తే.గీ:ఆత డమ్మహా వాక్యమ్ము లన్ని చదివి గ్రాంథికజ్ఞానమే పొంది గర్వ బడుచు ననుచు నా "యహం బ్రహ్మాస్మి" యనెడు మాట తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల” (కేవలం పుస్తకాలలో అద్వైతం చదివి అపరోక్షానుభూతి లేకున్నా ఆ పుస్తకజ్ఞానం తో అహం బ్రహ్మాస్మి అనుకుంటుంటాడు.)
మ.
రిప్లయితొలగించండిఘన బృందారక సేవ్య కృష్ణ విలసత్కమ్ర ప్రలీలా నివా
సనమౌ భాగవతంబు నేర్చి కవి విస్ఫారోద్విశిష్టంబునౌ
గుణముల్ కల్గు కవిత్వ లాస్యములఁ, దెన్గున్ మెచ్చి శ్రీఘ్రంబ పో
తనకే తాను నమస్కరించు కొని మోదంబందె నత్యంతమున్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండికృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణువనుచు
లోకమెల్లను మ్రొక్కంగ మోకరిల్లి
వాసుదేవుండు తానని పౌండ్రకుండు
తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల
మత్తేభవిక్రీడితము
ఘనులే మ్రొక్కఁగ దివ్యరూపుడనుచున్ గావంగ రమ్మంచు మా
మనసే నీదని మ్రొక్కఁగన్ హరిగ సన్మానించి శ్రీకృష్ణుఁ దా
నన గృష్ణుండని పౌండ్రకుండు స్వపదారాధ్యానురక్తుండునై
తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్
ధనమును గడించుటందున దనను మించి
రిప్లయితొలగించండిపుడమి పయిన నింకెన్నడు పుట్టడనుచు
దలచి , తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును ,
మిగుల స్వార్థపరుడతడు మేదినిపయి
రిప్లయితొలగించండి*(పరశు రాముడు, శ్రీరాముడు ఇరువురూ విష్ణ్వవతారులే అంటే ఇరువురొక్కటే అను భావముతో...)*
కినుక బూని చేరిన యట్టి మునికి వినయ
మందున నమస్కరించెనె యనఘు డైన
దాశరథియన విబుధుడు తలచె నిటుల
తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల
ఘనమౌ శంకర చాపమే యచట భగ్నంబైన యావెంటనే
ముని యా భార్గవ రాముడే కినుకతో పూజ్యుండు కామారిదౌ
ధనువున్ ముక్కలు సేసె నెవ్వడనుచున్ దానడ్గగా రాముడే
తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్.
విశ్వమంతయు తానైన విష్ణుమూర్తి
రిప్లయితొలగించండిసర్వ జీవులందుంటయు సత్యముగద
పరగి మానవ రూపాన భక్తుడగుచు
తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల
ధనమేమాత్రము లేని వాడు ఋణమున్ ధైర్యంబుగా గైకొనెన్
మనసే వేగిరపాటునొంది నపుడే మారాజు చందంబుగా
ఘనకార్యంబనఁ గట్టె నొక్క గృహమున్ గష్టాలతో నా నికే
తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్
అన్ని రంగా ల లో నేనె యా డ్యు డనుచు
రిప్లయితొలగించండివిఱ్ఱ వీగుచు మసలె డు వెర్రి వాడు
తనకు తా మ్రొ క్కి మోద ంబు గనును మిగుల
తనను మించ గ లేరంచు తలచి గాదె
తే॥ రామనామము రమ్యము రామ చరిత
రిప్లయితొలగించండిసుమధురము రామ జపమిడు శోభలిలను
ధన్యతఁ బడయ నెంచుచు దశరథుని సు
తునకె తా మ్రొక్కి మోదంబు గనును మిగుల
మ॥తనరన్ ధాత్రిని సర్వశక్తులను సంధానించి సద్వర్తనన్
వినయమ్మొప్పఁగఁ బ్రోచ వేడుచు సదా విశ్వేశ్వరున్ భక్తితోఁ
జనఁగా సాధకుఁ డడ్డుఁ గాంచునె కనన్ సర్వేశుఁ డందించు చే
తనకే తాను నమస్కరించుకొని మోదంబందు నత్యంతమున్
మరొక పూరణ అండి (నేటి స్థితి)
కనుమా మారెనె కాలమెంతగనొ నిక్కంబెంచ నీధాత్రినన్
మనఁగా నెవ్వరు నీకు తోడుఁ గనరే మన్నించి సారించవో
తనరన్ వృద్ధినిఁ బొంది పోరఁదగు సంధానించి శక్త్యాదులన్
దనకే తాను నమస్కరించుకొని మోదంబందు నత్యంతమున్
(శ్రీశ్రీ చెప్పినది భగవద్గీతలో కృష్ణ భగవానుడు 6.5 ఉద్ధరేదాత్మానాత్మనమ్ చెప్పినది అదేనండి)
తే.గీ:ఆత డమ్మహా వాక్యమ్ము లన్ని చదివి
రిప్లయితొలగించండిగ్రాంథికజ్ఞానమే పొంది గర్వ బడుచు
ననుచు నా "యహం బ్రహ్మాస్మి" యనెడు మాట
తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల”
(కేవలం పుస్తకాలలో అద్వైతం చదివి అపరోక్షానుభూతి లేకున్నా ఆ పుస్తకజ్ఞానం తో అహం బ్రహ్మాస్మి అనుకుంటుంటాడు.)
మ:"తనకున్ భాగవతమ్ము ప్రాణ" మను,"తత్త్వమ్మెల్ల యందున్న" దం
రిప్లయితొలగించండిచను ,మాటాడిన నందు నున్న పది పద్యమ్ముల్ బఠించున్, సదా
తన భక్తిన్ వెలయించి భాగవతకర్తన్ దల్చి యా భక్తపో
తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్”
ధనమూలమ్ము జగమ్మటంచు దలచున్ తానెప్పుఁ డాత్మమ్మునన్
రిప్లయితొలగించండిధనసంపాదనకై యొనర్చునతి క్షుద్రంబౌ నకృత్యంబులన్
కనఁడెన్నండును సౌమనస్యము మదిన్ గర్వాంధుఁడై మెల్గుచున్
తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్
ధనమె మూలంబటంచెప్డు దలచునతఁడు
రిప్లయితొలగించండితృప్తి సుంతయు గనరాదు తృష్ణ మెండు
పరుల నిందించు మితిమీరి వరలుచుండు
తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల
ఆత్మ పరమాత్మ లనునవి యరయతెలియు
రిప్లయితొలగించండిచిత్స్వరూపమైయుండును జీవికిలను
తానె భగవంతుఁడనుచును దలచి మదిని
తనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల”