2, మే 2025, శుక్రవారం

సమస్య - 5111

3-5-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు”

(లేదా...)

“భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్”

(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో చేపూరి శ్రీరామ్ గారి సమస్య)

16 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వేదినవధాన మొనరింప వేడుకొనుచు
    ముగ్గురమ్మల ప్రార్థన ముదము సేసి
    నలువ భామనే కాక పూన హరిహరుల
    భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు

    శార్దూలవిక్రీడితము
    ఆర్యుండై యవధాన వేదిపయినందాసీనుడై భక్తితో
    కార్యారంభము ముగ్గురమ్మల దయన్ గావించు సంకల్పమై
    ధైర్యమ్మున్ సభకూర్చ బ్రహ్మసతినిన్ దాశార్హ, త్ర్యక్షాళికౌ
    భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్!

    రిప్లయితొలగించండి
  2. ఇచ్చిన సమస్య బూరించ నిష్టపడుచు 
    తనకు తోడుగ నటువంటి తరుణమందు 
    దారలుగ నున్న యేకాగ్రత ,  తలపు లగు 
    భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. తే॥ సదవధాన సమర మందు శక్తి నిడుచుఁ
      బూరణలకు మేలగు వన్నెఁ భూరిగ నిడఁ
      రయమున తలఁచి ధ్యానించి బ్రహ్మ శివుని
      భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్థనుండు

      శా॥ కార్యమ్మెంచి వధాన పూరణల సాక్షాత్కార సధ్భాగ్యమున్
      బర్యాప్తమ్ముగఁ బొందు పాటవమటుల్ ప్రాప్తించ సద్భక్తినిన్
      ధైర్యోపేత వికీర్ణ విద్యలనిడన్ దైత్యారికిన్ బ్రహ్మకున్
      భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీ బట్వర్ధనుండియ్యెడన్

      ఇంతకు మునుపు 3వ పాదములో ప్రాస దోషమైనదండి.

      తొలగించండి

  4. విజ్ఞు డవధానము మొదలు పెట్టువేళ
    తనను బ్రోవుమటంచును వినయముగను
    తీర్థకరుని పితువును నుతించి వారి
    భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు.


    ఆర్యా! సంస్కృతి సాంప్రదాయములటంచాతండు దైవంబునే
    కార్యారంభమునన్ నుతించుటదియే కర్తవ్యమంచున్ సదా
    ధైర్యమ్మిమ్మని పద్మలాంఛనుని పద్మాక్షుండనున్ వారి యా
    భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్.

    రిప్లయితొలగించండి
  5. భావనా పటిమ నొసగె పలుకుకలికి
    జాయ జీవనమున నిండె సౌమనసము
    కీర్తి కాంతయుఁ వరియించి కేలుసాచె
    భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు

    పర్యాలోచన సల్పు శక్తినిడెనా వాగ్దేవి సంపూర్తిగా
    భార్యోజ్జీవనమొప్పుచుండెనుగదా వర్ణింపగా తృప్తిగా
    పర్యాయంబున కీర్తికాంత వలచెన్ ప్రాధాన్యముప్పొంగగా
    భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్

    రిప్లయితొలగించండి
  6. పూరణముఁజేసి పద్యముల్ పొలుపుమీఱ
    ధారణము సేయనవి యసాధారణముగ
    ప్రార్థనముజేసి పద్మాక్షు పరమశివుల
    భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:భార్య లిద్దరి గట్టుక భర్త యొకడు
    వారి తగవుల దీర్చగ వలను గాక
    వదల వారలకున్ మధ్యవర్తి యగుచు
    భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు”
    (పాపం! ఎవడి భార్యలో తగువు పడుతుంటే వాళ్లకి రాజీ చెయ్యటానికి పిలిచా రండీ!)

    రిప్లయితొలగించండి
  8. శా:ఆర్యావర్తము నెల్ల జుట్టి తనదౌ యాత్రన్ జగన్మాత యౌ
    నార్యా దేవిని,శంకరున్ గనియె,భక్త్యాధిక్యతన్ గాశి లో
    సూర్యార్ఘ్యమ్మిడి గంగలో రుచిరమౌ స్తోత్రాళి తో శంభునిన్
    భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్”

    రిప్లయితొలగించండి
  9. చేయ నవ ధా న మును బూని సిద్ధ పడియు
    కొలిచె గురువును దేవత న్ గొప్ప గాను
    మనసు పూర్వ క ముగ తాను మదిని శివుని
    భార్య లిద్దఱ బిలిచె బ ట్వ ర్ధ నుండు

    రిప్లయితొలగించండి
  10. తనదు పాటవ మెఱిఁగించు తపన తోడ
    దూర మందు నిలిచి నట్టి వారి నపుడు
    వినుఁడు రండు వేగమ్ముగ నని కుమార
    భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు


    ధైర్యోపేత మనస్కుఁ డై పరుల విత్తం బాహరింపంగఁ దా
    కార్యం బెన్ని వచింప నంతయును నా కాంతా ద్వయమ్ముం ద్రుటిం
    గార్యాకార్య వివేకవంతుఁడు స్వ పక్షప్రీతినిన్ సోదరీ
    భార్యారత్నము లిద్దఱం బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్

    [శ్రీ పటు+అవర్ధనుండు= శ్రీ పట్వర్ధనుండు; సంపదల సమర్థులను వర్ధిల్ల నీయని వాఁడు]

    రిప్లయితొలగించండి
  11. కార్యారంభమునందు సత్కవులు విఘ్నాయాసముల్ దొల్గగన్
    పర్యాప్తంబుగ దైవకీర్తనములన్ వల్లింత్రు సద్భక్తితో
    ధైర్యమ్మున్ గదియించగామనమునన్ దామోదరున్ త్ర్యక్షునిన్
    భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్

    రిప్లయితొలగించండి
  12. శౌర్యంబొప్ప శతావధానమును విశ్వాసమ్ముతో చేయుచున్
    స్థైర్యంబిచ్చుచు తోడుగానిలువగా సావిత్రి చిత్రాణిగా
    ధైర్యంబిచ్చుచు నుల్లసిల్లు సతి ప్రోత్సాహమ్ము వాంఛించుచున్
    భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీ పట్వర్ధనుండియ్యెడిన్

    శార్దూలము :

    కార్యంబుల్ నెరవేరునే నిహమునన్ గావంగకే దైవముల్
    ధైర్యంబున్ సమగూర్చగా యెపుడు నా దైవంబులన్ రమ్మనన్
    ఆర్యుల్ పల్కిన సుద్దులే మదిని దానా యర్ధనారీశ్వరున్,
    భార్యారత్నము లిద్దఱన్, బిలిచె, శ్రీ పట్వర్ధనుండియ్యెడిన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఈ వధాన మాటంకము లేమి లేక
    సాగ ముందుగా గురువుల సంస్మరించి
    ప్రార్థనల్ జేయు నిచ్ఛతో బ్రహ్మ, శివుని
    భార్యలిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు.

    రిప్లయితొలగించండి
  15. ఈ వధానము నందున నిమ్ము గాను
    అండదండగా నిల్చుచు నాదరమున
    దీవెన లిడరమ్మనుచును తిరుమలేశు
    భార్య లిద్దఱ బిలిచె బట్వర్ధనుండు
    ఆర్యుల్ మెచ్చెడు రీతిగా కవివరుం డత్యద్భుతంబౌ విధిన్
    కార్యోత్సాహిగచేయనెంచుచగనక్కార్యమ్ముసంతృప్తిగా
    ధైర్యమ్మిమ్మనివేడుచున్పిలిచెగాతానామహావిష్ణువున్
    *“భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్”*
    ”*


    రిప్లయితొలగించండి