23, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5329

24-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే”
(లేదా...)
“చెలి వడ్డించెను ప్రాణవల్లభునకుం జింతాకులోఁ బ్రేముడిన్”
('అవధాన పుష్కరిణి' మాస పత్రిక నుండి)

7 కామెంట్‌లు:

  1. నిలువుము మిత్రమ! యిదియే
    కలలోనం గాంచి తీవు కలికాలమునన్
    తెలియం గోరెద నిట నే
    చెలి వడ్డించెను విభునకు‌ జింతాకుననే

    రిప్లయితొలగించండి
  2. మత్తేభం
    మలిసంధ్యాసమయంబులో కలిగె గమ్మత్తైన భావంబులున్
    కలలో జూచిన మన్మధాకృతుడు సాక్షాత్కారమైనిల్వ వె
    న్నెలలో సిగ్గులు మొగ్గలై విరియ పానీయంబులర్పించె నె
    చ్చెలి వడ్డించెను ప్రాణవల్లభునకున్ చింతాకు లొఁబ్రేముడిన్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు

    రిప్లయితొలగించండి
  3. కందం
    'పులుపున్ కారము నుప్పును
    వలపున్ గలిపి', పొడుమంచు వర్షపు వేళన్
    నులివెచ్చని రాగమొలికి
    చెలి వడ్డించెను విభునకుఁ, 'జింతాకుననే'


    మత్తేభవిక్రీడితము
    వలపుల్ చిందుటె కాదు నా సతియె యస్వాదించెడున్ వంటలన్
    బలుమారుల్ దిని పల్వరించు గతిలో పళ్లెంబునన్ గూర్చె నె
    చ్చెలి వడ్డించెను ప్రాణవల్లభునకున్ జింతాకులోఁ బ్రేముడిన్
    బులుపున్ కారమునుప్పుతోడ పొడుమౌ ముద్దంచు వర్షాననే

    రిప్లయితొలగించండి
  4. -
    పిలిచెను దేవుని పుత్రుడు
    మొలకగ మునుగంగ తత్వమున బైబిలులో
    పులకింతల తన్నుమరిచి
    చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే



    ప్రభువు దయ అందరి పై
    ప్రసరించుగాక

    ఆమెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. నిలయము నందేర్పరచిన
    పలు పత్రముల వలె విందు పాత్రము లుండన్
    యెలమిని జూపించుచు నా
    చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే”

    రిప్లయితొలగించండి
  6. చలిచీమలజంట కుదిరి
    పులకించెను చింతచెట్టు బోదియ పైనన్
    వలపును కలగలిపినదై
    చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే

    వలపుల్ పండగ జేయు చింతనమునన్ బ్రాచీన వృక్షంబుపై
    చలిచీమల్ జతకూడెనంట నెనగా సాదృశ్యమే శూన్యమై
    చెలువంబొప్పగ నుగ్గడించె కవి తా సృష్టించు కావ్యంబులో
    చెలి వడ్డించెను ప్రాణవల్లభునకుం జింతాకులోఁ బ్రేముడిన్

    రిప్లయితొలగించండి

  7. కలధౌతముతో విస్తరి
    చెలువుడు చింతాకువోలె జేసి పిరిమి హే
    మలుడిచ్చెననుచు నివ్వగ
    చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే.

    తలియే యిచ్చెనటంచు పెన్మిటి యటన్ స్తాలమ్ము నందివ్వ నా
    చెలువుండిచ్చిన వెండి విస్తరదియే చింతాకు రూపంబునన్
    గలదంచున్ గని యింతియే మురిసి యాకంచమ్ము లో నప్పుడే
    చెలి వడ్డించెను ప్రాణవల్లభునకుం జింతాకులోఁ బ్రేముడిన్.

    రిప్లయితొలగించండి