30-12-2025 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అరిసెల రుచి కొఱకు వ్రేల్చు డాముదమందున్”(లేదా...)“అరిసెల వ్రేల్చఁగావలయు నాముదమందున స్వాదువందఁగన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సరియగు తైలము నొదవుట“అరిసెల రుచి కొఱకు ; వ్రేల్చు డాముదమందున్”అరగని దంతయు ప్రొద్దునవిరోచనమగుచు బయటకు వెడలుట కొరకై
కందంమురిపెమ్మున వచ్చిన కూతురల్లుడున్ వారి సంతు తోషమునందాచరణమ్మన సంక్రాంతికిఅరిసెల రుచి కొఱకు వ్రేల్చుడా ముదమందున్చంపకమాలమురిపెము మీరగన్ సుతయు ముద్దులు పంచెడు వారి పిల్లలున్దరలియు రాగ నల్లుడును దక్కెదె మోదము తల్లిదండ్రికిన్సరిపడునట్లుగన్ మరకసంక్రమణంపు సుపర్వ వేళలోనరిసెల వ్రేల్చఁగావలయు నా ముదమందున స్వాదువందఁగన్
చ.మురిపెము పెంపునొందగ ప్రభూత సుధాతరమైన తీపికైతరళ దినేశ కాలమున తమ్ముడ వంటలలోన చక్కగా నరుదగు బెల్లముం గలిపి యచ్చటనుంచెను రేయి వచ్చె నా యరిసెల వ్రేల్చగా వలయు నా ముదమందున స్వాదువందగన్ !
వెరజిన ధనమ్ము తోడను వరుణాత్మజ గ్రోలి యొకడు వచియించెనటన్ పరిగృహ్య తోడ, నిట్టుల నరిసెల రుచి కొఱకు వ్రేల్చు డాముదమందున్.*(భర్త భార్య తో పలికిన మాటలుగా)*బురకల మృత్యుభృత్యమును పూర్తిగ తీర్చుట కంచు వైద్యుడే పరిమితి తోడ నాముదపు పానము మేలని చెప్పె, గాంచగా నరుచి యటంచు గైకొనగ నౌరసు లిష్టము చూప రందుకే యరిసెల వ్రేల్చఁగావలయు నాముదమందున స్వాదువందఁగన్
కం. ధరలుర్విని వీడియు నంబరమును ౙొచ్చెఁ గొనఁ దేఱి భారమ్మాయెన్ ఇరుకాటము నొకడనియెన్ అరిసెల రుచికొఱకు వ్రేల్చు డాముదమందున్దేఱి = నెయ్యి
సరియగు నువ్వులు నూనెనుపొరుగునగల తెలికవాడు ముదమారగనిచ్చె రుచికరంబని దెలుపుచు నరిసెల రుచి కొఱకు వ్రేల్చుడా ముదమందున్సరియగు రీతిఁ బండినవి చక్కని నువ్వులఁ గానుగాడి మాపొరుగున నున్నవాడొకడు పొల్పున బంధువు లొచ్చియున్నదౌతరుణముఁ దెచ్చియిచ్చెనట తాఁముదమారగఁ దీసిన తైలరాజమేయరిసెల వ్రేల్చఁగావలయునా ముదమందున స్వాదువందఁగన్
సరసము లాడుచు నొకపరి పరిహాస ము మేళవించి పలుక గ బూనె న్ విరస గా నాత డని యె 'నరి సెలు రుచి కొఱ కు వ్రేల్చు డాముద మందు న్ "
విరిసిన పూలభంగి మురిపించు మృదుత్వమునందు నోటిలో కరకర లాడుచుండి కరుగన్ ఘనమౌరుచి నొప్పు రీతికైసరగున నేతి యందున పసందుగ వన్నెలు చిందు నట్టు లాయరిసెల వ్రేల్చఁగావలయు నా! ముదమందున స్వాదువందఁగన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసరియగు తైలము నొదవుట
రిప్లయితొలగించండి“అరిసెల రుచి కొఱకు ; వ్రేల్చు డాముదమందున్”
అరగని దంతయు ప్రొద్దున
విరోచనమగుచు బయటకు వెడలుట కొరకై
కందం
రిప్లయితొలగించండిమురిపెమ్మున వచ్చిన కూ
తురల్లుడున్ వారి సంతు తోషమునందా
చరణమ్మన సంక్రాంతికి
అరిసెల రుచి కొఱకు వ్రేల్చుడా ముదమందున్
చంపకమాల
మురిపెము మీరగన్ సుతయు ముద్దులు పంచెడు వారి పిల్లలున్
దరలియు రాగ నల్లుడును దక్కెదె మోదము తల్లిదండ్రికిన్
సరిపడునట్లుగన్ మరకసంక్రమణంపు సుపర్వ వేళలో
నరిసెల వ్రేల్చఁగావలయు నా ముదమందున స్వాదువందఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచ.
రిప్లయితొలగించండిమురిపెము పెంపునొందగ ప్రభూత సుధాతరమైన తీపికై
తరళ దినేశ కాలమున తమ్ముడ వంటలలోన చక్కగా
నరుదగు బెల్లముం గలిపి యచ్చటనుంచెను రేయి వచ్చె నా
యరిసెల వ్రేల్చగా వలయు నా ముదమందున స్వాదువందగన్ !
రిప్లయితొలగించండివెరజిన ధనమ్ము తోడను
వరుణాత్మజ గ్రోలి యొకడు వచియించెనటన్
పరిగృహ్య తోడ, నిట్టుల
నరిసెల రుచి కొఱకు వ్రేల్చు డాముదమందున్.
*(భర్త భార్య తో పలికిన మాటలుగా)*
బురకల మృత్యుభృత్యమును పూర్తిగ తీర్చుట కంచు వైద్యుడే
పరిమితి తోడ నాముదపు పానము మేలని చెప్పె, గాంచగా
నరుచి యటంచు గైకొనగ నౌరసు లిష్టము చూప రందుకే
యరిసెల వ్రేల్చఁగావలయు నాముదమందున స్వాదువందఁగన్
కం. ధరలుర్విని వీడియు నం
రిప్లయితొలగించండిబరమును ౙొచ్చెఁ గొనఁ దేఱి భారమ్మాయెన్
ఇరుకాటము నొకడనియెన్
అరిసెల రుచికొఱకు వ్రేల్చు డాముదమందున్
దేఱి = నెయ్యి
సరియగు నువ్వులు నూనెను
రిప్లయితొలగించండిపొరుగునగల తెలికవాడు ముదమారగని
చ్చె రుచికరంబని దెలుపుచు
నరిసెల రుచి కొఱకు వ్రేల్చుడా ముదమందున్
సరియగు రీతిఁ బండినవి చక్కని నువ్వులఁ గానుగాడి మా
పొరుగున నున్నవాడొకడు పొల్పున బంధువు లొచ్చియున్నదౌ
తరుణముఁ దెచ్చియిచ్చెనట తాఁముదమారగఁ దీసిన తైలరాజమే
యరిసెల వ్రేల్చఁగావలయునా ముదమందున స్వాదువందఁగన్
సరసము లాడుచు నొకపరి
రిప్లయితొలగించండిపరిహాస ము మేళవించి పలుక గ బూనె న్
విరస గా నాత డని యె
'నరి సెలు రుచి కొఱ కు వ్రేల్చు డాముద మందు న్ "
విరిసిన పూలభంగి మురి
రిప్లయితొలగించండిపించు మృదుత్వమునందు నోటిలో
కరకర లాడుచుండి కరు
గన్ ఘనమౌరుచి నొప్పు రీతికై
సరగున నేతి యందున ప
సందుగ వన్నెలు చిందు నట్టు లా
యరిసెల వ్రేల్చఁగావలయు
నా! ముదమందున స్వాదువందఁగన్!