2, సెప్టెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5232

3-9-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బ్రహ్మ పదార్థమ్ము విషయవాసన రేఁపున్”

(లేదా...)

“బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియలోలురైరహో”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో చేపూరి శ్రీరామ్ గారి సమస్య)


26 కామెంట్‌లు:

  1. ఉ.
    జిహ్మగభూషణుండు సని చిత్రముగా గొనె బెమ్మ శీర్షమున్
    జిహ్మగవేణిఁ జేరి తను చెన్నగు చేతిని సాచె భిక్షకై
    బ్రహ్మవిచార వర్గములు రాజిల భోజనమిచ్చెనా పర
    బ్రహ్మ, పదార్థముం గని విరాగులె యింద్రియ లోలురైరహో !

    రిప్లయితొలగించండి

  2. అహ్మదు నగరమందున
    రహ్మానును గూడి పక్వ రసముం గొని యా
    మహ్మూదు పలికె నిట్టుల
    బ్రహ్మ పదార్థమ్ము విషయవాసన రేఁపున్.


    బ్రహ్మయె నిత్యమంచునది వాస్తవమంచు తానటన్
    బ్రహ్మము గూర్చి వాసిగ తపమ్మొనరించెడు గాధి పుత్రుడా
    బ్రహ్మనెఱుంగ నెంచు తఱి వచ్చిన మేనక గాథ గాంచగాన్
    బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియలోలురైరహో.

    రిప్లయితొలగించండి
  3. కందం
    బ్రహ్మ పదార్థము దేహము
    బ్రహ్మ సృజన పంచభూత పరిపుష్టమనన్
    జిహ్మమొలుకు మగువయనన్
    బ్రహ్మ పదార్థమ్ము! విషయవాసన రేఁపున్!

    ఉత్పలమాల
    బహ్మము పంచభూతముల ప్రాథమికమ్ముగ సృష్టిఁ జేయుచున్
    బ్రహ్మ సృజించినాడనఁగ పంచక నిర్మితమే చరాచరాల్
    జిహ్మయనంగ చూపన నజిహ్మగ మట్లుగ రువ్వు భామయౌ
    బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియలోలురైరహో!

    రిప్లయితొలగించండి
  4. అహ్మదునకేల యిప్పుడు 
    బ్రాహ్మణ జవరాలితో వివాహము జరిగెన్ ?
    బ్రహ్మకయిన తెలియనిదా 
    బ్రహ్మ పదార్థమ్ము , విషయవాసన రేఁపున్

    రిప్లయితొలగించండి
  5. బ్రహ్మ సృజించిన మెల్తుక
    బ్రహ్మ పదార్థమననొప్పుఁ బ్రాయమునందున్
    బ్రహ్మసువే శల్యములిడఁ
    బ్రహ్మ పదార్థమ్ము విషయవాసన రేఁపున్

    జిహ్మముపైపరుండు గద జిష్ణువు వార్థిని పద్మనాభుడై
    బ్రహ్మ జనించినాడుగద పంకజ మందున దేవదేవుడై
    బ్రహ్మసువే సరమ్ములిడఁ బాధితులైరి మునీంద్రులెందరో
    బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియలోలురైరహో

    రిప్లయితొలగించండి
  6. బ్రహ్మను దలచుచు దపమును
    బ్రహ్మాండ ము గా సలుపరె పరమ ము నీ o ద్రుల్
    బ్రాహ్మo బెవరి కి నె చ్చ ట
    బ్రహ్మ పదార్థము విషయ వాసన రే పున్?

    రిప్లయితొలగించండి
  7. కం॥ బ్రాహ్మికుఁడె యెరుఁగడు కదా
    బ్రహ్మపదార్థము, జగతిని బ్రహ్మము నిండెన్
    వహ్మయె తెలుపఁగ నిటులను
    బ్రహ్మపదార్థమ్ము విషయ వాసన రేపున్

    ఉ॥ బ్రాహ్మికుఁడే గ్రహించఁగను రానిదె బ్రహ్మపదార్థమైనచో
    ”బ్రహ్మపదార్థముం గనివిరాగులె యింద్రియ లోలురైరహో”
    వహ్మయె పల్కనిట్టులను భావము నందున దోషముండఁగన్
    బ్రహ్మము సత్యమై జగముఁ బాలనఁ జేయఁగ నిండి యుండెడున్

    బ్రాహ్మికుడు బ్రహ్మోపదేష్ట వహ్మ భ్రాంతి బ్రహ్మము పరమాత్మ (the Supreme Being) బ్రహ్మపదార్థము ఏమియు తెలియనిది అగమ్యగోచరమైనది (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉ॥ చివరి పాదమును
      బ్రహ్మము సత్యమై నిలుచుఁ బాలనఁ జేయఁగ విశ్వమంతయున్
      అని మారుస్తానండి మరికొంత మెరుగౌతుంది

      తొలగించండి
  8. కం:బ్రహ్మము నెరుంగ గోరక
    బ్రహ్మమ్మును గూర్చి చెప్ప ప్రవచనముల నా
    బ్రాహ్మణు మదిలో నిముడని
    బ్రహ్మ పదార్థమ్ము విషయవాసన రేఁపున్”
    (బ్రహ్మాన్ని తాను తెలుసుకొనే సాధన లేకుండా ఉపన్యాసాలకి దిగితే మనస్సు లో నిజం గా లేని బ్రహ్మతత్త్వం కోరికలనే పెంచుతుంది.అది ధనమో,కీర్తి యో ఏదొ ఒకటి.)

    రిప్లయితొలగించండి
  9. బ్రహ్మము ను గూర్చి తెలుపును
    బ్రహ్మపదార్థమ్ము విషయవాసన రేపున్
    బ్రహ్మయె సృష్టించు మనను
    బ్రహ్మమె బోధించుమంచిపద్ధతులనిలన్


    బ్రహ్మమె నిత్యసత్యమని వాసిగ దల్చుచు మానసమ్ములో
    బ్రహ్మము పొంద నెంచుచును రాగము తోడను కానకేగుచున్
    బ్రహ్మము పొందనెంచియును పట్టును తప్పుచు పండి తాళియే
    బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియలోలురైరహో”*


    రిప్లయితొలగించండి
  10. బ్రహ్మోపాసన మొప్పును
    బ్రాహ్మ ముహూర్తమునఁ బడయ బ్రహ్మ పదమ్మున్
    జిహ్మగు లయి పెనఁగనిచో
    బ్రహ్మపదార్థమ్ము విషయ వాసన రేఁపున్

    [బ్రహ్మ పద+అర్థము = బ్రహ్మ లోకమున కయి]


    బ్రహ్మకు నైనఁ బుట్టు నెద రాగము సుందరిఁ గాంచ సంత తా
    జిహ్మ చరిత్రుఁ డైన ననఁ జెప్పఁగ నేల మనుష్య మాత్రులన్
    జిహ్మ చరిత్ర సొం పడరు చేడియ మోమును నంతరంగ మన్
    బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియ లోలు రై రహో

    [బ్రహ్మపదార్థము = అగమ్యగోచరమైనది]

    రిప్లయితొలగించండి
  11. బ్రహ్మమనంగను నె ఱుగుము
    బ్రహ్మయెపరమాత్మయండ్రు వైదిక పురుషుల్
    బ్రహ్మపదార్ధమిడునున్ముక్తిని
    బ్రహ్మపదార్ధమ్మువిషయవాసన రేపున్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  12. బ్రహ్మ ముహూర్తమందు తన స్వాంతము చంచలమై చెలంగనా
    బ్రహ్మ సృజించె భామినిని బ్రహ్మపదార్థము దాని యోచనల్
    జిహ్మములైన పోకడల చేడియ చూడ్కుల గాలమేయనా
    బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియలోలురైరహో

    రిప్లయితొలగించండి
  13. బ్రహ్మము శాశ్వతంబని సరాగులు నిత్యము నొక్కి చెప్పినన్
    బ్రహ్మపదార్ధముంగనివిరాగులె యింద్రియలోలురైరహో
    బ్రహ్మము గూరిచిం విరస భావము నొందుట కేమి హేతువో
    బ్రహ్మకు మాత్రమే తెలియు వారిజ లోచన! మిన్నకుండుమా!

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    బ్రహ్మ పదార్ధముం గని విరాగులె యింద్రియ లోలురైరహో !

    ఉ.మా :

    బ్రహ్మము గూర్చి చెప్పుమనె బ్రాహ్మణ పుట్టుక రాచ మౌనియే
    బ్రహ్మపు శక్తినర్హతలు, బ్రాహ్మణ పూజల మార్గదర్శమున్
    బ్రహ్మయు తత్త్వమెయ్యదియ, బ్రహ్మపు సృష్టిని మోహ చిత్తముల్,
    బ్రహ్మ పదార్ధముం గని విరాగులె యింద్రియ లోలురైరహో !

    రిప్లయితొలగించండి