తే.గీ:పుట్టు మచ్చల లో నున్న గుట్టు చెప్పు పండితుడు సార్వభౌము తో బలికె నిటుల నేమి దోషము లేదయ్య! యిచట పుట్టు మచ్చ మంచిదె, యశమిచ్చు మాన్యులకును” (పుట్టుమచ్చల మంచి చెడ్డలు చెపుతూ ఈ పుట్టు మచ్చ తో దోషం లేదు అన్నాడు."మీకు" అని రాజు గారి తో,పెద్ద వారి తో అనరు."ఏలినవారికి,దొరవారికి" అని అనే వాళ్లు.అలాగే మాన్యులకి అన్నాడు.)
ఉ:"వచ్చెను మార్పు కొల్వున శుభమ్ముగ మా బెజవాడ కాక పె న్మచ్చకు నిచ్చిరే!" యనగ మామ వచించెను "మంచి చోటుకే వచ్చెను,నీవు లంచములు పట్టవు,విప్రుల గౌరవించు పె న్మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్” (పెనుమచ్చ అనే ఊరు ఉంది.ట్రాన్స్ఫర్ బెజవాడ ఇమ్మంటే పెనుమచ్చకి యిచ్చారే అని బాధ.మామయ్య "నువ్వు లంచాలు తినవు కనుక అక్కడ గౌరవిస్తారు.పైగా ఆ ఊళ్లో బ్రాహ్మలని గౌరవిస్తారు" అని కూడా చెప్పాడు.)
ఉ:వెచ్చని పాల నిచ్చి యొక వేశ్య ప్రభున్ బడ వేసి యిట్లనెన్ మచ్చను బుగ్గ పై గలిగి మన్మథ తాపము బెంచు కూతు నే నిచ్చితి మీకు నీ పడతి యెల్లరు మెచ్చగ నర్తన మ్మిడున్ మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్ (ఒక వేశ్యమాత రాజు గారిని మాటకారితనం తో,కాసిని పా లిచ్చి ఇలా పడవేసి కూతురిని అంటు పెట్టింది.ఆ మచ్చని చూపి ఊరించింది.ఆమె నర్తకి గా సభలో యశస్సు పెంచుతుందని కూడా చెప్పింది.)
ఉ.
రిప్లయితొలగించండిఅచ్చపు భీమకన్యనట నర్మిలి వీడి వనంబులోనఁ దాఁ
జొచ్చుచు నాగముం గరము శూర గుణంబుల చేతఁ గావగం
జెచ్చెర కాటు వేసెనది చిత్రము మార్చెను గుబ్జ వోలె నా
మచ్చియు మంచిదే యగును, మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్ !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిస్వచ్ఛమైన వెన్నెలనిడు జాబిలికిని
సకల లోకాల బ్రోచెడి శంకరునకు
మచ్చ కలదందురు జనులు మహిని, కనగ
మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును.
మెచ్చెడి రీతి వెన్నెలను మేదిని బంచెడి పాథి కుండదే
మచ్చ, శిరమ్ము గంగగల మన్మథ సంహరి కంఠ మందునన్
మచ్చను గల్గియుండెనని మాన్యులు చెప్పిరి గాదె కాంచగన్
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్.
తేటగీతి
రిప్లయితొలగించండిక్షీరసాగరోద్భవమైన క్ష్వేళముఁగొని
నీలకంఠుఁడై యశమొందె కాలుఁడనఁగ
పూని లోకహితమ్మెంచ పొందినట్టి
మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును!
ఉత్పలమాల
వెచ్చగఁ బొంగుచున్ గడలి క్ష్వేళము సర్వము నాక్రమింపగా
నిచ్చఁగొనెన్ గదా శివుఁడు నెంచుచు సేమము! నీలకంఠుఁడై
పుచ్చుచు భీతినే యశము పొందెను! లోకహితాన నొందెడున్
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్!
అచ్చఁపు పుట్టుమచ్చయన నందముఁ గూర్చును మచ్చెకంటికిన్
రిప్లయితొలగించండిమచ్చయె కౌముదీపతికి మవ్వమునిచ్చు వియత్తలమ్మునన్
చిచ్చఱకంటి కంఠమున క్ష్వేళము బ్రోచినదెల్ల లోకముల్
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసొచ్చెమగు నగుమోముపై మచ్చయున్న
రిప్లయితొలగించండిమచ్చెకంటికినది కాదె మండనమ్ము
చందిరునిలోని మచ్చ కన్విందొనర్చు
మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎంతటి యవగడము దనకెదురయినను
రిప్లయితొలగించండివారడుగగ లేదనక యవనరముకయి
పేదలకు ధనమిచ్చుట వీడడనెడి
మచ్చ మంచిదె , యశమిచ్చు మాన్యులకును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినచ్చినదగు లగ్నంబున నతడు పుట్ట
రిప్లయితొలగించండిజన్మదుడు కోరెనాతని జాతకమును
పండితుండు తెల్పె నుదుటి పైన పుట్టు
మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును
నచ్చిన మంచిలగ్నమున నాతడు పుట్టెను రాజుభార్యకున్
మెచ్చిన జన్మకారకుడు మేకొనె నాతని జాతకంబుకై
వచ్చిన శాస్త్రకోవిదుడు వానిలలాటముఁ జూచిచెప్పె నై
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిచెచ్చెర శత్రుసంఘమునుఁ జిత్తొనరింపఁగ బూని సైనికుం
రిప్లయితొలగించండిడచ్చపుఁ గార్యశూరుఁడయి యా రిపువర్గపు సీమఁ జొచ్చి వి
వ్వచ్చుని రీతిఁ బోరు తరి వాదరచే క్షతినందెఁ జూడ నా
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్.
దేశ రక్షణ కొఱకు నై దీక్ష బూని
రిప్లయితొలగించండిశత్రు నివహమ్ము తో పోరు సా హ సునకు
గాయ పడినట్టి వేళ లో కలిగి నట్టి
మచ్చ మంచిది యశ మిచ్చు మాన్యు లకును
శంకరాభరణము వారి సమస్య
రిప్లయితొలగించండిమచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చునెప్పుడున్
వచ్చెను ముందుగన్ విషము పాలసముద్రము నుండి పొంగుచున్
త్రచ్చగ దేవదానవులు దార్ఢ్యము తోడను,ప్రోచ లోకముల్
చిచ్చర కంఠి కంఠమున క్ష్వేళము నుంచగ మచ్చయేర్పడెన్
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చునెప్పుడు న్
ఆర్కే శర్మ
శంకరాభరణము వారి సమస్య
తొలగించండిమచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చునెప్పుడున్
వచ్చెను ముందుగన్ విషము పాలసముద్రము నుండి పొంగుచున్
త్రచ్చగ దేవదానవులు దార్ఢ్యము తోడను,ప్రోచ లోకముల్
చిచ్చఱ కంటి కంఠమున క్ష్వేళము నుంచగ మచ్చయేర్పడెన్
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చునెప్పుడు న్
ఆర్కే శర్మ
తే.గీ:పుట్టు మచ్చల లో నున్న గుట్టు చెప్పు
రిప్లయితొలగించండిపండితుడు సార్వభౌము తో బలికె నిటుల
నేమి దోషము లేదయ్య! యిచట పుట్టు
మచ్చ మంచిదె, యశమిచ్చు మాన్యులకును”
(పుట్టుమచ్చల మంచి చెడ్డలు చెపుతూ ఈ పుట్టు మచ్చ తో దోషం లేదు అన్నాడు."మీకు" అని రాజు గారి తో,పెద్ద వారి తో అనరు."ఏలినవారికి,దొరవారికి" అని అనే వాళ్లు.అలాగే మాన్యులకి అన్నాడు.)
సమస్య:
రిప్లయితొలగించండి“మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్”
ఉ.మా :
ఖ(క)చ్చితమైన జీవితము, కష్టపు దారులు మెండు మెండహో
పిచ్చియు పట్టెనంచు, మరి పీడలు హెచ్చును వింతలోకమున్
వచ్చును చెడ్డ పేరుయును, వంకలు బెట్టని జీవనమ్మునన్
“మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్”
ఉ:"వచ్చెను మార్పు కొల్వున శుభమ్ముగ మా బెజవాడ కాక పె
రిప్లయితొలగించండిన్మచ్చకు నిచ్చిరే!" యనగ మామ వచించెను "మంచి చోటుకే
వచ్చెను,నీవు లంచములు పట్టవు,విప్రుల గౌరవించు పె
న్మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్”
(పెనుమచ్చ అనే ఊరు ఉంది.ట్రాన్స్ఫర్ బెజవాడ ఇమ్మంటే పెనుమచ్చకి యిచ్చారే అని బాధ.మామయ్య "నువ్వు లంచాలు తినవు కనుక అక్కడ గౌరవిస్తారు.పైగా ఆ ఊళ్లో బ్రాహ్మలని గౌరవిస్తారు" అని కూడా చెప్పాడు.)
ఉ:వెచ్చని పాల నిచ్చి యొక వేశ్య ప్రభున్ బడ వేసి యిట్లనెన్
రిప్లయితొలగించండిమచ్చను బుగ్గ పై గలిగి మన్మథ తాపము బెంచు కూతు నే
నిచ్చితి మీకు నీ పడతి యెల్లరు మెచ్చగ నర్తన మ్మిడున్
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్
(ఒక వేశ్యమాత రాజు గారిని మాటకారితనం తో,కాసిని పా లిచ్చి ఇలా పడవేసి కూతురిని అంటు పెట్టింది.ఆ మచ్చని చూపి ఊరించింది.ఆమె నర్తకి గా సభలో యశస్సు పెంచుతుందని కూడా చెప్పింది.)
మచ్చ శాస్త్రము పరికింప మానవేంద్ర
రిప్లయితొలగించండిదోష మించు కైనను లేదు దుఃఖ మేల
కుడి భజమ్ముపైఁ జక్కఁగ నడరు పుట్టు
మచ్చ మంచిదె యశ మిచ్చు మాన్యులకును
మెచ్చరె లోకు లింపుగ శ్రమించి యెదిర్చి రణమ్ములన్ జయం
బిచ్చిన వంత గాయమున కేలను క్షాత్రవ కోటి కేర్పడన్
నిచ్చలు వింటి నెక్కిడ ననీక ముఖమ్మున నల్లె త్రాటి యా
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్
ఎడమ వైపున స్త్రీలకు కుడిది శన,పు
రిప్లయితొలగించండిరుషుల కుంండిన మంచిది వసుధయందు
పుట్టి నప్పుఁడె గనిపించు బుల్లి పుట్టి
మచ్చమంచిదె, యశమిచ్చు మాన్యులకును
మచ్చలు వచ్చుచుండునిల మానవ కోటికి కర్మసాక్షిగా
రిప్లయితొలగించండిమచ్చల కారణంబునన మంచిగ నుండుట సాధ్యమౌను నా
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్”
బుచ్చలపాటి మంగపతి! పూర్తిగ నమ్ముము మానసంబునన్
లోకకళ్యాణముకొరకు రుద్రుడపుడు
రిప్లయితొలగించండిగరళమును గ్రోలి దాచెనుకంఠమందె
కప్పుమిగిలిపోయినగాని ఖ్యాతి నొసగె
*“మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును”*
మెచ్చుచు చెంత చేరగను మెచ్చక పొమ్మని దూరముంచగన్
చెచ్చెర యాగ్రహించుచును చేడియ యూర్వశి శాపమిచ్చి నన్
జొచ్చెను పేడిరూపమున సోదరు తోడనునాకిరీటియే
*“మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్”*
ఉ.మా :
రిప్లయితొలగించండినచ్చితివంచు కీచకుడు నాతిని రమ్మనె మేదకంబుతో
మెచ్చితి నీదు భోగమది మేదినసంభవ కామకేళికై
గుచ్చెడి చూపులన్ మదిని గుట్టుగ నాటెను మాలినీ క్షతీ
“మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్”
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కడలి నుద్భవ మొందిన గరళముఁ గొనె
జగతి హితము నాశించిన శంకరుండు
మచ్చ యేర్పడినను కంఠమందు కనగ
మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును.