21-7-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రథమమ్మును మ్రింగెనొక్క పంచమమయ్యో”
(లేదా...)
“ప్రథమంబున్ గబళించెఁ బంచమము సంభ్రాంతిన్ గనన్ షష్ఠమే”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంఅధికారము సేబట్టగనిధులుండియు శక్తిగలుగు నేతల కొప్పున్విధివలనో? రాశి ఫలమొ? ప్రథమమ్మును మ్రింగెనొక్క పంచమమయ్యో!మత్తేభవిక్రీడితముఅధికారమ్మును బొందముగ్గరటనే యార్తాన పోరాడగన్నిధులుండంగనె చాలునే గెలువగన్ నేతృత్వమున్ బొందగన్విధియాడింపగ, వారి రాశి ఫలమో? విశ్వాత్ము సంకల్పమో?ప్రథమంబున్ గబళించెఁ బంచమము సంభ్రాంతిన్ గనన్ షష్ఠమే!
మ.కథలోఁ జెన్ను తలోదరిన్ కనులతో కామజ్వరాతప్తుడై వ్యథలం బొందుచుఁ జూడ హృత్తత మహాహంకారముల్ కల్గి తావిధిగా బూనెను మానభంగమును గావించంగ మాత్సర్యుడైప్రథమంబుం గబళించెఁ బంచమము సంభ్రాతిం గనన్ షష్ఠమే !(అరిషడ్వర్గాలలో 1.కామం, 5.మదం/అహంకారం, 6.మాత్సర్యం)
కథయైననేమి వినగనువ్యథయించుక కలిగెనాకు వచియించెడి యాకథలో నట పరుగెత్తెడి ప్రథమమ్మును మ్రింగెనొక్క పంచమమయ్యో.(ప్రథమము మేషము మేక పంచమము సింహము)కథకుండొక్కడు చేరవచ్చి గుడి ప్రాకారమ్ములో నక్తమున్ కథతా జెప్పె నిటుల్ కనన్ గళములో క్వాథమ్మదే చిందగాప్రథమంబున్ గబళించెఁ బంచమము, సంభ్రాంతిన్ గనన్ షష్ఠమేవ్యథతో ఛాగిని మింగెనా యడవిలో పంచాస్య మంచేడ్చెనే.*(ప్రథమం మేషం పంచమం సింహం షష్ఠమం కన్య)*
విధిగనె మామిడి చిగురులప్రథమమ్మును మ్రింగెనొక్క పంచమమయ్యో !వ్యధనొందకు మారీతిగమధుర మయిన కూతలనిక మనకొస గునుగా
పృథ చెంతనున్న చెలితోరథమున్ బయనించువేళ లక్షించినదౌకథనమ్మును తెల్పె నిటులప్రథమమ్మును మ్రింగెనొక్క పంచమమయ్యోపృథవాచించెను చెంతనున్నచెలితో వీక్షించితిన్ గాననన్రథమందున్ బయనించు వేళ హరియే మ్రక్కించెనోమేకనేకథనేతెల్పెద నాలకింపుమనుచున్ గ్రాల్గంటి వాక్రుచ్చెనేప్రథమంబున్ గబళించెఁ బంచమము సంభ్రాంతిన్ గనన్ షష్ఠమే[జ్యోతిష రాశుల ననుసరించి...కుంతి కన్యగానుండగా]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికందం
తొలగించండిఅధికారము సేబట్టగ
నిధులుండియు శక్తిగలుగు నేతల కొప్పున్
విధివలనో? రాశి ఫలమొ?
ప్రథమమ్మును మ్రింగెనొక్క పంచమమయ్యో!
మత్తేభవిక్రీడితము
అధికారమ్మును బొందముగ్గరటనే యార్తాన పోరాడగన్
నిధులుండంగనె చాలునే గెలువగన్ నేతృత్వమున్ బొందగన్
విధియాడింపగ, వారి రాశి ఫలమో? విశ్వాత్ము సంకల్పమో?
ప్రథమంబున్ గబళించెఁ బంచమము సంభ్రాంతిన్ గనన్ షష్ఠమే!
మ.
రిప్లయితొలగించండికథలోఁ జెన్ను తలోదరిన్ కనులతో కామజ్వరాతప్తుడై
వ్యథలం బొందుచుఁ జూడ హృత్తత మహాహంకారముల్ కల్గి తా
విధిగా బూనెను మానభంగమును గావించంగ మాత్సర్యుడై
ప్రథమంబుం గబళించెఁ బంచమము సంభ్రాతిం గనన్ షష్ఠమే !
(అరిషడ్వర్గాలలో 1.కామం, 5.మదం/అహంకారం, 6.మాత్సర్యం)
కథయైననేమి వినగను
రిప్లయితొలగించండివ్యథయించుక కలిగెనాకు వచియించెడి యా
కథలో నట పరుగెత్తెడి
ప్రథమమ్మును మ్రింగెనొక్క పంచమమయ్యో.
(ప్రథమము మేషము మేక పంచమము సింహము)
కథకుండొక్కడు చేరవచ్చి గుడి ప్రాకారమ్ములో నక్తమున్
కథతా జెప్పె నిటుల్ కనన్ గళములో క్వాథమ్మదే చిందగా
ప్రథమంబున్ గబళించెఁ బంచమము, సంభ్రాంతిన్ గనన్ షష్ఠమే
వ్యథతో ఛాగిని మింగెనా యడవిలో పంచాస్య మంచేడ్చెనే.
*(ప్రథమం మేషం పంచమం సింహం షష్ఠమం కన్య)*
విధిగనె మామిడి చిగురుల
రిప్లయితొలగించండిప్రథమమ్మును మ్రింగెనొక్క పంచమమయ్యో !
వ్యధనొందకు మారీతిగ
మధుర మయిన కూతలనిక మనకొస గునుగా
పృథ చెంతనున్న చెలితో
రిప్లయితొలగించండిరథమున్ బయనించువేళ లక్షించినదౌ
కథనమ్మును తెల్పె నిటుల
ప్రథమమ్మును మ్రింగెనొక్క పంచమమయ్యో
పృథవాచించెను చెంతనున్నచెలితో వీక్షించితిన్ గాననన్
రథమందున్ బయనించు వేళ హరియే మ్రక్కించెనోమేకనే
కథనేతెల్పెద నాలకింపుమనుచున్ గ్రాల్గంటి వాక్రుచ్చెనే
ప్రథమంబున్ గబళించెఁ బంచమము సంభ్రాంతిన్ గనన్ షష్ఠమే
[జ్యోతిష రాశుల ననుసరించి...కుంతి కన్యగానుండగా]