22, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5328

23-12-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరుభూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్”
(లేదా...)
“అరిగి యెడారిలో నిసుక నమ్మి గడింపఁగవచ్చు సంపదన్”

5 కామెంట్‌లు:

  1. కందం
    దొరుక నదులలో దోచితె
    మరి మరి! భూగర్భ జలపు మట్టము పడియెన్!
    సరిపోదె కలిమి! పాపీ!
    మరుభూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్!

    చంపకమాల
    దొరుకగ నేరులన్ నదుల దోచ విచక్షణఁ గానకుండగన్
    మరిమరి! భూమిలో జలపు మట్టము జాఱెను త్రాగునీటికిన్
    కరువయె! చాలదందువయ! కల్మి! నరాధమ! సిగ్గు కాదొ? నీ
    వరిగి యెడారిలో నిసుక నమ్మి గడింపఁగవచ్చు సంపదన్!

    రిప్లయితొలగించండి
  2. పరిపాలన జేయుటకై
    యరుదగు రీతిగ నది తటి యనువని దలచన్
    శరము దరి నిర్మితి కొరక
    మరు భూమిని , నిసుక నమ్ముమా ! సిరులబ్బున్

    రిప్లయితొలగించండి

  3. పరమ పిసినారి జేరుచు
    విరాళము నడుగుట కంటె విశ్వము లోనన్
    ధరణీ రుహములె యుండని
    మరుభూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్.


    అరయగ వాడు లుబ్ధుడని యందరెఱుంగెదరైరి కాదె యె
    వ్వరికిని కాసు రాల్చడిది వాస్తవ మంచు నెఱంగి కూడ నీ
    పురమున నాసుపత్రికయి భూరి విరాళము గోర మందువే
    యరిగి యెడారిలో నిసుక నమ్మి గడింపఁగవచ్చు సంపదన్?

    రిప్లయితొలగించండి
  4. కం. అరుదగు అవకాశమ్మిది
    హరిహయపురిని మరిపించ నమరావతిలో
    వరరాజధానియగుచు న
    మరు భూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్

    హరిహయ పురి : ఇంద్రపురి
    అమరు భూమి : తగిన ప్రదేశము

    రిప్లయితొలగించండి