23, జులై 2025, బుధవారం

సమస్య - 5191

24-7-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాశిఁ జేరిరి కవులు శ్రీకాంతుఁ బొగడ”

(లేదా...)

“చేరిరి కాశికిన్ గవులు శ్రీపతియైన హరిన్ స్తుతింపఁగన్”

7 కామెంట్‌లు:

  1. ఉ.
    సార కవిత్వ వాక్ప్రభవ సౌరభ సంభృత పద్య సూనముల్
    కోరి యుపాస్తులన్ సలుపఁ గూర్చిరి, చక్కగ మోదమొందుచుం
    దీరుగ బిందు మాధవు మదిం బులకించుచు హృద్య భక్తిమై
    చేరిరి కాశికిం గవులు శ్రీపతియైన హరిన్ స్తుతింపగన్ !

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    ' కాశి' యనగ శ్రమమనెడు ఖచ్చితంపు
    అర్థమెరిగి సిరిని బొంద హరిహృదయమె
    లక్ష్మి కావాసమంచెంచి రయముమీర
    గాశిఁ జేరిరి కవులు శ్రీకాంతుఁ బొగడ

    ఉత్పలమాల
    కూరును సంపదల్ సిరుల కూరిమినిచ్చెడు లక్ష్మిఁగొల్చినన్
    భారము దీర్చి వైభవము పంచెడుమాతగనెంచి వాసమై
    శౌరి హృదాబ్జమందునను సందడి జేయుచునంచు నమ్మికన్
    చేరిరి కాశికిన్ గవులు శ్రీపతియైన హరిన్ స్తుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  3. తీరని యాశయంబులను దీర్చ
    కొనంగను శైవభక్తులున్
    దారుణమైన కష్టముల దాటుచు
    పట్టిన పట్టు వీడకన్
    చేరిరి కాశికిన్ గవులు , శ్రీపతీయైన
    హరిన్ స్తుతింపగన్
    జేరిరి కొందరన్ గవులు శ్రీరఘు
    రాము నయోద్యపట్నమున్.

    రిప్లయితొలగించండి


  4. విశ్వనాథుని దర్శించువేడ్కతోడ
    కాశి చేరిరి కవులు, శ్రీకాంతు బొగడ
    మనుచు పృచ్ఛకాళియు ప్రశ్నలడుగ మదిని
    దలచుచవధానినచ్చోట తమిని బూని.


    తీరుగ మాటలాడుకొని తేకువ తోడను సాగుచెల్లరున్
    బారులు తీరుచున్ చనుచు పావన మైన పురమ్ములోపలన్
    కోరుచుబిందుమాధవుని కూరిమితోగననెంచుచున్వడిన్
    చేరిరి కాశికిన్ కవులు శ్రీపతి యైన హరిన్ స్తుతింపగన్

    రిప్లయితొలగించండి
  5. మాన నీయమైన శతావధాన సభను
    పాలు గొననెంచి రయమున బయలుదేరి
    నిక్కముగ నాదికేశవుని పొడగాంచ
    కాశిఁ జేరిరి కవులు శ్రీకాంతుఁ బొగడ

    దూరమటంచు నెంచరుగ దోహలురెన్నడు కార్యశీలురై
    వారు శతావధానమున పాల్గొని వేదికపై విరాజిలన్
    గోరుచు నాదికేశవుని కొల్వదలంచుచు మిక్కుటంబుగా
    చేరిరి కాశికిన్ గవులు శ్రీపతియైన హరిన్ స్తుతింపఁగన్

    రిప్లయితొలగించండి
  6. దాపున కలదనుచు నెంచి , తాము నమ్ము
    హరిహరులు వేరుకాదను నాశయమున
    కాశిఁ జేరిరి కవులు , శ్రీకాంతుఁ బొగడ
    దలచి , తరచి జుడగ నిందు దప్పు లేదు

    రిప్లయితొలగించండి