7-5-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని”(లేదా...)“కరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్”
ఆటవెలదికంటికగుపడకయె కబలించెను గరోన!దోమ, చీమ వలన దూము తగులచిత్రమేమనందు చిక్కు పడినయంతదోమ గరిని మ్రింగెఁ ! జీమ పులిని!మత్తేభవిక్రీడితముధరణిన్ రేగుచు సూక్ష్మజీవులవె నిర్దాక్షిణ్యమన్ రీతిగన్బరలోకంబును జేర్చె మానవుల సర్వానర్థముల్ రేపుచున్బరిలో దోమయు జీమ కారణముగన్ ప్రాణాలకున్ మూడగన్గరినిన్ మ్రింగెను దోమ! చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్!
జగతిలోన యెపుడు సత్యముగానిది తెలుపగోరి యడుగ , దెల్లబోక వింత గొలుపునటుల విన్నవించె నిటుల "దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని"
మీ పూరణ బాగున్నది. "జగతిలోన నెపుడు..." అనండి.
వింత యొకటి తెల్పు విరించియని యడ్గవిన్నవించె నొక్క వికట కవికనియు విని యెరుగని కథనల్లి చెప్పెను"దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని"
మీ పూరణ బాగున్నది. 'విరించి, వికటకవి' అన్నచోట గణభంగం.
మంత్ర తంత్రములును మాయలు మెండైనచలన చిత్ర మొకటి కలుగచేసితాను బొందె యశము దర్శక ప్రవరుడుదోమ గరిని మ్రింగెఁ జీమ పులినిపరమానందము గూర్చు చిత్రములవే వర్ణింపగా శక్యమేపరిపూర్ణంబగు మంత్ర తంత్రములతో వాంఛించి నిర్మించెలేమురిపించందగు సన్నివేశములతో పూర్ణత్వమే చూపెలేకరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్
మీ రెండు పూరణలు బాగున్నవి.
మూలికలను దంచి ముదముగా నొక్కడు మందు చలన చిత్ర మందు చేసి దోమకు తిని పించె చీమకు తినిపించ దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని.అరయన్ బాలల హాస్య చిత్ర మదియే ఆంగ్లేయుడే తీయ న బ్బర మౌ వింతల వెన్నియో కలవటన్ పాటించి దర్శింపగా కరివేపాకును దంచి యోషధిగ నా కామందు త్రావింప గా కరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్.
పోచిరాజు కామేశ్వరరావు గార్కినమస్కారములుకృత్రిమ మేధ ను ఏలితెలివి అనవచ్చని కొంత డిస్కషన్ జరుగుతోంది సరియేనాండీ ఈ పదము ?చూడగ నిజమైన చోద్యమైనట్టి దృశ్యమగు పించె నచట చక్కనైనయేలి తెలివి గానరే చిత్రమొక్కటిదోమ కరిని మ్రింగె చీమ పులిని
మీ పూరణ బాగున్నది.
నమస్కారములండి. అనవచ్చును. కాని కొంచెము మోసపు తెలివి యన్న భావన సూచిత మవును.
భంగు త్రాగి మెదడు భంగపడ నొకఁడుమత్తునందు దూఁగి మాటలాడెగాడిద వనమందు గాలిలో విహరించెదోమ గరిని మ్రింగెఁ జీమ పులిని
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చిత్ర చిత్ర ములుగజెప్పు చుండె నొకడు చిన్ని పాప లకును చిత్ర కథలు వారి కద్భు తముగవర్ణించి యి ట్ల నె దోమ మ్రింగె గరిని చీమ పులిని
మ॥ అరయంగన్ గడు చిత్రముల్ చొనిపి బాలానందమున్ గాంచఁగన్నిరతమ్మట్లు పరిశ్రమమ్ము నిడి ధ్యానించంగ నాలోచనల్విరియన్ దీసిరి చిత్ర రాజమును వైవిధ్యమ్ముగా నందులోఁగరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్
జంభమాడు వాడు జగతిమాన్యుండాయె వినయశీలి పరమ దీనుడాయెప్రల్లదీడు పలుకు పగ్గెలీ లాగునదోమ గరిని మ్రింగెఁ జీమ పులిని
శంకరాభరణమయ్యవారు పూర్తిగా బ్లాగు వైపు చూడటమే మానేసుకున్నారు మల్లే వున్నది వాత్సాపు లోక మహిమ :)
అమ్మా! తరచూ తప్పని ప్రయాణాలు, అస్వస్థత, మిత్రుల పుస్తకాల డిటిపి పనులతో 'బడిదొంగ'నౌతున్న మాట నిజమే... ఇకనుండి క్రమంతప్పకుండా సమీక్షించడానికి ప్రయత్నిస్తాను.
హరియన్ బాలకు డొక్కడున్ గృహమునన్ నాక్రందనన్ జేయగన్మురిపించాలని తాత బాలకుడినిన్ ముద్దాడి తాజెప్పుచున్పరమానందము గూర్చు వింత కథనున్ వర్ణించె నీరీతిగన్కరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్
ఆసఁ గలల నమ్మి మోసపోవ వలదు చెదరఁ గలలు తొలఁగుఁ గద భ్రమ లిఁకఁ గలల యందు నెల్ల నలవడు వింతలే దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని పరమాశ్చర్యము నంద డెందముల సంభావ్యమ్ము లీ వింతలే దురమం దౌర శిఖండి భీష్ముని వెసం దున్మాడ యత్నించెనే స్థిరచిత్తుం డయి సైంధవుం డకట యాక్షేపించె భీమాదులం గరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కనుచు పిల్లలంత కార్టూను చిత్రాలువింతలెన్నొ జూచి విస్తుబోవుజంబుకమ్ము నొకటి చంపె సింగమ్మునుదోమ గరిని మ్రింగెఁ, జీమ పులిని.
ఆటవెలది
రిప్లయితొలగించండికంటికగుపడకయె కబలించెను గరోన!
దోమ, చీమ వలన దూము తగుల
చిత్రమేమనందు చిక్కు పడినయంత
దోమ గరిని మ్రింగెఁ ! జీమ పులిని!
మత్తేభవిక్రీడితము
ధరణిన్ రేగుచు సూక్ష్మజీవులవె నిర్దాక్షిణ్యమన్ రీతిగన్
బరలోకంబును జేర్చె మానవుల సర్వానర్థముల్ రేపుచున్
బరిలో దోమయు జీమ కారణముగన్ ప్రాణాలకున్ మూడగన్
గరినిన్ మ్రింగెను దోమ! చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్!
జగతిలోన యెపుడు సత్యముగానిది
రిప్లయితొలగించండితెలుపగోరి యడుగ , దెల్లబోక
వింత గొలుపునటుల విన్నవించె నిటుల
"దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని"
మీ పూరణ బాగున్నది.
తొలగించండి"జగతిలోన నెపుడు..." అనండి.
వింత యొకటి తెల్పు విరించియని యడ్గ
రిప్లయితొలగించండివిన్నవించె నొక్క వికట కవి
కనియు విని యెరుగని కథనల్లి చెప్పెను
"దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని"
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'విరించి, వికటకవి' అన్నచోట గణభంగం.
మంత్ర తంత్రములును మాయలు మెండైన
రిప్లయితొలగించండిచలన చిత్ర మొకటి కలుగచేసి
తాను బొందె యశము దర్శక ప్రవరుడు
దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని
పరమానందము గూర్చు చిత్రములవే వర్ణింపగా శక్యమే
పరిపూర్ణంబగు మంత్ర తంత్రములతో వాంఛించి నిర్మించెలే
మురిపించందగు సన్నివేశములతో పూర్ణత్వమే చూపెలే
కరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండి
రిప్లయితొలగించండిమూలికలను దంచి ముదముగా నొక్కడు
మందు చలన చిత్ర మందు చేసి
దోమకు తిని పించె చీమకు తినిపించ
దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని.
అరయన్ బాలల హాస్య చిత్ర మదియే ఆంగ్లేయుడే తీయ న
బ్బర మౌ వింతల వెన్నియో కలవటన్ పాటించి దర్శింపగా
కరివేపాకును దంచి యోషధిగ నా కామందు త్రావింప గా
కరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్.
పోచిరాజు కామేశ్వరరావు గార్కి
రిప్లయితొలగించండినమస్కారములు
కృత్రిమ మేధ ను ఏలితెలివి అనవచ్చని కొంత డిస్కషన్ జరుగుతోంది సరియేనాండీ ఈ పదము ?
చూడగ నిజమైన చోద్యమైనట్టి దృ
శ్యమగు పించె నచట చక్కనైన
యేలి తెలివి గానరే చిత్రమొక్కటి
దోమ కరిని మ్రింగె చీమ పులిని
మీ పూరణ బాగున్నది.
తొలగించండినమస్కారములండి.
తొలగించండిఅనవచ్చును.
కాని కొంచెము మోసపు తెలివి యన్న భావన సూచిత మవును.
భంగు త్రాగి మెదడు భంగపడ నొకఁడు
రిప్లయితొలగించండిమత్తునందు దూఁగి మాటలాడె
గాడిద వనమందు గాలిలో విహరించె
దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిత్ర చిత్ర ములుగజెప్పు చుండె నొకడు
రిప్లయితొలగించండిచిన్ని పాప లకును చిత్ర కథలు
వారి కద్భు తముగవర్ణించి యి ట్ల నె
దోమ మ్రింగె గరిని చీమ పులిని
మీ పూరణ బాగున్నది.
తొలగించండిమ॥ అరయంగన్ గడు చిత్రముల్ చొనిపి బాలానందమున్ గాంచఁగన్
రిప్లయితొలగించండినిరతమ్మట్లు పరిశ్రమమ్ము నిడి ధ్యానించంగ నాలోచనల్
విరియన్ దీసిరి చిత్ర రాజమును వైవిధ్యమ్ముగా నందులోఁ
గరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్
జంభమాడు వాడు జగతిమాన్యుండాయె
రిప్లయితొలగించండివినయశీలి పరమ దీనుడాయె
ప్రల్లదీడు పలుకు పగ్గెలీ లాగున
దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని
మీ పూరణ బాగున్నది.
తొలగించండిశంకరాభరణమయ్యవారు
రిప్లయితొలగించండిపూర్తిగా బ్లాగు వైపు చూడటమే మానేసుకున్నారు మల్లే వున్నది వాత్సాపు లోక మహిమ :)
అమ్మా! తరచూ తప్పని ప్రయాణాలు, అస్వస్థత, మిత్రుల పుస్తకాల డిటిపి పనులతో 'బడిదొంగ'నౌతున్న మాట నిజమే... ఇకనుండి క్రమంతప్పకుండా సమీక్షించడానికి ప్రయత్నిస్తాను.
తొలగించండిహరియన్ బాలకు డొక్కడున్ గృహమునన్ నాక్రందనన్ జేయగన్
రిప్లయితొలగించండిమురిపించాలని తాత బాలకుడినిన్ ముద్దాడి తాజెప్పుచున్
పరమానందము గూర్చు వింత కథనున్ వర్ణించె నీరీతిగన్
కరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్
ఆసఁ గలల నమ్మి మోసపోవ వలదు
రిప్లయితొలగించండిచెదరఁ గలలు తొలఁగుఁ గద భ్రమ లిఁకఁ
గలల యందు నెల్ల నలవడు వింతలే
దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని
పరమాశ్చర్యము నంద డెందముల సంభావ్యమ్ము లీ వింతలే
దురమం దౌర శిఖండి భీష్ముని వెసం దున్మాడ యత్నించెనే
స్థిరచిత్తుం డయి సైంధవుం డకట యాక్షేపించె భీమాదులం
గరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కనుచు పిల్లలంత కార్టూను చిత్రాలు
వింతలెన్నొ జూచి విస్తుబోవు
జంబుకమ్ము నొకటి చంపె సింగమ్మును
దోమ గరిని మ్రింగెఁ, జీమ పులిని.