ఉ:సొంపొనరింప గ్రామమును,చుట్టును బాటలు వేయ,సంపదన్ పెంపు నొనర్ప,చేయుటకు పేదలకున్ బని యంద జేయగా తెంపరి మంత్రి తల్చె,నిక తీరగు మేడలు వచ్చి ప్రాత వౌ కొంపలు గూలు సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్” (ఆ ప్రాంతాన్ని బాగు చెయ్యటానికి మంత్రి గారు గొప్ప ప్రణాళిక వేసాడుట.అది నెరవేరితే కొంపలు కూలుతాయి కానీ పాత కొంపలు కూలి అన్నీ మేడలే వస్తాయిట.)
పంపకము నచ్చకుండిన
రిప్లయితొలగించండికొంపలు గూలున్ ; సుజనుని కోరిక దీరన్
తెంఫుల నాపిన వేళనె
నింపుగ వావి చెడకుండ నిలచును సతమున్
రిప్లయితొలగించండిశంపాంగుల మనమందున
తంపరలై చెలగు భావ తర్కము నెఱుగన్
తెంపరి కోరిక కోరిన
కొంపలు గూలున్ సుజనుని కోరిక దీరన్.
సంపద లన్నియున్ విడిచి స్కంభుని యింతుల మానసమ్మునన్
తంపరలై చెలంగు వగ తర్కమెఱుంగు నటుల్ వరమ్ముకై
తెంపరి వాడొకండచట తీక్ష్ణతపమ్మొనరించు వేళలో
కొంపలు గూలు సజ్జనునిని కోరిక దైవము సమ్మతించినన్.
కందం
రిప్లయితొలగించండికంపరమెత్తించు నరకుఁ
జంపన్ శిష్టులు భజించ చక్రియె సతినే
కొంపోవననికి దుష్టుని
కొంపలు గూలున్ సుజనుని కోరిక దీరన్
ఉత్పలమాల
కంపరమొందగన్ జనులు ఘాతుకముల్ నరకుండునెంచఁగన్
జంపగ రక్కసున్ వరద సాయముజేయుమటంచు వేడ ధీ
రంపు సతిన్ రణంబునకు రమ్మని చక్రియె నేగ వైరికిన్
కొంపలు గూలు సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్
సంపదగల సుజనుడడిగె
రిప్లయితొలగించండి'చంపక రజనీచరులకు సైతము సతతం
బింపుగ స్వేచ్ఛనొసగుమా'
కొంపలు గూలున్ సుజనుని కోరిక దీరన్
ఇంపుగ సజ్జనుండు పరమేశుని చొక్కిలె నివ్విధంబునన్
'సొంపుగ సర్వజీవులకు సొంతము జేయుము స్వేచ్ఛనెల్లెడన్
జంపుట మాని దైత్యులకు చక్కని రక్షణ కల్గజేయుమా'
కొంపలు గూలు సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్
పంపక మందు భేదములు స్వాస్థ్యము నందున మిక్కిలుండినన్
రిప్లయితొలగించండిఇంపుగ వంటలేదనిన యింతియు కోపము హెచ్చు నొందినన్
కొంపలు గూలు; సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్
గంపలకొద్దిగన్ సిరి నికాయము నందున చేరుచుండుగా
ఇంపుగ సంసారమ్మను
రిప్లయితొలగించండిరొంపిని బడి పుడమి జనులు రోసించకనే
సంపదలిమ్మని కోరిన
కొంపలు గూలున్ సుజనుని కోరిక దీరన్
సంపద లేమితో జనులు సంకటముల్బడి క్రుంగుచుండ తా
రిప్లయితొలగించండినింపుగనట్టి వారలకు నెట్టి శ్రమమ్ముల నొందకుండనే
సంపదలిచ్చి బ్రోవుమని శర్వుని గోరెను సజ్జనుండొగిన్
కొంపలు గూలు సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్
కం:చంపగ నిరువది యార్గుర
రిప్లయితొలగించండినింపా పాక్ దేశమునకు?నిక మోదీకిన్
కంపర మెక్కెను దుష్టుల
కొంపలు గూలున్ సుజనుని కోరిక దీరన్
ఉ:సొంపొనరింప గ్రామమును,చుట్టును బాటలు వేయ,సంపదన్
రిప్లయితొలగించండిపెంపు నొనర్ప,చేయుటకు పేదలకున్ బని యంద జేయగా
తెంపరి మంత్రి తల్చె,నిక తీరగు మేడలు వచ్చి ప్రాత వౌ
కొంపలు గూలు సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్”
(ఆ ప్రాంతాన్ని బాగు చెయ్యటానికి మంత్రి గారు గొప్ప ప్రణాళిక వేసాడుట.అది నెరవేరితే కొంపలు కూలుతాయి కానీ పాత కొంపలు కూలి అన్నీ మేడలే వస్తాయిట.)
తెంపరు లై బలహీను ల
రిప్లయితొలగించండిసంపద లను దోచు కొనుచు చాల దురితు లై
పెంపు గ సల్పె డు దుష్టుల
కొంపలు గూ లున్ సుజను ల కోరిక దీరన్
కం॥ తెంపరి దొంగలు హెచ్చిరి
రిప్లయితొలగించండియింపుగ నూతన విధముల నెదుగుచు జగతిన్
నింపగు రక్షను దుష్టుల
కొంపలు గూలున్ సుజనుని కోరిక దీరన్
ఉ॥ తెంపరు లెందరో జనులఁ దిప్పలు వెట్టుచు దోఁచు చుండిరే!
నింపుగఁ గ్రొత్త పద్ధతుల నిత్యము హెచ్చిన జాగరూకతన్
బెంపును జేయ రక్షఁగను విద్యను సత్పురుషుండు నేర్పుచున్
గొంపలు గూలు సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్
ఇక్కడ కొంపలు అంటే figurative గా చోరులదండి. రోజూ పేపర్ నందు సైబర్ ఫ్రాడ్ సుద్ది ఉండనే ఉంటుందండి. దాని ఆధారంగా వ్రాసానండి
రిప్లయితొలగించండిసంపదలున్నవాడిల ప్రశాంతత లేదని ధాత్రియందునన్
తెంపరులై చరించు కడు త్రిమ్మరు లెల్లను కంటిచూపుతో
చంపెడి శక్తి నివ్వమని స్కంభుని గోరి తపమ్ము జేసినన్
కొంపలు గూలు సజ్జనునిని కోరిక దైవము సమ్మతించినన్.
చంపుటల నెల్లఁ దగ వా
రిప్లయితొలగించండిరింపంగఁ దలఁచిన వీరుఁ డెదఁ బగతుఱ కీ
ళ్లొంపంగ వారు కట్టిన
కొంపలు గూలున్ సుజనుని కోరిక దీరన్
సంప దమేయ సిద్ధి గత సంజని తేషణ దుర్నిమిత్త హృ
త్కంపన సంచలత్ప్రతిఘ ధర్ష తరంగ కదంబ యుక్త నై
లింప దురార్చకాధమ వరేణ్య వినిర్మిత దుష్ట పూరముల్
కొంపలు గూలు సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్
సమస్య:
రిప్లయితొలగించండికొంపలు గూలు సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్
ఉ.మా :
అంపిరి సంధిసేయ హరి యందరి వాడని పాండునందనుల్
చంపగ చూడ దుర్మతులు చక్కగ బందిగ సేయ నెంచగా
కంపితులైరి శ్రీహరిని కాంచగ రౌద్రపు విశ్వరూపమున్
కొంపలు గూలు, సజ్జనుని, కోరిక దైవము సమ్మతించినన్.
రిప్లయితొలగించండితంపులు పెట్టుచు సతతము
తెంపరితనముకనపరచితీరుగగరిమన్
బెంపొందించుకొను ఖలుల
*"కొంపలు గూలున్ సుజనుని కోరిక దీరన్”*
కంపరమెత్తుమాటలనుగర్వముతో సతతమ్ము నాడుచున్
దెంపరియై చరించికడు తీయగ గోతుల నట్టివారిచే
*“గొంపలు గూలు సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్”*
నింపుగ ఖ్యాతి నొందుచిక నెచ్చట నైనను వెల్గు మాన్యుడై
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కంపించినచో భూమియు
కొంపలు గూలున్; సుజనుని కోరిక దీరన్
సంపదను లెక్కచేయక
నింపుగ సహాయ చర్యల నెన్నో చేయన్.