ఉ॥ దూసెను కత్తి బాధలను ద్రుంచఁగ దీనుల కట్లు మెచ్చ శ్రీ శ్రీ సృజనాత్మకత్వపు విశిష్టత మేటియటంచు నాతఁడే వ్రాసెను ఖడ్గ సృష్టి కృతి, వంగకవీంద్రుఁడునౌ రవీంద్రుఁడే భాసుర మొప్ప తత్వ ధృతి భావన నింపి రచించె గొప్పగన్
ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ దేవులపల్లి బాధ ప్రపంచానికి బాధ (అని అనుకుంటాను) గుడిపాటి వెంకటాచలం గారేమో అన్నది. రబీంద్రుడు తత్వము (spirituality), సంగీతమునకు ప్రసిద్ధి అనుకుంటానండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెలుగు వారు మెచ్చ దివ్యుo డు శ్రీ శ్రీ యె
తొలగించండివ్రాసె ఖడ్గసృష్టి :: వంగ సుకవి
జాతి ఖ్యాతి బెంచ జాతీయ గీతమ్ము
వ్రాసి జగతి మిగుల వాసి గాంచె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవెలది
తొలగించండిఅల్లె ఖడ్గసృష్టి నధివాస్తవికతలన్
' శ్రీనివాసరావు' జ్ఞానియౌచు
చేతనఁ గొని చూడ 'గీతాంజలి' గ నాడె
వ్రాసె ఖడ్గసృష్టి వంగ సుకవి!
ఉత్పలమాల
వాసిఁగనంగఁ గూర్చె నధివాస్తవికత్వము 'ఖడ్గసృష్టి' గన్
భాసిల సాహితీ జగతి భాగ్యమనంగను శ్రీనివాసరా
వా సిరి నాంధ్రమే! మునుపె యంజలి గీతకునుత్తరంబుగన్
వ్రాసెను ఖడ్గసృష్టి కృతి వంగకవీంద్రుఁడునౌ రవీంద్రుఁడే!
(అంజలి గీతకునుత్తరంబుగన్ = గీతాంజలి)
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
రిప్లయితొలగించండిక్రొత్త పద్దతులను గూర్చి శ్రీ శ్రీగారు
వ్రాసె ఖడ్గసృష్టి ; వంగ సుకవి
గీతముల నమస్సు "గీతాంజలి" ని వ్రాసి
పేరు గాంచె మన రవీంద్ర వరుడు
ఉ.
రిప్లయితొలగించండిభాసుర విప్లవ ప్రకట భావ సముచ్చయ పూరితోద్ధతిన్
బాసను నేర్చి యాతడు ప్రభాతమునన్ రవి మాడ్కి మార్పుఁ దా
నాసను బుద్ధి నిల్పి వడి నాతత కావ్యత శక్తిచేఁ గలన్
వ్రాసెను ఖడ్గసృష్టి కృతి వంగ కవీంద్రుడునౌ రవీంద్రుడే !
రిప్లయితొలగించండిస్నేహితుడను జేరి శ్రీశ్రీ రచించిన
కావ్యమొకటి తెలుపు ఘనుడవైన?
జనగణమన గీతమును వ్రాసి రెవరన
వ్రాసె ఖడ్గసృష్టి , వంగ సుకవి.
కోసుల దూరమేగి యనుకూలుర గూడుచు సంబరమ్మునన్
కాసులు గ్రుమ్మరించి యట కాశ్యము గ్రోలిన మత్తు తో నటన్
బాసటు లడ్గినంతటనె ప్రాజ్ఞుడ నంచు వచించె నిట్టులన్
వ్రాసెను ఖడ్గసృష్టి కృతి వంగకవీంద్రుఁడునౌ రవీంద్రుఁడే.
ఆ॥ విప్లవ పథమునటు విడువక శ్రీశ్రీయె
రిప్లయితొలగించండివ్రాసె ఖడ్గసృష్టి, వంగ సుకవి
విరియు తత్వవిధము విహిత మొప్పఁ బటిమ
రంగరించి నుడివె రమ్యమొదవ
ఉ॥ దూసెను కత్తి బాధలను ద్రుంచఁగ దీనుల కట్లు మెచ్చ శ్రీ
శ్రీ సృజనాత్మకత్వపు విశిష్టత మేటియటంచు నాతఁడే
వ్రాసెను ఖడ్గ సృష్టి కృతి, వంగకవీంద్రుఁడునౌ రవీంద్రుఁడే
భాసుర మొప్ప తత్వ ధృతి భావన నింపి రచించె గొప్పగన్
ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ దేవులపల్లి బాధ ప్రపంచానికి బాధ (అని అనుకుంటాను) గుడిపాటి వెంకటాచలం గారేమో అన్నది.
రబీంద్రుడు తత్వము (spirituality), సంగీతమునకు ప్రసిద్ధి అనుకుంటానండి.
రెండు శ్రీలు కలిగియుండు కవివరుడు
రిప్లయితొలగించండివ్రాసె ఖడ్గసృష్టి; వంగ సుకవి
కలముఁ జాలు వారి వెలసె గీతాంజలి
విశ్వ కవిగ నతడు వినుతికెక్క
భాసుర కావ్య సృష్టికిరవై శ్రమజీవుల గుండె లందు వి
శ్వాసము నింపునట్టి కవి శబ్దవిరించుడు శ్రీనివాసుడే
వ్రాసెను ఖడ్గసృష్టి కృతి; వంగకవీంద్రుఁడునౌ రవీంద్రుఁడే
వ్రాసెను విశ్వమంతయును ప్రాభవమొందిన పద్య కావ్యమే