12, డిసెంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5328

13-12-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్”
(లేదా...)
“అవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్”

4 కామెంట్‌లు:

  1. కందం
    శ్రవణీయమ్మగు కంఠము
    కవనమొలకగన్ విదేశ గమనమమరగా
    నవగుణపుటసభ్య నడత
    నవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్

    మత్తేభవిక్రీడితము
    శ్రవణీయంబగు గాత్రమున్ గలుగుచున్ సాహిత్యమందించుచున్
    గవనమ్మొల్కి విదేశయానములతోఁ గల్గంగ సత్కీర్తియే
    వివశుండౌచు నసభ్యవర్తనమునన్ వేదింపగన్ గాంతనే
    యవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్

    రిప్లయితొలగించండి

  2. అవమానించకు మంటిని
    యవనిన్ యశమును గడించి నట్టి బుధిలు డం
    టి, విదుడిపుడు నీ కంటికి
    యవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్?


    కవికాదాతడు కాంచగా నెపుడు సత్కావ్యమ్ములన్ వ్రాసి యీ
    యవనిన్ గీర్తిని పొందలేదు సఖులే యర్థింప పోనాడకన్
    సవయస్కుండ్ర గృహమ్ము లందు తన కౌశల్యమ్ముతో మేటిగా
    నవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్.

    రిప్లయితొలగించండి
  3. ఠవరయని కీర్తి నొందిరి
    యవధానములెన్నొ చేసి ; యల్పుండయ్యెన్
    అవసరము లేక యున్నను
    ప్రవీణతను గనబరచుట వాడుక యగుటన్

    రిప్లయితొలగించండి
  4. వివరించుఁ గాలి వానలు
    భవితవ్యపు హెచ్ఛరికలు భగ్నములవగా
    నవమానించుట మొదలై
    అవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్

    [అవధానము = హెచ్ఛరిక]

    అవధానంబనఁ జిత్తగించవలెనా యష్టావధానంబునే?
    వివరింపంగ విలక్షణంబయినవే వేర్వేరు రంగాలలో!
    నవధానంబులు పెక్కు సల్పెనతడన్యంబైన రంగాలలో
    యవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్

    రిప్లయితొలగించండి