2, జులై 2025, బుధవారం

సమస్య - 5171

3-7-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పూతరేకులఁ దిని కడు పుల్లన యనె”

(లేదా...)

“పూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే”

(అనంతచ్ఛందం సౌజన్యంతో)

18 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      వైరి చేతల మెచ్చెడు వారలరుదు
      మగువలందున నసలుకునగుపడుదురె?
      సుదతి పంచగ ప్రక్కింటి మదవతికని
      పూతరేకులఁ దిని కడు పుల్లన యనె!

      మత్తకోకిల
      చేతలన్నవి వైరివన్నను జెల్లునే తగ మెచ్చగన్
      గోతులందున జూడనట్టివి కోరిచూడఁగలేమయా!
      నాతియొక్కతి పంచినంతనె నర్మిలిన్ బొరుగిళ్లకున్
      పూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే

      (గోతి = ఆడుది, స్త్రీ)

      తొలగించండి
  2. తెలుగునాట జనుల జిహ్వ తియ్యనౌను
    పూతరేకులఁ దిని : కడు పుల్లన యనె
    మామిడి రసము‌ జుఱ్ఱగ మక్కువగొని ,
    ఆంధ్రులకు గల సౌభాగ్య మరయగలమె

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. చేతనమ్మునఁగొత్తకోడలుఁజిత్తశుద్దిగజేసినన్
    మూతిదిప్పుచునత్తగారటుమోదమన్నదిలేకనే
    భీతిబెంచగనెక్కిరించుచుభేదభావపుజూపుతో
    పూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి

  5. బాదుషాలును లడ్డూలు పాలకోవ
    కాకినాజకాజాలు భక్ష్యాలు కడుపు
    నిండ భుజియించి తానాగ కుండ నచటృ
    పూతరేకులఁ దిని కడు పుల్లన యనె

    *(కడుపు నిండిన గారెలు చేదనెడార్యోక్తి ప్రకారము)*


    నీతిమాలిన వారలేగద నేతలన్నను ధాత్రిపై
    కోతలెన్నియొ నోటుకోసము కోయుచుందురు నిత్యమున్
    సీత గ్రోలుచు కల్లలాడెడి చేతకుండ్రిట గాంచగన్
    బూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే.

    రిప్లయితొలగించండి
  6. తే॥ ఆకతాయి యొకఁడు చెట్టు లటులనెక్కి
    తుంటరి పనులఁ జేయుచు దూరి పైకి
    కాయలఁ గొరికి చవిగొనుఁ గడకు చింత
    పూత రేకులఁదిని కడు పుల్లన యనె

    మత్త॥ ప్రీతిఁగాంచఁగఁ బట్టెడన్నముఁ బెట్టి నంతను పొంగరే!
    భ్రాతి వీడఁగఁ బెట్టి యొప్పఁగఁ బంచ భక్ష్యము లైననున్
    ద్యోతకమ్మును గాదు మోదము దోషమెంచెడి వారలున్
    బూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే!

    తే॥ రేకులు Petals
    మత్త॥ మాములుగా (ముఖ్యంగా) గతంలో మగ పెళ్ళి వారి ఆగడాలు ఇలాగే ఉండేవండి.

    రిప్లయితొలగించండి
  7. వెలది తీయని పలుకులు విశద పడవు
    కలికి వచియింప కలుగును కలవరమ్ము
    చెలియ మాటల కర్థము తెలియుటెట్లు
    పూతరేకులఁ దిని కడు పుల్లన యనె

    ప్రీతిపాత్రములైన కాంతలఁ బ్రేమతో పొడగాంచరే
    చేతనీయము కానివేగద చెల్వలెల్లరి మాటలే
    జాతి లక్షణమెంచ వారి వచస్సు కర్థము వేరులే
    పూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే

    రిప్లయితొలగించండి
  8. పూతరేకుల నాత్రేయపురమునుండి
    భర్త తెచ్చినఁ బక్కింటి పడతికీయ
    పొరుగు పచ్చకు నోర్వని పువ్వుబోడి
    పూతరేకులఁ దిని కడు పుల్లన యనె

    రిప్లయితొలగించండి
  9. ఆతతమ్ముగ పూతరేకుల నగ్రహారమునందునన్
    ప్రీతిగా గొనితెచ్చి నాథుఁడు పేర్మిఁబత్నికినీయగన్
    భ్రాతిగాపొరుగింటిలోగల పంకజాక్షికి బంపినన్
    పూతరేకులఁ దిన్న వెంటనె పుల్లనైన వటందురే

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:తాను మథు మేహమును గల్గి తాత "పెద్ద
    తీపి కా"దని యెంతయు దృప్తిగ పది
    పూతరేకులఁ దిని, "కడు పుల్లన" యనె
    నాల్గు నేరేడు పండ్లిడ నాల్క బెట్టి.
    (మథు మేహం ఉన్నాయన పూతరేకులు తింటూ తీపి తక్కువే అని సమర్ధించుకున్నాడు.షుగర్ కి వైద్యం కదా! అని నేరెడు పళ్లు పెడితే అబ్బే చాలా పుల్లగా ఉన్నాయని వంక బెట్టాడు.)

    రిప్లయితొలగించండి
  11. సతిని యే డ్పి o చ డలచిన పతి యొ కండు
    కమ్మగా వండినవి గాంచి కడుపు నిండ
    పూ త రేకు ల దిని కడు పుల్లనయనె
    నలుక మాన్ఫ గ నోదా ర్చె నామె నతడు

    రిప్లయితొలగించండి