ఉ. పిక్కటిలెన్ మహా రవము పేరు సమస్యలు వచ్చెనంచు నే దిక్కులు దోచబోక యొక తీరగు నీడను విశ్రమించతిన్ దృక్కులు వేచి చూడగ విధించిన కాలము దాటెనంతలో, టక్కరిదౌను దూమశకటమ్ము ప్రయాణము దుఃఖహేతువౌ !
ఎక్కువ ఖర్చు లేదు మరి యేగుదమంచును రైలుయానమున్ మక్కువ మీర నెక్కితిమి మాగను లేచియు చూడ సందడిన్ గ్రక్కున నాగ రైలు మరి గాంచితి మెక్కిన దుండగీడులన్ “టక్కరిదౌను ధూమశకటమ్ము ప్రయాణము దుఃఖహేతువౌ”
దూర తీరాన గమ్యముఁ జేరుకొనఁగ
రిప్లయితొలగించండిధూమశకటమ్ము పైబోవ క్షేమకరము
బరువు మోతలు హెచ్చుగా పెరిగినపుఁడు
ధూమశకట ప్రయాణంబు దుఃఖకరము
నిప్ప కణికలు సృష్టించ నీటియావి
రిప్లయితొలగించండిగుప్పు గుప్పను పొగతోడ కూతలిడుచు
కదలి పరుగిడు పొగబండి కాదుకాదు
ధూమశకట ప్రయాణంబు దుఃఖకరము
చిక్కెను స్థానమంచు హరుసించి ప్రయాణము చేయనెంచినన్
గ్రక్కున చేర్చుగాదె మన గమ్యము నిద్దురలేచి చూడగా
టక్కరిదౌను ధూమశకటమ్ము; ప్రయాణము దుఃఖహేతువౌ
చక్కని బండినెక్కనని సాగుచునుండిన పాదచారియై
పురము విడి వేరు తావుకు బోవనెంచ ,
రిప్లయితొలగించండిదాను లోనికి పీల్చెడి తతము నందు
ధూళి వికటత్వ మిడుచుండ , దూర మునకు
ధూమశకట ప్రయాణంబు దుఃఖకరము
తేటగీతి
రిప్లయితొలగించండిమనము కొనఁగ కేటాయించ మనది కాదె!
యందున ప్రయాణికులునెక్కువైనయెడల
నరసి నిదురించు రెండవ తరగతిఁ బడ
ధూమశకట ప్రయాణంబు దుఃఖకరము
ఉత్పలమాల
చక్కగ నిద్రఁ బోవుటకు చాలును రెండవతర్గతంచు నే
రొక్కము గట్టి యెక్కితిని రోదన దక్కెను నిద్రలేదహో!
నిక్కుచు దూరుచున్ పరులు నిద్రను బాపిరి యిట్టి తర్గతిన్
టక్కరిదౌను ధూమశకటమ్ము! ప్రయాణము దుఃఖహేతువౌ!
ఉ.
రిప్లయితొలగించండిపిక్కటిలెన్ మహా రవము పేరు సమస్యలు వచ్చెనంచు నే
దిక్కులు దోచబోక యొక తీరగు నీడను విశ్రమించతిన్
దృక్కులు వేచి చూడగ విధించిన కాలము దాటెనంతలో,
టక్కరిదౌను దూమశకటమ్ము ప్రయాణము దుఃఖహేతువౌ !
యాత్రికుల ముల్లె మూటల నపహరించు
రిప్లయితొలగించండిరాత్రిచరులు చరించెడి రైలు లందు
పయనమున్ జేయు వారల బాధ చూడ
ధూమశకట ప్రయాణంబు దుఃఖకరము.
అక్కఱ పాటులెన్నియొ ప్రయాణికులెల్లరి కచ్చటం చటన్
పెక్కువిధాల భాషలును భిన్నపు సంస్కృతి గల్గు వారులున్
దక్కడి కారులున్ గనగ దండడిగా తిరుగాడు చుండగా
టక్కరిదౌను ధూమశకటమ్ము ప్రయాణము దుఃఖహేతువౌ,
మిక్కిలి క్షేమదాయక మమేయ ధృతిన్సమకూర్చునట్టిబల్
రిప్లయితొలగించండిచక్కని సాధనమ్ము కొనసాగఁగ యానము దూరతీరముల్
కక్కసుదాపునన్ జనుల కాహళముల్ నిదురన్ హరించుచో
టక్కరిదౌను ధూమశకటమ్ము ప్రయాణము దుఃఖహేతువౌ
తే॥ తరచుగ విలంబమధికము తగని శ్రమము
రిప్లయితొలగించండిదొంగల బెడఁద స్వస్థత దోఁచు తిండి
పడక సౌకర్యమల్పమై పరఁగు కతన
ధూమశకట ప్రయాణంబు దుఃఖకరము
ఉ॥ ఎక్కువగా విలంబమగు నెప్పుడు మిక్కిలి డస్సిపోదుమే!
దక్కిన తిండి జబ్బులను దప్పక తెచ్చును బాధలొందఁగన్
నక్కిన దొంగలెప్పుడటు నక్కల వోలెను పొంచి యుందురే!
టక్కరిదౌను ధూమశకటమ్ము ప్రయాణము దుఃఖ హేతువౌ
తే॥ 3 వ పాదము ముఖ్యంగా side upper berth వస్తే నరకమేనండి. చాలా మార్లు వృద్ధులకు upper berths వస్తాయండి.
రైలు భోజనము అమీబియాసిస్ వచ్చేందుకు దోహదకారి.
చేర వలసిన గమ్యంబు చేరు కొఱకు
రిప్లయితొలగించండిచేయ వలె ప్రయాణంబు ను సిద్ధ పడి యు
వ్యయ ప్రయాస ల కోర్చియు యాతన పడ
ధూమ శకట ప్రయాణం బు దుఃఖ కరము
చిన్నపిల్లల తోడను చేయ యాత్ర
రిప్లయితొలగించండిసీటు దొరకక హెచ్చెనుచిక్కులెన్నొ
గమ్యమునుచేర తప్పవు కష్టములవి
*ధూమ శకట ప్రయాణంబు దుఃఖకరము*
తక్కువఖర్చుతోడచన దల్చిసతీసుతగూడిసాగగన్
మక్కువతోడటిక్కెటును మానుగ గొంచును రైలు నెక్కగా
గ్రక్కున నిండగా పొగయు కానకనేదియు నూపిరాగగన్
*“టక్కరిదౌను ధూమశకటమ్ము ప్రయాణము దుఃఖహేతువౌ”*
గాలి లోనఁ బ్రయాణము మేలు గాదె
రిప్లయితొలగించండికూలె నొక టని మదిఁ బడ నేల చింత
దలఁచి చూడఁ గానేరదు తన్నభో వి
ధూమశకట ప్రయాణంబు దుఃఖకరము
చిక్కులలో మునుంగకుము చేరవు కాలము నందు గమ్యమున్
మ్రొక్కెద నెత్తి చేతులను బోవల దక్కట యాగుచుండుఁ జూ
యెక్కడ నైన మందగతి యెన్నఁగ నిక్కము సెప్పు చుంటి దీ
టక్కరి దౌను ధూమశకటమ్ము ప్రయాణము దుఃఖహేతువౌ
[దీటు + ఆ + కరి = దీ టక్కరి]
సమస్య:
రిప్లయితొలగించండి“టక్కరిదౌను ధూమశకటమ్ము ప్రయాణము దుఃఖహేతువౌ”
ఉ మా :
ఎక్కువ ఖర్చు లేదు మరి యేగుదమంచును రైలుయానమున్
మక్కువ మీర నెక్కితిమి మాగను లేచియు చూడ సందడిన్
గ్రక్కున నాగ రైలు మరి గాంచితి మెక్కిన దుండగీడులన్
“టక్కరిదౌను ధూమశకటమ్ము ప్రయాణము దుఃఖహేతువౌ”
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
జనులు కాలు పెట్టుట కైన సందు లేక
నిక్కటులు పడుచుందురు, కిక్కిరిసిన
పెట్టె లందున శుభ్రత వట్టి మాట
తప్పకను చేయవలసిన తరుణమందు
ధూమశకట ప్రయాణంబు దుఃఖకరము.