1, నవంబర్ 2025, శనివారం

సమస్య - 5292

2-11-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే”
(లేదా...)
“దుర్దినమంచు బాలకులె తోరఁపుఁ దోషము నందిరత్తఱిన్”
(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో నారుమంచి అనంతకృష్ణ గారి సమస్య)

9 కామెంట్‌లు:


  1. నిర్దయ బూనుచు వరుణుడు
    దర్దురమును వీడి కురియ ధరణిని కనగన్
    కర్దము నిండిన పాళము
    దుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే.


    దర్దుర వాహకుండగుచు ధాత్రిని సంద్రము సేయ నెంచుచున్
    నిర్దయ బూని జంబుకుడు నేలను జేరగ తీవ్ర రూపమున్
    కర్దము నిండి శుభ్రమగు కర్పటముల్ చెడగొట్టు చుండగా
    దుర్దినమంచు బాలకులె తోరఁపుఁ దోషము నందిరత్తఱిన్.

    రిప్లయితొలగించండి
  2. నిర్దయుడగు బడిపంతులు
    వర్ది నొనగిరి మరునాడు ప్రశ్నలనిడుటన్
    అర్దితమెరుగక రేపది
    దుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే”

    రిప్లయితొలగించండి
  3. దర్దురమౌ నింగినిగని
    నిర్దిష్టము గాలివాన నేడిటననుచున్
    దుర్దశయని సెలవొసగగ
    దుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే

    దర్దురమైన మిన్నుగని తామట తెల్పిరి విజ్ఞులీవిధిన్
    వర్ధిలు నేడువర్షమిట పాఠములన్ మరి చెప్పశక్యమే?
    దుర్దశయంచు బోధకులు తొందరపాటున సెల్వొసంగగా
    దుర్దినమంచు బాలకులె తోరఁపుఁ దోషము నందిరత్తఱిన్

    [దుర్దినము = మబ్బు క్రమ్మిన దినము]

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. కం॥ మర్దనచేయుచు రుద్దఁగ
      నిర్దయఁగ చదువులు విరతి నెమ్మదిఁ గనకన్
      హార్దమొదవె సెలవు నొసఁగ
      దుర్దినమని, బాలురెల్లఁ దోషముఁ గనిరే

      ఉ॥ నిర్దయఁ గాంచి రుద్దగను నిత్యము విద్యలఁ బాఠశాలలన్
      మార్దవమొప్పు బాలలకు మైకముఁ గ్రమ్మద భారమెక్కువై
      హార్దము మీరె వర్షమటు లాగకనున్న విరామమిచ్చినన్
      దుర్దినమంచు, బాలకులె తోరపుఁ దోషము నందిరత్తఱిన్

      పొరపాటున ఉ 3వ పాదము చివర దోషమున్నందున సరి చేసానండి.

      హార్దము ప్రేమ
      అతివృష్టి దురదృష్టకరమండి. కార్పొరేట్ విద్యా విధానం ఫలమండి

      తొలగించండి
  5. కందం
    అర్దనమున కాళిందిని
    కర్దటమును రేపి నింప గరళము, హరియే
    మర్దించఁగఁ, గాళియునకు
    దుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే!

    ఉత్పలమాల
    అర్దనమెంచుచున్ విషము హానికరమ్ముగ నింపుచున్ నదిన్
    కర్దటమెల్ల రేపగను గాసిల గోకులమెల్ల కన్నడున్
    మర్దన జేయుచున్ ఫణులఁ గ్రాలఁగఁ గాళియు గర్వమోడెడున్
    దుర్దినమంచు బాలకులె తోరఁపుఁ దోషము నందిరత్తఱిన్!

    రిప్లయితొలగించండి
  6. కం:నిర్దయుడై దండించు కు
    మార్ దండుగ యొజ్జ, యతడు మారెను ,వచ్చెన్
    మార్దవశీలియె,పోయెను
    దుర్దినమని బాలురెల్లఁ దోషముఁ గనిరే”
    (తమని దండించే కుమార్ అనే టీచర్ పోయి మంచి టీచర్ వచ్చినందుకు పిల్లలు తోషము పొందారు.)

    రిప్లయితొలగించండి
  7. ఉ:మార్దవశైలి లేక తన మాటల,జేతల దేశకీర్తికే
    దుర్దశ దెచ్చుచుండ నొక ధూర్తుడు తా ప్రతిపక్షనేతయై
    నిర్దయ జూపుచున్ ప్రజలు
    నిల్ప బరాజయ మందు, వానిదే
    దుర్దినమంచు బాలకులె తోరఁపుఁ దోషము నందిరత్తఱిన్”
    (ఒక ప్రతిపక్ష నేత దేశం పరువు పోయేట్టు మాట్లాదుతుంటే ఎన్నికలో ప్రజలు ఓటమి అందించారు. వాడితే చెడ్డ రోజు అని పాలకులు సంతోషించారు. ఇక్కడ దోషము అంటే తోషము.బాలకులు అంటే పాలకులు.సరళాదేశం గా.)

    రిప్లయితొలగించండి
  8. సర్దు లెఱుంగక మనము క
    పర్ది కృప వహింప నాటపాటల నలరన్
    మార్దవముగ నిఁకఁ దొలఁగెను
    దుర్దిన మని బాలు రెల్లఁ దోషముఁ గనిరే

    [సర్దు = సరుదు, ఎల్ల]


    అర్దుగ సంభవింతు రిల నంచిత జన్ములు సాధు సజ్జనౌ
    ఘార్దిత భాసి తాననుఁడు నౌ మన కృష్ణుని మేనమామకున్
    దుర్దమ నిత్య సంకటద దుర్భర బాలక హింసకారికిన్
    దుర్దిన మంచు బాలకులె తోరఁపుఁ దోషము నంది రత్తఱిన్

    రిప్లయితొలగించండి