
  మరలగఁ బిల్వజాలను సుమా!
  యెటులే! వరల *క్ష్మి* ! చెప్పవే!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  24-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 39. కవిమిత్రులకు నమస్సులు.
  ఈరోజు ఒక కవిమిత్రుడు ఫోన్ చేసి అడిగాడు... "మీరు కవుల పూరణలను చదివి 'అద్భుతంగా ఉన్నది, మనోహరంగా ఉన్నది, ప్రశస్తంగా ఉన్నది, బాగున్నది' అని వేరువేరుగా స్పందిస్తున్నారు. ఇలా చెప్పడానికి ఏమైనా కొలమానాలున్నాయా? కొందరు ప్రత్యేక వ్యక్తుల పూరణలను 'అద్భుతంగా, ప్రశస్తంగా' ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇతరుల పద్యాలు కూడా బ్రహ్మాండంగా ఉంటున్నాయి. అయినా మీరు సరిగా స్పందించడం లేదు. ఎందుకు?" అని.
  నిజానికి అటువంటి కొలమానాలు ఏవీ లేవు. అందరి పట్లా నాకు సమాన దృష్టి ఉన్నది. నాకు ఎవ్వరూ ఎక్కువ, తక్కువ కాదు. ఆ సమయంలో తోచిన రీతిగా వ్యాఖ్యానిస్తున్నాను. ఎలాంటి పక్షపాతం నా మనస్సులో లేదని గమనించమని మనవి.
  ఇకనుండి అందరి పూరణపై "మీ పూరణ బాగున్నది. అభినందనలు" అని ఆ తర్వాత ఆ పద్యాలలోని గుణదోషాలను సమీక్షిస్తాను. మిత్రులు సహృదయంతో నా ఇబ్బందిని గమనించి సహకరిస్తారని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాన్యులు శంకరయ్య గారికి నమస్సులు! మీ నిష్పక్షపాత ధోరణి మొదటినుండియు నేనెఱిగినదే! ఎన్నడును పక్షపాతమును ప్రదర్శించని మీరు, ఎవరో ఫోన్‍లో ఏదో అడిగారని మీ దృక్పథాన్ని మార్చుకోనవసరం లేదని నా కనిపిస్తున్నది. "లోకోబిన్న రుచిః" అన్నారు పెద్దలు. ఒకరికి పప్పు రుచిగా అనిపిస్తే, ఇంకొకరికి వంకాయ కూర రుచిగా అనిపించవచ్చును. మరొకరికి మాంసాహారం రుచిగా అనిపించవచ్చును. అంతమాత్రమున అందరికీ ఇవన్నీ రుచిగా నన్నట్లు తోపకపోవచ్చును. ఎవరి రుచి వారిది. మీకు బాగా అనిపించిన భావాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. మీ కద్భుతంగా తోచిన పద్యం మరొకరికి బాగా అనిపించకపోవచ్చును. అది వారి వారి దృక్కోణమును బట్టి, సంస్కారమును బట్టి ఉంటుంది. కాబట్టి మీరు మీ సహజ సిద్ధమైన అభిప్రాయ ప్రకటనను మార్చుకోవలసిన అవసరం లేదని నా కనిపిస్తున్నది. మునుపటి వలెనే అందరి పద్యాలను మీ మనస్సుతో తూకము వేస్తూ మీ అభినందన వాక్యములను తెలుపగలరని మనవి.

   తొలగించండి
 40. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు.

  తేటగీతి
  వలచి మనువాడ విష్ణువు వార్ధి సుతగ
  పతి ధరఁ బ్రజను పోషించు బాధ్యతెరిగి
  నిలచి షట్కర్మల హరికి నెచ్చెలివిగ
  సృష్టి కాదర్శపు వరలక్ష్మీ! నమోస్తు

  రిప్లయితొలగించండి


 41. వరములను వేడ లలనలు వాసిగాను
  నంతరములు వీడుచు నెల్ల రవని యందు
  పూజలన్ముద మున జేయ మురిసి పోయి
  శ్రీలు గురిపింప నెంచిలక్ష్మి యరుదెంచె
  హారతులిడగరండిక నతివ లార.

  రిప్లయితొలగించండి
 42. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂న్యస్తాక్షరి🤷‍♀....................
  అంశము - వరలక్ష్మీ స్తుతి
  ఛందస్సు- తేటగీతి
  1 వ పాదం 1 వ గణం 1 వ అక్షరం 'వ',
  2 వ పాదం 2 వ గణం 1 వ అక్షరం 'ర',
  3 వ పాదం 3 వ గణం 1వ అక్షరం 'ల',
  4 వ పాదం 4 వ గణం 1 వ అక్షరం 'క్ష్మి/క్ష్మీ'.

  సందర్భము: తల్లీ!ఇంటి తలుపు లన్నీ తెఱచి వుంచింది మా శ్రీమతి వరలక్ష్మీ వ్రతం నాడు నీవు (సశరీరంగా) వస్తా వనే ఆశతో..
  చిత్ర మేమంటే దోమలు మాత్రం ఎంచక్కా బిలబిల మంటూ సంబరంగా వచ్చేశాయి బోలెడన్ని.
  (అవి సశరీరంగానే రాగలవు కదా!)
  ==============================
  *వ* త్తు వని నీవు... తలుపులు బార్ల తెఱచె
  నింతి... *ర* మ్మనకే దోమ లెన్నియో స
  లక్షణముగ లీ *ల* గ వచ్చె... రక్ష సేయ
  వే! హరింపవె భీతి! ల *క్ష్మీ*! హరి ప్రియ!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  24-8-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 43. వరములను వేడ లలనలు వాసిగాను
  నంతరములు వీడుచు నెల్ల రవని యందు
  పూజచేయంగ లక్ష్మితా మురిసి పోయి
  శ్రీలు గురిపింప నెంచిలక్ష్మి యరుదెంచె
  హారతులిడగరండిక నతివ లార

  రిప్లయితొలగించండి
 44. గురువర్యులకు నమస్సులు. వారి పద్యాలను పొగిడితే పాదాభివందనం అంటూ, లోపాలను ఎత్తి చూపితే సహించలేని ధూర్తులు కొంత మంది ఉంటారు. వాళ్ళ మాటలను పెడచెవిని పెట్టండి. నిష్కల్మషంగా పవిత్రమైన మనసుతో మీరు సూచించే సవరణలు మాకందరికీ అమోదయోగ్యములు. మీ సూచన సరియైనది కాదు అనితలచినప్పుడు మీరు కవిమిత్రులను మన్నించండి అని చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. జిహ్వకొక రుచి పుర్రెకొక బుద్ధి అంటారు. మీరు కూడా మానవమాత్రులు. ఆసమయంలో మీ మనస్సు లో కలిగిన స్పందన అకవి పద్యం మీద వ్యక్తం అవుతుంది. ఆదుర్తి సుబ్బారావు లాంటి దర్శకుడు హేమమానిని నువ్వు హీరోయిన్ గా పనికిరావంటే హిందీ సినిమాలలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. పై విషయమును బట్టి దర్శకుని ప్రతిభను బేరీజు వేయలేము కదా. మీ నిష్పక్షపాత వైఖరి శంకరాభరణం బ్లాగులో వ్రాస్తున్న కవి మిత్రులందరికి తెలుసు. మీరు మీ వైఖరి మర్చుకోవద్దు. మీ అంతరాత్మ ప్రబోధమును బట్టి పయనించండి. మేమందరమూ ఎల్లప్పుడూ మీకు వెన్నుదన్నుగా ఉంటాము. యధావిధంగా మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి. మీ వైఖరి నచ్చని వాళ్ళను వైదొలగి పొమ్మని సవినయంగా ప్రార్థిస్తున్నాను. నెట్ లో చాలా బ్లాగులు వున్నవి. వెళ్లి అక్కడ వ్రాసుకోవచ్చు. లేకపోతే వాళ్ళే క్రొత్త బ్లాగు పెట్టి నడుపుకోవచ్చు. నిచ్చలంగా కదిలే నీటిపై రాళ్ళను వేయవద్దని మనవి చేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 45. వలదు మాపైన కోపమే వలదు తల్లి
  రమ్ము రయమున వరములు కుమ్మరించు
  గొంతులెత్తి పిలచెదము కోర్కె తీర్చు !
  క్షితిన సుఖముల దేల్చు లక్ష్మీవి నీవె!

  రిప్లయితొలగించండి