1, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5321

2-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె”
(లేదా...)
“మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్”

6 కామెంట్‌లు:

  1. సభ యలంకరణము జక్కగ లేదని
    మమ్ముఁ దప్పుపట్టి ; మాల వేసె
    నింతకంటె రోత నిడెడు దానిని జూసి .
    వింత గొలుపుచుండు విషయమిదియ

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    ఒప్పితినని క్రీడి నూర్వశి చేరఁగ
    వావి వరుసఁ జూపి పారుచుండ
    మగువ వలచిరాగ మరులు గొననను నీ
    మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె!


    ఉత్పలమాల
    నెమ్మిని జూపి యూర్వశియె నిక్కెడు సోయగమొల్కి పార్థునిన్
    గమ్ముచు నుండగన్ వరుస కాదని దూరము పారుచుండఁగన్
    గొమ్మయె కోరివచ్చెననఁ గూడక సాకులు జెప్పు వావి నీ
    మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్!

    రిప్లయితొలగించండి

  3. మా జనకుని మెచ్చి మాకుల శ్రేష్ఠలు
    వ్రేకదనము చేయు వేళ మంత్రి
    పిలువ లేదటంచు పేరిమితో నట
    మమ్ముఁ దప్పుపట్టి, మాల వేసె.



    కొమ్మల పైన గాథలను కొల్లలుగా రచియించి నట్టి మా
    తమ్ముని మెచ్చి వానికట దంబునొనర్చెడి నత్తరిన్ తనన్
    రమ్మని బిల్వ లేదనిచి రాకును జూపుచు మర్చి నందుకై
    మమ్మును దప్పుపట్టి, యొక మాలను వేసె సభాంతరమ్మునన్.

    రిప్లయితొలగించండి

  4. కొమ్మను గోరివచ్చితిని కూడదటంచు తిరస్కరింతువే
    నెమ్మిని యాదరించకను నీకిది భావ్యము కాదు నన్నిటుల్
    పొమ్మని తోయు చుండుటది మూర్ఖుపు చేష్ట యటంచు క్రీడి నే
    మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్.

    రిప్లయితొలగించండి
  5. చిన్న బుచ్చె నంచు చెలియ యూర్వశి యెతా
    నలక బూనిన తరి యతిథి పలుకు
    పనికి మాలి నదని పార్థుడు చెప్పు నీ
    మమ్ము దప్పు పట్టి మాల వేసె.

    రిప్లయితొలగించండి