19-7-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవనమున విరులు వికాసమందె”
(లేదా...)
“కవనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో”
చ.కవికుల శేఖరుల్ పొగడఁ గష్టమ కోకిల పంచమంబులం,బవన విశుద్ధ వాహినులు బచ్చని పత్ర తతిం గదిల్చె నద్రి వితత చంచరీకములు దీపిని కోఱె, వసంత భామ దూ క, వనమునన్ వికాసనమునుఁ గన్నవి మల్లెలు మోల్లలెన్నియో !
కువకువలాడు కోయిలల కూజితముల్ యెలమావి కొమ్మలన్నవనవలాడు పూ లతల నర్తనముల్ చిరుగాలి సోకఁగన్కవిహృదయాంతరాళమున కమ్మనియూహలు నింప నామనిన్కవనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో
ఆటవెలదివేడ్కఁగాంచ వెడల బృందావనమ్మునకృష్ణమూర్తిఁ గనక ఖేదమొందవేణునాదమలర వినిపించు శౌరి రాక, వనమున విరులు వికాసమందె!చంపకమాలప్రవిమల భక్తి భావముల రంజిలనాడుచు కృష్ణమూర్తికైస్తవముల గోపికల్ వెడల తన్మయమందగ గోకులమ్మునన్జవమున వేణునాదమది సంబరమొందగ నూదు శౌరి రాక, వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో
ఎండకాలమందు చండమునకు మల్లి క,వనమున విరులు వికాసమందెవాటినెల్ల జిదిమె వనిత , తనసిగలోముడుచు కొనుట యందు మోద మొంది
భువనములోన సర్వమును బూర్తిగమేల్కొనె నిద్రనుండి భూభవములు మారె బచ్చగను భవ్యమనోహరమొప్పె పృథ్వియున్గువకువ కూసె కోయిలలు కొమ్మలలోన వసంత కాంత రాక, వనమునన్ వికాసుమును గన్నవిమల్లెలు మొల్లలన్నియో
ఆ॥ కవన మనెడు తోఁట కడు రమణీయపు పుష్పములకు నెలవు పురుఁడు పోసుకొను కవితలందు కొసరి విరియఁ గానుగవనమున విరులు వికాసమందెచం॥ చవి విరియంగ భావుకత సంస్థితమై తనరంగ హృద్యమౌ కవన సుమమ్ము లెన్నియొ ప్రకాశము నొందెనె మల్లె మాలయున్గవికుల నారి మొల్లయును గావ్య సుధామృత ధారఁ జిమ్మిరే!కవనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో! మొల్ల ప్రథమ తెలుగు కవయిత్రి అనుకుంటా నండి
కొమ్మ గుబురులందు కోకిల కూతలుఅల్లన ప్రసరించు పిల్లగాలికవి హృదయమునందు కాంతులు నింపగకవనమున విరులు వికాసమందె
అతడహర్నిశమ్ము లావనమున శ్రమియించిన ఫల మిదియె యింపుగానుపూలమొక్కలచట భూరిగన్ బెరుగ ప్రక్క వనమున విరులు వికాసమందె.భవనము చెంతనున్న నొక వారటమందున బావి త్రవ్వగా సవము సమృద్ధిగన్ గలుగ శ్రద్ధను జూపుచు క్షేత్రజీవుడే యవిరల సేవజేయ నట యద్భుతమౌ ఫలితంబు దక్క ప్రక్క వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో.
భవనమందునిలువ భామిని నిరసింపవనమునందునుంచె దనుజవిభుడుసీత రాకతోడ చిత్రంబుగానశోక వనమున విరులు వికాసమందెభవనమునందు నుండుటకు భామిని సీతనిరాకరించగాచివరకు నుంచినాడుగద సీతను చక్కని వృక్ష వాటిలోనవనిజ రాకతో మురిసెనావన మంతయుఁ దత్క్షణంబశోక వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో
చ.
రిప్లయితొలగించండికవికుల శేఖరుల్ పొగడఁ గష్టమ కోకిల పంచమంబులం,
బవన విశుద్ధ వాహినులు బచ్చని పత్ర తతిం గదిల్చె న
ద్రి వితత చంచరీకములు దీపిని కోఱె, వసంత భామ దూ
క, వనమునన్ వికాసనమునుఁ గన్నవి మల్లెలు మోల్లలెన్నియో !
కువకువలాడు కోయిలల కూజితముల్ యెలమావి కొమ్మలన్
రిప్లయితొలగించండినవనవలాడు పూ లతల నర్తనముల్ చిరుగాలి సోకఁగన్
కవిహృదయాంతరాళమున కమ్మనియూహలు నింప నామనిన్
కవనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో
ఆటవెలది
రిప్లయితొలగించండివేడ్కఁగాంచ వెడల బృందావనమ్మున
కృష్ణమూర్తిఁ గనక ఖేదమొంద
వేణునాదమలర వినిపించు శౌరి రా
క, వనమున విరులు వికాసమందె!
చంపకమాల
ప్రవిమల భక్తి భావముల రంజిలనాడుచు కృష్ణమూర్తికై
స్తవముల గోపికల్ వెడల తన్మయమందగ గోకులమ్మునన్
జవమున వేణునాదమది సంబరమొందగ నూదు శౌరి రా
క, వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో
ఎండకాలమందు చండమునకు మల్లి
రిప్లయితొలగించండిక,వనమున విరులు వికాసమందె
వాటినెల్ల జిదిమె వనిత , తనసిగలో
ముడుచు కొనుట యందు మోద మొంది
భువనములోన సర్వమును బూర్తిగ
రిప్లయితొలగించండిమేల్కొనె నిద్రనుండి భూ
భవములు మారె బచ్చగను భవ్య
మనోహరమొప్పె పృథ్వియున్
గువకువ కూసె కోయిలలు కొమ్మల
లోన వసంత కాంత రా
క, వనమునన్ వికాసుమును గన్నవి
మల్లెలు మొల్లలన్నియో
ఆ॥ కవన మనెడు తోఁట కడు రమణీయపు
రిప్లయితొలగించండిపుష్పములకు నెలవు పురుఁడు పోసు
కొను కవితలందు కొసరి విరియఁ గాను
గవనమున విరులు వికాసమందె
చం॥ చవి విరియంగ భావుకత సంస్థితమై తనరంగ హృద్యమౌ
కవన సుమమ్ము లెన్నియొ ప్రకాశము నొందెనె మల్లె మాలయున్
గవికుల నారి మొల్లయును గావ్య సుధామృత ధారఁ జిమ్మిరే!
కవనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో!
మొల్ల ప్రథమ తెలుగు కవయిత్రి అనుకుంటా నండి
కొమ్మ గుబురులందు కోకిల కూతలు
రిప్లయితొలగించండిఅల్లన ప్రసరించు పిల్లగాలి
కవి హృదయమునందు కాంతులు నింపగ
కవనమున విరులు వికాసమందె
రిప్లయితొలగించండిఅతడహర్నిశమ్ము లావనమున శ్రమి
యించిన ఫల మిదియె యింపుగాను
పూలమొక్కలచట భూరిగన్ బెరుగ ప్ర
క్క వనమున విరులు వికాసమందె.
భవనము చెంతనున్న నొక వారటమందున బావి త్రవ్వగా
సవము సమృద్ధిగన్ గలుగ శ్రద్ధను జూపుచు క్షేత్రజీవుడే
యవిరల సేవజేయ నట యద్భుతమౌ ఫలితంబు దక్క ప్ర
క్క వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో.
భవనమందునిలువ భామిని నిరసింప
రిప్లయితొలగించండివనమునందునుంచె దనుజవిభుడు
సీత రాకతోడ చిత్రంబుగానశో
క వనమున విరులు వికాసమందె
భవనమునందు నుండుటకు భామిని సీతనిరాకరించగా
చివరకు నుంచినాడుగద సీతను చక్కని వృక్ష వాటిలో
నవనిజ రాకతో మురిసెనావన మంతయుఁ దత్క్షణంబశో
క వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో