కం:పూజితుడౌ గురువు తనకు పూజా భాజనుగ దోచ బూజించ దగున్ పూజానర్హునిగ నెరుగ పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్” (గురు భక్తి నిజం గా ఉండాలి.ఆ గురువు పూజించ దగిన వాడని నిజం గా భావిస్తే పూజించాలి.కానీ వాడు అనర్హుడని అనుకుంటూ మర్యాద కోసం పూజిస్తే పుణ్యం దక్కదు.అది ఆత్మవంచన.)
ఉ:పూజల బొందు నా గురువు పూలకు,బండ్లకు దృప్తి జెంది యా పూజ నొనర్చు వానికి ప్రమోదము తో నొక సూక్తి జెప్పినన్ సాజము, పాద పూజలకు సాధ్యము కాని వెలల్ విధించ నా పూజలు మానినన్ విపులపుణ్యము దక్కును సజ్జనాళికిన్” (గురువు అనే వాడు పూజ తో తృప్తి పడాలి కానీ పూజ చాలక తనకి పాదపూజ చేస్తే ఎదురు ఇంత సొమ్ము ఇవ్వాలని రేటు పెడితే ఆ పూజ మానటమే పుణ్యం.)
కందం
రిప్లయితొలగించండిబూజదులుపు వాడిననుచు
వాజమ్మలఁ జేసి జనుల పాలకుడగుచున్
మోజుగ దోచెడు దుష్టుని
పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్
ఉత్పలమాల
బూజు తొలంగజేసెదను భుక్తిని గూర్చెదనంచు మాటలన్
వాజము వోలు యెన్నికల వాటము పారగ గెల్చి గద్దెపై
మోజులు దీరఁ గొల్వుఁ గొని భూరిగ దోచెడు దుష్టుఁ గొల్చెడున్
బూజలు మానినన్ విపులపుణ్యము దక్కును సజ్జనాళికిన్
గురుదేవుల సవరణతో:
తొలగించండి'వాదము వోలు నెన్నికల'
రిప్లయితొలగించండిరాజులను బోలు నేతలె
యా జగదీశ్వరులటంచు నంధత్వముతో
పూజింపనేల వారిని
పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్.
రాజులు లోక మేలెడిపురాణగు లంచుదలంచి వారికిన్
బూజలు సేసినంతనిల భుక్తికి లోటది యుండ దంచు నీ
వా జగదీశుగాదనుచు నర్భక నేతకు రోజు చేసెడిన్
బూజలు మానినన్ విపులపుణ్యము దక్కును సజ్జనాళికిన్.
ఆజి సలుపుటందు నతని
రిప్లయితొలగించండితేజస్సు గురించి సరిగ దెలిసిన కూడన్
ఓజ నెరుంగక వానిని
పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం. రోజొక వేషము వేసెడు
రిప్లయితొలగించండివాజమ్మల ధీరులనుచుఁ వాచాలురనే
ధీజనులని గజమాలల
పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజాజర గల నాయకులను
రిప్లయితొలగించండివ్యాజపు నైజము గలిగిన వారలగు పరి
వ్రాజకులన్ మూఢతతో
పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్
నైజము క్రూరమై సలుపు నైచ్యపు కర్మలు క్షుద్ర పూజలున్
వ్యాజపు తత్త్వమున్ గలిగి పక్షములో జనులెన్నకుండినన్
రాజిలు నేతకున్ మరి విరక్తుల బోలెడి మోసగాళ్ళకున్
పూజలు మానినన్ విపులపుణ్యము దక్కును సజ్జనాళికిన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిపూజలు చేయుట చెల్లును
రిప్లయితొలగించండిభూ జనులందరును భవుని పుణ్యము కొరకై
పూజార్హత లేని ఖలుని
పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:పూజితుడౌ గురువు తనకు
రిప్లయితొలగించండిపూజా భాజనుగ దోచ బూజించ దగున్
పూజానర్హునిగ నెరుగ
పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్”
(గురు భక్తి నిజం గా ఉండాలి.ఆ గురువు పూజించ దగిన వాడని నిజం గా భావిస్తే పూజించాలి.కానీ వాడు అనర్హుడని అనుకుంటూ మర్యాద కోసం పూజిస్తే పుణ్యం దక్కదు.అది ఆత్మవంచన.)
కం॥ వ్యాజనము వీడి ధరణిని
రిప్లయితొలగించండిరాజిలు సద్వర్తన యలరారఁగ నియతిన్
మోజుగ స్వలాభమునకై
పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్
ఉ॥ వ్యాజనమొంద కుండ తగు భావన నిల్పుచు మానవాళికిన్
మోజుగ సేవలన్ గనఁగ మెచ్చును మాధవుఁ డంచు నమ్ముచున్
రాజిలు సద్గుణమ్ము లలరారఁగ వర్తిలు చుండి క్షుద్రమౌ
పూజలు మానినన్ విమల పుణ్యము దక్కును సజ్జనాళికిన్
వ్యాజనము కపటము
ఉ:పూజల బొందు నా గురువు పూలకు,బండ్లకు దృప్తి జెంది యా
రిప్లయితొలగించండిపూజ నొనర్చు వానికి ప్రమోదము తో నొక సూక్తి జెప్పినన్
సాజము, పాద పూజలకు సాధ్యము కాని వెలల్ విధించ నా
పూజలు మానినన్ విపులపుణ్యము దక్కును సజ్జనాళికిన్”
(గురువు అనే వాడు పూజ తో తృప్తి పడాలి కానీ పూజ చాలక తనకి పాదపూజ చేస్తే ఎదురు ఇంత సొమ్ము ఇవ్వాలని రేటు పెడితే ఆ పూజ మానటమే పుణ్యం.)
సాజము జీవనమున సం
రిప్లయితొలగించండియోజన భగవాను నరయ యోగం బందున్
వ్యాజము జేసెడి వారల
పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్!
పూజించుట వలన గలుగు
రిప్లయితొలగించండిసాజమ్మగు పుణ్య ఫలము సర్వుల కిలలో
నే జన్మను పలుక దగు నె
పూజించుట మానినపు డె పుణ్యము దక్కు న్?
తేజోమ యామృతాంధో
రిప్లయితొలగించండిరాజినిఁ గొలుచుచు సభక్తి గ్రామమ్ములలో
రాజిలు క్షుద్ర సురావళిఁ
బూజించుట మాని నపుడె పుణ్యము దక్కున్
ఆజి మనోర థాతత దురాత్ములు నై ఘన రోష తప్తులై
వ్యాజ మనస్కులై పర ధ నాఖిల వస్తు వినాశ నార్థమై
భూజన సంక్షయమ్మునకు భూరి తరాణు వరాస్త్ర కోటికై
పూజలు మానినన్ విపుల పుణ్యము దక్కును సజ్జనాళికిన్
కం॥
రిప్లయితొలగించండిరాజిలు మోక్షమ్మందెడి
మోజున జనులెల్లఁగడిది మోహావశులై
జాజర జేసెడి సాధుల
పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్