1, జులై 2025, మంగళవారం

సమస్య - 5170

1-7-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఎలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా”

(లేదా...)

“ఎలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా”

8 కామెంట్‌లు:

  1. చిలువలుఁబలువలు రేపుచు
    బలువురువిద్రోహులిచటఁబబ్బముగడుపన్,
    చెలగుచుఁజెప్పిరిటులఁ"జి
    ట్టెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా"
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  2. చిలుకపలుకులిడు జిన్నను
    నలుగురు విని యచ్చెరువున నవ్వెడి రీతిన్
    పలుకుమనగ నుడివె నిటుల ,
    యెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా !

    రిప్లయితొలగించండి
  3. చ.
    కలిమిని పొందఁ గోరుచు ప్రకాశ మయాంచిత బుద్ధి నిల్పి నే
    నెలిమిగ కష్టమొందెడి పనిం బొనరించు నిశీథి కాలముం
    గలిగిన నిద్రలో మునిగి కల్లల స్వప్నమునందుఁ గంటి చి
    ట్టెలుకకుఁ బుట్టె నేనుగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా !

    రిప్లయితొలగించండి
  4. కం॥ వలచఁగ బాలలు హాస్యము
    చెలఁగ చలనచిత్ర మటుల చిత్రముల పరిన్
    బొలుపుగ పిల్లలు మెచ్చఁగ
    నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా

    చం॥ వలచఁగ బాలలందరును భవ్యమటుంచును హాస్య మెంతయో
    చెలఁగ విచిత్ర రీతులను చిత్రము, వింతగు జంతు జాలముం
    దలఁచుట వైనమంచుఁ దగు నమ్మక ముంచి సృజించ నందులో
    నెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా

    వైనము ఉపాయము (నిఘంటువు సహాయమండి)

    Animated cartoon movies రమారమి ఇలాగే ఉంటాయండి

    రిప్లయితొలగించండి

  5. లలన చరవాణి యందున
    పలు వింతల గాంచె నందు పరికింపంగన్
    పులిగుహలో వసియించెడి
    యెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా.


    పలు విధ వింతలన్ గనగ వచ్చునటంచును పాఠశాలలో
    చెలిమరి చెప్పెనంచు నిలు చేరిన వెంటనె తండ్రి నడ్గగన్
    వెలగన నెక్కువైన కడు పేర్మి గొనివ్వగ నందు గాంచగా
    యెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా.

    రిప్లయితొలగించండి
  6. [వేద జ్యోతిష్యంలో 27 నక్షత్రాలను కొన్ని జంతు లక్షణాల ఆధారంగా 14 యోనులుగా విభజించారు]

    తెలుపగ నడిగిరి వానిని
    వలచిన జంటలకు యోని వర్గము తగునా
    తిలకించిన జ్యోతిషుడనె
    నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా

    వలచిన వారి జాతకపు వర్గము లెంచగ సాటివచ్చునా
    తెలుపుము వాస్తవమ్మనుచు తెచ్చిరి సర్వుల జాతకంబులన్
    పలువురి జాతకంబులను బాగుగ చూచి వచించె జోస్యుడే
    'ఎలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా'

    రిప్లయితొలగించండి
  7. చిలుకల రీతి పల్కునని చెంతకు బిల్చుకొనంగ , వానితో
    నలుగురి మెప్పునొందుటకు నాలుగు మాటలు జెప్ప గోరగా
    పలికెనతండు భీతిలక వాక్యమునొక్కటి వింత గొల్పుచున్
    "యెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా

    రిప్లయితొలగించండి
  8. బలహీన మైన తల్లికి
    బలవంతుడు సుతుడు బుట్ట పలికిరి మహిళల్
    కిల కిల నవ్వుచు వింత గ
    నెలుకకు జన్మించె నొక్క యెనుo గౌ రా!

    రిప్లయితొలగించండి