10, డిసెంబర్ 2025, బుధవారం

సమస్య - 5326

11-12-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ”
(లేదా...)
“గ్రీష్మపుటెండ చల్లన సఖీ విహరించెదమా మరీచికన్”

16 కామెంట్‌లు:

  1. ఉ.
    ఊష్మము కోరి మానసము హోమము భంగి జ్వలించుచుండె నే
    భీష్ముడ కాను నీపయిన ప్రీతికి లొంగి రమింప బూనితిన్
    గ్రీష్ముని కాలమందు రతికేళి యొనర్చదమీవ యున్నచో
    గ్రీష్మపుటెండ చల్లన, సఖీ విహరించెదమా మరీచికన్ !

    రిప్లయితొలగించండి
  2. కందం
    సుష్మా! నవదంపతులము
    నూష్మమ్మున కులుమనాలి యొప్పు మనకు, న
    ర్చష్మంతుని దలపించెడు
    గ్రీష్మపుటెండన్, విహారకేళి సుఖదమౌ!

    ఉత్పలమాల
    ఊష్మము తాళగన్ తనువు నొప్పక యున్నది జృంభణమ్మునన్
    సుష్మ! భరింపఁగన్ దగదు సూ! నవదంపతులై మనంగ న
    ర్చిష్మతిఁ బోలె నీ పురము ప్రేయసి! చేరి కులూ మనాలిలో
    గ్రీష్మపుటెండ చల్లన సఖీ విహరించెదమా మరీచికన్!

    రిప్లయితొలగించండి

  3. భీష్ముని చెల్లెలు చేరెను
    సుష్మ గృహము, వింతలెల్ల చూడదలచెడిన్
    రేష్మను వారించి తెలిపె
    గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ?


    భీష్ముని బంధువైనసతి పిల్లల తోడ విహార యాత్రకై
    సుష్మగృహమ్ముజేర తన జోడును గాంచి ముదమ్ము జెప్పె నా
    రేష్మకు వచ్చుచుండె నదొ గ్రీష్మము కాంచగ నప్పుడుండదే
    గ్రీష్మపుటెండ చల్లన సఖీ!, విహరించెదమా మరీచికన్.

    రిప్లయితొలగించండి
  4. గ్రీష్మఁపు మార్తాండుఁడు కడు
    నూష్మముఁ బుట్టించుచుండె నుర్వీతటిపై
    శుష్మము పెనఁగొన నెల్లెడ
    గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ?

    శుష్మము=నిప్పు

    రిప్లయితొలగించండి
  5. నే "ష్మా"ల నెచట వెదకుదు
    నీ "ష్మా" దుష్కర మగునని ఎఱుగుదురెల్లన్
    ఈ "ష్మా" ప్రాసల కన్నను
    గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ

    రిప్లయితొలగించండి
  6. శ్లేష్మము తగ్గును దప్పక
    గ్రీష్మపుటెండన్ ; విహారకేళి సుఖదమౌ
    నుష్మము కొంచెము గుదియగ ,
    కూష్మాండపు లేహ్యముదిని క్రుమ్మరుచుండన్

    రిప్లయితొలగించండి
  7. ఊష్మముతో బాల్యములో
    నూష్మాక్షరములను తెలిపి యుంటివి నాకున్
    గూష్మాండలేహ్యముఁ గుడువ
    గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ

    ఉష్మము లెక్కసేయవు మహోదయ బాల్యము గుర్తుసేయగా
    నూష్మములెన్నియో తెలిపి యుంటివి తెల్గున నాలుగంచు నా
    ముష్మిక సౌఖ్యముల్ వలదు ముచ్చట లాడగ కొండకోనలో
    గ్రీష్మపుటెండ చల్లన సఖీ విహరించెదమా మరీచికన్

    రిప్లయితొలగించండి
  8. భీష్మంబై తోచు నిచట
    నూష్మంబు భరింపలేమె యోపగలేమే!
    సుష్మా! శీతలవనమున
    గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ!

    రిప్లయితొలగించండి
  9. కం:"హుష్! మధ్యాహ్నము రాకయె
    యూష్మము బాధించు చుండె నూటీ లో నీ
    యూష్మము తగ్గు,వదల నీ
    గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ”

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. 2)ఉ:ఊష్మము చంపుచుండ నను నూరకె చూపకు మా యెడారి యీ
      గ్రీష్మము చాలదే! మరల రేపెద వేలనొ దూరదర్శన
      గ్రీష్మము? తోట లోన విహరింతము, నీకు రుచించె నేమి యీ
      గ్రీష్మపుటెండ? చల్లన సఖీ విహరించెదమా మరీచికన్?
      (అసలే గ్రీష్మం తో బాధ పడుతుంటే టి.వి లో ఆ ఎడారి దృశ్యాలు పెట్టా వెందుకు? ఆ ఎండ మావుల్లో విహరిద్దామా? వద్దు. తోట లోకి పోదాము. మరీచిక=ఎండ మావి)

      తొలగించండి
  11. పరమ పుణ్య దేశము సుమ్ము భరత భూమి
    యెన్నఁగ నిజ మింపుగ నెల్ల యెడలఁ దక్క
    నవని గ్రీష్మపు టెండన్ విహార కేళి
    సుఖద మౌను వీక్షింపఁగ సుదతి వినుమ


    ఇష్మ విహార సన్నిభము హెచ్చిన వేడుకతోఁ జరింతమా
    భీష్మ తరంపుఁ దాపమున విశ్వము వేఁగఁగ మిక్కుటమ్ముగా
    నూష్మము సాంత మంత మయి యుర్విని వర్ష ఋతూద్భవమ్ము గా
    గ్రీష్మపు టెండ చల్లన సఖీ విహరించెదమా మరీచికన్

    [వర్షకాలములో నెండమావుల గోచరము సాధారణమే]

    రిప్లయితొలగించండి
  12. (చెలినుద్దేశించి సఖుడు ధ్రవ ప్రాంతానికి దగ్గర ఉన్నవాడు తెలుపుట)

    కం॥ ఉష్మమనఁగ భయ మేలనొ
    గ్రీష్మమ్ము ధ్రువము దరిని విరియదు తెలుపఁగన్
    గ్రీష్మమున గృహము వీడుచు
    గ్రీష్మపుటెండన్ విహార కేళి సుఖదమౌ

    ఉ॥ ఉష్మమనంగనే భయము నొందఁగ నేల? ధ్రువమ్ము దాపులన్
    గ్రీష్మపు తాప మెచ్చటను? గేహము వీడి చనంగ నొప్పునే!
    గ్రీష్మము కానిచో చలికి కిమ్మనకుండుటయే చెలీ తగున్
    గ్రీష్మపుటెండ చల్లన సఖీ విహరించెదమా మరీచికన్

    ఉష్మము వేసవి ఎండ

    రిప్లయితొలగించండి
  13. రేష్మ యు భర్తయు యాత్రకు
    గ్రీ ష్మ o బు న బయలు దేరి కేరింత ల తో
    భీష్మి o చి సలుపు న య్యె డ
    గ్రీ ష్మపు టెండన్ విహార కేళి సుఖద మౌ

    రిప్లయితొలగించండి
  14. గ్రీష్మపుటెండలోనిటుల గీమునువీడి చరింపనేలనో
    శుష్మము ప్రజ్వలించ ననుశోకము తప్పదటందువేల నీ
    యూష్మమునైన సైపగల యోరిమి నిచ్చెడు నీదు నెమ్మికన్
    గ్రీష్మపుటెండ చల్లన, సఖీ విహరించెదమా మరీచికన్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    గ్రీష్మంబున ఊటీకై
    రేష్మయె వెడలె హితురాలు రేణుక తోడన్
    ఊష్మము నంతగ లేదిట
    గ్రీష్మపు టెండన్ విహారకేళి సుఖదమౌ.

    రిప్లయితొలగించండి