9, మే 2026, శనివారం

సమస్య - 5464

10-5-2026 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కుంజరములు సమసెఁ గుంభకోణమునందున్”

(లేదా...)

“హేలన్ దిగ్గజసంఘముల్ సమసిపోయెన్ గుంభకోణమ్మునన్”

18 కామెంట్‌లు:

  1. తంజావూరు గుడులలో
    జంజీరలు మాయమైన సమయము నందున్
    పుంజీల కొలది యాజ్ఞిక
    కుంజరములు సమసెఁ గుంభకోణమునందున్

    రిప్లయితొలగించండి
  2. జంజాటము తొలగింపగ
    సంజనితంబైన రీతి సలిపిరి హత్యల్
    పంజరములో చిలుకలై
    కుంజరములు సమసెఁ గుంభకోణమునందున్

    ఆలోచించిన వారికెల్ల విదితంబా లడ్డులో నాణ్యతే
    చాలాకాలము నుండియున్న నెఱినే సంపూర్తిగా మార్చగా
    పాలే చూడని సంస్థకే ఘృతముకై ప్రాప్తించె నొప్పందమే
    హేలన్, దిగ్గజసంఘముల్ సమసిపోయెన్, గుంభకోణమ్మునన్

    రిప్లయితొలగించండి
  3. వేలున్ లక్షలు కోట్ల రూకల ప్రజావిత్తంబుతో కార్యముల్
    కాలాతీతమొనర్చుచున్ నిధులు కైంకర్యం బొనర్పంగనా
    వాలాయమ్ముగ మ్రింగు కల్లరుల నిర్బంధించి శిక్షింపగన్
    హేలన్ దిగ్గజసంఘముల్ సమసిపోయెన్ గుంభకోణమ్మునన్

    రిప్లయితొలగించండి
  4. భంజన మొనరించి నిధులు
    వ్యంజనముగ నారగించి వాలాయముగా
    రంజనమున కులికి తుదకు
    కుంజరములు సమసెఁ గుంభకోణమునందున్

    రిప్లయితొలగించండి
  5. రంజిలు రీతిగ ప్రతిమలు
    మంజుల మౌ మందిర మున మహిమా న్వి త మై
    పుంజు కొన వినాశ ము నై
    కుంజరములు సమసె కుంభ కోణ ము నందున్

    రిప్లయితొలగించండి
  6. కం:తంజావూరున కరవున
    గంజియె ఘన మయ్యె , చచ్చె గా గుర్రములున్
    బంజరు భూములె మిగిలెను
    కుంజరములు సమసెఁ గుంభకోణమునందున్”
    (నిజానికి ఇక్కడ పెద్ద సమస్య లేదు.కుంభకోణం నగరం పేరు. )

    రిప్లయితొలగించండి
  7. శా॥ మేలౌదిగ్గజ నామమొంది తగు నెమ్మిన్ బ్రాభవమ్మొందినన్
    గీలున్ గాంచిన శత్రువుల్ చెలఁగుచున్ గ్లేశమ్ముఁ జేకూర్చఁగన్
    గాలమ్మావిధి రాజకీయ చదరంగంబందు బంధించఁగన్
    హేలన్ దిగ్గజ సంఘముల్ సమసి పోయెన్ గుంభకోణమ్మునన్

    రిప్లయితొలగించండి
  8. శా:కాలాబ్ధిన్ బవళించె చోళఘనతల్,కన్ పింతురే పాండ్యులున్!
    శాలల్ బోయెను రాచ గుర్రములకున్,శాస్త్రీయతల్ దెచ్చు నా
    హేలన్ దిగ్గజసంఘముల్ సమసిపోయెన్ గుంభకోణమ్మునన్
    గోలన్ బెంచు నవీనవాహనములే గుయ్యంచు గన్ పించెడిన్.
    (పాండ్య చోళ రాజుల నాటి గుర్రాలు, ఏనుగులు ఇప్పుడు కుంభకోణం నగరం లో కనిపిస్తాయా? ఆధునిక వాహనాలే ఉంటాయి. )

    రిప్లయితొలగించండి
  9. సంజాత విహంగము లెగు
    రం జాలక యభ్ర మందుఁ ద్రస్తాత్మలునై
    పంజరములలో మేఁతల
    కుం జరములు సమసెఁ గుంభకోణము నందున్

    [మేఁతలకున్+ చరములు = మేఁతలకుం జరములు]


    కాలాతీతులు కారె యెవ్వరును ధిక్కారమ్ము దుర్భేద్యమే
    వేలాకోలము కాదు పౌర తతి జృంభింపంగ నచ్చోటఁ బోఁ
    గాలం బేర్పడ రాజకీయ ఘనులే గర్వాంధు లౌటం గటా
    హేలన్ దిగ్గజ సంఘముల్ సమసి పోయెన్గుంభకోణమ్మునన్

    రిప్లయితొలగించండి
  10. కందం
    రంజిల నధికారమ్మునఁ
    గుంజిరి నేతలు సిరులను గోప్యమటంచున్
    వ్యంజిత పరిశోధనలన్
    గుంజరములు సమసెఁ గుంభకోణమునందున్


    శార్దూలవిక్రీడితము
    మేలెంచన్ బ్రజలెన్నుకొన్న ఘనులున్ మేతల్ ప్రధానమ్ముగన్
    లీలల్ జేసి బ్రజాళి సంపదల దుర్నీతిన్ భుజింపంగ కం
    గాలీ కార్యము నేర శోధనమునన్ గగ్గోలు రేపంగనే
    హేలన్ దిగ్గజసంఘముల్ సమసిపోయెన్ గుంభకోణమ్మునన్

    రిప్లయితొలగించండి