తే.గీ:సమయమ్ము మించి వచ్చిన , శ్రమ నొందగ నేను, తాము శ్రమ బడ పని వా రమితముగా నాదౌ వై ద్యమునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్” (అని ఒక వైద్యుదు రోగి తో అన్నాడు.)
యమునిన్; యమునికిఁ బదములను సంయమునిన్; సంయమునికి నని వ్రాసి పూరించుట సాధువు కాదు. సంయమి; సంయమనుఁడు పదములు కలవు కాని సంయముడు పదము లేదు కనుక నవి సాధువులు కావని నా యభిప్రాయము.
సమయంబాసన్న మయెన్
రిప్లయితొలగించండియమలోకముకేగవలయు నని శనినుడువన్
శమనరిపుడు మార్కండే
య మునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్
సమయము మించిపోయె యమ సద్మము చేరగ రమ్మటంచు నా
తొలగించండియమనుడనంగ బీతుకొని హంసుడు దిక్కను నిబ్బరంబుతో
క్షమకుడు నీలకంఠుని మృకండు తనూజుడు వేడగా తదీ
య మునికిఁ బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడిఁ బారద్రోలెనే
చ.
రిప్లయితొలగించండిశమదమ సంపదన్ విరిసి చంద్రశిరోమణి నిండుగా మహ
త్వమతిశయింప నమ్ముకొని తా జని కాచుమనంగ నప్డు పా
శములను వీడ జేసి గిరిజాధవుడే దిగి వచ్చె భక్తి పూ
య, మునికి బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడి బారద్రోలెనే !
కం॥
రిప్లయితొలగించండిసమకొన సమగతికంత్యము
సమవర్తియెపాశమూని సందిట నిలువన్
శమనరిపుడు మార్కండే
యమునిన్ బ్రతికింపఁజేసి యమునిం దరిమెన్
కం. సమయంబాయెను నీపతి
రిప్లయితొలగించండిశమనపురికి నేగగయన సావిత్రియును
త్తమసతి చతురతఁ సత్యని
యమునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్
సావిత్రి సత్యవంతుని బ్రతికించుకొన్న వృత్తాంతము
కందం
రిప్లయితొలగించండినమముల మృకండు సుతుఁడు ని
యమాల నల్పాయువౌచు నార్తిన్ జుట్టన్
క్షమియించి లింగడున్ సం
యమునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్
చంపకమాల
నమముల నిత్యమున్ శివుని నమ్మి మృకండుని పుత్ర రత్నమే
సుమమల నర్చనన్ సలిపి స్తోత్రములన్ జపియించి, భక్తి నం
తిమ సమయాన పాశమున తీరఁగ లింగనిఁ జుట్ట నార్తి సం
యమునికిఁ బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడిఁ బార ద్రోలెనే!
రిప్లయితొలగించండిఅమతపు భయమున్ ద్రోయుచు
ప్రమదము గూర్చు మని వేడ పశుపతి సౌజ
న్యమున మృకండు సుతుని సం
యమునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్.
అమతము తప్పదయ్యెనిక యర్భక యాశ్రిత పోషకుండిలన్
ప్రమదము గూర్చు భక్తులకు ఫాలుడొ కండెయటంచు తెల్పగా
విమలమృకండుజీవనుడు పింగళు వేడగ బ్రీతి తోడ సం
యమునికిఁ బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడిఁ బారద్రోలెనే.
||
రిప్లయితొలగించండి(మార్కండేయుని కథ )
అమతము దప్పదని దెలియ
నా మహదేవుని గొలువగ నపరాజితుడున్
సముచితమని ప్రాణం బీ
య , మునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినామ స్మరణము నందున
రిప్లయితొలగించండిబ్రేమన్ దరిగొన్న శివుడు విమలాత్ముండై
క్షేమంబుగ మార్కండే
య మునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్!
తే.గీ:సమయమ్ము మించి వచ్చిన ,
రిప్లయితొలగించండిశ్రమ నొందగ నేను, తాము శ్రమ బడ పని వా
రమితముగా నాదౌ వై
ద్యమునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్”
(అని ఒక వైద్యుదు రోగి తో అన్నాడు.)
చం:సమయము వచ్చి ప్రాణమును సంగ్రహణ మ్మొనరింప రాగ నా
రిప్లయితొలగించండియముడు, మృకండసూనుడు భయమ్మున దా శరణమ్ము వేడ,శీ
ఘ్రమె పరమేష్టి బాలకుని కంఠపు బాశము దీసి,బాలస
మ్యమునికిఁ బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడిఁ బారద్రోలెనే”
(మార్కండేయుని వృత్తాంతం తో.)
ఇది కేవలం ఊహ అండి ఒక యముడు యమధర్మరాజు 2వ యముడు శనిమహాత్ముడు
రిప్లయితొలగించండికం॥ యములిరువురు సోదరులటు
మమతలు మరచి కలహించ మానకఁ గినుకన్
బ్రమద గణనాథుఁడే చని
యమునిన్ బ్రదికింపఁ జేసి యమునిం దరిమెన్
చం॥ సమయముఁ జూచి ప్రాణములు చక్కగ దీయు నొకండు, పట్టఁగన్
సమముగఁ గష్టనష్టముల సందిటఁ గట్టెడి వాఁడొకండునై
మమతలు వీడి సోదరులు మానకఁ బోరుచునుండ విష్ణుఁడే
యమునికిఁ బ్రాణబిక్షనిడి యాయమునిన్ వడిఁ బారద్రోలెనే
(గణపతి (కం) విష్ణువు (చం) సోదరులలో ఓడిపోతున్న యముని రక్షించాడని అండి)
మృత్యుంజయుడైన మార్కండేయునితో తల్లిదండ్రులు జరిగినది వివరించు సందర్భము:
రిప్లయితొలగించండికం:
సమవర్తినిన్ను గొనిపో
వ మరణపాశమ్మువిడువ ఫాలుడు దాక్షి
ణ్యమున, తొలగజేసి యపా
యము, నిన్ బ్రతికింపఁజేసి యమునిం దరిమెన్
అమితపు భక్తిగ వేడుచు
రిప్లయితొలగించండితమితో నీ శ్వరు ని జేరు ధార్మిక పరునిన్
గమనించి న వేళ న్ సం
యముని న్ బ్రతికింప జేసి యమునిన్ దరి మెన్
భ్రమరాం బేశుని మున్ను వి
రిప్లయితొలగించండినమె మార్కండేయుఁ డార్తి నకులుని వేఁడన్
యముఁ డడరుచుఁ బాశము నే
య మునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దఱిమెన్
సుమ శర వైరి కాత్మ జన శోకము గాంచఁ గరంగు డెందమే
డమరువు మ్రోగఁ జేయుచుఁ దటాలునఁ దా నరుదెంచి యుగ్రతం
గమలి కరమ్ము నార్తిని మృకండు కుమారుఁడు వేఁడుకోలు సే
య మునికిఁ బ్రాణ భిక్ష నిడి యా యమునిన్ వడిఁ బాఱఁ ద్రోలెనే
యమునిన్; యమునికిఁ బదములను సంయమునిన్; సంయమునికి నని వ్రాసి పూరించుట సాధువు కాదు. సంయమి; సంయమనుఁడు పదములు కలవు కాని సంయముడు పదము లేదు కనుక నవి సాధువులు కావని నా యభిప్రాయము.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం.
రిప్లయితొలగించండియముడామార్కండేయుని
తమతోజేర్చుటకుబోగ తనభక్తిన; దే
వమహేశ్వరుండునచ్చట
*యమునింబ్రతికింపఁజేసియమునిందరిమెన్"*
✍️ ఇంద్రకంటి భార్గవనృసింహ శర్మ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
యముడా మార్కండేయుని
సమయగ జేయంగ దలచ శంకరు వేడన్
సమయమునకు వచ్చియె సం
యమునిన్ బ్రతికింపజేసి, యమునిం
దరిమెన్.