గజయాన కైదవ తనమ గు, జనుల నిత్యావసరమగు సరుకుగను భే షజముగను పనికి వచ్చెడి రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్.
(రజని=పసుపు)
రుజలన్ దొలగించునది స హజశక్తినొసంగుచునది యారబమును భే షజముగ రక్షించెడి న త్రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్.
ప్రజలిల మంగళమ్మనుచు భావన సేయు పదార్థమైన భే షజముగ మేలొనర్చెడి నిశాహ్వము మేటిగ లాభమిచ్చుచున్ విజయము గూర్చునంచు కడు ప్రీతిని జూపుచు సాగు జేసెడిన్ రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్.
విజయమనంగనేమి యన విస్తృత మౌ ఫల సాయమందుటే నిజమది రోగమంటినను నిష్ఫలమౌ కృషి యంచు నెంచి భే షజముగ ముఖ్యమంచు వ్యవసాయము నందున వాడు నట్టి న త్రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్.
కం:గజ గజ వణకించు చలిని గజము గజము బొలము జూచు కర్షకి యౌ నా గజగమన యౌ వితంతువు రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్” (ఆ స్త్రీ కి భర్త గతించాడు.స్త్రీ ఐనా అంత జాగ్రత్తగా వ్యవసాయం చేస్తున్న రజని అనే స్త్రీని రైతులు మెచ్చుకోవాలి.)
2)చం:గజముల గుంపు నల్లనగు కాయములన్ వని గ్రమ్మినట్టు ల క్కజముగ సూర్యకాంతులను గ్రమ్మెను నల్లని మేఘపంక్తి, యే భజన ఫలమ్మొ కాని భగవానుడె యీ పగటిన్ విదల్చు నీ రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్” (రజని అంటే రాత్రి,చీకటి .మేఘాలు కమ్ముకొని చీకటి ఐపోయింది.ఈ చీకటి వర్షసూచన కనుక రైతులు దీన్ని మెచ్చుకోవాలి. భగవంతుడు పగటి పూటే రాత్రిని విదిల్చాడు.)
కం॥ నిజముగ నీటి వనరులే విజయముఁ గను రైతులకిల విరియుచు వానల్ విజయముచేయఁగ రాత్రుల రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్
చం॥ నిజముగఁ బాడిపంటలను నెమ్మిగఁ బొందఁగ నీటి లభ్యతే విజయముఁ గూర్చి మోదమిడు విచ్చిన సాంద్రత తీర్చు బాధలన్ బ్రజలకు, రాత్రి పూటలనె రాజిలు చుండఁగ వర్ష మెల్లెడల్ రజనిని మెచ్చగా వలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్
(సామాన్యంగా మంచి వర్షము రాత్రిళ్ళు పడుతుందండి. మఖ ఉత్తర కార్తెలలో రాత్రిపూట వానలు పడితే చెరువులు నిండగలవు. పల్లెల్లో ఆరుద్ర ను ఆరెద్దుల మఖని మగ అంటారండి)
కందం
రిప్లయితొలగించండిరుజలవి పంటలకెపుడు స
హజముగ నాశమొనరించు నాపెడు కతనన్
నిజమగు సత్తువనిడు న
త్రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్
చంపకమాల
తొలగించండిరుజలవి పంటలన్ జిదుము లోకము నందుననెంచి చూడగన్
సుజలము తోడుగన్, దెలిసి శోకము బాయగ, శాస్త్ర పద్ధతిన్
నిజమగు సత్తువన్ బడసి నేర్పుగ పోరగ నందజేయ న
త్రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్
చ.
రిప్లయితొలగించండిభుజముల బల్బలంబుల సుభూరి సమంచిత యత్నమెంచి దు
న్ని జలము పార జేసినను, నేత్రము పంటల కావ వేసినన్
రుజముల నిచ్చు పుర్గులట రోషము చూపుచు చేరు, మంచి న
త్రజనిని మెచ్చగావలెను రైతులు సత్ఫల సిద్ధి గోరుచున్ !
ప్రజలకు వలసిన పంటలు
రిప్లయితొలగించండినిజముగ పండింతురుగద నిరతము రైతుల్
విజయము లభియింపగ న
త్రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్
గజిబిజి లేక పంటలను గట్టిగ యోచన చేయగాదగున్
తొలగించండివిజయము నిచ్చు పంటలను వేసిన చాలును సీరవాహకుల్
నిజముగ పప్పుధాన్యముల నెన్నిక జేయగ లభ్యమైన న
త్రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్
నిజమగు విత్తుల నొందుచు
రిప్లయితొలగించండిసజావుగ గమతమును గొనసాగించుటకై
సుజనుల పక్షపు రంగగు
రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్
రిప్లయితొలగించండిగజయాన కైదవ తనమ
గు, జనుల నిత్యావసరమగు సరుకుగను భే
షజముగను పనికి వచ్చెడి
రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్.
(రజని=పసుపు)
రుజలన్ దొలగించునది స
హజశక్తినొసంగుచునది యారబమును భే
షజముగ రక్షించెడి న
త్రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్.
ప్రజలిల మంగళమ్మనుచు భావన సేయు పదార్థమైన భే
షజముగ మేలొనర్చెడి నిశాహ్వము మేటిగ లాభమిచ్చుచున్
విజయము గూర్చునంచు కడు ప్రీతిని జూపుచు సాగు జేసెడిన్
రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్.
విజయమనంగనేమి యన విస్తృత మౌ ఫల సాయమందుటే
నిజమది రోగమంటినను నిష్ఫలమౌ కృషి యంచు నెంచి భే
షజముగ ముఖ్యమంచు వ్యవసాయము నందున వాడు నట్టి న
త్రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్.
రుజలవి దరి రా నీ యక
రిప్లయితొలగించండిప్రజలకు బంగారు పంట బాగుగ నొస గన్
రుజువు గ బని చేసెడి న
త్ర జనిని మె చ్చ o గ వలెను రైతులు నెమ్మి న్
చంపకమాల
రిప్లయితొలగించండివిజయము కోరి సైరికుడు వేళకు పైరుకు పెర్గటానికిన్
సుజలము నందజేసినను శోభిలు చుండును క్షేత్రమంతయున్
రుజయది రూపుమాపి ప్రతిరోజును మొక్కకు సత్తు విచ్చు న
త్రజనిని మెచ్చగావలెను రైతులు సత్ఫలసిద్ధిగోరుచున్
సజలమ్మగు సరసున నీ
రిప్లయితొలగించండిరజములు వికచమ్మునొందు లాగున పుడమిన్
ప్రజలకు మేల్గూర్చెడు న
త్రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్
సుజలఁపు కూమమందునను సూర్యకరమ్ములు సోకి నంతనే
రిప్లయితొలగించండిసుజలము విచ్చుకొన్నటుల శోషము నొందెడు పంట భూములన్
రుజలనుబాపి పంటలకు రూఢముగా బలమిచ్చునట్టి న
త్రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్
సుజలము=మంచినీరు, తామర
కం:గజ గజ వణకించు చలిని
రిప్లయితొలగించండిగజము గజము బొలము జూచు కర్షకి యౌ నా
గజగమన యౌ వితంతువు
రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్”
(ఆ స్త్రీ కి భర్త గతించాడు.స్త్రీ ఐనా అంత జాగ్రత్తగా వ్యవసాయం చేస్తున్న రజని అనే స్త్రీని రైతులు మెచ్చుకోవాలి.)
2)చం:గజముల గుంపు నల్లనగు కాయములన్ వని గ్రమ్మినట్టు ల
రిప్లయితొలగించండిక్కజముగ సూర్యకాంతులను గ్రమ్మెను నల్లని మేఘపంక్తి, యే
భజన ఫలమ్మొ కాని భగవానుడె యీ పగటిన్ విదల్చు నీ
రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్”
(రజని అంటే రాత్రి,చీకటి .మేఘాలు కమ్ముకొని చీకటి ఐపోయింది.ఈ చీకటి వర్షసూచన కనుక రైతులు దీన్ని మెచ్చుకోవాలి. భగవంతుడు పగటి పూటే రాత్రిని విదిల్చాడు.)
కం॥ నిజముగ నీటి వనరులే
రిప్లయితొలగించండివిజయముఁ గను రైతులకిల విరియుచు వానల్
విజయముచేయఁగ రాత్రుల
రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్
చం॥ నిజముగఁ బాడిపంటలను నెమ్మిగఁ బొందఁగ నీటి లభ్యతే
విజయముఁ గూర్చి మోదమిడు విచ్చిన సాంద్రత తీర్చు బాధలన్
బ్రజలకు, రాత్రి పూటలనె రాజిలు చుండఁగ వర్ష మెల్లెడల్
రజనిని మెచ్చగా వలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్
(సామాన్యంగా మంచి వర్షము రాత్రిళ్ళు పడుతుందండి. మఖ ఉత్తర కార్తెలలో రాత్రిపూట వానలు పడితే చెరువులు నిండగలవు. పల్లెల్లో ఆరుద్ర ను ఆరెద్దుల మఖని మగ అంటారండి)
సుజనులు మీరని పెద్దల
రిప్లయితొలగించండిభజించి సస్యాభివృద్ధి వడయఁగ నిచ్చో
ట జనింప రసాయన విస
ర జనిని మెచ్చంగ వలెను రైతులు నెమ్మిన్
[రసాయన విసర జని = రసాయన సమూహము లందుఁ బుట్టుక కలది, యూరియా]
రజనిని నిద్ర వోఁ దలఁప రమ్య తరమ్ముగఁ జేతు లుంచుచున్
నిజ హృదయమ్మలం బిసరు నేరక యెట్టి భయమ్ము లాత్మలన్
సజల ధరిత్రి లోన సరసమ్ముగఁ బండెడి పీత వర్ణ వ
ద్రజనిని మెచ్చఁగా వలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్
[రజని = 1. రాత్రి, 2. పసుపు]
సమస్య:
రిప్లయితొలగించండి“రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్”
చం.మా :
సుజనులు కర్షకుల్ సతము సుంతయు స్వార్ధములేక పంటలన్
నిజమగు భక్తితో యజము నీమము చేసియు పొంద వర్షమే
ప్రజలకు క్షుత్తు దీర్చ తమ పధ్ధతి మార్చగ క్షేత్రమున్ సుసా
“ర జనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్”
రుజయనునది యిక సోకని
రిప్లయితొలగించండిరజనిని మెచ్చంగవలెను, రైతులు నెమ్మిన్
గజములకొలదిని భూమిని
సజలంగాఁజేసి పంట సాగును జేయున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
రుజలెప్పుడు పంటలను స
హజమది నాశనము చేయు,నాపగ రుజలన్
నిజమగు బలము గలుగు న
త్రజనిని మెచ్చంగవలెను రైతులు నెమ్మిన్
రిప్లయితొలగించండిచ: భజనలు చేయ శాంకరికి వర్ష మనల్పముగా కురిపించె పృథ్విపై
ప్రజలు ముదమ్ము నొందుచును పంటపొలమ్ముల విత్త భీజముల్
నిజమగు పంటతీయగను విస్తృత మౌగతి చిక్కినట్టి న
త్రజనిని మెచ్చఁగావలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్