6, మే 2026, బుధవారం

సమస్య - 5461

7-5-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని”
(లేదా...)
“కరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్”

24 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    కంటికగుపడకయె కబలించెను గరోన!
    దోమ, చీమ వలన దూము తగుల
    చిత్రమేమనందు చిక్కు పడినయంత
    దోమ గరిని మ్రింగెఁ ! జీమ పులిని!


    మత్తేభవిక్రీడితము
    ధరణిన్ రేగుచు సూక్ష్మజీవులవె నిర్దాక్షిణ్యమన్ రీతిగన్
    బరలోకంబును జేర్చె మానవుల సర్వానర్థముల్ రేపుచున్
    బరిలో దోమయు జీమ కారణముగన్ ప్రాణాలకున్ మూడగన్
    గరినిన్ మ్రింగెను దోమ! చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్!

    రిప్లయితొలగించండి
  2. జగతిలోన యెపుడు సత్యముగానిది
    తెలుపగోరి యడుగ , దెల్లబోక
    వింత గొలుపునటుల విన్నవించె నిటుల
    "దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని"

    రిప్లయితొలగించండి
  3. వింత యొకటి తెల్పు విరించియని యడ్గ
    విన్నవించె నొక్క వికట కవి
    కనియు విని యెరుగని కథనల్లి చెప్పెను
    "దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని"

    రిప్లయితొలగించండి
  4. మంత్ర తంత్రములును మాయలు మెండైన
    చలన చిత్ర మొకటి కలుగచేసి
    తాను బొందె యశము దర్శక ప్రవరుడు
    దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని

    పరమానందము గూర్చు చిత్రములవే వర్ణింపగా శక్యమే
    పరిపూర్ణంబగు మంత్ర తంత్రములతో వాంఛించి నిర్మించెలే
    మురిపించందగు సన్నివేశములతో పూర్ణత్వమే చూపెలే
    కరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్

    రిప్లయితొలగించండి

  5. మూలికలను దంచి ముదముగా నొక్కడు
    మందు చలన చిత్ర మందు చేసి
    దోమకు తిని పించె చీమకు తినిపించ
    దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని.


    అరయన్ బాలల హాస్య చిత్ర మదియే ఆంగ్లేయుడే తీయ న
    బ్బర మౌ వింతల వెన్నియో కలవటన్ పాటించి దర్శింపగా
    కరివేపాకును దంచి యోషధిగ నా కామందు త్రావింప గా
    కరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్.

    రిప్లయితొలగించండి
  6. పోచిరాజు కామేశ్వరరావు గార్కి

    నమస్కారములు‌

    కృత్రిమ మేధ ను ఏలితెలివి అనవచ్చని కొంత డిస్కషన్ జరుగుతోంది సరియేనాండీ ఈ పదము ?


    చూడగ నిజమైన చోద్యమైనట్టి దృ
    శ్యమగు పించె నచట చక్కనైన
    యేలి తెలివి గానరే చిత్రమొక్కటి
    దోమ కరిని మ్రింగె చీమ పులిని



    రిప్లయితొలగించండి
  7. భంగు త్రాగి మెదడు భంగపడ నొకఁడు
    మత్తునందు దూఁగి మాటలాడె
    గాడిద వనమందు గాలిలో విహరించె
    దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని

    రిప్లయితొలగించండి
  8. చిత్ర చిత్ర ములుగజెప్పు చుండె నొకడు
    చిన్ని పాప లకును చిత్ర కథలు
    వారి కద్భు తముగవర్ణించి యి ట్ల నె
    దోమ మ్రింగె గరిని చీమ పులిని

    రిప్లయితొలగించండి
  9. మ॥ అరయంగన్ గడు చిత్రముల్ చొనిపి బాలానందమున్ గాంచఁగన్
    నిరతమ్మట్లు పరిశ్రమమ్ము నిడి ధ్యానించంగ నాలోచనల్
    విరియన్ దీసిరి చిత్ర రాజమును వైవిధ్యమ్ముగా నందులోఁ
    గరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్

    రిప్లయితొలగించండి
  10. జంభమాడు వాడు జగతిమాన్యుండాయె
    వినయశీలి పరమ దీనుడాయె
    ప్రల్లదీడు పలుకు పగ్గెలీ లాగున
    దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని

    రిప్లయితొలగించండి
  11. శంకరాభరణమయ్యవారు
    పూర్తిగా బ్లాగు వైపు చూడటమే మానేసుకున్నారు మల్లే వున్నది వాత్సాపు లోక మహిమ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మా! తరచూ తప్పని ప్రయాణాలు, అస్వస్థత, మిత్రుల పుస్తకాల డిటిపి పనులతో 'బడిదొంగ'నౌతున్న మాట నిజమే... ఇకనుండి క్రమంతప్పకుండా సమీక్షించడానికి ప్రయత్నిస్తాను.

      తొలగించండి
  12. హరియన్ బాలకు డొక్కడున్ గృహమునన్ నాక్రందనన్ జేయగన్
    మురిపించాలని తాత బాలకుడినిన్ ముద్దాడి తాజెప్పుచున్
    పరమానందము గూర్చు వింత కథనున్ వర్ణించె నీరీతిగన్
    కరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్

    రిప్లయితొలగించండి
  13. ఆసఁ గలల నమ్మి మోసపోవ వలదు
    చెదరఁ గలలు తొలఁగుఁ గద భ్రమ లిఁకఁ
    గలల యందు నెల్ల నలవడు వింతలే
    దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని


    పరమాశ్చర్యము నంద డెందముల సంభావ్యమ్ము లీ వింతలే
    దురమం దౌర శిఖండి భీష్ముని వెసం దున్మాడ యత్నించెనే
    స్థిరచిత్తుం డయి సైంధవుం డకట యాక్షేపించె భీమాదులం
    గరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కనుచు పిల్లలంత కార్టూను చిత్రాలు
    వింతలెన్నొ జూచి విస్తుబోవు
    జంబుకమ్ము నొకటి చంపె సింగమ్మును
    దోమ గరిని మ్రింగెఁ, జీమ పులిని.

    రిప్లయితొలగించండి