6-12-2025 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కరువు జీవులకున్ మోదకరము సుమ్ము”(లేదా...)“కరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”
తేటగీతిచినుకు ధాన్యము సమకూర్చు జీవులకనఁగడుపునిండినన్ గాదె యాకలి శమించుశ్రావణమున మబ్బు కురిసి సడలినంతకరువు, జీవులకున్ మోదకరము సుమ్ముచంపకమాలకురిసెడు మేఘమే భువిని గుప్పును ధాన్యము జీవకోటికీన్దొరికిన తిండి యాకలిని దూరము సేయుచు శక్తినిచ్చునేయురుమెడు మబ్బులున్ గురియ నొప్పెడు రీతిని వీడినంతటన్కరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్!
పంట లెండుచు నుండగా బాధ పడె డు కర్ష కాళికి హర్షము కలుగు నట్లు మెండు వర్షము కురియగా మేలు గాగ కరువు జీవుల కున్ మోద కరము సుమ్ము
దివ్య దీపావళీ పర్వదినములందు పిల్లలకు క్రొత్తవస్త్రముల్ పేర్మిఁ గొనగ నొనర యజమాని కూరిమినొసగు సంౘ కరువు జీవులకున్ మోదకరము సుమ్ముసంౘకరువు : advance money
వర్ష లేమితో ప్రజలెల్ల బాధ పడిన నేమి పరమాత్మ దయతోడ నిప్పు డచట భూరి వృష్టికురిసి విడి పోయిన నిక కరువు, జీవులకున్ మోదకరము సుమ్ము.వరుణుడె యాగ్రహించి గత వత్సర మంతయు వర్షలేమితో నరటము చెంది రెల్లరు బృహత్తు కటాక్షము తోడ కాంచగా సరియగు వర్షముల్ కురిసి సంకటముల్ విడినంత వీడినన్ గరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్.
దారి దొరకుటయే చాలు తప్పకుండ మోసగించు చుండెడి కాలమున సతతమునేపనైన జేసెడి ముందు యిచ్చు సంచకరువు జీవులకున్ మోదకరము సుమ్ము”
శంకరాభరణం Dt. 06-12-2025 (శుక్రవారం ) సమస్య - 5324“కరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”చంపకమాల************( పల్నాడు ప్రాంతములో నీటి ఎద్దడి చూచి చలించిన శ్రీనాథ కవిసార్వభౌమ ఉవాచ ఇది )సిరిగల వానికిన్ మిగులఁ జెల్లునుగాఁ బదునారువేలుగన్దరణుల బెండ్లి యాడుచును దారలఁజక్కగఁ జూచి యేలగన్తిరిపెము కిద్దరాండ్ర? విను దేవర! పార్వతి చాలు గాదొకో?కరుణను గంగనున్ విడుము కాటకమే నశియించ ; వీడుచోకరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్ ఆకుల శాంతి భూషణ్ వనపర్తి.
తరువుల బెంచి రమ్యముగ ధాత్రిని పచ్చదనంబు నిండ శ్రీ కరముగ పాడిపంటలు ప్ర కామ పథంబున సాగ విశ్వమున్ పరిగొను కాలుషాగ్నుల ప్రభావ విపత్పరిణామమొంద నాకరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంత సౌఖ్యముల్!ఆకరువు=సమాప్తి
ర్షపాతము క్షీణించి పైరులెండి కరువు నెలకొన్న పిమ్మట యజ్ఞఫలమువలన కురిసిన వర్షము, తొలగజేయ కరువు, జీవులకున్ మోదకరము సుమ్ముకురియక వర్షముల్ కడకు కొట్టిక లందున పైరులెండగాస్థిరపడె నిచ్చటన్ గరువు చేసిన యాగపు సత్ఫలంబునన్వరుణ కటాక్షమైనతరి వర్షమవశ్యము, తొల్గజేయుచున్గరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్
వర్షపాతము...
అయ్యా! "కరవు " అంటే "క్షామము" అని అర్థం."కరువు" అనేది ఆ అర్ధం లో వ్యావహారికమే.కనుక ఇచ్చిన సమస్యని "కరవు " గా ఇవ్వ దలచారా? అనేది సందేహం.పూరణలలో "కరవు" అని వాడాలా?"కరువు" అనే పదం తో వేరే అర్థం లో వాడాలా? అనేది సందేహం.
తే॥ సంతుఁ గనక సతమతమై సౌఖ్యమటులఁగొరవడ బ్రదుకు బాధలఁ బరఁగు చుండభార్య నెలతప్పి తుదకటు వరలఁ దాల్చికరువు జీవులకున్ మోదకరము సుమ్ముచం॥ విరియఁగ భక్తి భావమటు వేదము లెల్ల పఠించి విజ్ఞుఁడైమరిమరి వల్లె వేయుటయు మాన్యత సద్గుణ సంస్థితంబగున్వరలఁగ సద్గుణమ్ములిల భాగ్యముఁ జొప్పడదా కనంగ నేకరువు సమస్త జీవులకుఁ గల్గఁగఁ జేయు ననంత సౌఖ్యముల్
తేగీ కరువు గర్భము చం ఏకరువు వేదాదులను మరవకుండుటకై వల్లె వేయుట
తే.గీ:కరవు కాలమ్ములోన మువ్వురను గనుటపౌరధర్మమ్ము కాదమ్మ భరత నారి!ఒకటియో హెచ్చు గోర మరొక్కటియునొకరువు జీవులకున్ మోదకరము సుమ్ము”(కరువు=గర్భము. కుటుంబ నియంత్రణ గూర్చి. )
చం:కరకుగ గన్న బిడ్డలను కత్తులకున్ బలిజేయ కంసు డానరకము జూచి కుందు దన నాతికి ధైర్య మొసంగ నిట్లనెన్స్థిరమతి తోడ భర్త "సుదతీ యిక నష్టమ మైన యట్టి యీకరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్"(ఈ ఎనిమిదవ గర్భం శాంతి నిస్తుందని వసుదేవుడు దేవకి తో అన్నట్లు. )
కరువు వచ్చినఁ గనుట దుర్భరము సుమ్ము సొమ్మ లున్నను భృశము ఫలమ్ము సున్న వెన్నుని కరుణ వెతలు రాకున్న యెడలఁగరువు జీవులకున్ మోదకరము సుమ్ము [కరువు = గర్భము] హరిహర నామ సంస్మరణ మక్షయ పుణ్య మొసంగు ధాత్రినిన్ నర సుర యక్ష కింపురుష నాగ విహంగమ భేద హీనమై హరి చరణాబ్జ సంస్తవము నత్యధి కార్తి సభక్తి వెట్ట నేకరువు సమస్త జీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్ [ఏకరువు = ఒక్కవల్లె] వ్యాకరణ విశేషము: ఏకరువు, ఒకసారి వల్లెవేయుట. ఇది మిశ్రమసమాసము. వైరి సమాసముగాఁ గన్పట్టుచున్నది. వ్యవహారములో సుప్రసిద్ధము. ఏకము రువ్వు – వృత్తిలో ము వర్ణ లోపమై ఏకరు వ్వయినది. కనుక మిశ్రమ సమాసమే. ఏకరువ్వు – ఏకరువు జడ్డక్కరము లోపింపఁగా. కనకక్రోవి (కనకము క్రోవి) – పాండురంగమాహాత్మ్యము.
సమస్య:“కరవు సమస్తజీవులకుఁ, గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”చం.మా :కొరవడి వృష్టి క్షేత్రముల కోరుచు వేడిరి నీటిఱేఁనినిన్తెరవది కానరాదు నిల తేకువ సాగగ జీవనమ్మునున్ మరువగ రాని శాపమిది మాధవుడాజ్ఞను దీర సుంత, యా “కఱవు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”
తరువులునెండిపోవుగదధాత్రిని వానలులేకహెచ్చగాచెరువులుయెండిపోవగను చిత్తము నందున నింపె దుఃఖమే*“కరువు సమస్తజీవులకుఁ, గల్గఁగఁ జేయు ననంత సౌఖ్యముల్”*తరగనిభక్తితోకొలువతాకురిపించుచువానవజ్రియే
తేటగీతి
రిప్లయితొలగించండిచినుకు ధాన్యము సమకూర్చు జీవులకనఁ
గడుపునిండినన్ గాదె యాకలి శమించు
శ్రావణమున మబ్బు కురిసి సడలినంత
కరువు, జీవులకున్ మోదకరము సుమ్ము
చంపకమాల
కురిసెడు మేఘమే భువిని గుప్పును ధాన్యము జీవకోటికీన్
దొరికిన తిండి యాకలిని దూరము సేయుచు శక్తినిచ్చునే
యురుమెడు మబ్బులున్ గురియ నొప్పెడు రీతిని వీడినంతటన్
కరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్!
పంట లెండుచు నుండగా బాధ పడె డు
రిప్లయితొలగించండికర్ష కాళికి హర్షము కలుగు నట్లు
మెండు వర్షము కురియగా మేలు గాగ
కరువు జీవుల కున్ మోద కరము సుమ్ము
దివ్య దీపావళీ పర్వదినములందు
రిప్లయితొలగించండిపిల్లలకు క్రొత్తవస్త్రముల్ పేర్మిఁ గొనగ
నొనర యజమాని కూరిమినొసగు సంౘ
కరువు జీవులకున్ మోదకరము సుమ్ము
సంౘకరువు : advance money
రిప్లయితొలగించండివర్ష లేమితో ప్రజలెల్ల బాధ పడిన
నేమి పరమాత్మ దయతోడ నిప్పు డచట
భూరి వృష్టికురిసి విడి పోయిన నిక
కరువు, జీవులకున్ మోదకరము సుమ్ము.
వరుణుడె యాగ్రహించి గత వత్సర మంతయు వర్షలేమితో
నరటము చెంది రెల్లరు బృహత్తు కటాక్షము తోడ కాంచగా
సరియగు వర్షముల్ కురిసి సంకటముల్ విడినంత వీడినన్
గరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్.
దారి దొరకుటయే చాలు తప్పకుండ
రిప్లయితొలగించండిమోసగించు చుండెడి కాలమున సతతము
నేపనైన జేసెడి ముందు యిచ్చు సంచ
కరువు జీవులకున్ మోదకరము సుమ్ము”
శంకరాభరణం
రిప్లయితొలగించండిDt. 06-12-2025 (శుక్రవారం )
సమస్య - 5324
“కరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”
చంపకమాల
************
( పల్నాడు ప్రాంతములో నీటి ఎద్దడి చూచి చలించిన శ్రీనాథ కవిసార్వభౌమ ఉవాచ ఇది )
సిరిగల వానికిన్ మిగులఁ జెల్లునుగాఁ బదునారువేలుగన్
దరణుల బెండ్లి యాడుచును దారలఁజక్కగఁ జూచి యేలగన్
తిరిపెము కిద్దరాండ్ర? విను దేవర! పార్వతి చాలు గాదొకో?
కరుణను గంగనున్ విడుము కాటకమే నశియించ ; వీడుచో
కరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి.
తరువుల బెంచి రమ్యముగ
రిప్లయితొలగించండిధాత్రిని పచ్చదనంబు నిండ శ్రీ
కరముగ పాడిపంటలు ప్ర
కామ పథంబున సాగ విశ్వమున్
పరిగొను కాలుషాగ్నుల ప్ర
భావ విపత్పరిణామమొంద నా
కరువు, సమస్తజీవులకుఁ
గల్గఁగఁ జేయు ననంత సౌఖ్యముల్!
ఆకరువు=సమాప్తి
ర్షపాతము క్షీణించి పైరులెండి
రిప్లయితొలగించండికరువు నెలకొన్న పిమ్మట యజ్ఞఫలము
వలన కురిసిన వర్షము, తొలగజేయ
కరువు, జీవులకున్ మోదకరము సుమ్ము
కురియక వర్షముల్ కడకు కొట్టిక లందున పైరులెండగా
స్థిరపడె నిచ్చటన్ గరువు చేసిన యాగపు సత్ఫలంబునన్
వరుణ కటాక్షమైనతరి వర్షమవశ్యము, తొల్గజేయుచున్
గరువు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్
వర్షపాతము...
తొలగించండిఅయ్యా! "కరవు " అంటే "క్షామము" అని అర్థం."కరువు" అనేది ఆ అర్ధం లో వ్యావహారికమే.కనుక ఇచ్చిన సమస్యని "కరవు " గా ఇవ్వ దలచారా? అనేది సందేహం.పూరణలలో "కరవు" అని వాడాలా?"కరువు" అనే పదం తో వేరే అర్థం లో వాడాలా? అనేది సందేహం.
రిప్లయితొలగించండితే॥ సంతుఁ గనక సతమతమై సౌఖ్యమటులఁ
రిప్లయితొలగించండిగొరవడ బ్రదుకు బాధలఁ బరఁగు చుండ
భార్య నెలతప్పి తుదకటు వరలఁ దాల్చి
కరువు జీవులకున్ మోదకరము సుమ్ము
చం॥ విరియఁగ భక్తి భావమటు వేదము లెల్ల పఠించి విజ్ఞుఁడై
మరిమరి వల్లె వేయుటయు మాన్యత సద్గుణ సంస్థితంబగున్
వరలఁగ సద్గుణమ్ములిల భాగ్యముఁ జొప్పడదా కనంగ నే
కరువు సమస్త జీవులకుఁ గల్గఁగఁ జేయు ననంత సౌఖ్యముల్
తేగీ కరువు గర్భము చం ఏకరువు వేదాదులను మరవకుండుటకై వల్లె వేయుట
తొలగించండితే.గీ:కరవు కాలమ్ములోన మువ్వురను గనుట
రిప్లయితొలగించండిపౌరధర్మమ్ము కాదమ్మ భరత నారి!
ఒకటియో హెచ్చు గోర మరొక్కటియునొ
కరువు జీవులకున్ మోదకరము సుమ్ము”
(కరువు=గర్భము. కుటుంబ నియంత్రణ గూర్చి. )
చం:కరకుగ గన్న బిడ్డలను కత్తులకున్ బలిజేయ కంసు డా
రిప్లయితొలగించండినరకము జూచి కుందు దన నాతికి ధైర్య మొసంగ నిట్లనెన్
స్థిరమతి తోడ భర్త "సుదతీ యిక నష్టమ మైన యట్టి యీ
కరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్"
(ఈ ఎనిమిదవ గర్భం శాంతి నిస్తుందని వసుదేవుడు దేవకి తో అన్నట్లు. )
రిప్లయితొలగించండికరువు వచ్చినఁ గనుట దుర్భరము సుమ్ము
సొమ్మ లున్నను భృశము ఫలమ్ము సున్న
వెన్నుని కరుణ వెతలు రాకున్న యెడలఁ
గరువు జీవులకున్ మోదకరము సుమ్ము
[కరువు = గర్భము]
హరిహర నామ సంస్మరణ మక్షయ పుణ్య మొసంగు ధాత్రినిన్
నర సుర యక్ష కింపురుష నాగ విహంగమ భేద హీనమై
హరి చరణాబ్జ సంస్తవము నత్యధి కార్తి సభక్తి వెట్ట నే
కరువు సమస్త జీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్
[ఏకరువు = ఒక్కవల్లె]
వ్యాకరణ విశేషము:
ఏకరువు, ఒకసారి వల్లెవేయుట. ఇది మిశ్రమసమాసము. వైరి సమాసముగాఁ గన్పట్టుచున్నది. వ్యవహారములో సుప్రసిద్ధము. ఏకము రువ్వు – వృత్తిలో ము వర్ణ లోపమై ఏకరు వ్వయినది. కనుక మిశ్రమ సమాసమే. ఏకరువ్వు – ఏకరువు జడ్డక్కరము లోపింపఁగా.
కనకక్రోవి (కనకము క్రోవి) – పాండురంగమాహాత్మ్యము.
సమస్య:
రిప్లయితొలగించండి“కరవు సమస్తజీవులకుఁ, గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”
చం.మా :
కొరవడి వృష్టి క్షేత్రముల కోరుచు వేడిరి నీటిఱేఁనినిన్
తెరవది కానరాదు నిల తేకువ సాగగ జీవనమ్మునున్
మరువగ రాని శాపమిది మాధవుడాజ్ఞను దీర సుంత, యా
“కఱవు, సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”
తరువులునెండిపోవుగదధాత్రిని వానలులేకహెచ్చగా
రిప్లయితొలగించండిచెరువులుయెండిపోవగను చిత్తము నందున నింపె దుఃఖమే
*“కరువు సమస్తజీవులకుఁ, గల్గఁగఁ జేయు ననంత సౌఖ్యముల్”*
తరగనిభక్తితోకొలువతాకురిపించుచువానవజ్రియే