కం:తంజావూరున కరవున గంజియె ఘన మయ్యె , చచ్చె గా గుర్రములున్ బంజరు భూములె మిగిలెను కుంజరములు సమసెఁ గుంభకోణమునందున్” (నిజానికి ఇక్కడ పెద్ద సమస్య లేదు.కుంభకోణం నగరం పేరు. )
శా:కాలాబ్ధిన్ బవళించె చోళఘనతల్,కన్ పింతురే పాండ్యులున్! శాలల్ బోయెను రాచ గుర్రములకున్,శాస్త్రీయతల్ దెచ్చు నా హేలన్ దిగ్గజసంఘముల్ సమసిపోయెన్ గుంభకోణమ్మునన్ గోలన్ బెంచు నవీనవాహనములే గుయ్యంచు గన్ పించెడిన్. (పాండ్య చోళ రాజుల నాటి గుర్రాలు, ఏనుగులు ఇప్పుడు కుంభకోణం నగరం లో కనిపిస్తాయా? ఆధునిక వాహనాలే ఉంటాయి. )
తంజావూరు గుడులలో
రిప్లయితొలగించండిజంజీరలు మాయమైన సమయము నందున్
పుంజీల కొలది యాజ్ఞిక
కుంజరములు సమసెఁ గుంభకోణమునందున్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిజంజాటము తొలగింపగ
రిప్లయితొలగించండిసంజనితంబైన రీతి సలిపిరి హత్యల్
పంజరములో చిలుకలై
కుంజరములు సమసెఁ గుంభకోణమునందున్
ఆలోచించిన వారికెల్ల విదితంబా లడ్డులో నాణ్యతే
చాలాకాలము నుండియున్న నెఱినే సంపూర్తిగా మార్చగా
పాలే చూడని సంస్థకే ఘృతముకై ప్రాప్తించె నొప్పందమే
హేలన్, దిగ్గజసంఘముల్ సమసిపోయెన్, గుంభకోణమ్మునన్
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండివేలున్ లక్షలు కోట్ల రూకల ప్రజావిత్తంబుతో కార్యముల్
రిప్లయితొలగించండికాలాతీతమొనర్చుచున్ నిధులు కైంకర్యం బొనర్పంగనా
వాలాయమ్ముగ మ్రింగు కల్లరుల నిర్బంధించి శిక్షింపగన్
హేలన్ దిగ్గజసంఘముల్ సమసిపోయెన్ గుంభకోణమ్మునన్
ప్రశస్తమైన పూరణ.
తొలగించండిభంజన మొనరించి నిధులు
రిప్లయితొలగించండివ్యంజనముగ నారగించి వాలాయముగా
రంజనమున కులికి తుదకు
కుంజరములు సమసెఁ గుంభకోణమునందున్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిరంజిలు రీతిగ ప్రతిమలు
రిప్లయితొలగించండిమంజుల మౌ మందిర మున మహిమా న్వి త మై
పుంజు కొన వినాశ ము నై
కుంజరములు సమసె కుంభ కోణ ము నందున్
మీ పూరణ బాగున్నది.
తొలగించండికం:తంజావూరున కరవున
రిప్లయితొలగించండిగంజియె ఘన మయ్యె , చచ్చె గా గుర్రములున్
బంజరు భూములె మిగిలెను
కుంజరములు సమసెఁ గుంభకోణమునందున్”
(నిజానికి ఇక్కడ పెద్ద సమస్య లేదు.కుంభకోణం నగరం పేరు. )
మీ పూరణ బాగున్నది.
తొలగించండిశా॥ మేలౌదిగ్గజ నామమొంది తగు నెమ్మిన్ బ్రాభవమ్మొందినన్
రిప్లయితొలగించండిగీలున్ గాంచిన శత్రువుల్ చెలఁగుచున్ గ్లేశమ్ముఁ జేకూర్చఁగన్
గాలమ్మావిధి రాజకీయ చదరంగంబందు బంధించఁగన్
హేలన్ దిగ్గజ సంఘముల్ సమసి పోయెన్ గుంభకోణమ్మునన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిశా:కాలాబ్ధిన్ బవళించె చోళఘనతల్,కన్ పింతురే పాండ్యులున్!
రిప్లయితొలగించండిశాలల్ బోయెను రాచ గుర్రములకున్,శాస్త్రీయతల్ దెచ్చు నా
హేలన్ దిగ్గజసంఘముల్ సమసిపోయెన్ గుంభకోణమ్మునన్
గోలన్ బెంచు నవీనవాహనములే గుయ్యంచు గన్ పించెడిన్.
(పాండ్య చోళ రాజుల నాటి గుర్రాలు, ఏనుగులు ఇప్పుడు కుంభకోణం నగరం లో కనిపిస్తాయా? ఆధునిక వాహనాలే ఉంటాయి. )
ప్రశస్తమైన పూరణ.
తొలగించండిసంజాత విహంగము లెగు
రిప్లయితొలగించండిరం జాలక యభ్ర మందుఁ ద్రస్తాత్మలునై
పంజరములలో మేఁతల
కుం జరములు సమసెఁ గుంభకోణము నందున్
[మేఁతలకున్+ చరములు = మేఁతలకుం జరములు]
కాలాతీతులు కారె యెవ్వరును ధిక్కారమ్ము దుర్భేద్యమే
వేలాకోలము కాదు పౌర తతి జృంభింపంగ నచ్చోటఁ బోఁ
గాలం బేర్పడ రాజకీయ ఘనులే గర్వాంధు లౌటం గటా
హేలన్ దిగ్గజ సంఘముల్ సమసి పోయెన్గుంభకోణమ్మునన్
కందం
రిప్లయితొలగించండిరంజిల నధికారమ్మునఁ
గుంజిరి నేతలు సిరులను గోప్యమటంచున్
వ్యంజిత పరిశోధనలన్
గుంజరములు సమసెఁ గుంభకోణమునందున్
శార్దూలవిక్రీడితము
మేలెంచన్ బ్రజలెన్నుకొన్న ఘనులున్ మేతల్ ప్రధానమ్ముగన్
లీలల్ జేసి బ్రజాళి సంపదల దుర్నీతిన్ భుజింపంగ కం
గాలీ కార్యము నేర శోధనమునన్ గగ్గోలు రేపంగనే
హేలన్ దిగ్గజసంఘముల్ సమసిపోయెన్ గుంభకోణమ్మునన్