9, సెప్టెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5239

10-9-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పూజించెడివారి కెటులఁ బుణ్యము దక్కున్”

(లేదా...)

“పూజలు సేయువారలకుఁ బుణ్యము రాదని యండ్రు పండితుల్”

19 కామెంట్‌లు:

  1. ఉ.
    బూజును బోలు మానసము పుష్కరమై భగవత్పదంబుపై
    రాజిలునే ? మదంబనెడి లక్షణమే గరిమంబటంచు వి
    భ్రాజిత భక్తి వీడి భువి పావన రీతులు మాని గర్వులై
    పూజలు సల్పు వారలకు పుణ్యము రాదని యండ్రు పండితుల్ !

    రిప్లయితొలగించండి

  2. మోజనుచు మిత్రు లెల్లరు
    పూజలు సేతురని యెఱగి మూర్ఖుండతడై
    రోజు తలిదండ్రుల తెగడి
    పూజించెడివారి కెటులఁ బుణ్యము దక్కున్.


    మోజుగ మిత్రులెల్లరును బుద్ధిగ వేకువ జామునందునన్
    బూజలు సేతురంచెఱగి మూర్ఖుడు తానును తల్లి దండ్రులన్
    రోజట హింస బెట్టుచు నరోత్తము డంచును రామచంద్రుకున్
    బూజలు సేయువారలకుఁ బుణ్యము రాదని యండ్రు పండితుల్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    సాజము పరోపకారము
    నైజముగన్ వర్తిలంగ నలువయు మెచ్చున్
    వ్యాజము నిల్పుచు మదిలో
    పూజించెడివారి కెటులఁ బుణ్యము దక్కున్


    ఉత్పలమాల
    సాజగుణంబులౌ దయయు, జాలియు, దాన, పరోపకారముల్
    నైజము గావలెన్ భువిని నల్వయు మెచ్చెడు మానవత్వమై
    రాజిలు నప్పుడే మనిషి, ప్రాణులు కుందగ హింసలెంచుచున్
    పూజలు సేయువారలకుఁ బుణ్యము రాదని యండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  4. పూజలు సువ్రతమ్ములను పొల్పుగ సల్పుటకన్న మిన్నయౌ
    భోజనమొక్కపూటయినమోదముగా నిరుపేదకీయ నా
    భాజనుడే గణింప నిజభక్తుఁడు, దీనుల యార్తి బాపకన్
    పూజలు సేయువారలకుఁ బుణ్యము రాదని యండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. పూజా ఫలమాశింపక
      పూజించెడి వారికెపుడు పుణ్యము దక్కున్
      పూజలు క్షుద్రమయినచో
      పూజించెడివారి కెటులఁ బుణ్యము దక్కున్?

      తొలగించండి
    2. పూజలు సేయువారలకుఁ బుణ్యము వచ్చునటంచు చెప్పినన్
      బూజలు సేయకుండినను పుణ్యము దక్కుట సాధ్యమేసుమా!
      పూజలు నిత్యకృత్యమను పోకడతో వెడ క్షుద్ర దేవతా
      పూజలు సేయువారలకుఁ బుణ్యము రాదని యండ్రు పండితుల్

      తొలగించండి
  6. పూజలు నోములు వ్రతములు
    భూజను లొనరింత్రు పుడమిఁ బుణ్యము కొరకై
    భోజనమిడకను పేదకు
    పూజించెడివారి కెటులఁ బుణ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  7. ఏ జీవితమందైనను
    ఆజిన నోటమిని బొంది యానందమునన్
    రాజిలుచుండెడి వానిని
    పూజించెడివారి కెటులఁ బుణ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  8. పూజలు చిత్తశుద్ధిమెయి మ్రొక్కచు
    వారల యిష్టదైవమున్
    రోజతి శ్రద్ధతోడ గడు రూఢిగ జేసిన
    దక్కు పుణ్యమున్
    సాజముగాక పేరుకయి సాగపవిత్ర
    విచిత్ర చిత్రమౌ
    పూజలు సేయువారలకు పుణ్యము
    రాదని యంద్రుపండితుల్



    రిప్లయితొలగించండి
  9. సమస్య-
    పూజలు సేయు వారలకు బుణ్యము రాదనియండ్రు పండితుల్

    ఉ.మా.

    రాజులు పోయిరే మరల రాముని రాజ్యము వచ్చునాయనిన్
    జాజుల తోటలన్ దిరిగి జాగృతి సేసెడు కృష్ణ కాలమున్
    మోజులు కోరిరే జనులు మోసపు బుద్ధులు మీరు రీతిలో
    పూజలు సేయు వారలకు బుణ్యము రాదనియండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  10. (1)కం:భోజనము పెట్ట పేదకు
    నీ జీవిత మందు నెపుడు నెంచక సిరి పై
    మోజున దానిని గోరుచు
    పూజించెడివారి కెటులఁ బుణ్యము దక్కున్?

    (2)ఉ:భోజన మీయ పేదలకు భోరున నేడ్చుచు,నర్చకాళికిన్
    బూజల సేయ దక్షిణకు భోరున నేడ్చుచు పేర్లు వ్రాయగా
    రాజసరీతి చూపరులు రంజన నొంద బ్రదర్శనార్థమై
    పూజలు సేయువారలకుఁ బుణ్యము రాదని యండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  11. కం॥ ఈ జగమున భక్తిఁ గనుచు
    రాజిలు మనుజులరుదు గద లౌక్యము పరఁగన్
    మోజుగ గొప్పలఁ దెలుపఁగఁ
    బూజించెడి వారికెటులఁ బుణ్యము దక్కున్

    ఉ॥ ఈ జగమందు భక్తిఁ గని యీశునిఁ గొల్చెడి వారలేరయా
    మోజుగఁ జూపి యార్భటము మోహపు వాంఛలఁ దీర్చఁ గోరుటే
    నైజము నేఁడు దైవమును నమ్మక గొప్పకు భక్తి హీనమౌ
    పూజలు సేయు వారలకుఁ బుణ్యము రాదని యండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  12. భూజను లెవ్వరినిఁ గొలువఁ
    గాఁ జను సద్భక్తి తోడఁ గరుణం జెపుమా
    తేజున నశించి పాపము
    పూజించెడి వారి కెటులఁ బుణ్యము దక్కున్


    ఓజ నొనర్ప మానవుల కుర్విని సేవలు చిత్త శుద్ధితోఁ
    బూజలు సేయ నేల యది పుణ్య మొసంగును నిశ్చయమ్ముగన్
    భూజన నాశ నార్థముగ మూరి జపమ్ములు క్షుద్ర దేవతా
    పూజలు సేయు వారలకుఁ బుణ్యము రాదని యండ్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  13. ఆజిని గెలుపుంబొందక
    రాజసమున దూఱుచుండి రఘుకుల తేజున్
    రోజుల వెంబడి తెగడుచుఁ
    బూజించెడివారి కెటులఁ బుణ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  14. రోజుల వెంబడిన్ మిగుల రోతను దూషణఁజేయు చుండుచున్
    బూజలు సేయువారలకుఁ బుణ్యము రాదని యండ్రు పండితుల్”
    భాజను లైనవారలును భక్తివిహీనతఁ గల్గియుండుచోఁ
    బూజలుసేసినం'ఫలము పుట్టదు తథ్యము నిక్కమేసుమా

    రిప్లయితొలగించండి
  15. సాజము గా లభ్య మగును
    పూజలు చే సెడి జనులకు పుణ్యo బిలలో
    మోజుగ తిరుగుచు క్షుద్రపు
    పూజించె డి వారి కె టుల పుణ్యము దక్కు న్?

    రిప్లయితొలగించండి