14, జులై 2025, సోమవారం

సమస్య - 5182

15-7-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వారసుఁ గన నెంచఁ జేరె దాయ”

(లేదా...)

“వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే”

(పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

10 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    బాలకృష్ణుఁ జంపఁ బంపించ కంసుండు
    నందమైనరూపునతివయౌచు
    పూతన విషకుంభపుటెదతో మధురకున్
    వారసుఁ గన నెంచఁ జేరె దాయ!

    ఉత్పలమాల
    కోరఁగ సాయమున్ హరిని, కూర్చొనఁజాలక పాద పీఠమున్
    కౌరవ రాజరాజు కొనె గౌరవ మంచును శీర్ష పీఠమున్
    జేరియు మీదటన్ తొలుత చెల్లెను క్రీడియె! కృష్ణ ప్రేమకున్
    వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే!

    రిప్లయితొలగించండి
  2. పుత్ర పౌత్ర పంక్తి పొందని ధనికుడు
    బడెను వీలు నామ వ్రాయ కుండ ;
    చనిన వాని యాస్తి చక్కగ పొందెడు
    వారసుఁ గన నెంచఁ జేరె దాయ

    రిప్లయితొలగించండి
  3. *(హిరణ్య కశ్యపుడు నారదునితో పలికిన మాటలు)*

    అసుర జాతికెల్ల నధిపుడు వీడంచు
    నమ్మియుంటి నోయి నారద విను
    శత్రునామమెపుడు జపియించు చుండెనే
    వారసుఁ గన నెంచఁ జేరె దాయ


    ఫేరవ జాతి శ్వస్తనపు విట్పతి వీడని మోదమందితిన్
    నారద! నీలిరాగమున నాసుతు బెంచదలంచ నేమి దై
    త్యారిని స్మరియించుచు నతండిట ప్రక్కన బల్లమయ్యె నే
    వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే.

    రిప్లయితొలగించండి
  4. శ్రీరస కావ్యనాయకుడుఁజేరెనయోధ్యకుఁ బత్నితోడఁకై
    వారములందగా నచటఁబట్టము గట్టిరి దేశవాసులున్,
    దారనుఁబంపివేసెగద ధర్మమటంచును రామమూర్తిఁనే
    వారసు రాకకై యెదురుపన్నుగ గాంచఁరిపుండుతోచెనే?
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  5. తనకు శత్రువైన తనమేనయల్లుని
    ప్రాణభీతిచేత బైసికొనఁగ
    చెఱను మ్రగ్గుచున్న చెల్లెలు దేవకి
    వారసుఁ గన నెంచఁ జేరె దాయ

    రిప్లయితొలగించండి
  6. కారణజన్ముడై భువిని కంసుని ద్రుంచగ ద్వాపరంబునన్
    కోరిజనించె కృష్ణునిగ కోమలి దేవకి గర్భమందునన్
    చారకమందునుంచి సహజన్ వసుదేవుల కక్కసమ్ముగా
    వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే

    రిప్లయితొలగించండి
  7. ఆ॥ ఆజి యందు రిపులు మోజుపడి సలుపఁ
    బ్రాణనష్టముఁ గని పరితపించఁ
    దప్పుఁ దెలిసి కొనుచుఁ దగు రీతి మసలఁగ
    వారసుఁ గన నెంచఁ జేరె దాయ

    ఉ॥ వీరులు వైరులిద్దరును భీకర యుద్ధము సల్పుచుండఁగన్
    బోరునఁ బ్రాణనష్టమును భూరిగఁ గాంచఁగఁ దల్లడిల్లుచున్
    మారిరి సఖ్యతా విలువ మన్నన సేయఁగ నెంచ నా విధిన్
    వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే!

    అశోకుడు కళింగ యుద్ధము తరువాత మారినటులనండి

    రిప్లయితొలగించండి
  8. ఉ.
    సారస సంభవ ప్రముద చారు కళాయుత కాంతకున్ వడిం
    దీరుగఁ బూజలన్ సలుప దీక్షగఁ జెన్ను కవిత్వ శక్తికై
    యూరిని చేరఁ దాను సుఖ యోగము వీడెను, నాదు కంటికిన్
    వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు దోచెనే !

    రిప్లయితొలగించండి
  9. స్థిర చరా స్తు లన్ని చెక్కు చెదర కుండ
    వీలు నామ వ్రాయ వెదుకు చుండ
    కలుగ లేదు దనకు కలిమి బొంద గలుగు
    వార సు గన నెంచ జేరె దాయ

    రిప్లయితొలగించండి
  10. వేగమె తొలివేల్పు విద్యను నేర్వ నౌ
    రసుని బంపెగద హిరణ్య కశిపు
    డే! హరిని భజించు డింగరి తోననె
    వారసుఁ గన నెంచఁ జేరె దాయ

    వేరము రాక్షసోచితపు విద్యను నేర్వగఁ బంపె పుత్రునిన్
    బోరనఁ జెప్పమంచు దితి పుత్రుడు కోరెను దీర్ఘదర్శినే
    ఘోరముగా సుతుండు హరిఁ గొల్చుట కన్గొని బల్కెనిట్టులన్
    వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే

    రిప్లయితొలగించండి