13, జులై 2025, ఆదివారం

సమస్య - 5181

14-7-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గురు గిరిప్రదక్షిణము మీకుఁ దగదయ్య”

(లేదా...)

“గురు గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే”

(పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

6 కామెంట్‌లు:

  1. తేటగీతి
    అగ్నిలింగమై శివుఁడు తానఘము గాల్చ
    హరుఁడె యరుణాచలమ్మని గురువులనఁగ
    నమ్మకముఁ బాప మీలోని వైరులారు
    గురు, గిరిప్రదక్షిణము మీకుఁ దగదయ్య

    చంపకమాల
    అరుణగిరీంద్రుఁడై శివుడు నార్తిని బాపగ నగ్నిలింగమై
    హరుని స్వరూపమంచు నరుణాచలమున్ ప్రజ మ్రొక్కుచుండఁగన్
    స్థిరమగు నమ్మకమ్ము విడి చిందులు వేయగ లోన వైరు లా
    ర్గురు, గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే!

    రిప్లయితొలగించండి

  2. క్రైస్తవ సమూహమట జేరి క్రీస్తు చరిత
    జెప్పుచుండ నర్చకుడు వచించె నిటుల
    మీరు హిందుమతమునకు వైరు లారు
    గురు గిరిప్రదక్షిణము మీకుఁ దగదయ్య.


    తరుణులు కష్టమంచనక ధైర్యము జూపుచు జేయవచ్చు పా
    ర్పరులకు ప్రాణగొడ్డమని వైద్యుడు నాడు వచించె గాదుటే
    యరయగ శ్వాశకోశముల వ్యాధిని గల్గిన వారలైన స
    ద్గురు గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. తే॥ వరలు నాషాఢభూతులు గురువులఁ గని
      కపట చిత్తము దాచుచు కడు నటనల
      ప్రణతుల నొసఁగు చుండఁగఁ బలికితినిటు
      గురు గిరి ప్రదక్షిణము మీకుదగగయ్య

      చం॥ గురువును గౌరవించుటకుఁ గూర్చిన విద్యలఁ బంచ నెంచినన్
      గరిమగ శాస్త్ర శోధనను గాంచుచు విద్యలఁ బెంచ మోదమే
      మరచుచు నన్ని స్వార్థమున మాన్యులఁ దల్చుచు వ్యాస పూర్ణిమన్
      గురు గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే

      తే॥ గురు గిరిప్రదక్షిణము లో రి గురువాండి, అప్పుడు గిరి అంటే కొండే ఔతుంది

      తొలగించండి
  4. ఇప్పుడాషాఢమని దమ యిష్టుడు నర
    సింహమూర్తి రూపున వెలసిన గిరి కడ
    వయసు మీరగ ముదుసలి వారగు నలు
    గురు గిరిప్రదక్షిణము మీకుఁ దగదయ్య

    రిప్లయితొలగించండి
  5. అగ్ని పర్వతము పగుల నగ్ని రగిలి
    వేడి శగలను రగిలించు వేళలోన
    తత్తరపడి వేగ పరుగులెత్తగ పదు
    గురు గిరిప్రదక్షిణము మీకుఁ దగదయ్య

    గిరులను చూడవచ్చిన నొకించుక చూపుము జాగరూకతన్
    వరదుని కాణయాచి యని వచ్చిన భక్తుల ముందు విచ్చి జ్వా
    లరగిలి పెద్దయెత్తున శిలాద్రవమున్ వెదజల్లు చున్న జే
    గురు గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే

    రిప్లయితొలగించండి