కం:"రాష్ట్రమె ముఖ్యము, హిందూ రాష్ట్రమ్మో? మహ్మదీయ రాష్ట్రమొ? కాదం చుష్ట్రమును తురుష్కు లిడగ నుష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్” (దేశాన్ని హిందూ రాష్ట్రం గా చేస్తా మని కొందరు,అల్లా రాజ్యం చేస్తామని కొందరు గోల చేస్తున్న ఈ రోజుల్లో ఆ మహమ్మదీయులు గణేశోత్సవాలకి ఒంటెని ఇచ్చారు.గణేశుడు దాని పై ఊరేగాడు.)
ఆష్ట్రమునంటిన క్షామము
రిప్లయితొలగించండిరాష్ట్రము నందున నెలకొని రట్టడి జేయన్
ఉష్ట్రమె తగు వాహనమని
యుష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్
ఆష్ట్రము= ఆకాశము
రిప్లయితొలగించండిభ్రాష్ట్రము హద్దుగ గలిగిన
రాష్ట్రము లెరుగవె యిల శుషిరమె జక్కిగదా
త్వాష్ట్రుడ చెప్పుమదెప్పుడొ
యుష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్.
రాష్ట్రము లోన వేడ్కగను రాజధరున్ సుతుడౌ వినాయకున్
భ్రాష్ట్రమె హద్దుగా చెలగి భక్తులు వేడ్కలు చేయుచుందురే
త్వాష్ట్రుడ మూషకంబుకద వాహన మాతని కందు రెట్టులా
యుష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్.
ఆష్ట్రము లోనిదేవతలు హాయిగ చూచుచు నున్న వేళలో
రిప్లయితొలగించండిరాష్ట్రము లోనిమానవులు రమ్మని భక్తిగ పిల్చు వేళలో
భ్రాష్ట్రము లందుసిద్ధమగు వంటలఁ గాంచుచు ప్రీతి నొందుచున్
నుష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్
[బ్రాష్ట్రము = వేఁపుడు చట్టి]
ఆష్ట్రములోని గణపతిని
తొలగించండిరాష్ట్రములో భక్తగణము రమ్మని పిలువన్
భ్రాష్ట్రములో బూరెలఁగనె
నుష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్
కం॥ రాష్ట్రమున నెలుకలఁ గనక
రిప్లయితొలగించండిరాష్ట్రపు పంటలఁ జెఱచఁగ మ్రక్కించఁగ సౌ
రాష్ట్రపు టేనుఁగు కనఁబడ
నుష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్
ఉ॥ రాష్ట్రమునందు మూషికములన్ గనఁ బంటలఁ గీడుఁ జేసెడిన్
రాష్ట్ర వినాశకారియని రాజ్యము నందున నేరివేయ సౌ
రాష్ట్రపు టేనుఁగై వరలి రాజస మొప్ప చరించుండు నా
యుష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్
మ్రక్కించు చంపు (నిఘంటువు సహాయమండి)
సౌరాష్ట్ర కచ్ లోకూడ ఎడారి ఉంటుందండి. గుజరాత్ లో ఒంటెలు ఎక్కువగా వాడుతారు. పంటలు నాశనము చేసే ఎలుకలను లేకుండా చేసినందున ఒంటె మీద గణనాథుడు వచ్చాడు అని
రాష్ట్రపు టేనుఁగై వరలి రాజస మొప్ప చరించుచుండు నా
తొలగించండిఉ॥ సరిచేసిన 3వ పాదమండి
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆష్ట్రేలియా దెసన మన
రాష్ట్రములోవలె నచట నరసిన దినమునన్
రాష్టీయపు యవి దొరుకక
ఉష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్
భ్రాష్ట్రము నుండి ధారగను వర్షము తుట్రిలు చుండగన్ మహా
రిప్లయితొలగించండిరాష్ట్రము నందు నంతట విరామము నివ్వక పర్వమందు యా
రాష్ట్రము నందు కష్టమని రాకడ పోకడ మూషికంబుపై
ఉష్ట్రము నెక్కి వచ్చెను మహోధరుడౌ గణనాథుడొయ్యనన్
రాష్ట్రమునందు నెల్లెడల రట్టడి వెట్టుచు క్షామమేర్పడన్
రిప్లయితొలగించండిఆష్ట్రమునంటు బాధితుల యార్తముఁదీర్చఁగ నాఖువాహనుం
డుష్ట్రఁపు వాహనమ్మెకడు యుక్తము బోవుటకంచునెంచి తా
నుష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్
కం:"రాష్ట్రమె ముఖ్యము, హిందూ
రిప్లయితొలగించండిరాష్ట్రమ్మో? మహ్మదీయ రాష్ట్రమొ? కాదం
చుష్ట్రమును తురుష్కు లిడగ
నుష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్”
(దేశాన్ని హిందూ రాష్ట్రం గా చేస్తా మని కొందరు,అల్లా రాజ్యం చేస్తామని కొందరు గోల చేస్తున్న ఈ రోజుల్లో ఆ మహమ్మదీయులు గణేశోత్సవాలకి ఒంటెని ఇచ్చారు.గణేశుడు దాని పై ఊరేగాడు.)
రాష్ట్రము చేరగ దలచియు
రిప్లయితొలగించండిరాష్ట్రము లో మోద కముల రయము భుజంప న్
రాష్ట్రమున నె లుక దొరకక
ను ష్ట్ర ము నెక్కి గణ నాథు డొ య్యన వచ్చె న్
సమస్య:
రిప్లయితొలగించండి“ఉష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్”
ఉ.మా :
రాష్ట్రము లోన దిర్గు నట రమ్యపు వాహన మండ్రు జెప్పుమా ?
రాష్ట్రము గుర్తు దెచ్చు మరి రాదుగ దప్పిక లేక నీటికే !
రాష్ట్రపు చిహ్నమై దిరిగె రాజు వినాయకు వాహనంబుగా
“ఉష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్”
రాష్ట్రము లోన దిర్గు నట రమ్యపు వాహన మండ్రు జెప్పుమా ?(ఒంటె వాహనం..రాజస్థాన్)
రాష్ట్రము గుర్తు దెచ్చు మరి రాదుగ దప్పిక లేక నీటికే !(ఆరు నెలలు నీరు లేకుండా ఉండేజీవి - ఒంటె)
రాష్ట్రపు చిహ్నమై దిరిగె రాజు వినాయకు వాహనంబుగా (గణపతి వాహనంగా ఒంటెని నిలిపి ఊరేంగించారు అక్కడ)
“ఉష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్”
త్వాష్ట్రీ తారా భాసిత
రిప్లయితొలగించండిరాష్ట్రమున వెలుంగు చంద్రు రమణ నడరుచున్
రాష్ట్రఘ్నుఁడు మూషికము జి
తోష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్
[త్వాష్ట్రి=చిత్త; రాష్ట్రము=ఉపద్రవము]
ఆష్ట్రము నందు నిత్యము సహస్ర మయూఖుఁడు సంతసమ్మునం
ద్వాష్ట్రి మనోహరుండు సను భంగినిఁ గన్పడ నిచ్చ మెచ్చుచున్
రాష్ట్రము రాష్ట్రముం దిరుగ రక్తి ననింద్యుఁ బ్రధావనచ్యుతో
గ్రోష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్
[ ఆష్ట్రము=ఆకాశము; త్వాష్ట్రి=సంజ్ఞాదేవి; రాష్ట్రము=దేశము]
కందం
రిప్లయితొలగించండిరాష్ట్రేతరులున్ మెచ్చఁగ
రాష్ట్రము నవరాత్రి జరుప ప్రాభంజనిగా
నాష్ట్రమె కన నొక దినమున
నుష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్!
రాష్ట్రము నందు వేడ్కగ నవరాత్రులొనర్చ గణేశ పర్వమై
రాష్ట్రము తోడుగన్ పొరుగు రాష్ట్రమువారలు మెచ్చు రీతిగా
నాష్ట్రమె సాక్షిగన్ హనుమయా యను పోలిక నొక్క నాడహో!
నుష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్!
ఆస్ట్రేలియాకు చెందిన
రిప్లయితొలగించండినుష్ట్రము నొకదానిఁజూచి యుత్సాహముతో
నుష్ట్రము గణపతి కీయఁగ
నుష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్”
అస్ట్రము మీదకుంగనగ నద్భుతమొక్కటి గానిపించెనే
రిప్లయితొలగించండియుష్ట్రముఁబోలునట్లుగనట యొక్కొక మేఘము దానిపైన యా
యుష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్”
రాష్ట్రము చుట్టి వచ్చునటు రంజిలఁజేసెను నద్భుతంబుగా