30-1-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది”(లేదా...)“దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్”
తేటగీతిశక్తికొలది పనులఁ జేయ సాధ్యమగునులేదు కాదటంచున్ జెప్ప లేక పనులభారము తలకెత్తు కొనెడు వాక్కను సిరిదాన మొనరింపఁ గల్గు బాధలు గడిందిఉత్పలమాలపూనుచు బాధ్యతల్ నెఱుప ముఖ్యము సేసెడు కొల్వునందునన్లేనివి కానివాటికిని లేదని జెప్పుటలుత్తమంబు మీరానక మోదమందెదరు! హద్దులెరుంగక కార్యభార వాగ్దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
వలదటంచు చెప్పిననేమి భానుమాటవినక కొనితెచ్చుకొనెకదా పెద్దనిదురయార్కి, యతని గాధయె తెల్పె నవని యందుదాన మొనరింపఁ గల్గు బాధలు గడింది.సూనుని జేరి జన్మదుడు సుద్దులు చెప్పుచు నుండె నివ్విధిన్ మానుమపాత్రదానమని మర్కుడు సూచన జేసినన్ శచీజానికి యంగరాజు కవచమ్మునొసంగి మరించె గాంచగాదానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్.
తేటగీతి
రిప్లయితొలగించండిశక్తికొలది పనులఁ జేయ సాధ్యమగును
లేదు కాదటంచున్ జెప్ప లేక పనుల
భారము తలకెత్తు కొనెడు వాక్కను సిరి
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది
ఉత్పలమాల
పూనుచు బాధ్యతల్ నెఱుప ముఖ్యము సేసెడు కొల్వునందునన్
లేనివి కానివాటికిని లేదని జెప్పుటలుత్తమంబు మీ
రానక మోదమందెదరు! హద్దులెరుంగక కార్యభార వా
గ్దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
రిప్లయితొలగించండివలదటంచు చెప్పిననేమి భానుమాట
వినక కొనితెచ్చుకొనెకదా పెద్దనిదుర
యార్కి, యతని గాధయె తెల్పె నవని యందు
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది.
సూనుని జేరి జన్మదుడు సుద్దులు చెప్పుచు నుండె నివ్విధిన్
మానుమపాత్రదానమని మర్కుడు సూచన జేసినన్ శచీ
జానికి యంగరాజు కవచమ్మునొసంగి మరించె గాంచగా
దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్.