ద్రుపదుని తమ్ముడు (ధృష్టద్యుమ్నుడు) పూనుకొని అర్జునుని మీద (కవ్వడి రెండుచేతులలో వడి గలవాడు) నూరు వాడి బాణాలు వేశాడు. అర్జునుడు మిక్కిలి కోపగించి, ఆ బాణాలన్నింటినీ మధ్యలోనే ముక్కలు చేసి పడగొట్టాడు.
పదం అర్థం కడఁగి పూనుకొని, ఉత్సాహంతో ద్రుపదానుజుఁడు ద్రుపదుని తమ్ముడు - ధృష్టద్యుమ్నుడు కవ్వడి - అర్జునుడు
కం:కర్ణుం డొక పరి రెచ్చగ కర్ణము నా వార్త సోకగా రారాజున్ వర్ణించె నతడు ముదమున "కర్ణుం డుగ్రుఁ డగుచు ననిఁ గవ్వడిఁ గూల్చెన్." (అంత పెద్ద యుద్ధం లో ఎవడో ఒకడు ఒక సారి రెచ్చటం సహజం. కర్ణుడు ఒక సారి పై చేయి సాధించాడనే వార్త వినగానే దుర్యోధనుడు ఆ మాట అనేసాడు. )
ఉ:కర్ణుడు గొప్పయోధు డని గట్టిగ నమ్మ సుయోధనుం డనిన్ కర్ణుని శూరతన్ దెలుపగా గురు డిట్టుల బల్కె " నెన్నడీ కర్ణుఁడు గూల్చె యుద్ధమునఁ గవ్వడి? నొంటరిఁ జేసి క్రోధియై కర్ణుడు పార్థ నందనుని గాసిలి వెట్టెను మంది నొక్కడై. (ఈ కర్ణుడు అర్జునుణ్ని ఎప్పుడు గెలిచా డయ్యా! అర్జునుడి కొడుకుని మాత్రమే ఒంటరిని చేసి బాధ పెట్టారు.అదీ ఒక్కడే కాదు. మా అందరి గుంపు లో ఒకడు గా అని ద్రోణాచార్యుడు అన్నాడు. )
జీర్ణుడు ధృతరాష్ట్రుండట
రిప్లయితొలగించండికర్ణ పరాక్రమ మటంచు కనె స్వప్నములోన్
వర్ణ విహీను డయిన యా
కర్ణుండుగ్రుడగుచునని గవ్వడి గూల్చెన్.
వర్ణ విహీ నుడంచు నట పన్నలు కొంచెము చేసి నట్టి యా
కర్ణ పరాక్రమమ్ము వినగా కడు సంతస మంది యంధుడా
జీర్ణ వయస్కుడచ్చట సుషిప్తిని గాంచిన స్వప్న మందునన్
కర్ణుడు కూల్చె యుద్ధమున గవ్వడి నొంటరి జేసి క్రోధియై.
కర్ణము జిల్లుపడ నరచె
రిప్లయితొలగించండికర్ణుం డుగ్రుఁ డగుచు , ననిఁ గవ్వడిఁ గూల్చెన్."
అర్ణవమగు కురు సేనను
పూర్ణమసుని వెలుగు నాడు ముగియక ముందే
-
రిప్లయితొలగించండికడఁగి ద్రుపదానుజుఁడు నె,వ్వడిఁ గవ్వడినేసె నూఱు వాఁడిశరంబుల్, కడునలిగి వానినన్నియు, నడుమన తునియంగనేసె నరుఁడస్త్రములన్.
ద్రుపదుని తమ్ముడు (ధృష్టద్యుమ్నుడు) పూనుకొని అర్జునుని మీద (కవ్వడి రెండుచేతులలో వడి గలవాడు) నూరు వాడి బాణాలు వేశాడు. అర్జునుడు మిక్కిలి కోపగించి, ఆ బాణాలన్నింటినీ మధ్యలోనే ముక్కలు చేసి పడగొట్టాడు.
పదం
అర్థం
కడఁగి
పూనుకొని, ఉత్సాహంతో
ద్రుపదానుజుఁడు
ద్రుపదుని తమ్ముడు - ధృష్టద్యుమ్నుడు
కవ్వడి - అర్జునుడు
కడు నలిగి
మిక్కిలి కోపగించి
నరుఁడు
అర్జునుడు
అస్త్రములన్
బాణాలను~
కందం
రిప్లయితొలగించండినిర్ణయమెట్లొనరించితొ?
వర్ణించె ప్రవచన కర్త భారతకథనే
గర్ణములకు తూట్లు పడఁగఁ
"గర్ణుం డుగ్రుఁ డగుచు ననిఁ గవ్వడిఁ గూల్చెన్"
ఉత్పలమాల
నిర్ణయమెట్లుఁ జేసితివొ నేతగ, నా ప్రవచించు పండితున్?
వర్ణనఁ జేయుచున్ బలుక భారత గాథను ప్రేక్షకాళికిన్
కర్ణ కటోరమౌ పగిదిఁ గారెను రక్తము వాని వాక్కులన్,
"గర్ణుఁడు గూల్చె యుద్ధమునఁ గవ్వడి నొంటరిఁ జేసి క్రోధియై!"
ఉ॥ కర్ణుని ప్రాపు నెంచి తన కామిత కల్పకమంచు భ్రాంతితో
రిప్లయితొలగించండినిర్ణయమున్ సుయోధనుఁడు నెమ్మినిఁ జేయఁగ నాజి సల్పఁగన్
జూర్ణముఁ గావు కోర్కెలను స్ఫూర్తిని నింపెను స్వప్నమీ విధిన్
గర్ణుఁడు కూల్చె యుద్ధమునఁ గవ్వడి నొంటిరిఁ జేసి క్రోధియై
కం:కర్ణుం డొక పరి రెచ్చగ
రిప్లయితొలగించండికర్ణము నా వార్త సోకగా రారాజున్
వర్ణించె నతడు ముదమున
"కర్ణుం డుగ్రుఁ డగుచు ననిఁ గవ్వడిఁ గూల్చెన్."
(అంత పెద్ద యుద్ధం లో ఎవడో ఒకడు ఒక సారి రెచ్చటం సహజం. కర్ణుడు ఒక సారి పై చేయి సాధించాడనే వార్త వినగానే దుర్యోధనుడు ఆ మాట అనేసాడు. )
ఉ:కర్ణుడు గొప్పయోధు డని గట్టిగ నమ్మ సుయోధనుం డనిన్
రిప్లయితొలగించండికర్ణుని శూరతన్ దెలుపగా గురు డిట్టుల బల్కె " నెన్నడీ
కర్ణుఁడు గూల్చె యుద్ధమునఁ గవ్వడి? నొంటరిఁ జేసి క్రోధియై
కర్ణుడు పార్థ నందనుని గాసిలి వెట్టెను మంది నొక్కడై.
(ఈ కర్ణుడు అర్జునుణ్ని ఎప్పుడు గెలిచా డయ్యా! అర్జునుడి కొడుకుని మాత్రమే ఒంటరిని చేసి బాధ పెట్టారు.అదీ ఒక్కడే కాదు. మా అందరి గుంపు లో ఒకడు గా అని ద్రోణాచార్యుడు అన్నాడు. )
వర్ణవిహీనత నొందిన
రిప్లయితొలగించండికర్ణుని గొప్పనటఁ నిజము కాని విధమునన్
వర్ణించె నా విబుధుడే
'కర్ణుం డుగ్రుఁ డగుచు ననిఁ గవ్వడిఁ గూల్చెన్'
వర్ణము నిమ్నమన్న తలవంపుల నొందిన వీరుడాతడే
స్వర్ణపు కుండలమ్ములను సంజనితమ్ముగ గల్గి యుండెలే
వర్ణన సేయ రాదిటుల వాస్తవ దూరములైన సంగతుల్
'కర్ణుఁడు గూల్చె యుద్ధమునఁ గవ్వడి నొంటరిఁ జేసి క్రోధియై'