7-7-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్”
(లేదా...)
“బే యని గౌరవించిరి కవీశుని వేదికపైన నెల్లరున్”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
కందంశ్రేయస్కరమౌ నీతులవ్రాయఁగ శతకంబు పేరఁ బటిమన్ గనుచున్వేయుచు దండల స్తుత్యంబే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్ఉత్పలమాలవ్రాయగ నీతులన్ మలచి రంజిలగన్ శతకంబు పేరిటన్శ్రేయము గూర్చు జాతికని ప్రీతిగ నొప్పుచు పండితార్యులున్వేయుచు దండలన్ మిగుల వేడ్కగ భావము స్ఫూర్తి దాయకంబే యని గౌరవించిరి కవీశుని వేదిక పైననెల్లరున్
చేయని తప్పుపయి నటులవ్రాయుట కూడదను దలపు వ్యక్త పరచుచున్నాయన చెప్పుట న్యాయంబే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఉ.ప్రాయ రసాన్విత ప్రముద భావ సముచ్చయ హృద్య వాక్కులన్ హాయిగ నవ్య రీతులుగ నద్భుత రమ్యతఁ జూపెనంచు వారాయత మోదమొందుచు శుభైక గళధ్వనిఁ గావ్య కేసరం బే యని గౌరవించిరి కవీశుని వేదికపైన నెల్లరున్ !
వేయు సమస్యలకు కవియు సైయని పూరించి నట్టి చాతుర్య ము కున్ జే యనుచు ను బలుకు చు సబ బే యని మెచ్చిరి మురిసి క వీ శు ని సభ లోన్
వ్రాయఁగ కావ్యమ్ముజనులశ్రేయమ్మును మదిని నిల్పిశేముషి విరియన్జేయఁగ సత్కృతి యుక్తంబే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్
ఆయన కావ్యము లద్భుతమాయన గాత్రమ్ము కూడ హాయిని గూర్చున్ కోయిల యని పొగడిని సబబే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్.ఆయన పద్యముల్ చదువ హాయిని గూర్చున టంచు ప్రేక్షకుల్ కోయిలకన్న నాయనదె కోమల గాత్రమటంచతండు పారాయణి మెచ్చు పుత్రుడని ప్రస్తుతి జేసి నుతించుటన్ ముదంబే యని గౌరవించిరి కవీశుని వేదికపైన నెల్లరున్.
ఈయుగమందున గొప్పది ధ్యేయమమేనని రచనము దివ్యమపూర్వంబే యని నవరస భరితంబే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్చేయని వర్ణణంబు మదిఁజేరని భావము లేని కావ్యమేశ్రేయము కూర్చు ధాత్రికని చెప్పిరి పల్వురు పండితోత్తముల్ధ్యేయమమేయమేననుచు దివ్యమనోహర కావ్య మద్భుతంబే యని గౌరవించిరి కవీశుని వేదికపైన నెల్లరున్
కందం
రిప్లయితొలగించండిశ్రేయస్కరమౌ నీతుల
వ్రాయఁగ శతకంబు పేరఁ బటిమన్ గనుచున్
వేయుచు దండల స్తుత్యం
బే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్
ఉత్పలమాల
వ్రాయగ నీతులన్ మలచి రంజిలగన్ శతకంబు పేరిటన్
శ్రేయము గూర్చు జాతికని ప్రీతిగ నొప్పుచు పండితార్యులున్
వేయుచు దండలన్ మిగుల వేడ్కగ భావము స్ఫూర్తి దాయకం
బే యని గౌరవించిరి కవీశుని వేదిక పైననెల్లరున్
చేయని తప్పుపయి నటుల
రిప్లయితొలగించండివ్రాయుట కూడదను దలపు వ్యక్త పరచుచున్
నాయన చెప్పుట న్యాయం
బే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ.
రిప్లయితొలగించండిప్రాయ రసాన్విత ప్రముద భావ సముచ్చయ హృద్య వాక్కులన్
హాయిగ నవ్య రీతులుగ నద్భుత రమ్యతఁ జూపెనంచు వా
రాయత మోదమొందుచు శుభైక గళధ్వనిఁ గావ్య కేసరం
బే యని గౌరవించిరి కవీశుని వేదికపైన నెల్లరున్ !
వేయు సమస్యలకు కవియు
రిప్లయితొలగించండిసైయని పూరించి నట్టి చాతుర్య ము కున్
జే యనుచు ను బలుకు చు సబ
బే యని మెచ్చిరి మురిసి క వీ శు ని సభ లోన్
వ్రాయఁగ కావ్యమ్ముజనుల
రిప్లయితొలగించండిశ్రేయమ్మును మదిని నిల్పిశేముషి విరియన్
జేయఁగ సత్కృతి యుక్తం
బే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్
రిప్లయితొలగించండిఆయన కావ్యము లద్భుత
మాయన గాత్రమ్ము కూడ హాయిని గూర్చున్
కోయిల యని పొగడిని సబ
బే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్.
ఆయన పద్యముల్ చదువ హాయిని గూర్చున టంచు ప్రేక్షకుల్
కోయిలకన్న నాయనదె కోమల గాత్రమటంచతండు పా
రాయణి మెచ్చు పుత్రుడని ప్రస్తుతి జేసి నుతించుటన్ ముదం
బే యని గౌరవించిరి కవీశుని వేదికపైన నెల్లరున్.
ఈయుగమందున గొప్పది
రిప్లయితొలగించండిధ్యేయమమేనని రచనము దివ్యమపూర్వం
బే యని నవరస భరితం
బే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్
చేయని వర్ణణంబు మదిఁజేరని భావము లేని కావ్యమే
శ్రేయము కూర్చు ధాత్రికని చెప్పిరి పల్వురు పండితోత్తముల్
ధ్యేయమమేయమేననుచు దివ్యమనోహర కావ్య మద్భుతం
బే యని గౌరవించిరి కవీశుని వేదికపైన నెల్లరున్