3-5-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు”
(లేదా...)
“భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో చేపూరి శ్రీరామ్ గారి సమస్య)
తేటగీతివేదినవధాన మొనరింప వేడుకొనుచుముగ్గురమ్మల ప్రార్థన ముదము సేసినలువ భామనే కాక పూన హరిహరులభార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండుశార్దూలవిక్రీడితముఆర్యుండై యవధాన వేదిపయినందాసీనుడై భక్తితోకార్యారంభము ముగ్గురమ్మల దయన్ గావించు సంకల్పమైధైర్యమ్మున్ సభకూర్చ బ్రహ్మసతినిన్ దాశార్హ, త్ర్యక్షాళికౌభార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్!
ఇచ్చిన సమస్య బూరించ నిష్టపడుచు తనకు తోడుగ నటువంటి తరుణమందు దారలుగ నున్న యేకాగ్రత , తలపు లగు భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తే॥ సదవధాన సమర మందు శక్తి నిడుచుఁబూరణలకు మేలగు వన్నెఁ భూరిగ నిడఁరయమున తలఁచి ధ్యానించి బ్రహ్మ శివునిభార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్థనుండుశా॥ కార్యమ్మెంచి వధాన పూరణల సాక్షాత్కార సధ్భాగ్యమున్బర్యాప్తమ్ముగఁ బొందు పాటవమటుల్ ప్రాప్తించ సద్భక్తినిన్ధైర్యోపేత వికీర్ణ విద్యలనిడన్ దైత్యారికిన్ బ్రహ్మకున్భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీ బట్వర్ధనుండియ్యెడన్ఇంతకు మునుపు 3వ పాదములో ప్రాస దోషమైనదండి.
విజ్ఞు డవధానము మొదలు పెట్టువేళతనను బ్రోవుమటంచును వినయముగనుతీర్థకరుని పితువును నుతించి వారి భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు.ఆర్యా! సంస్కృతి సాంప్రదాయములటంచాతండు దైవంబునే కార్యారంభమునన్ నుతించుటదియే కర్తవ్యమంచున్ సదాధైర్యమ్మిమ్మని పద్మలాంఛనుని పద్మాక్షుండనున్ వారి యాభార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్.
భావనా పటిమ నొసగె పలుకుకలికిజాయ జీవనమున నిండె సౌమనసముకీర్తి కాంతయుఁ వరియించి కేలుసాచెభార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండుపర్యాలోచన సల్పు శక్తినిడెనా వాగ్దేవి సంపూర్తిగాభార్యోజ్జీవనమొప్పుచుండెనుగదా వర్ణింపగా తృప్తిగాపర్యాయంబున కీర్తికాంత వలచెన్ ప్రాధాన్యముప్పొంగగాభార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్
పూరణముఁజేసి పద్యముల్ పొలుపుమీఱధారణము సేయనవి యసాధారణముగప్రార్థనముజేసి పద్మాక్షు పరమశివులభార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు
తే.గీ:భార్య లిద్దరి గట్టుక భర్త యొకడువారి తగవుల దీర్చగ వలను గాకవదల వారలకున్ మధ్యవర్తి యగుచుభార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు”(పాపం! ఎవడి భార్యలో తగువు పడుతుంటే వాళ్లకి రాజీ చెయ్యటానికి పిలిచా రండీ!)
శా:ఆర్యావర్తము నెల్ల జుట్టి తనదౌ యాత్రన్ జగన్మాత యౌనార్యా దేవిని,శంకరున్ గనియె,భక్త్యాధిక్యతన్ గాశి లో సూర్యార్ఘ్యమ్మిడి గంగలో రుచిరమౌ స్తోత్రాళి తో శంభునిన్ భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్”
చేయ నవ ధా న మును బూని సిద్ధ పడియు కొలిచె గురువును దేవత న్ గొప్ప గాను మనసు పూర్వ క ముగ తాను మదిని శివుని భార్య లిద్దఱ బిలిచె బ ట్వ ర్ధ నుండు
తనదు పాటవ మెఱిఁగించు తపన తోడ దూర మందు నిలిచి నట్టి వారి నపుడు వినుఁడు రండు వేగమ్ముగ నని కుమార భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు ధైర్యోపేత మనస్కుఁ డై పరుల విత్తం బాహరింపంగఁ దాకార్యం బెన్ని వచింప నంతయును నా కాంతా ద్వయమ్ముం ద్రుటిం గార్యాకార్య వివేకవంతుఁడు స్వ పక్షప్రీతినిన్ సోదరీ భార్యారత్నము లిద్దఱం బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్ [శ్రీ పటు+అవర్ధనుండు= శ్రీ పట్వర్ధనుండు; సంపదల సమర్థులను వర్ధిల్ల నీయని వాఁడు]
కార్యారంభమునందు సత్కవులు విఘ్నాయాసముల్ దొల్గగన్పర్యాప్తంబుగ దైవకీర్తనములన్ వల్లింత్రు సద్భక్తితోధైర్యమ్మున్ గదియించగామనమునన్ దామోదరున్ త్ర్యక్షునిన్భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్
శౌర్యంబొప్ప శతావధానమును విశ్వాసమ్ముతో చేయుచున్ స్థైర్యంబిచ్చుచు తోడుగానిలువగా సావిత్రి చిత్రాణిగా ధైర్యంబిచ్చుచు నుల్లసిల్లు సతి ప్రోత్సాహమ్ము వాంఛించుచున్ భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్
సమస్య:భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీ పట్వర్ధనుండియ్యెడిన్శార్దూలము : కార్యంబుల్ నెరవేరునే నిహమునన్ గావంగకే దైవముల్ ధైర్యంబున్ సమగూర్చగా యెపుడు నా దైవంబులన్ రమ్మనన్ ఆర్యుల్ పల్కిన సుద్దులే మదిని దానా యర్ధనారీశ్వరున్, భార్యారత్నము లిద్దఱన్, బిలిచె, శ్రీ పట్వర్ధనుండియ్యెడిన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఈ వధాన మాటంకము లేమి లేకసాగ ముందుగా గురువుల సంస్మరించిప్రార్థనల్ జేయు నిచ్ఛతో బ్రహ్మ, శివునిభార్యలిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు.
ఈ వధానము నందున నిమ్ము గానుఅండదండగా నిల్చుచు నాదరమునదీవెన లిడరమ్మనుచును తిరుమలేశుభార్య లిద్దఱ బిలిచె బట్వర్ధనుండుఆర్యుల్ మెచ్చెడు రీతిగా కవివరుం డత్యద్భుతంబౌ విధిన్కార్యోత్సాహిగచేయనెంచుచగనక్కార్యమ్ముసంతృప్తిగాధైర్యమ్మిమ్మనివేడుచున్పిలిచెగాతానామహావిష్ణువున్*“భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్”*”*
తేటగీతి
రిప్లయితొలగించండివేదినవధాన మొనరింప వేడుకొనుచు
ముగ్గురమ్మల ప్రార్థన ముదము సేసి
నలువ భామనే కాక పూన హరిహరుల
భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు
శార్దూలవిక్రీడితము
ఆర్యుండై యవధాన వేదిపయినందాసీనుడై భక్తితో
కార్యారంభము ముగ్గురమ్మల దయన్ గావించు సంకల్పమై
ధైర్యమ్మున్ సభకూర్చ బ్రహ్మసతినిన్ దాశార్హ, త్ర్యక్షాళికౌ
భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్!
ఇచ్చిన సమస్య బూరించ నిష్టపడుచు
రిప్లయితొలగించండితనకు తోడుగ నటువంటి తరుణమందు
దారలుగ నున్న యేకాగ్రత , తలపు లగు
భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ సదవధాన సమర మందు శక్తి నిడుచుఁ
తొలగించండిబూరణలకు మేలగు వన్నెఁ భూరిగ నిడఁ
రయమున తలఁచి ధ్యానించి బ్రహ్మ శివుని
భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్థనుండు
శా॥ కార్యమ్మెంచి వధాన పూరణల సాక్షాత్కార సధ్భాగ్యమున్
బర్యాప్తమ్ముగఁ బొందు పాటవమటుల్ ప్రాప్తించ సద్భక్తినిన్
ధైర్యోపేత వికీర్ణ విద్యలనిడన్ దైత్యారికిన్ బ్రహ్మకున్
భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీ బట్వర్ధనుండియ్యెడన్
ఇంతకు మునుపు 3వ పాదములో ప్రాస దోషమైనదండి.
రిప్లయితొలగించండివిజ్ఞు డవధానము మొదలు పెట్టువేళ
తనను బ్రోవుమటంచును వినయముగను
తీర్థకరుని పితువును నుతించి వారి
భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు.
ఆర్యా! సంస్కృతి సాంప్రదాయములటంచాతండు దైవంబునే
కార్యారంభమునన్ నుతించుటదియే కర్తవ్యమంచున్ సదా
ధైర్యమ్మిమ్మని పద్మలాంఛనుని పద్మాక్షుండనున్ వారి యా
భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్.
భావనా పటిమ నొసగె పలుకుకలికి
రిప్లయితొలగించండిజాయ జీవనమున నిండె సౌమనసము
కీర్తి కాంతయుఁ వరియించి కేలుసాచె
భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు
పర్యాలోచన సల్పు శక్తినిడెనా వాగ్దేవి సంపూర్తిగా
భార్యోజ్జీవనమొప్పుచుండెనుగదా వర్ణింపగా తృప్తిగా
పర్యాయంబున కీర్తికాంత వలచెన్ ప్రాధాన్యముప్పొంగగా
భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్
పూరణముఁజేసి పద్యముల్ పొలుపుమీఱ
రిప్లయితొలగించండిధారణము సేయనవి యసాధారణముగ
ప్రార్థనముజేసి పద్మాక్షు పరమశివుల
భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు
తే.గీ:భార్య లిద్దరి గట్టుక భర్త యొకడు
రిప్లయితొలగించండివారి తగవుల దీర్చగ వలను గాక
వదల వారలకున్ మధ్యవర్తి యగుచు
భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు”
(పాపం! ఎవడి భార్యలో తగువు పడుతుంటే వాళ్లకి రాజీ చెయ్యటానికి పిలిచా రండీ!)
శా:ఆర్యావర్తము నెల్ల జుట్టి తనదౌ యాత్రన్ జగన్మాత యౌ
రిప్లయితొలగించండినార్యా దేవిని,శంకరున్ గనియె,భక్త్యాధిక్యతన్ గాశి లో
సూర్యార్ఘ్యమ్మిడి గంగలో రుచిరమౌ స్తోత్రాళి తో శంభునిన్
భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్”
చేయ నవ ధా న మును బూని సిద్ధ పడియు
రిప్లయితొలగించండికొలిచె గురువును దేవత న్ గొప్ప గాను
మనసు పూర్వ క ముగ తాను మదిని శివుని
భార్య లిద్దఱ బిలిచె బ ట్వ ర్ధ నుండు
తనదు పాటవ మెఱిఁగించు తపన తోడ
రిప్లయితొలగించండిదూర మందు నిలిచి నట్టి వారి నపుడు
వినుఁడు రండు వేగమ్ముగ నని కుమార
భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు
ధైర్యోపేత మనస్కుఁ డై పరుల విత్తం బాహరింపంగఁ దా
కార్యం బెన్ని వచింప నంతయును నా కాంతా ద్వయమ్ముం ద్రుటిం
గార్యాకార్య వివేకవంతుఁడు స్వ పక్షప్రీతినిన్ సోదరీ
భార్యారత్నము లిద్దఱం బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్
[శ్రీ పటు+అవర్ధనుండు= శ్రీ పట్వర్ధనుండు; సంపదల సమర్థులను వర్ధిల్ల నీయని వాఁడు]
కార్యారంభమునందు సత్కవులు విఘ్నాయాసముల్ దొల్గగన్
రిప్లయితొలగించండిపర్యాప్తంబుగ దైవకీర్తనములన్ వల్లింత్రు సద్భక్తితో
ధైర్యమ్మున్ గదియించగామనమునన్ దామోదరున్ త్ర్యక్షునిన్
భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్
శౌర్యంబొప్ప శతావధానమును విశ్వాసమ్ముతో చేయుచున్
రిప్లయితొలగించండిస్థైర్యంబిచ్చుచు తోడుగానిలువగా సావిత్రి చిత్రాణిగా
ధైర్యంబిచ్చుచు నుల్లసిల్లు సతి ప్రోత్సాహమ్ము వాంఛించుచున్
భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్
సమస్య:
రిప్లయితొలగించండిభార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీ పట్వర్ధనుండియ్యెడిన్
శార్దూలము :
కార్యంబుల్ నెరవేరునే నిహమునన్ గావంగకే దైవముల్
ధైర్యంబున్ సమగూర్చగా యెపుడు నా దైవంబులన్ రమ్మనన్
ఆర్యుల్ పల్కిన సుద్దులే మదిని దానా యర్ధనారీశ్వరున్,
భార్యారత్నము లిద్దఱన్, బిలిచె, శ్రీ పట్వర్ధనుండియ్యెడిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఈ వధాన మాటంకము లేమి లేక
సాగ ముందుగా గురువుల సంస్మరించి
ప్రార్థనల్ జేయు నిచ్ఛతో బ్రహ్మ, శివుని
భార్యలిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు.
ఈ వధానము నందున నిమ్ము గాను
రిప్లయితొలగించండిఅండదండగా నిల్చుచు నాదరమున
దీవెన లిడరమ్మనుచును తిరుమలేశు
భార్య లిద్దఱ బిలిచె బట్వర్ధనుండు
ఆర్యుల్ మెచ్చెడు రీతిగా కవివరుం డత్యద్భుతంబౌ విధిన్
కార్యోత్సాహిగచేయనెంచుచగనక్కార్యమ్ముసంతృప్తిగా
ధైర్యమ్మిమ్మనివేడుచున్పిలిచెగాతానామహావిష్ణువున్
*“భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్”*
”*