24, మే 2025, శనివారం

సమస్య - 5131

25-5-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వాస్తుఁ జూచి కట్టవలదు గృహము”

(లేదా...)

“వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్”

15 కామెంట్‌లు:

  1. ఇంటి లోని వారి కిబ్బంది లేకుండ
    నన్ని విధ ములు గను మన్ని కగుచు
    నుండు నటుల చూచు టుత్త మమగు కాని
    వాస్తు జూచి కట్ట వలదు గృహము

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    ఇంటనుండువారికెంతేని యారోగ్య
    మమరఁ జేయు శాస్త్ర మయ్యె గాన
    తొందరపడి చెప్పు దోష పూరితమైన
    వాస్తుఁ జూచి కట్టవలదు గృహము

    ఉత్పలమాల
    వాస్తవమెంచి చూడ జన స్వాస్థ్యము నెంచెడు శాస్త్రమంచనన్
    నిస్తులమై మనెన్ గనుక నీమముదప్పక నాచరించుమా!
    యాస్తులు నాశమౌ కతన నజ్ఞులు జెప్పెడు దోషపూర్ణమౌ
    వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. వారు వీరు జెప్పు వచనములను నమ్మి
    యించుకైన గూడ నెరుగ నట్టి
    బొప్పడు రచియించు పొత్తము నందలి
    వాస్తుఁ జూచి కట్టవలదు గృహము

    రిప్లయితొలగించండి
  5. ఉ.
    గోస్తనిగా రుచించి మన గుండెల నిండెడి, శాస్త్ర బోధలన్
    హస్తుల హస్తముల్ వలెను హానిని జేసిడి సంప్రదాయ స
    ద్వాస్తవ వల్లికన్ దునుము వాక్కులఁ జెప్పెనొకండు, వెఱ్ఱిగా
    వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్ !

    రిప్లయితొలగించండి

  6. చదువకున్ననేమి సకలశాస్త్రాలలో
    పండితులమటంచు పలుకు వారు
    శ్రీకరమ్మటంచు చెంతజేరుచు చెప్పు
    వాస్తుఁ జూచి కట్టవలదు గృహము.


    విస్తృత మైన జ్ఞానమది వీధుల లోను లభించు చుండెనే
    పుస్తక రూపమందున ప్రబుద్ధులు కొందరు వ్రాయ నందునన్
    వాస్తవదూరమైన పలు వక్కణముల్ గని యందునుండెడిన్
    వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్.

    రిప్లయితొలగించండి
  7. వాస్తు ననుసరించి వాస్తవమ్ము మరచి
    కట్టనెంచఁ గృహము కష్టమగును
    వాస్తు సూత్రములను వర్జింపకున్నను
    వాస్తుఁ జూచి కట్టవలదు గృహము

    పుస్తకమందునున్నదని పూర్తిగ నమ్మిన కష్టమేసుమా
    మస్తకమందునున్న మతి మన్నన జూపక యున్న నెన్నడున్
    వాస్తవమున్ గణింపక నవాస్తవ సూచనలన్ గ్రహించుచున్
    వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్

    రిప్లయితొలగించండి
  8. ఆ॥ పట్టణమున భూమి వసతిఁ గనఁ దరమె
    పడయఁ గొంత భూమి పరిణతఁ గని
    శాస్త్ర విజ్ఞత యటు సౌఖ్యమెంచ వలయు
    వాస్తుఁ జూచి కట్టవలదు గృహము

    ఉ॥ ప్రస్తుత కాలమందు ఘన పట్టణ మందునఁ గొంత భూమియున్
    విస్తరణమ్ము హెచ్చఁగను వేడుక లభ్యము గాఁగ మూర్ఖుఁడై
    వాస్తు గణించకన్ వసతి వాంఛకుఁ గూర్చుము శాస్త్ర విజ్ఞతన్
    వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్

    సైటు దొరకడమే కష్టము పట్టణాలలో. ఉన్నంతలో సౌకర్యంగా కట్టకుండా ప్లానుతో సహా వాస్తు జ్ఞాని వద్దకు వెళితే మొత్తం సైటుతో సహా అన్నీ తల్లక్రిందులండి.

    రిప్లయితొలగించండి
  9. కట్టు కొనగ వలెను ఘనముగా యింటిని
    వాస్తు జూసి,కట్ట వలదు గృహము
    నిచ్చ వచ్చి నట్లు నిబ్బందు లాపైన
    పడక తప్ప దనుట వాస్తవమ్ము

    శిస్తుగ కట్టగా వలెను చిన్నదెయైనను యింటినెప్పుడున్
    *“వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్”*
    నేస్తుల మాటలన్ వినుచు నిక్కమటంచు తలంచబోకుమీ
    నాస్తికు లాడు మాటలను నమ్ముచు వాస్తును వీడకెప్పుడున్

    రిప్లయితొలగించండి
  10. ఇల్లుఁగట్టునప్పు డేర్పడ వాస్తును
    చూడదగును గేస్తు సుఖముఁ గోరి
    తొందరపడి యెప్డు దోషపూరితమగు
    వాస్తుఁ జూచి కట్టవలదు గృహము

    రిప్లయితొలగించండి
  11. గేస్తునకెల్ల వేళలను క్షేమము గూర్చఁగ శాస్త్ర పద్ధతిన్
    వాస్తును గీముఁ గట్టుటకు వాసిగ వ్రాసిరి వాస్తుపండితుల్
    వాస్తవమున్ గ్రహించి నిజ స్వాస్థ్యము పెంపు వహింపగా వినా
    వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్

    రిప్లయితొలగించండి
  12. కనకుమా ముహూర్తమును గదలికలకు
    నమ్మి చెడకు కపట నరుల గిరలు
    కలఁగకు మపశకునములఁ గాంచి సుంతయు
    వాస్తుఁ జూచి కట్ట వలదు గృహము


    స్వస్తి యగున్ భృశమ్ముగ నవశ్యము నమ్ము నిరంతరం బప
    ధ్వస్త వివాద యుక్త ఘన దర్పిత లోకులు సేయు నట్టి య
    ప్రస్తుత మైన వాదనలపై నిడి డెందము రిక్త శాస్త్రమున్
    వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    “వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్”

    వాస్తవ జీవనమ్మునను వాసిగ గూడొకటున్న చాలనే
    నాస్తిక వాదులే యిలను నమ్మిక లేక సమాధి భూములన్
    మస్తక మందు దల్తురుగ మాకవి వాసపు యోగ్యమంచు, నే
    “వాస్తును జూచి కట్టకుము, భద్రముగా నివసింప గేహమున్”

    రిప్లయితొలగించండి
  14. వాస్తును జెప్పువారలును బల్గురు
    వెల్సిరి ప్రస్తుతంబయో!
    వాస్తవమౌట కల్ల మరి వారల
    మాటలు నమ్మబోకుమా
    నేస్తమ ! గాలివెల్తురును నిక్కము
    మిక్కిలి రాని చోట యే
    వాస్తును జూచి కట్టకుము భద్రముగా
    నివసించు గేహము

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వాస్తు శాస్త్రమందు వాస్తవమ్ము కలదు
    వాస్తు జూచి కట్ట వలదు గృహమ
    టంచు చెప్పుచుందు రదియు నమ్మని వారు
    వాస్తు చూడ యింటి బలము హెచ్చు.

    రిప్లయితొలగించండి